సుకన్య

రెండో భాగం :

 తన కంటె చందుకి ఎక్కువ మార్కులు వస్తే అతను ఏమి వ్రాసాడోనని అతని పేపర్లు తీసికొని చూచేది సుకన్య. అంతేగాని

తన కంటె ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఏమైనా తప్పు వ్రాసాడేమో చూద్దామనే దృష్టి ఉండేది కాదు. ఇద్దరి మధ్య

చిన్న నాటి నుండి తెలియని అనుబంధమేదో మొదలై, అది అట్లాగే పెద్దయినా కొనసాగుతోంది.  సుకన్య పట్టణంలో

పోర్షన్‌లో ఉంటుంటే చందు హాస్టల్లో ఉండేవాడు. ఇద్దరి మధ్య అంత చనువు ఉన్నా ఏనాడు హద్దు మీరి ఎవరు

ప్రవర్తించలేదు. అసలు తామిద్దరికి ఒకరంటే à°’à°•à°°à°¿à°•à°¿ à°…à°‚à°¤ ప్రేమాభిమానా లున్నట్లు గుర్తింపే రాలేదు చాలాకాలం వరకు…

సుకన్య కంటె పెద్దవాడయిన నిరంజన్‌ ఊటిలో చదివేవాడు. మన దేశంలో ఉన్న ఆనవాయితీ అదేకదా! అమ్మాయిలు ఎంత బాగా చదువుతున్నా వారిని మామూలు స్కూల్లో చదివిస్తే చాలు. మగపిల్లలకి చదువు రాకున్నా, ఇంట్రస్టు

లేకున్నా వారిని బలవంతంగా నైనా ఇంగ్లీషు కాన్వెంట్లకు పంపాలి. ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. అమ్మాయిలు వల్ల

రిటన్స్‌ ఏముంటాయి. కనక అబ్బాయిలయితే ఎంత ఖర్చు పెట్టారో అంతకంత తిరిగి రాబట్ట వచ్చు కదా! అసలు

ఆడపిల్లలకి చదువెందుకు అనే థ నుండి ఆడపిల్లలు కూడా చదువు కోవచ్చు అనే థకు రావటానికి ఎన్ని వందల

సంవత్సరాల కాలం పట్టిందో! అదీ అమ్మాయిలు పురాణాలలో, వ్రతాలో, గృహసంబంధమైన విద్యలు తప్ప

మేధోవికాసానికి పనికి వచ్చే చదువులు ఉండేవికావు. నిజానికి ఏ పరీక్షాఫలితాలు చూచినా ఫలితాల్లో ఆడపిల్లలే

ముందుంటారు! అయినా సరే తల్లిదండ్రులకు డొనేషన్లు కట్టయినా సరే మగపిల్లల్ని చదివించటానికి ఇష్టమే. బాగా చదివే

అమ్మాయిని అర్ధంతరంగ మధ్యలోనే చదువు అపించటానికి కూడ ఏమాత్రం సంశయించరు. నిరంజన్‌ విషయంలోను అదే

జరిగింది. అతను ఏమంత గొప్ప తెలివిగల వాడు కాకున్నా మంచిలోకెల్ల మంచి, గొప్పలోకెల్ల గొప్ప స్కూల్లో

చదివించాలనే వెంకయ్య నిర్ణయం వల్ల ఆపిల్లాడు హైస్కూల్‌ చదువంతా ఊటినోను, కాలేజి చదువంతా మద్రాసులోను

కొనసాగింది. ప్రస్తుతం నిరంజన్‌ అమెరికాలో ఉన్నాడు.

వెంకయ్య ధనవంతుడయినా పిసినారి వాడు కాదు. పిల్లల చదువు విషయంలో డబ్బుబాగా ఖర్చు చేసేవాడు.

ఎవరయినా అవసరం ఉండి బీదబిక్కి డబ్బు సాయంగా అడిగితే ఇచ్చేవాడు. ఆఊళ్ళో అతని చలవ వల్లే బడి-గుడి-చిన్న

కమ్యూనిటీ  హాలు  ఏర్పడ్డాయి. మరీ సినిమాల్లో విలన్‌ లాగా కాకుండా వెంకయ్య ప్రజల మధ్యలో మంచి పేరే

తెచ్చుకొన్నాడు. అందరికీ అతనంటే గౌరవం కూడా! ఊళ్ళో మంచికి చెడ్డకి వెంకయ్య అండదండలు కావలసిందే! నిజానికి

గ్రామాల్లో రాజకీయ నాయకులు అధికార్లు కంటే కూడా ఇలాంటి ఊరి పెద్దల మాటే చెల్లుబాటవుతోంది.

వెంకయ్య తీరికగా కూర్చుని పడక కుర్చీలో చుట్ట తాగుతున్నాడు. ప్రతి రోజు రాత్రి ఏడు గంటల కల్లా భోజనం కానిచ్చి

గంట రెండు గంటలు చుట్ట తాగుతూ ఊరి జనంతో పిచ్చాపాటి మాట్లాడటం అలవాటు వెంకయ్యకు. ఆరోజు అట్లాగే

కూర్చున్నాడు. ఎవరెవరో వచ్చి ఏదో మాట్లాది వెళ్తున్నారు. రాజకీయాలు, పెరుగుతున్న ధరలు వగయిరా…అంతా

వెళ్ళిపోయినా చివరకు నాగన్న మాత్రం మిగిలిపోయాడు. ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమవుతున్నాడు. అతను

తరచు పట్నం వెళ్ళి వస్తుంటాడు. వెళ్ళినపుడల్లా సుకన్యకు ఏదో ఒకటి యిచ్చి పంపుతుంది వెంకయ్య భార్య సీతమ్మ.

”బావా! నీతో à°’à°• మాట చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ ఇది ఎంతవరకు నిజమో చెప్పలేను. నేను

చూచింది నీకు చెప్పటం ధర్మం అని చెబుతున్నాను.” ఎలాగోలా నోరు పెగుల్చుకొని అన్నాడు నాగన్న.

‘చెప్పు ఏం చూచావో చెప్పరా సందేహమెందుకు అన్నాడు.”

మరేం లేదు మన సుకన్య మన ఊరి అబ్బాయిలేడు, చంద్ర అదే మన కుమ్మరి కనకయ్య కొడుకు అతనితో చాలా

చనువుగా ఉంటుంది. మొన్న నేను వెళ్ళినపుడు ఇంట్లో లేదు. సరేనని నేను అట్లా బయట తిరిగొద్దామని వెళ్ళా… ఇద్దరు

ఒకే బండి మీద వెళ్తు కనిపించారు…”

”అంతే గదా! ఇద్దరు చిన్నప్పట్నించి కలిసి చదువు కొన్నారు కదా! కొంచెం చనువుగా ఉంటారులే అయినా అంతగ

పూసుకొని తిరగవసరం లేదు. నేను అడుగుతానులే” అన్నాడు వెంకయ్య గంభీరంగ. కాని ఆఫ్టరాల్‌ కుండలు చేసుకొని

బతికే కుమ్మరోడి కొడుకుతో అంత క్లోజుగా ఉండవలసిన అవసరం ఏమిటి? లోపల ఎన్ని అనుకొన్నా పైకి మాత్రం

నవ్వుతూనే అన్నాడు… ‘నీవు వెళ్ళు చాలా పొద్దుపోయింది ‘అంటు తనూ లేచాడు.

”సీతమ్మ!” అని గట్టిగ పిలిచాడు భార్యని. ఆమె వంట గదిలో నుంచి పరిగెత్తుకొంటు వచ్చింది.

”చూసావా నీ కూతురి నిర్వాకం. పెద్దదయింది… చాల గొప్పది కూడ. అయింది…”

”ఏమిటి ఏం చేసిందండి” ఆదుర్దగ అడిగింది సీతమ్మ.

”ఏం చేసేదేమిటి? మన à°Šà°°à°¿ కుమ్మరాడు కనకయ్య లేడు అతనికొడుకు చంద్ర, ఇది కలిసి తిరుగుతున్నారు.”

‘à°†’ నోరు తెరిచి ఆశ్చర్యపోయింది సీతమ్మ.

వెంటనే తేరుకొని ‘అంతా వట్టిది. అయినా పట్నంలో చదువుకొనే పిల్లలు à°† మాత్రం కలిసి తిరుగుతారు అన్నిటికి తప్పు

బడితే ఎలా? అది ఈ సారి వచ్చినపుడు నిలదీసి అడుగుదాంలే. మన వనజ ఉంది కదా! దాన్ని అడిగితే అది అన్ని

చెబుతుంది. వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళేది వచ్చేది దానికి తెలుస్తుంది కదా” అంటు వెంకయ్యను శాంత పరిచింది సీతమ్మ.

”నిజమే అట్లా చేద్దాం” అన్నాడు వెంకయ్య.

నిజానికి ఆరాత్రంతా వెంకయ్యకి నిద్రలేదు. కూతురు ఏమైనా చేయకూడని పని చేస్తే, ఏ కడుపో, కాలో వస్తే ఎంత

అప్రతిష్ట… అయినా చదువుకోమని పంపితే à°ˆ పిల్లలు ఏమిటో ఇట్లా చేస్తున్నారు? ఏది ఏమైనా రేపు ఒకసారి చెప్పా

పెట్టకుండా వెళ్ళి కూతురి పరిస్థితి చూచి రావాలి! అట్లా ఓ నిర్ణయానికి వచ్చాక గాని అతనికి నిద్రపట్టలేదు.

***                                                           ***                                                     ***                                           ***”అక్కా! నీ కోసం అతను వచ్చాడు” బయట వరండాలో కూర్చుని చదువుకొంటున్న వనజ లోపల గదిలో

ఉన్న సుకన్యతో  చెప్పింది.

”కూర్చోబెట్టలేకపోయావా” అంటునే సుకన్య బయటకు వచ్చింది. తలస్నానం చేసిన జుట్టు ఇంకా జడవేసుకోలేదు.

భుజాల నిండ పరచుకొంది. ఏ దేవతో వచ్చి తన ముందు ప్రత్యక్షం అయినట్లుంది చంద్రధర్‌కి.

”హాయ్‌ చందు! ఏమిటి ఇలా వచ్చావ్‌? నీ ప్రయాణం రాత్రికి కదా! మరి సాయంత్రం కలుద్దామను కొన్నాం కదా!” అన్నది

సుకన్య.

”ఎందుకో చూడాలనిపించింది మంచి కవిత à°’à°•à°Ÿà°¿ చదివాను నీవు గుర్తు వచ్చావు. ఉన్న పళంగా నిన్ను

చూడాలనిపించింది”

”ఏమిటో à°† కవిత.”

”అద్దమే చూచితినా అందులోన నీవే…

పద్యమే వ్రాసితినా ప్రతి పదము నీవే…”

”ఆహా అంతగ మనసులో తిష్ట వేసుకొన్నానన్నమాట……”

”కావాలంటే నా గుండె చీల్చిచూపనా…..” యాక్షన్‌ చేస్తు షర్ట్‌ మీద చేతులు వేసి బటన్స్‌ విప్పబోయాడు చందు.

”వద్దులే! అంతపని చేయకు… చందు నీవు నన్ను చూడాలనిపించి పరిగెత్తు కుంటూ వచ్చావే మరి నాకెట్లా ఉంటుందో

చెప్పనా?” సుకన్య మెల్లగా అంది.

”చెప్పు నిజంగా నేను గుర్తుకు వస్తానా…”

”అసలు మరిచిపోవటమంటూ జరిగితే కదా! నీవు ఎపుడు నాతోనే ఉంటావ్‌ నేను చేసే అన్ని పనులు నీవు చూస్తునే

వుంటావ్‌. నేను నీతో ఎపుడు మాట్లాడుతునే ఉంటాను.

చంద్రధర్‌ సూటిగా సుకన్య కండ్లల్లోకి చూచాడు.”

”అట్లా చూడకు చందు నాకు నీవట్లా చూస్తే మాట్లాడటానికి ఏం మాటలు రావు…”

”ఎందుకనో…”

”ప్రేమామృతం చవిచూసిన మత్తు ఆవరించి…” చందు కవిత మొదలెట్టాడు.

”ఓహో! నీవు కవిత్వం వ్రాస్తావని తెలుసు… ప్రస్తుతానికి కవితలల్లటం మాని నీ టూర్‌కి అన్ని సిద్ధం చేసుకొన్నావో లేదో

చెప్పు.”

”అన్ని ప్రిపేర్‌ చేసుకొన్నాను. à°“ పదిరోజులు నిన్ను చూడకుండ ఉండటం సాధ్యమా అనిపించింది. అందుకే

చూడాలనిపించి వచ్చాను” తప్పుచేసిన చిన్న పిల్లాడు తల్లికి సంజాయిషీ ఇచ్చుకొన్నట్లు అన్నాడు.

– à°¡à°¾.కనుపర్తి విజయ బక్ష్

(ఇంకా ఉంది)

సుకన్య, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో