కౌమార బాలికల ఆరోగ్యం

బహిష్టు సమస్యలు

ఆలస్యంగా రజస్వల అవడం :

1. బాలికకు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇంకా రొమ్ముల పెరుగుదల, మానం మీద, చంకల్లోనూ వెంట్రుకల పెరుగుదల లేకుండా, రజస్వల అవకుండా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. క్రోమోజోమ్స్‌ లోపాల వలన, జననాంగాలలో, ముఖ్యంగా గర్భాశయం, అండాశయాల నిర్మాణం, ప్రతిస్పందనలు, విధులలో లోపాలు, హార్మోన్స్‌ ఉత్పత్తి సవ్యంగా లేనప్పుడు రజస్వల అవడం ఆలస్యమవవచ్చు, లేక అసలు రజస్వల కాకపోవచ్చు.
బహిష్టులు ఆలస్యంగా రావడం:
1. బాలిక రజస్వల అయాక 1-2 సంవత్సరాల పాటు ఆలస్యంగా 2,3 నెలలకొకసారి బహిష్టు అవడం సహజమే. హైపొధాలమస్‌ – పిట్యూటరీ – అండాశయం, à°ˆ వరుస క్రమం పరిణతి చెందేదాకా ఇలా ఆలస్యమయి à°† తరువాత హార్మోన్లు క్రమబద్ధంగా ఉత్పత్తి అవుతున్నప్పుడు బహిష్టులు 28-32 రోజులకు ఒకసారి వస్తాయి. 2. క్షయ, తీవ్ర రక్తహీనత, మానసిక వ్యాధులు, కొన్ని మందుల వాడకం, వాతావరణం మొదలైన వాటి కారణంగా కూడా బహిష్టులు ఆలస్యంగా రావచ్చు. డాక్టర్ని సంప్రదించి అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. మిగతా ఆరోగ్య సమస్యలు ఏమీ లేనప్పుడు బహిష్టులు ఆలస్యంగా రావడం కారణంగా సామాన్య ఆరోగ్యం దెబ్బతినదు.
బహిష్టులో అధిక రుతుస్రావం:
1. రజస్వల అయాక మొదటి 1-2 బహిష్టులలో చాలా ఎక్కువ రోజుల పాటు, చాలా ఎక్కువగా à°’à°• క్రమం లేకుండా రుతుస్రావం జరగవచ్చు. ఒక్కొక్కసారి రుతుస్రావం ద్రవరూపంలో కాక గడ్డలు గడ్డలుగా కూడా అవవచ్చు. కాని చాలా త్వరగా హైపొథాలమస్‌ – పిట్యూటరీ – అండాశయము క్రమం పరిణతి చెంది క్రమబద్ధంగా రుతుస్రావం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలిగించేంత ఎక్కువగా రుతుస్రావం అవవచ్చు. అలా 2-3 సంవత్సరాల వరకు జరిగి తరువాత క్రమబద్ధంగా అవవచ్చు.
2. ఒత్తిడి, ఆందోళనలాంటి మానసిక స్థితి కూడా రుతుస్రావం ఎక్కువ అవడానికి కారణం అవవచ్చు. 3. గర్భాశయంలో ట్యూమర్లు, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో తేడాలవల్ల కూడా రుతుస్రావం అధికంగా జరగవచ్చు. 4. తీవ్రమైన రక్తహీనత కూడా అధిక రుతుస్రావానికి కారణమవవచ్చు. 5. థైరాయిడ్‌ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి సరిగ్గా పనిచెయ్యకపోతే అధిక రుతుస్రావం అవవచ్చు. 6. క్షయ వ్యాధి వల్ల కూడా రుతుస్రావం ఎక్కువ అవవచ్చు. 7. గర్భాశయం నిర్మాణంలో తేడాల వల్ల, గర్భాశయం బాగా వెనుకకు వంగి అంటుకుపోతే రుతుస్రావం ఎక్కువ అవవచ్చు. 8.”ఎండోమెట్రియోసిస్‌” అను వ్యాధి, గర్భాశయానికి, గర్భాశయం ప్రక్కన, అండవాహికకు, అండాశయాలకు ఇన్ఫెక్షన్‌, అండాశయాలలో కణితుల వల్ల కూడా రుతుస్రావం ఎక్కువగా జరగవచ్చు.
చికిత్స :
1. రుతుస్రావం ఎక్కువగా జరుగుతున్నప్పుడు పడుకుని విశ్రాంతి తీసుకోవాలి.
2. అవసరమయితే తక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకోవచ్చు. దానితో ఆందోళన తగ్గి రుతుస్రావం కూడా తగ్గవచ్చు.3.రుతుస్రావం జరగనప్పుడు క్రమబద్ధంగా వ్యాయామం చెయ్యాలి. చన్నీటి స్నానం చెయ్యాలి. 4.ఆహారలోపాల్ని సరిదిద్దాలి. రక్తహీనతను సరిదిద్దాలి. 5.కాల్షియం, ‘విటమిన్‌-సి’, ‘విటమిన్‌-కె’ ని తీసుకుంటే రక్తం గడ్డ కట్టడంలోని లోపాలు కొన్ని సవరింపబడతాయి. 6.రక్తాన్ని గడ్డకట్టించే మాత్రల్ని వేసుకోవచ్చు. 7.వేరే వ్యాధులు, ఇతర సమస్యలు వుంటే వాటికి చికిత్స చేయాలి 8. హార్మోన్‌ లోపాలు వున్నప్పుడు హార్మోన్‌ మాత్రల్ని కొన్ని నెలలపాటు వాడవలసి రావచ్చు.
బహిష్టులో నొప్పి లేక రుతుస్రావనొప్పి:
బహిష్టు సమయంలో పొత్తికడుపులో ఉండే నులినొప్పిని లేక మెలిపెడుతున్నట్లుగా ఉండడాన్ని బహిష్టు నొప్పి లేక రుతుస్రావ నొప్పి అంటారు. నొప్పి నిలకడగా, తగ్గకుండా ఉండవచ్చు, లేక తెరలు తెరలుగా తగ్గుతూ, ఎక్కువవుతూ ఉండవచ్చు. నొప్పి పిరుదుల్లోకి, నడుము క్రింది భాగానికి, తొడల లోపలివైపుకు పాకవచ్చు. నొప్పితోపాటు వికారం, వాంతులు, విరేచనాలు లేక శరీరమంతా కూడా సలుపుగా ఉండవచ్చు. బహిష్టు నొప్పి స్వల్పంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ బాధలు రావచ్చు.

చికిత్స :

1.ఇంటి దగ్గర, పనిచేసే చోట ప్రతికూల వాతావరణం వుంటే దానిని సరిదిద్దాలి. 2. పౌష్టికాహార లోపాల్ని సవరించాలి. సామాన్య ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. జీవనశైలిలో లోపాలు వుంటే సరిదిద్దాలి. 3.రుతుస్రావ సమయంలోనూ, మామూలు సమయంలోనూ క్రమబద్ధంగా వ్యాయామం చెయ్యాలి. 4.చాలామందికి చిన్న చిన్న సలహాలు, ధైర్యం చెప్పడం నొప్పి తగ్గేందుకు సహాయపడతాయి. పొత్తి కడుపు మీద రుద్దుకోవడం, కాపడం పెట్టు కోవడం, అల్లం ”à°Ÿà±€” తాగడం లాంటి చిట్కాలు నొప్పిని తగ్గిస్తాయి. 5. నొప్పిని తగ్గించే మందుల్ని వాడడం వల్ల కూడా బాధ నివారణ అవుతుంది. ప్రోస్టాగ్లాండిన్స్‌ ఉత్పత్తిని అణిచే మందుల్ని బహిష్టు అయిన మొదటిరోజున లేక రెండవరోజున 1-2 మాత్రలను వాడితే నొప్పి తగ్గుతుంది. 6.అవసరమయితే హార్మోన్స్‌ని తీసుకోవాలి. గర్భనిరోధక హార్మోన్‌ మాత్రల్ని 3-6 నెలలపాటు వాడితే నొప్పి తగ్గుతుంది. 7.”à°¡à°¿&సి” అనే చిన్న ఆపరేషన్‌ వల్ల కూడా కొంత ఫలితం ఉంటుంది. 8.”ఆక్యుప్రెషర్‌” – బొటనవ్రేలికి చూపుడు వ్రేలికి మధ్యవున్న సున్నితమైన ప్రదేశంలో రెండవ చేతి బొటన వేలు, చూపుడు వేలితో నొక్కితే నొప్పి తగ్గవచ్చు.
రుతుస్రావ పరిశుభ్రత
1.    శుభ్రమైన బట్టల్ని వేసుకోవాలి.
2.    జననేంద్రియాలకు ఇన్ఫెక్షన్‌ రాకుండా నివారించేందుకు ఎప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా వుండాలి. రుతుస్రావ సమయంలో మరింత జాగ్రత్తగా జననాంగాల్ని శుభ్రపరురుకోవాలి.
3.    యోని శీర్షాన్ని పైకిలాగి అంతరాధరాలను విడదీసి యోని శీర్షం క్రింద పేరుకుపోయే స్మెగ్మాను, రుతుస్రావాన్ని కడుక్కోవాలి. జననాంగాల్ని శుభ్రపరచు కునేటప్పుడు నీరు మలద్వారం నుండి, యోని, మూత్ర ద్వారం వైపుకు వెళ్ళకుండా జాగ్రత్తపడాలి.
4.    శానిటరీ నాప్‌కిన్స్‌, నూలు టాంపూన్స్‌ లేక తడిని పీల్చగల శుభ్రమైన, మెత్తటి బట్టతో చేసిన ప్యాడ్‌లను రుతుస్రావాన్ని పీల్చేందుకు ఉపయోగించాలి.శానిటరీ నాప్‌కిన్స్‌ని లేదా బట్టను తరచుగా మార్చేయాలి. ఎక్కువసేపు మార్చకపోతే దుర్వాసన రావడం, తొడలు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ బట్టను వాడుతున్నట్లయితే సబ్బు నీటితో బాగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టిన తరువాత తిరిగి ఉపయోగించాలి. తడిగావున్న వాటిని, అపరిశుభ్రమైన ప్రదేశంలో దాచిన వాటిని, మురికి గుడ్డల్ని ఉపయోగిస్తే జననాంగానికి ఇన్ఫెక్షన్లు వచ్చి అనేక బాధలకు, సమస్యలకు దారితీస్తాయి.
5.     రుతుస్రావాన్ని పీల్చడానికి వాడిన బట్టల్ని జాగ్రత్తగా పారెయ్యాలి. ఉతికి, ఆరేసిన తరువాత కాల్చేయాలి లేక నేలలో పాతిపెట్టాలి.
6.     ఒక బట్టను లేక నాప్‌కిన్‌ని తీసి వేరేది పెట్టుకునే ముందు జననాంగాల్ని రక్తం పేరుకుపోకుండా శుభ్రంగా కడుక్కోవాలి.
7.     జననాంగాల పరిశుభ్రతను, ముఖ్యంగా రుతుస్రావ శుభ్రతను పాటించకపోతే జననాంగ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం వుంది.
4. గర్భధారణ
* 18 సంవత్సరాలలోపు వయసులో వివాహం చేసుకోవడం, 20 సంవత్సరాలలోపు మొదటి బిడ్డను కనడం తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు.
* ప్రతి గర్భం కోరుకున్నది, ప్లాన్‌ చేసుకున్నప్పుడు వచ్చినది అయివుండాలి.
* కుటుంబానికి ఆధారం తల్లి. కుటుంబ సంరక్షకురాలు తల్లి. తల్లి ఆరోగ్యంతోనే కుటుంబం, సమాజం, దేశం యొక్క ఆరోగ్యం ముడిపడివుంది. అందుచేత తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కేవలం ఆమె వ్యక్తిగత బాధ్యత కాదు, కుటుంబం, సమాజం, దేశం యొక్క బాధ్యత.
* కనీస ఆర్ధిక వనరులు, కుటుంబ సభ్యుల ప్రేమాదరణలు, సంఘర్షణలు, హింసలేని కుటుంబం, సమాజం తల్లి ఆరోగ్యానికి పునాది.

గర్భధారణ

గర్భం సమయంలో స్త్రీ అనేక శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన మార్పులకు లోనవుతుంది. తనలో ఒక కొత్త జీవి రూపుదిద్దుకుంటూందనే భావన ఆమెకు ఆనందాన్నీ, ఆందోళనను కూడా కలిగిస్తుంది.
ప్రకృతి మహాద్భుతాలలో ఒకటి
గర్భధారణ ప్రకృతి మహాద్భుతాలలో ఒకటి. స్త్రీ శరీరంలోని అండంతో పురుషుని శరీరంలో ఉత్పత్తి అయే వీర్యకణం కలిసి శిశువు సృష్టి జరుగుతుంది. ఈ కలయిక గర్భధారణకు ప్రారంభం. అండం, వీర్య కణం రెండు కణాలు కలిసి ఒకే ఒక కణం, సంయుక్త బీజకణం ఏర్పడుతుంది. బిడ్డ ఆడో, మగో ఇప్పుడే నిర్ణయమయిపోతుంది. బిడ్డ రూపురేఖలు, గుణగణాలు కూడా ఇప్పుడే నిర్ణయమవు తాయి.
ఋతుచక్రం ప్రారంభం నుండి హార్మోన్ల ప్రభావం  వలన అండాశయాలలో కొన్ని ఫాలికిల్స్‌ పెరగడం పారంభిస్తాయి. అందులో à°’à°•à°Ÿà°¿ మిగతా వాటి కంటే వేగంగా పెరుగుతూ పరిణతి చెంది అండాశయం ఉపరితలానికి వస్తుంది. అలా పరిణతి చెందిన ఫాలికిల్‌ పగిలి à°…à°‚à°¡à°‚ విడుదల అవుతుంది. సామాన్యంగా à°…à°‚à°¡à°‚ విడుదల బహిష్టుకు 14 రోజుల ముందు జరుగుతుంది. ప్రతి రుతుచక్రంలో ఒకే ఒక్క à°…à°‚à°¡à°‚ ఏదో à°’à°• అండాశయాన్నుండి విడుదల అవుతుంది. అలా విడుదల అయిన అండాన్ని అండవాహిక చివరలో ఉన్న వ్రేళ్ళ లాంటి ‘ఫింబ్రియా’ పట్టి అండవాహికలోకి తీసుకుంటాయి. అండవాహిక ప్రత్యేక కదలికల వల్ల, అండవాహికల లోపలి తలంలోని శైలికలు నెట్టడం వల్ల à°…à°‚à°¡à°‚ అండవాహిక లోపలికి చేరుతుంది.
స్త్రీ పురుషుల లైంగిక కలయికలో స్త్రీ యోనిలో వెదజల్లబడిన పురుషుని వీర్యంలో మిలియన్ల సంఖ్యలో వీర్యకణాలు ఉంటాయి. ఇందులో కొన్ని వేల వీర్య కణాలు మాత్రమే వేగంగా ఈదుకుంటూ, హార్మోన్ల ప్రభావంతో అనుకూలంగా మారిన సర్విక్స్‌ ద్వారా గర్భాశయంలోకి, అండవాహికలలోకి చేరతాయి. సుమారుగా 3-5 వీర్య కణాలు ఒకేసారి అండాన్ని చుట్టుముడతాయి. అందులో ఒకే ఒక్క వీర్యకణం విజయవంతంగా అండంలోకి చొరబడగానే మిగతా వీర్యకణాలు à°…à°‚à°¡à°‚ లోపలికి ప్రవేశించకుండా నిరోధింప బడతాయి. à°…à°‚à°¡à°‚ విడుదలయాక కేవలం 12-24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. వీర్య కణాలు 2-3 రోజులు, ఒకోసారి 5 రోజుల వరకు జీవించి ఉంటాయి. à°…à°‚à°¡à°‚ విడుదలకు కొంచెం ముందు వెనుకలుగా స్త్రీ, పురుషులు లైంగికంగా కలిస్తేనే à°…à°‚à°¡à°‚, వీర్యకణం కలవడం సాధ్యమవుతుంది. à°…à°‚à°¡à°‚ లోపలికి వీర్యకణం చేరాక à°…à°‚à°¡à°‚ ‘న్యూక్లియస్‌’ వీర్యకణం ‘న్యూక్లియస్‌ తో’ కలిసి ఫలదీకరణ జరిగి ‘జైగోట్‌’ లేక ‘సంయుక్త బీజకణం’ ఏర్పడుతుంది. సంయుక్త బీజకణం విభజిత మవుతూ గర్భాశయాన్ని చేరేలోగా à°’à°• à°•à°£ సమూహం ఏర్పడి అది అనేక జీవపరమైన మార్పులకు లోనవుతుంది.
ఫలదీకరణ జరిగాక 6 రోజులకు, అప్పటికి హార్మోన్ల ప్రభావంతో గర్భధారణకు సిద్ధమైన గర్భాశయపు లోపలి పొరలోకి తొలుచుకుని వెళ్ళగానే ప్రవేశద్వారం మూసుకుపోతుంది. ఫలదీకరణ జరిగాక 10వ లేక 11వ రోజుకు మొత్తం ప్రకియ పూర్తవుతుంది.
తరువాత కొద్ది రోజుల్లో మాయ , బొడ్డుతాడు  ఏర్పడతాయి. గర్భాశయపు గోడను అంటుకుని వుండే ‘మాయ’ ను ‘పిండా’న్ని బొడ్డుతాడు కలుపుతుంది. మాయ, బొడ్డుతాడు ద్వారానే తల్లి రక్తంలోని పోషకాలు పిండానికి సరఫరా చెయ్యబడతాయి. శిశువు శరీరంలోని విసర్జకాలు వీటి ద్వారానే విసర్జింపబడతాయి.

– à°¡à°¾. ఆలూరి విజయ లక్ష్మి

వచ్చే సంచికలో-

బిడ్డను కనడానికి అనువైన వయసు

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో