జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”పరుశరామ చరిత్రల పోతరాజు కథ ఉన్నదట”

”ఓహ్‌… ఇంకేం ఆ కథను మొదలు పెట్టు” ఆసక్తిగా విద్య
అక్కడ ఉన్న లస్మవ్వకి తప్ప ఆమె పిల్లలు, రజని, అంజయ్య ఎవ్వరికీ ఆ కథ తెలియదు. అందరూ లింగన్న చెప్పే కథ కోసం కుతూహలంతో ఎదురు చూస్తున్నారు.

” ఒకనాడు శివుడు నదిలో స్నానం చేసి ఒడ్డున నిలబడి తన జటాజూటాన్ని సవరించుకుంటున్నపుడు దానిలో ఒక చిన్న గవ్వ చిక్కుకు పోవడంతో దాన్ని పార్వతి తీసి ఇసుకలో దాచిందట. కొన్ని రోజులకు ఆ గవ్వ పొదిగి చిన్న పాపగా పుట్టిందట. ఇసుక రేణువుల మద్య నుంచి పుట్టుకొచ్చిన బిడ్డ కాబట్టి ఆ పసిబిడ్డకు ‘రేణుక’ అని నామకరణం చేసి పెంచారట. రేణుక జమదగ్ని మహామునిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నదట. ఆ తర్వాత పరుశురాముడు, సిరియాళగౌరి అనే పిల్లలు పుట్టారట. రేణుక చాలా అందగత్తె. అటు భర్త సేవలోనే తన జీవితానందాన్ని పొందుతున్న పతివ్రత అట. అలాంటి రేణుకను ఆమె మేనబావలు కార్తికేయులు ఒక రోజు ఆమె నది నుండి నీళ్ళు తీసుకు వచ్చే సమయంలో అడ్డుపడి ఆమెపై అత్యాచారం చేయబోయారట. ఆమె తప్పించుకుని పారిపోతూ ఉండగా ఆమె మొఖం అందవిహీనంగా తయారయ్యిందట.

జమదగ్ని మహర్షి పరిస్థితిని దివ్య దృష్టితో గమనించి తన కుమారుడైన పరుశురాముని పిలిచి కార్తికేయుల్ని, రేణుకను చంపి రమ్మని ఆజ్ఞాపించాడట. తండ్రి ఆజ్ఞ మేరకు పరుశురాముడు కార్తికేయుల్ని చంపాడు. తన తల్లిని చంపడానికి ప్రయత్నించడగా ఆమె ప్రాణభయంతో ఎందర్నో ఆశ్రయం కోరిందట. పరుశురాముని కోపానికి, జమదగ్ని ముని శాపానికి భయపడి ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదట. చివరికి రేణుక హరిజన వాడకు చేరుకుని ఆశ్రయం అడిగిందట. తినడానికి తిండైనా లేని వాళ్ళు ఆమెకు ఆశ్రయం ఇచ్చి ఎక్కడ దాచగలరు? అందుకే ఆమెను చర్మాలను నానబెట్టే నీటి తొట్టి ”లందా”లో దాచి పెట్టి దానిపైన చర్మాలను కప్పి ఉంచారట. పరుశురాముడు బ్రాహ్మణుడు. వీరుడు. అలాంటి వాడు మాలమాదిగలు ఉన్న చోటికి పోతే అగౌరవం కదా! అందుకే, తల్లి జాడ కనుక్కోవాలంటే వేషం మార్చాలి.

విరబోసి, చేతిలో కొరడా తీసుకుని పోతరాజు వేషం వేసుకుని వెళ్ళి తన తల్లి జాడ కనుక్కుని చంపినాడట. అపుడు పరుశరాముడు వేసిన వేషంతోటే పోతరాజులు వచ్చారట.” తలపాగా సవరించుకుంటూ చెప్పాడు లింగన్న.
” పోతరాజులుగా గ్రామంలో మీరేం చేస్తారు.?”

”ఊరపండుగలు చేస్తాం, జోగిపట్టం కడ్తం, గావు పడ్తం, కథలు చెప్తం, దేవతలకు హారతులిస్తం. చిన్న చిన్న రోగాలకు మంత్రం వేస్తాం.”
”వడ్ల కల్లాలల్లో అడుక్కుంటం!” చెప్పాడు లింగన్న.
ఊర పండుగను గతంలో చూసి ఉన్న విద్య ఊరపండుగలో పోతరాజు పాత్ర ఏమిటో లింగన్న ద్వారా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంది. అందుకే.

”లింగన్నా ఊరపండుగ అంటే ఏమిటి? మీరు ఏం చేస్తారు ఊరపండుగలో” అడిగింది విద్య కొంత వరకూ గతంలో విని ఉన్నప్పటికీ కొద్దిగ చూసినప్పటికీ.

”గ్రామంలో ఆనలు పడకపోయినా, రోగాలు అచ్చినా, గ్రామదేవతలు ఆగ్రహించినాయని తలచి ఆ దేవతల పేరు మీన పండగ చేయాలని తలుస్తారు. గ్రామ పెద్దలు, పోలీసు పటేలు, మాలీ పటేల్‌, సర్పంచ్‌ గ్రామంలో ఉన్న అన్ని కులాల పెద్దలు, పోతరాజులు, జోగినులు అందరూ గ్రామ చావిడి దగ్గర కూర్చొని పండుగ నిర్ణయిస్తరు. గ్రామంల ‘అరక’కు ఇంత అని పైసలు ఏసుకుంటరు. ఆ పైన అంత పెద్ద కాపు దగ్గర ఉంటది. ఆ అటెనుక వచ్చే అంగడి రోజు పెద్దకాపు.

గ్రామ బేగం పోయి పండుగకు కావల్సిన వస్తువులు కొనుక్కొస్తరు. పండుగ ముందురోజు పోతరాజు ఆ గ్రామ బేగరి ఇంటికి పోతడు. ఆ తర్వాత ఊరి పెద్దలందర్ని కల్సి అందరికీసలామ్‌ పెట్టి అస్తడు. పండుగ ముందు రోజు రాత్రి గ్రామ చావిడి దగ్గర నుండి పని వారు డప్పులతో బేగరోని ఇంటికి పోయి పోతరాజును తీసుకుని వస్తారు. ఆ తర్వాత అందరికీ దండాలు పెట్టి కొద్ది సేపు నాట్యం చేసిన తర్వాత గ్రామ పెద్దలు కల్లు చిట్టీ ఇస్తారు. తర్వాత పోతరాజు వెంట వచ్చిన మాల, మాదిగ వారు, డప్పుల వారు, జోగోళ్ళు అందరూ కల్సి బాగా తాగుతరు. తిరిగి కచేరి కాడ ఆ రాత్రంతా పోతరాజు ఎల్లమ్మ, పోశమ్మ, ఊరడమ్మ కథలు చెప్తూ కాలక్షేపం చేస్తడు.

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో