అమ్మచెట్టు

నిజానికి ముప్పిడి ప్రభాకరరావు గారి కథల్ని ఈ సంపుటికి ముందుమాట రాసిన ఏ.కె.ప్రభాకర్ కంటే బాగా పరామర్శించడం కష్టం. ఆయన రచయిత గుండెమీద చెయ్యి పెట్టి కథావస్తువునీ దాని సామాజిక నేపథ్యాన్నీ, రచయిత ప్రాపంచిక దృక్పథాన్నీ నిశితమైన పరిశీలన చేసి రచయితకీ పాఠకులకీ న్యాయం చేశారు. మంచి విమర్శకుడాయన. ఆ పని ఎక్కువ చేస్తే బాగుండును.

తెలుగు సాహిత్యాన్ని నిష్పాక్షికంగా పరిశీలిస్తున్న ఎవరికైనా రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి తెలుగుకథకి మంచి విమర్శకులు లేకపోవడం రెండు ఏదో ఒక ధోరణి ఆవరించి ఉండడం. ధోరణీ సాహిత్యానికి అవసరమా కాదా అనేది సమాధానం లేని ప్రశ్న. కానీ ఏదో ఒక ప్రబలమైన ధోరణి ఉండడం కూడాజీవలక్షణం అని అంగీకరించాలి. అది సామాజిక చైతన్యానికి ఒక కిటికీ సమస్య అది కాదు. తెలుగులో ఈ వాదాలకి అతీతంగా కూడా సాహిత్యం ఉంటుందనే స్పృహ లేకపోవడం. సాహిత్య ప్రయోజనం మీద తెలుగులో వేరూనినంత బలమైన అభిప్రాయాలు మరే ఇతర భాషాసాహిత్యాలలో ఉన్నట్టు తోచదు. జీవితం ఎంత విస్తృతమైనదో సాహిత్యం కూడా అంతే. ఈ విస్తృతిలో ఏదో ఒక ధోరణి భాగంగా ఉండాలి కానీ అది ఆవిష్కృతిని పరిమితం చెయ్యకూడదు. రచయితకి సైద్దాంతిక నిబద్ధత ఉండవలసిన అవసరం లేదు. రచయిత ఎవరో ఒకరి పక్షం వహించి మాట్లాడ్డం అతని/ ఆమె ప్రాధమిక ధర్మం కాదు. అది వారి విశ్వాసాలకు నిబద్ధతకు సంబంధించినది. అటువంటి నిబద్ధత ఉండటమే గొప్పసాహిత్యానికి జీవలక్షణంగా భావించనవసరం లేదు. సామాజిక చైతన్యానికి ఒక్క పార్శ్వమే ఉండదు. తనదైన సామాజికధృక్పధంతో ఒక ధోరణిలో మమేకమై రచనలు చేయడం అభ్యంతరకరం కాదు. అదొక ఉదాత్తమైన వైఖరి. అంటే సామాజిక ప్రయోజనం ఒక నిర్దిష్టమైన సామాజికప్రయోజనంతో ముడిపడి ఉన్నదనే బలమైన నమ్మకం అది.స్థూలంగా ఈ అభిప్రాయం గత నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని గాఢంగా ప్రభావితం చేసిన మార్క్సిస్టు ధృక్పధం. సాహిత్యానికి సామాజిక భౌతిక ప్రయోజనం మినహా మరే ఇతర పరమార్థం లేదనీ ఉండకూడదనీ ఒకవేళ ఉన్నట్టయితే అది సాహిత్యం అనే సిద్ధాంతీకరణ జరిగిపోయింది దీన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. మరొకటి సాహిత్యం ప్రాధమికంగా సృజనాత్మక వ్యవహారం. అందువల్లనే అది సాహిత్యం అయింది. సృజనాత్మకత ఒక అద్భుతం దీనికి పరిమితులు లేవు. ఇది చింతనాశీలురైన రచయితలకు అవగతం అవుతుంది. ఈ క్లుప్తనేపథ్యం చెప్పడంలో ఉద్దేశం ముప్పిడి ప్రభాకరరావుగారి ప్రాపంచిక ధృక్పధం స్పష్టం చెయ్యడం. ఆయన వ్యక్తిగతంగా వామపక్ష విరోధి కాదు అది కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపకరణం అని నమ్ముతాడు. కానీ ఆయన అంతటితో ఆగిపోలేదు. కనుచూపు మేరా చూశారు. ఆ అలవాటుతోనే నడుస్తూ వస్తున్నారు. సమాజం లేదు వ్యక్తి మాత్రమే ఉన్నాడు అంటారాయన. సమాజం కేవలం వ్యక్తి భావన మాత్రమేననీ మనకి అనుభూతం అయ్యేది జీవితానుభవమే అనీ అదే తన సాహిత్యానికి చోదకశక్తి అనీ నమ్ముతారు ప్రభాకరరావు గారు. అట్లా జీవితానుభవాన్ని పట్టుకొని అత్యంత ఆలోచనాత్మకమైన ఇతివృత్తాలు ఆలోచించారాయన. ఇక్కడ మరోమాట స్పష్టం చేయకపోతే అపార్థం చేసుకొనే అవకాశం ఉంది. అనుభవం అనే పదానికి చాలా విస్తృతి ఉంది. లోతు ఉంది. అందుచేత అది కేవలం వైయక్తికమైన అనుభవం అనుకొనే ప్రమాదం ఉంది. సామూహిక అనుభవాన్ని స్వీయానుభవం చేసుకుని సాహిత్యచైతన్యంలో అక్షరబద్ధం చెయ్యడం అనుభవంలో ఒకభాగం. దీనికి జీవితానుభవం, సాహిత్యానుభవం చింతనాశీలత అనేవి ప్రాణశక్తిని ఇస్తూ ఉంటాయి. ఇంతకంటే వివరణ అప్రస్తుతం.

కొన్నింటికి ప్రత్యేకతను సంతరిస్తాయి. మిగతా అన్ని కథలూ అప్పటివీ ఇప్పటివీ నిర్మాణపరంగా ఏ లక్షణమైనవని చెప్పలేం. దానిక్కారణం ఊహించవచ్చు, కొన్ని కథల్ని ఎంచుకొని ఆయన ప్రత్యేకంగా నిర్మిమ్చారు., మిగతాది చాలా భాగం సరళమైన కథన పద్ధతిని అనుసరిస్తూ ఇతివృత్తం మీద కథ చెప్పేడాయన అయితే నిర్మాణ క్లిష్టత లేని ఈ కథన పద్ధతి మనకి కొత్త కాదు. నిరాడంబరమైన శైలి సరళరేఖ వలె సాగిపోయే కథనం రచయిత ఎంచుకోవడానికి కారణం ఆయన చెప్పదల్చుకున్న కథ. పాఠకుడు గమనించకుండా ఉండలేని మరొక అంశం అనేకకథల్లో ఒక రకమైన ఉత్కంఠ, ఉద్వేగాలకి సందర్భం ఏర్పడినా రచయిత అటువంటి దట్టమైన వాతావరణం కల్పించకపోవడం. తాను కల్పించిన పర్యావరణంలోకి పాఠకుల్ని నడిపించి తీసికెళ్ళి వదలడం తప్పించాడాయన, పాఠకుడే తనంత తానుగా అందులో చిక్కుపడి తేరిపార చూసుకునే అవకాశం కల్పించాడు. అంటే రచయిత తక్కువ చెప్పి ఎక్కువ పాఠకుడి ఊహకి విడిచి పెడుతున్నాడు. He ensures participation of the reader in the happenings. పాఠకుడు కాలక్షేపంగా కుర్చీలు కూచుని రచయిత చెంచాతో అందిస్తుంటే ఆస్వాదించే సౌకర్యాన్ని పొందటం లేదు. దీనికి మంచి ఉదాహరణ నడచివచ్చిన దారి అనే కథ. నలుగురు మిత్రులు ఒక ఆప్తమిత్రుడి అంత్యక్రియల సందర్బంలో చేసిన ప్రయాణం అది,. మిత్రుడి మరణం కలిగించిన దుఃఖాన్ని మర్చిపోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం మద్యపానం, ఒక అందమైన స్త్రీతో కబుర్లు. వాళ్ళందర్నీ పాఠకుడు మరో సింగిల్ సీట్లో కూచుని ఆరోవ్యక్తిగా కలిసిపోవడమే పార్టిసిపేషన్. రచయిత అతనికి సహాయం చేయడు. ఒక ఉద్వేగభరితమైన లేదా అటువంటి వాతావరణం కల్పించే పదచిత్రాల్ని ఉపయోగించడం ద్వారా ఒక దృశ్యాన్ని నిర్మించాడాయన. దీనికి ఒక ఉదాహరణ. అమ్మచెత్తు కథలో ఒక దృశ్యం. ఎంతో ప్రేమతో అపురూపంగా పెంచుకుంటున్న ఉడతపిల్ల కథకుడి కాళ్లకింద పడి చచ్చిపోతుంది. రెండు మూడు వాక్యాలు మాత్రం రాసి విడిచిపెట్టేడాయన. అది ప్రభాకారావు గారి కథన పద్ధతి.

గతరెండు దశాబ్దాలలో వచ్చిన ఉత్తమకథల్లో ‘బోడిఎల్లావు’ ఒకటి, అమ్మచెత్తు కూడా అంతే. ఈ రెంటికీ కూడా పైన చెప్పినదంతా వర్తిస్ద్తుంది రెండు కథల విస్తృతి గొప్పది. ఆలోచనాత్మకమైనది. మన నమ్మకాలు అభిప్రాయాలను రచయితే అన్నట్టు నీటిలో వేసిన రాయి కల్పించే వలయాల వలె వ్యాకోచింపచేస్తాయి. ప్రశ్నిస్తాయి. మన ఆలోచనల్ని ఉన్నతీకరిస్తాయి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని మిగులుస్తాయి. రెండుమూడు పొరలుగా అనుభూతం అవుతుంది. భౌతికంగా కర్మకాండపరంగా ప్రతీకగా అన్న భారతీయుల చేతనలో సజీవం అని మనకి తెలుసు. మాదిగ నుబ్బడి ఇంటినుంచి ప్రస్థానం మొదలై బిడ్డల్ని అనేక ఇళ్ళలో వదిలి పాలు పంచి పూజలందుకొని చివరికి శుష్కించి కబేళాపరం అయేలోగా మళ్ళీ నుబ్బడి ఇంటికి చేరుతుంది. బోడిఎల్లావు. అనేకకోణాల్లోంచి అర్థం చేసుకోవచ్చు. ఈ కథని. వస్తువు, ఉపయోగిత, విలువ అనే మార్కెట్ త్రిరత్నాల దృష్ట్యా విలువలు, ఉపయోగిత మానవధర్మం, విలువలు వాణిజ్యీకరణ, అవసరాల దృష్ట్యా వీటికి అతీతమైన నైతికత దృష్ట్యా పొరలు పొరలుగా మనకి అనుభూతం అయ్యే ఉత్తమ ఇతివృత్తం బోడి ఎల్లావు. కథలో ఎక్కడా రచయిత చొరబడి వ్యాఖ్యానించడు., కథ చెప్పుకుంటూ పోతూ పాఠకుడి చుట్తూ ఆలోచనా వలయాల్ని కల్పిస్తాడు రచయిత.

అటువంటి ఆలోచనాత్మకమైన కథ మరొకటి ‘అమ్మచెట్తు’ దీన్ని కేవలం పర్యాచరణ కథ అనడం దాని అంతరార్థాన్ని సంకుచితపరచడమే. పర్యాచరణం అంటే మనకి తెలిసిన అర్థాన్ని బట్టి కూడా ఉంటుంది. జననమరణాలు మనిషి ఉనికి. ప్రాణికోటి కంతటికీ గల పేగుబంధం, వాకూ గాడమైన తాత్త్వికచింతన కలగచేస్తుందీకథ,. ఎవరూ పని గట్టుకొని వెయ్యని సీతాఫలం చెట్టు పెరగడం ఎండిపోవడం, దాని పాదులో కాకుల బారినపడి చావబోయిన బతికిన ఉడత, చివరికి దాన్ని రక్షించి పెంచుకొన్న వ్యక్తి కాలికిందపడి అది మరణించడం, ఉడతచుట్టూ అల్లుకున్న ఆ కుటుంబం ప్రేమ చివరికి దాన్ని పాతిపెట్టినచోట మరో పచ్చటి మొలక రావడంతో కథ ముగుస్తుంది. జీవితం పట్ల ఒక రకమైన బెంగ, ప్రేమ ఒకేసారి కలిగిస్తుందీ కథ. మనిషి జీవితానికి ఒక అర్థాన్ని స్ఫురింపజేసే కథ ఇది. కథ చివరికి వస్తుండగా రచయిత ఒక చిత్రమైన వాక్యం రాస్తాడు. ‘ అందుకని మనిషి హృదయం ఓ స్మశాన భూమి కావాలి. అందులో ఈ స్మృతులన్నింటినీ పూడ్చిపెట్టాలి. బహురాఖీయమైన సీతాఫలం చెట్టు దాని ఫలదీకరణం స్మృతులు. ఇతర ప్రాంతీయభాషల్లోకి అనువాదం కావలసిన కథలు ఈ రెండే.

‘నడిచివచ్చినదారి’ కథ మనకి పరిచయం చెయ్యని శశాంక అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని జ్ఞాపకాల కారణంగా జరుగుతుంద్ఫి. అతన్ని చివరిసారిగా చూడ్డానికి నలుగురు మిత్రులు ప్రయానం అవుతారు. ఎవరీ శశాంక? జీవితానిని ప్రేమించిన ధీశాలి. ధైర్యశాలి. పైగా ‘ మనమిత్రుడు శశాంక ఒక విశిష్టవ్యక్తి. కీర్తినీ ఆడదాన్ని ఆయన దూరంగా ఉంచి మార్క్సిజాన్ని మందునీ అమితంగా ప్రేమించినవాడు’ – అని ఒక మిత్రుడంటాడు. నలుగురు మిత్రులూ శశాంక మరణం గురించి మాట్లాడ్డానికే ఆలోచించడానికే సిద్ధంగా లేరు. ఎందుకంటే అది ఒక బాధాకరమైన అనుభవం. పైగా రైలు హఠాత్తుగా ఒక నిర్జనప్రదేశంలో చటుక్కున ఆగిపొవడంతో చివరిచూపులు దక్కవని రూఢి అయిపోయి విస్కీసీసా తెరుస్తారు. ఆ క్రమంలో పక్కన కూచున్న అందమైన రెబెకా ఫ్రం జర్మనీ ని పరిచయం చేసుకొని సిగరెట్లు వెలిగించి అయిదుగురూ కబుర్లు చెప్పుకుంటూ విస్కీ సేవిస్తూ కాలక్షేపం చేస్తారు. ఉదయానికి వెళ్ళి మిత్రుడి పార్థివశరీరాన్ని చూస్తారు. అతన్ని ప్రేమించిన స్నేహితులెవరూ శశాంక మరణాన్ని స్వీకరించడానికి సిద్ధమైనట్లుగా కాలేకపోయారు. అంటే ఒక గాఢమైన దుఃఖాన్ని అధిగమించడానికే అర్థంచేసుకోవడానికీ లేదా అందులో మురిసిపోవడానికీ ఎవరూ సాహసించలేకపోయారు. మనిషి ఉన్నంతకాలం మృత్యువు అతనికి అర్థం కాదు. అనేకరకాలుగా అనేక సందర్భాలలో మృత్యుభీతి మన జీవితాన్ని నిర్వచిస్తూ ఉంటుంది.

పెద్దగా ఎవరూ పట్తించుకోని మరో మంచి ఇతివృత్తం ‘స్పష్టి’ నిన్న మొన్నటి వరకూ మధ్యతరగతి గృహస్థులందరికీ పరిచితమైన అతి సామాన్యవిషయం,. పాతపరుపు దూది ఏకించడం కథలో అటువంటి పాతపరుపుకి రాదనుకున్న దాన్ని బయటకి లాగి దూది ఏకించి కొత్తగ గేటు వేయించి ఇంటికి తీసుకురావడం వివరంగా రాసాడు రచయిత. అనేకప్రశ్నలు సమాధానాలు సందేహాలు తలెత్తుతాయి. కథ ముగించగానే మనసులోంచి చిరునవ్వు వస్తుంది. అల్పవిషయాలే వాటి గురించిన విచికిత్స వల్లనేమనం ఊహించలేని కొన్ని జీవన వాస్తవాలు అవగతం అవుతాయి. ఇదో చిత్రమైన ఎరుక. నిత్యజీవితంలో మనం అనేక విషయలకూ వస్తువులకూ కొన్ని విలువలు ఆపాదిస్తూ ఉంటాం. అనాలోచితంగానే అలవాటుగానే జరుగుతూ ఉంటుంది. విలువలు మారే అవకాశం ఉంది. మన ఆలోచనలు కూడా మనం నిర్మించుకున్న మూసలోనే ఉంటాయి. ఒకటి కాదు. అనేక ఆసక్తికరమైన కళ్ళు తళుక్కుమనిపించేవాస్తవాలు స్ఫురిస్తాయి. జీవితం కొత్తగా కనిపిస్తుంది. ఏకి కొత్త గల్లీలుఅ తొడగా తినిపిస్తుంది. బావుంటుందనిపిస్తుంది.

తీరిగ్గా ఏడాదిలో ఒకటో రెండో కథలకంటే ఎక్కువ రాయరు ప్రభాకరరావుగారు ఎక్కువ రాయాలనే తాపత్రయం ఉన్న వాడుకాడాయన. ఆయన మరోసంకలనం కోసం మరో రెండేళ్ళు వేచిఉండక తప్పదు. తెలుగువాళ్ళకి రాశి ఉంటే ఎక్కువ ఇష్టం, జీవితంలోంచి అనేక మంచి కథల్ని ఏరి గుచ్చి గిచ్చిన ముప్పిడి ప్రభాకరరావుగారు అభినందనీయులు.

– తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

ముప్పిడి ప్రభాకరరావు
46-18-25/1
దానవాయిపేట.
రాజమండ్రి-533103
సెల్.నం.9295503024

UncategorizedPermalink

One Response to అమ్మచెట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో