కుమారసంభవం

రచయిత : మల్లాది వెంకటకృష్ణమూర్తి

maala kumar అనగనగా ఓ వూళ్ళో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి వున్నారు.తొలిచూపుల్లోనే ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టి పెళ్ళి చేసుకున్నారు.సంవత్సరం లోగా వాళ్ళ కి మొదటి బిడ్డ పుట్టాడు. తరువాత చాలా మంది. వాళ్ళంతా సంతోషం గా జీవించారు.
ఇది మామూలు కథ.

కాని ,”కుమారసంభవం” వక అసాధారణమైన కథ.సుకుమార్, వరలక్ష్మిలకి కాని, సుకుమార్, భవానిలకి కాని వివాహము కాలేదు. కాని ముగ్గురి కి కలిసి ఓ బిడ్డ పుట్టాడు. అది ఎలా సంభవం? అంటే ఇలా . . . . .
సుకుమార్ కు ఉరిశిక్ష బడుతుంది. నేను నేరస్తుడిని కాను , బాపిరాజు చంపలేదు అంటే నమ్మరు.సాక్షాలన్నీ సుకుమార్ ను నేరస్తుడని రుజువు చేస్తాయి.సుప్రీంకోర్ట్ కు అప్లై చేసుకున్నా తిరస్కరించ బడుతుంది. ప్రెసిడెంట్ కు అప్లై చేసుకొని తీర్పు కోసం ఎదురు చూస్తుంటాడు.ఓరోజు లైఫ్ మాగ్జిన్ లోని ఓ ఆర్టికల్ చదువుతుండగా ఓ ఐడియా వస్తుంది. తను చనిపోయినా తనకో బిడ్డ వుండాలి అనుకుంటాడు.దాని కోసమని జైల్ సూపరినెంట్ ను సంప్రదిస్తాడు. ఆయన ఒప్పుకోవటము తో జైలో వున్న తోటి ఖైదీలు ఐన భవాని, వరలక్ష్మి లను సంప్రదిస్తాడు. వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా చివరకు వొప్పుకుంటారు.శిశోదయం అనే హాస్పిటల్ ని నిర్వహించే డాక్టర్ జయశ్రీ, డాక్టర్ రవీంద్ర ప్రసాద్ ల పర్యవేక్షణలో సుకుమార్ కి టెస్ట్ ట్యూబ్బేబీ విషయం లో తోద్ఫడేందుకు తమ సంసిద్దతను వ్యక్తపరిచారు.భవాని, సుకుమార్ ల టెస్ట్ ట్యూబ్ బేబీ కి వరలక్ష్మి సర్రగేట్ మదర్ గా ఒప్పుకుంది.అలా ఇద్దరు తల్లులు, ఒక తండ్రి కి పుట్టిన బిడ్డ కోసం జరిగే చిత్ర విచిత్రమైన కథే ఈ “కుమారసంభవం”.

ఈ కథ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పేకన్నా చదివితే బాగుంటుంది.
కథ లోనే కాదు , నవలా ప్రపంచం లో ‘కుమారసంభవం’ ఓ కొత్త ఎక్స్పరిమెంట్.నవలలు కనీసం 300 నుంచి 360 పేజీల దాకా వుంటాయి.అన్ని పేజీలల్లో చెప్పదగ్గ కథ ని కేవలం 120 – 140 పేజీల్లో చెబితే బిగి, వేగం అధికం అవుతుందన్న వుద్దేశ్యం తో మల్లాది దీని ని ‘స్పీడ్ నవలాగా వ్రాసారు. తక్కువ పేజీలల్లో రాసినంత మాత్రాన కథ తక్కువ కాని పాత్రపోషణ కాని, ఇతర అంశాలు కాని తగ్గలేదు. ఇదో కొత్త ప్రయోగం.

ఈపుస్తకం లో ఓ బోనస్ బుక్ కూడా వుంది. అందులో రోజుకొకటిచొప్పున సంవత్సరానికి సరిపడ ” ప్రేమ కొటేషన్స్ ” వున్నాయి.ఎంచక్కా ప్రేమికులు సంవత్సరము పొడుగూతా తమ ప్రేమను ఒకరికొకరు , రోజుకో విధం గా తెలుపుకోవచ్చు.
మల్లాది గారి గురించి కొత్తగా చెప్పక్కరలేదు. దాదాపు గా 100 నవలలు రాసిన మల్లాది గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నవల ఇంకో నవల కి తేడా గా ఏదన్నా సబ్జెక్టు తీసుకుంటే దాని గురించి సంపూర్తిగా వివరంగా చెప్పడం అయన ప్రత్యేకత. అది పులి మీద కావొచ్చు, చట్టం మీద కావచ్చు, రోగం మీద కావచ్చు ఏదన్నా సరే దాని గురించి విపులంగా, వివరంగా రాయడం అయన ప్రత్యేకత. కథ లో అనవసరమైన వర్ణన కన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్ కి ప్రాధాన్యత ఇస్తారు అయన. మధ్య మధ్య జోక్స్ , చిన్న చిన్న చిట్కాలు చెప్పటం ఆయన ప్రత్యేకత. అవన్నీ కూడా కథలో కలిసిపోయి ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయే కాని విసుగు పుట్టించవు.

– మాలాకుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో