నేతాజీ అదృశ్యం వెనుక కథ ఇప్పటికైనా వెలుగులోకి వస్తుందా?

నిజంగానే నేతాజీ బ్రతికే ఉన్నారా?
ఈ సందేహం మీలో ఎవరికైనా వచ్చిందా?
కొన్ని మిస్టరీలు ప్రపంచంలో చేదించకనే మిగిలిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాతో, కొన్ని దశాబ్దాల తర్వాతనో కొన్ని మిస్టరీలు వీడిపోతాయి.
ఇన్నేళ్ళ తర్వాత ఆయన బ్రతికి ఉన్నారంటూ రమేష్ కుమార్ అనే న్యాయవాది ద్వారా భారతీయ సుభాష్ సేన కు చెందిన ఒక మహిళ, తమిళ కోర్టులో కేసు వెయ్యడం కొంచెం విచిత్రంగానే ఉన్నా… అప్పట్లో భారత ప్రభుత్వం నేతాజీని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగిస్తామని హామీ ఇచ్చింది నిజమేనా? ఒకవేళ ఆ హామీ ఉన్నా, ఆయన చనిపోయారని అనుకున్న తర్వాత ఆ హామీను ఉపసంహరించుకోవాలని కానీ, లేదా స్వతంత్ర భారతంలో అటువంటి హామీలు, చట్టాలు మొదలైన వాటిని సవరించాలని కానీ న్యాయ వ్యవస్థ ఆలోచించలేదా అన్న విషయం ఇపుడు పౌరులందరి మెదడుల్లోకి వచ్చి చేరింది.
నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణించారని మనకు రుజువులు లభించలేదని అందరికీ తెలుసు. అందుకేనేమో ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారని చాలా సంవత్సరాలుగా అనుకునేవారు. ఆయన ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అంటూ చాలా మంది కథనాలు రాసారు. ఆయన కనిపించకుండా పోవడం వెనుక కారణాలు వెతకడానికి కొందరు ప్రయత్నించారు. అప్పుడప్పుడూ నేతాజీ సాధువుగా జీవిస్తున్నరంటూ ఎవరో ఒకరు చెబుతూనే ఉన్నారు. కానీ ఇంకా బ్రతికి ఉండడం అనే విషయం మాత్రం నమ్మశక్యం కాదు. ఆయన జీవిత చరిత్ర చదివితే ఆయన ప్రస్తుత వయసు ఎంత ఉండవచ్చో మనకు తెలుస్తుంది.
ఇదంతా ఒక సరదా అని కొందరికి అనిపించవచ్చు.
గుహా అనే వ్యక్తి చెప్పినా….
భగవాన్ జి అనే ఆయన నేనే నేతాజీని అన్నా….
నేతాజీ రాసారంటూ కొన్ని ఉత్తరాలు వెలుగులోకి వచ్చినా…
ఈ విషయం మాత్రం భారతీయులకు స్పష్టత లేని అంశం.
1945 లో అదృశ్యం అయిన గొప్ప నాయకుడి జీవితంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రజలందరికీ ఉంది.
జాతీయ నాయకుల పేర్లు కూడా సరిగ్గా తెలియని నేటి యువత ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి నేతాజీ జీవిత చరిత్రను చదువుతున్నారు.

కేంద్రానికి నోటీసు ఇవ్వడం కోర్టు చేసిన మంచి పని.
కనీసం ఆ హామీ ఇంకా ఉందో లేదో తెలియడమే కాదు ఇంకా ఇటువంటి అంశాలు మన ప్రభుత్వం పట్టించుకోక పోయి ఉంటే అవి కూడా వెలుగు లోకి వస్తాయి. తీగ లాగితే డొంకంతా కదిలింది అంటారు కదా….
రమేష్ కుమార్ లాగిన తీగతో కొన్ని డొంకలన్నా కదలాలి.

 

http://in.rediff.com/news/2005/may/11inter1.htm

https://www.facebook.com/netajiliveson

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కాలమ్స్, సమకాలీనంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో