సమకాలీనం – విజయభాను కోటే

మరణం ఎప్పుడైనా రావచ్చు…స్వయంకృతాపరాధానికి బలి కావచ్చు!
——————————————————————————–

యంత్రాలమైపోయిన తర్వాత భయాలు కూడా ఉండకూడదు. అవును.
పరిణామ క్రమంలో మనిషి తయారీ భూగోళానికి పరిణమించిన శాపంగా చరిత్రలో నిలిచిపోనుంది.
చరిత్రను చదివేందుకు భవిష్యత్ తరం మిగిలి ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నే!
చిన్నగా మొదలై, 20, ౩౦ సెకన్ల పాటు ముందు ఇంట్లో వస్తువులు, తర్వాత మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంటే, ఇదివరకు భయం వేసేది. ఇంట్లోంచి పరుగెత్తి బయటకు పారిపోయేవాళ్ళం. ఇపుడు భయం తగ్గింది. ఒక రకమైన నిర్లిప్తత ఆవరించింది.
ఏదో ఒక ఉపద్రవం ఎప్పుడైనా ముంచుకురావచ్చు.
నీరు ఉప్పెనగానో, సునామీగానో నీపై విరుచుకుపడొచ్చు.
భూమి రెండుగా చీలి, నువ్వు కట్టుకున్న నీ అంతస్తులను మట్టుపెట్టొచ్చు.
సమూహాలకు సమూహాలు ఒక్క క్షణంలో శవాల గుట్టలుగా మారొచ్చు.
ఏమైనా కావచ్చు,,,,,
ఏదీ కాకపొతే, బయటకు వెళ్ళిన ఇంట్లో సభ్యులు తిరిగి ఇంటికి రాకపోవచ్చు,,,
అయితే ఆక్సిడెంటు కావచ్చు…రోడ్ల మీద భద్రత లేదు కదా….
ఆడపిల్లలు, ఆమె తల్లులు కూడా మార్గ మధ్యలో ఎక్కడైనా అత్యాచారానికో, హత్యకో గురి కావచ్చు…
నేను విసిగిపోయానో….
మానవ సమాజపు స్వయం కృతాపరాధానికి విరక్తి చెందానో తెలీదు…..
ఎన్ని నీతులైనా, చెప్పడానికే….చెయ్యడానికి కాదని సబ్ కాన్షియస్ గా ఫిక్స్ అయిపోయిన మానవ నైజాన్ని దగ్గరగా చూసి, దిగులు చెంది ఉన్నానని మాత్రం చెప్పగలను….
భౌతికంగా, మానసికంగా రోగగ్రస్థమైన దేశాల్లో ఎంత మేధస్సు ఉంటే ఏం లాభం?

– విజయభాను కోటే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, సమకాలీనం, , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
D.Venkateswara Rao
D.Venkateswara Rao
5 years ago

ఈ క్రింది ప్రసనలకు మీరు జవాబు చెప్పి తీరాలి….

యంత్రాలమైపోయామని మీరు కాక ఎవరనుకుంటున్నారు?
మనిషి భూగోళానికి పట్టిన శాపమా ?
భౌతికంగా, మానసికంగా రోగగ్రస్థమైన దేశాలు ఏవి ?

తెలియకుండా మాట్లాడకండి
తెలిసి తెలియనట్లు ప్రవర్తిన్చాకండి

భూకంపం వాటి ప్రమాదాలనుండి ఎలా తప్పించుకోవచ్చో తెలపండి
రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసే విధానాన్ని సూచించండి
మానభంగాల నివారణ గురిచి చెప్పండి

ఎంత మేధస్సు ఉంటే ఎంత లాభం? –