“అమరమైనాక..”(కవిత )- సుజాత తిమ్మన

ప్రమిద …నూనె ఉంటేనే…..
వత్తి వెలిగి ..దీపమై వెలుగిస్తుంది.
యోధుడయినా… దేవుడయినా……
అతివ ఆలంబన లేనిది..
తాను నిమిత్త మాత్రుడనని…తెలుపగలిగే..చరితే……
మూర్చిల్లిన శ్రీ కృష్ణుని రక్షించుకొన…
నరకాసురుని వధించిన సత్యభామ కథ…

ఆది ..అంతం..”ఆమె” అని తెలిసినా….
అణగారని అహంకార రాక్షసులు కోకొల్లలు..
జీవాన్ని తోడేస్తూ…ఛరించే శవాలుగా మార్చేస్తూ..
అమ్మ కూడా “ఆమె ” అన్న బావాన్ని తొక్కేస్తూ…
ఆదిశక్తి అంశను అశువుల వలయంలో బందిస్తున్నారు..వారు..

పుణ్య ఫలాలనిచ్చే పురాణాలకాలంనుంచి…
సరస్వతి…లక్ష్మి…పార్వతి…పేర్లు ఏవయినా…
దేవి..అమ్మవారు ..సౌభాగ్యప్రదాయిని “ఆమె..”
ప్రతి నోములోను..గౌరమ్మగా పూజలందుకుంటూ…
హిందూసాంప్రదాయంలోనిలిచిన… పసుపు పట్టపురాణి “ఆమె “

“ఆమె ” కంటి కొస వెన్నెలలు కురిసిన రోజు..
“ఆమె ” చిరునవ్వుతో మల్లెలు పూయించిన రోజు…
“ఆమె” కదలిక కనకాంబరాల కనకం కురిసిన రోజు..
“ఆమె” లో కంటి చెమ్మచేరనీయకుంటే చాలు..
ఆ రోజే అసలయిన “దీపావళి ” పండుగ ..
ఆ పండుగ ప్రతిరోజు రావాలి…ఇక తారా జువ్వలెందుకు ..
“ఆమె ” పంచే ప్రేమామృత ధారల సేవనల అమరమైనాక..!!

– సుజాత తిమ్మన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , Permalink

3 Responses to “అమరమైనాక..”(కవిత )- సుజాత తిమ్మన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో