‘కథలు’ కాని కథల à°•à°¥

 

రచయితలు, తమ రచనలను పత్రికలకి పంపేటప్పుడు ఆ రచనలు తమ స్వంతమేననీ దేనికీ అనువాదమూ అనుసరణ కాదనీ హామీ పత్రం జతపరచాలంటారు.ఈ నిబంధనని చూసి కనీసం ఒక్కసారయినా నవ్వుకోని రచయిత ఉండడు. అయినా సరే రచయితలు హామీ పత్రాలు రాస్తూనే వుంటారు. పత్రికలవారు నిబంధనలు పెడుతూనే వుంటారు. అది కేవలం ఒక సాంకేతిక పరమయిన ముందు జాగ్రత్త చర్య మాత్రమే.

అయితే, వారికీ వీరికీ కూడా బాగా తెలిసిన సత్యం ఒకటుంది. ఏ కథా ఏ ఒక్కరి స్వంతమూ కాదు. అలాగే ప్రతి కథా మరొక కథకి కొనసాగింపు మాత్రమే. ఏ కథా ఏ ఒక్కరితోనూ మొదలు కాదు. ఏఒక్కరితోనూ ముగిసిపోదు. మారేవల్లా అవగాహనా పరిధులూ దృష్టి కోణాలూ స్థల కాలాలూ పాత్రలూ శైలీ శిల్పాలూ ఆయా రాతగాళ్ళ నైపుణ్యాలూ మాత్రమే. à°ˆ విషయం మనకి కూడా తెలియాలంటే మనం à°ˆ ‘కథలు’ అనే పుస్తకం చదవాలి. అలాగని ఇది కథల గురించిన పుస్తకం కాదు. ఇది పదహారణాల తెలుగు కథల పుస్తకమే.

దీనిని రాసిన నాయుని కృష్ణమూర్తి గారు రచయితగా మాత్రమే కాదు, మా బడి, పాఠశాల మాస పత్రికల   సంపాదకుడిగానూ, పిల్లల సచిత్ర నిఘంటు కర్తగానూ, ప్రచురణ కర్త గానూ, గురుకుల విద్యాలయాల నిర్వాహకుడిగానూ, ప్రాంశుపాలుడిగానూ  ప్రసిద్ధులు.
వీరు తన కథల్లోంచీ పదహారు కథలని à°’à°• సంపుటంగా వెలువరించారు. అందులో ‘ మాట్లాడరేమండీ ‘ అనే కథకి సంబంధించిన నేపథ్యాన్ని గురించి వివరిస్తూ అది ఏ ఒక్కరి కథో కానప్పుడు దాన్ని నా స్వంత à°•à°¥ అని హామీ పత్రం ఎలా రాయగలనని మధన పడ్డారు.
ఎందుకంటే..,
ఈ పుస్తకం పేరు కథలు. కానీ ఇందులో ఉన్నవి కథలు కావు.
à°ˆ కథలు కాని కథల వెనుక ఉన్న కథలని తెలుసుకున్నాక, à°ˆ కథల కంటే ఆయా కథలని రాయించిన సంఘటనలూ పాత్రలూ సన్నివేశాలే మన్ని కలవర పెడతాయి. అందుకే ఇంగ్లీషు వాళ్ళు ‘లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్’ అంటారు. నిజమే.., వాస్తవ జీవితాన్ని  మించిన భావోద్వేగాలనీ బాధ్యతలనీ బాధలనీ భయాలనీ కల్పించడం కాల్పనిక సాహిత్యానికి  అసాధ్యం. ఎందుకంటే, à°°à°šà°¨ అనే పేకాటలో అన్ని పాత్రల ఆటనీ రచయిత ఒక్కడే ఆడతాడు. నిజ జీవితంలో అలా సాధ్యం కాదు. ఏ పాత్ర ఆట à°† పాత్రే ఆడతాడు. ఎవరిదగ్గర ఏయే ముక్కలున్నయనేది ముందే తెలిసిపోతే ఆటలో మజా ఏం వుంటుంది? అదీ కాకుండా జీవితమే సాహిత్యం లాంటి కళా రూపాలన్నింటికీ ముడి సరుకు కాబట్టీ సమాజానికి దీటయిన సృజన మరొకటి వుండదు.

అలాగని వాస్తవ సంఘటనలన్నీ కథలు కావు. అలాగే జరిగింది జరిగినట్టు రాసేస్తే అది వార్తా కథనం అవుతుందే కానీ కథ కాదు. రచయితలనేవారికి ఏది కథావస్తువు అవుతుందో ఏది కాదో గుర్తించగలిగిన నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యంతో బాటుగా చక్కటి నిర్మాణ కౌశలం కలిగివున్న అతి కొద్దిమంది రచయితలలో నాయుని కృష్ణమూర్తి గారు ఒకరు. ఇందులో కథతో బాటు ఆ కథారచనకి  దారితీసిన సందర్భాల్ని కూడా ఇవ్వడం వలన ఒక వృత్తాంతం కథా వస్తువుగా ఎలా రూపొండుతుందో చదువరికి అర్ధమౌతుంది. ఇంతవరకూ ఏ రచయితా తను రాసిన కథలన్నిటి నేపధ్యాలనీ వివరించిన దాఖలాలు లేవు. కాబట్టీ కొత్త రచయితలు కథా రచనలోని మెళకువలు తెలుసుకోవడానికి ఈ కథా సంపుటం ఒక పాఠ్య పుస్తకంలా ఉపయోగిస్తుంది. అలాగే కథా విమర్శ పట్ల ఆసక్తి కలిగినవారికి ఒక కథా వస్తువు, కథగా రూపొందే క్రమాన్ని అంచనా వెయ్యడానికి ఒక నమూనాగా కూడా పనికి వస్తుంది.

   ఇందులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథల్లో ప్రముఖమైనది ‘సారాజు à°•à°¥’. à°ˆ à°•à°¥ ఆద్యంతం వ్యంగ్య వైభవంతో అలరిస్తుంది. ఇందులోని కథావస్తువు సారా. దాని నేపధ్యం కూడా సారానే. à°† సారా తెలుగు తోబుట్టువులని à°Žà°‚à°¤ ఆగ్రహానికి గురిచేసిందో, దాని ఫలితంగా à°† తోబుట్టువుల చేతిలో ఎంతటి ఆగ్రహానికి గురైందో, చివరికి  ఎలా నిషేధానికి గురయిందో తెలియనిదెవరికి  ? నిషేదానంతర పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించి రాసిన à°•à°¥ ఇది. à°ˆ à°•à°¥ వచ్చి అయిదారేళ్ళు అయినా తిరక్కుండానే ఆయన రాసిన కథలోలాగే జరగడం యాదృచ్చికం కాదు.

ఇదే రచయిత ప్రాధమిక కర్తవ్యం.రాబోయే ఉత్పాతాన్ని ముందుగానే ఊహించి పాఠకులని హెచ్చరించి  ప్రమాద ఘంటికలని మ్రోగించడం. వారిలో చైతన్యాన్ని రేకెత్తించడం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఇందులోని కథలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి.

  ఇంతే అయితే à°ˆ ‘సారాజు à°•à°¥’ గురించి ఇంతగా చెప్పాల్సిన పని లేదు. ‘చరిత్రలు రాయబడతాయి’ అని చరిత్రని లోతుగా చదువుకున్నవాళ్ళు ఆ  చరిత్రని ఎందుకు విమర్శిస్తారో ఎందుకు ఈసడించుకుంటారో   తెలుసుకోవడానికి à°ˆ కథా నేపధ్యం ఎంతగానో ఉపయోగిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం ఎక్కడ మొదలైంది ? అని ఏ విద్యార్ధిని ప్రశ్నించినా ‘నెల్లూరు జిల్లాలోని దూబగుంటలో ప్రారంభించబడినది’ అని తడుముకోకుండా చెప్పేస్తాడు. కాని సారా వ్యతిరేక ఉద్యమం చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం లోని ‘టేకు మంద’ అనే గ్రామంలో ప్రారంభం అయింది అనే వాస్తవం ఎంతమందికి తెలుసు ? అక్కడి మహిళలని à°† ఉద్యమానికి ఉసిగొలిపి, వారిని యుద్దోన్ముఖులుగా సమాయత్తం చేసింది అప్పటి సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమం అని ఎంతమందికి తెలుసు ? విద్య, మనిషిలో రేకెత్తించే చైతన్యానికి  ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ? à°ˆ విధంగా సారాజు à°•à°¥ à°Žà°‚à°¤ గొప్పదో à°† కథా నేపధ్యం à°…à°‚à°¤ కంటే గొప్పది.

  ఇందులో ‘à°•à°¥ ‘ అని à°’à°• à°•à°¥ వుంది. à°ˆ కథకి, à°•à°¥ అనే పేరు పెట్టడం వెనుక చాలా పెద్ద à°•à°¥ వుంది. à°† à°•à°¥, à°’à°• à°•à°¥ పెట్టుబడిగా ఎలా రూపొండుతుందో చెప్పే à°•à°¥. à°’à°• à°•à°¥ ఇలా  పెట్టుబడిగా రూపాంతరం చెందగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందా  అని కథకులందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ అది వాస్తవం. à°ˆ కథలో రచయిత చూపించిన కథన చాతుర్యం పాఠకుడిని ఎంతగా ఆకట్టుకుంటుందో à°•à°¥ ద్వారా వెల్లడయిన వాస్తవం అంతకంటే బలంగా ఆలోచింపజేస్తుంది. à°Žà°‚à°¤ ఆలోచించినా సగటు మనిషి తన బలహీనతలని జయించలేక పోవడమే సామాజిక విషాదం.

    నైతిక విలువల గురించి పదిమందికీ నీటి బోధలు చేస్తూ.., తమ పరిధిలోంచే  నీతిని ఎడా  పెడా నిర్వచించే ఘరానా పెద్ద మనుషుల్లోని నీతి బాహ్యతనీ, తద్వారా రూపొందే విలువలలోని డొల్ల తనాన్నీ  ఈ కథ చెప్పినంత బాగా మరే కథా చెప్పలేదు. ఎందుకంటే, ఈ కథ నిజంగానే ఒక పత్రికాధిపతి, చలన చిత్ర నిర్మాతా అయిన ఒకానొక ప్రసిద్దుడి జీవితంలోని ఒక చీకటి కోణం. ఈ కోణాన్ని బహుశా ఎవరూ చూసివుండరు.  ఈ కథ చదివినప్పుడు కలిగే ఆలోచనల కంటే ఈ కథ వెనుకనున్న నిజాలు తెలిసినప్పుడు కలిగే జుగుప్సే మన్ని క్రీనీడలా  వెంటాడుతుంది. కొన్ని వాస్తవాలింతే వెగటు.., పుట్టిస్తాయి. కానీ, మన్ని మనం తీర్చి దిద్దుకునే పరిణామ క్రమంలో మనం ఏం చెయ్యకూడదో అర్ధం చేసుకోవడానికి అయినా ఈ కథనీ దీని నేపధ్యాన్నీ చదివి తీరాలి.

  ఇలా ప్రతి కథ గురించీ చెబుతూ పోతే ఈ సమీక్ష ఒక సిద్ధాంత గ్రంధంగా మారిపోయి ప్రమాదం వుంది. కాబట్టీ కథాసక్తులు అందరూ తప్పకుండా చదవ వలసిన కథల పుస్తకం ఈ  కథా సంపుటం అని విన్నవించుకుంటూ..,స్వస్తి.

-రాణి

పుస్తక సమీక్షలుPermalink

3 Responses to ‘కథలు’ కాని కథల à°•à°¥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో