భవాని దేవి కవిత్వంలో మానవీయత

“మనిషి మనిషి అయిన మరి తంట ఏముండు ” అంటారు మానవతావాదులు. మానవీయత అనే మూలధాతువును జారిపోనీకుండా ఉన్నంతవరకు మనిషి మనిషి గానే ఉంటాడు. సామాజిక వికాసానికి, ప్రగతికి తోడ్పడుతూనే వుంటాడు. స్వార్ధం ప్రకోపించి అధికార దాహం, ఆర్ధిక దాహం, మనిషిలో తలెత్తినప్పుడు మానవీయతను మరుగు పరిచే సామాజిక విద్వంసక చర్యలకు పూనుకుంటాడు. దోపిడిలు, దౌర్జన్యాలు, అణిచివేత, అమానవీయత వీటికి ఆయుధాలై ఎల్లప్పుడూ బలహీన వర్గాలని బాధిస్తుంటాయి. శాంతియుత సామాజిక సాంస్కృతిక జీవన సంపద మీద దాడి చేస్తాయి. మానవత్వానికి ఓ నిర్వచనాన్ని తమ చర్యలకు అనుకూలంగా రూపొందించడం జరుగుతుంది. ఈ విధమగా పాలకవర్గాలు దోపిడీ వర్గాల కొమ్ము కాస్తూ అట్టడుగు వర్గాల్ని అణచి వేస్తూ మానవీయతా విలువలకు మసి పూసి వారికి అనుకూలమైన కొత్త నిర్వచనాలనిస్తూ ఏలుబడి సాగిస్తుంటారు. అందుకే మానవీయత కోణాలు ఆర్ధికపరంగా, అధికార పరంగా ఉన్నత స్థితిలో వున్న వారి పక్షాన్ని వహిస్తూ సమాజాన్ని ఓ తీరుగా ఉంచవు. సమాజంలో వైవిధ్యాలు వైరుధ్యాలు విస్తృతిస్తుంటాయి. అంతరంగపు తూట్లు గమనించము. అంతరిక్షానికి బాటలు వేస్తుంటాము.
సామాజిక విద్వంసక మూలాలను బయట పెట్టి సమాజాన్ని అమానవీయతా రుగ్మతులనుండి విడిపించాలనుకునే సాహితీవేత్తల్లోను మానవీయత దృక్పధాల దృష్టి కోణం ఒక తీరుగా ఉండదు. అందుకే భౌతికవాది దృష్టిలో మానవీయత దృక్పధం ఒక కోణంలో కనిపిస్తుంటుంది. మార్క్సిస్ట్ దృష్టిలో ఒక తీరుగా ఉంటుంది. అస్తిత్వవాది దృష్టిలో మరో విధంగా ఉంటుంది. అట్లే ఆద్యాత్మిక వాది దృష్టిలో మానవీయత కోణం ఇంకో తీరుగా కనిపిస్తుంటుంది. ఏది ఏమైనా సాహిత్యానికి టార్గెట్ సమాజం, మనిషి, మానవీయత. “అన్ని రోడ్లు రోమ్ పట్టణానికే అన్నట్లు” సాహిత్య ప్రయోజనం సమాజంలో మానవీయతను పెంపోదించడమే! ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిచడమే.
డా. చిల్లర భవాని దేవి కవిత్వంలో మానవీయతను ఎత్తి చూపడమే ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం. సాహిత్యరంగంలో నాలుగు దశాబ్దాలు అనుభవాలను అనుభూతులను కలబోసుకుని సామాజిక అభివ్యక్తి , ఆత్మాశ్రయ వ్యక్తీకరణ పరిణితి చెందిన అవగాహనతో “ఏడు కవితా సంపుటాలను” వెలువరించారు. ప్రతి సమకాలీన సంఘటనకు చలించి నిజయితీగా, ధైర్యంగా అన్యాయాలు అక్రమాల మీద నిప్పులు చెరిగారు. దోపిడీ వ్యవస్థను, ధనస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ అణచివేయపడుతున్న అట్టడుగు వర్గాలకోసం నిలబడి తన కవిత్వాన్ని వినిపించారు. అంధ విశ్వాసాలను ఖండించారు. మానవీయత వాదాన్ని వినిపించారు. మానవుడే అన్నింటికీ ప్రమాణంగా భావించారు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆశించారు. మనిషి మనిషి తనాన్ని మరువకూడదని ఆశించారు. సాటి మనిషి ఉనికిని మరచి పోకూడదని భోదించారు. అందరూ ఒకే మానవాత్మగా మనగలగాలంటూ తన కవిత్వంలో ప్రభోదించారు.
ఈమె సిద్దాంతపరమైన ఏ వాదాన్ని తలకెత్తుకున్న కవయిత్రి కాదు. ఏ ‘ఇజం’ లోను ఇమిడి తీరిన కవయిత్రి కాదు. మానవీయత కోణాన్ని మరచిపోని వైయక్తిక పరివర్తనతో, సాముహిక సద్వర్తనతో, సమాజాన్ని కల్లోలపరుస్తున్న సమస్యల యెడల స్పందిస్తూ, శాస్త్రియమైన, హేతుబద్ధమైన ఆలోచనాధోరణి పాటకుల్లో రేకెత్తించి ఒక సజీవ సంతకంగా సాహిత్య రంగంలో మిగిలిన కవయిత్రి భవనీ దేవి. ఈమె కవిత్వంలో భౌతికవాద చ్చాయలు ఉంటాయి. ఆధ్యాత్మికవాద పలుకుబడులు కనిపిస్తాయి. ఆధునిక సమాజంలోని అన్ని పార్శ్వాల్ని స్పృశిస్తూ మానవతా వాదాన్ని పైకి తెస్తున్న కవయిత్రి ఈమె. అభ్యుదయ, విప్లవ , శ్రామిక, సామాజిక దృక్పధాలు అప్పుడప్పుడు గొంతెత్తుతాయి. మానవతా దృక్పధానికి మనోజ్ఞరూపం దిద్దడానికి ప్రయత్నిస్తాయి. మానవ సంబంధాలు, ఆత్మీయతానురాగాలు స్వార్ధానికి బలైపోతున్నప్పుడు అశక్తత కన్నీరు మున్నీరవ్వడమే కాదు శక్తిని కూడదీసుకొని విప్లవ జ్వాలై ఎగియడమూ ఈమె కవిత్వంలో గమనించవచ్చు.
ఈమె కవిత్వంలో స్పష్టమైన శబ్ద ప్రయోగం ఉత్తమ భావుకతతో పాటు భౌతిక, ఆధ్యాత్మిక వాద సమన్వయము కనిపిస్తుంటుంది. అంటే భౌతిక, ఆధ్యాత్మిక వాదాల మేలు కలయికలకు నిలువుటద్దంగా ఈమె కవిత్వం నిలబడుతుంది. కవయిత్రిగా భవానిదేవి స్త్రీ వాదాన్ని భుజానికెత్తుకోక పోయినా మానవీయత కోణాన్ని మరచిపోకుండా అభ్యుదయవాదాన్ని అందిపుచ్చుకొని ఆడపిల్లలు బాల్యాన్ని బలికోరుతున్న సమాజాన్ని నిలదీశారు. పురుషాధిపత్యాన్ని దుయ్యబట్టారు.
ఆమె కవితా సంపుటాల్లోకెడితే…..
1. నాలోని నాదాలు.
“నా కవిత్వానికి నేపద్యం సమాజం, భూమిక నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు” అంటూ వస్తు మూలాలను
నిర్దేశించి చెప్పారు కవయిత్రి. “నాలోని నాదాలు” అనే కవితా సంపుటిలో సమాజానికి మంచి జరగాలంటే కొన్ని పెత్తందారితనాలు పతనంగాక తప్పదు అంటారు. “చేతన” కవితలో
“చిమ్మచీకట్లు చీలినపుడే
కమ్మని కాంతి కన్ను తెరుస్తుంది
మర్రి చెట్టు విరిగి పడినపుడే
మల్లె తీగ మిన్నులు చూస్తుంది.” అంటూ బలహీనులు పైకి రావాలంటే బలవంతుల అడ్డం తొలగాలి అనే సందేశానిస్తారు. “ఆవేదన” అనే కవితలో
“దానవత్వపు నీడలను దహించలేక
మానవత్వదీపం మిణుకు మిణుకు మంటున్నది” అంటారు.
“ఆశాగీతం” కవితలో
“జీవనగమ్యం చేరడానికి పోరాటం అనివార్యం…..
ఆటంకాల అడ్డు తొలగించుకొని
ఆశాకర దీపికతో అడుగులు వేయాలి” అంటూ వినిపిస్తారు కవయిత్రి.
మన ఆత్మలన్నీ ఒక్కటే ఆకృతులే వేరు అనే తాత్విక చింతన “మనమంతా” అనే కవితలో వినిపిస్తారు.
“మనమంతా ఒక పొలం గింజలం
మనమంతా ఒక కలం అక్షరాలం” అంటారు.
గవేషణ
గవేషణ అంటే వెదకటం. జీవితంలో వెతుకులాట ఓ సజీవ లక్షణం. మనిషి మనిషిగా బతకాలనేడి అన్వేషణలో సమాజం లోని అవకతవకలకు అర్ధం పట్టింది ఈ “గవేషణ”. “అర్దరాత్రి ఆవులింత” కవితలో
“అర్దరాత్రి బంది పోటులా
చీకటి ముసుగేసుకుంది”
నిస్సహాయంగా ఆక్రందించే
అమాయక హృదయ వేదన
పగలబడి పరిహసిస్తోంది” అంటారు.
“వెలుగు పాట” కవితలో
“మతోన్మాదుల కేకలతో
మానవతా స్పూర్తి మరుగై పోతుంది
కుళ్ళు కుతంత్రం నిండిన రాజకీయం
కప్పల తక్కెడగా కంగారు పడుతుంది
ప్రజాస్వామ్యపు కే.డి.లతో
సెగలు పొగలుగా పవిత్ర భారతం
అగ్ని పంజరంలో అల్లాడిపోతోంది” అంటారు.
“ఓ మనిషి కావాలి “ కవితలో ఈమె భౌతిక వాద పటిమ కనిపిస్తోంది.
“నాకీక్షణoలో
ఓ మానవ శక్తి కావాలి
అతి మాములుగా బ్రతికేసే
…………….. మనిషి కాదు” అంటూ మనిషి శక్తినే మహాశక్తిగా భావిస్తారు.
శబ్ద స్పర్శ
ఈ కవితా సంపుటిలో మెత్త మెత్తగా కనిపించే భవాని దేవి విచ్చుకత్తిలా విజ్రుంభించడం, అగ్ని జ్వాలలా రగిలి పోవడం చూస్తాము.
“విష ప్రపంచపు వధ్య శిలపై, వివక్షతా కరవాలానికి బలి అవుతూనే ఉంది.” ఆడది అంటారు. అట్లే “మానవ మేధో సమర సౌధం మెట్లు అన్నింటికీ, ఆధార సుత్రానివైన, అందరూ మరిచే ఆత్మఉ కూడా నీవేలే” అంటారు.
వర్ణ నిధి
అంటే రంగుల చీకటి, “వ్యసనాలతో కూడిన సుఖాల వెంట పరుగు లెత్తితే చివరకు మిగిలేది గాడాంధ కారమైన చీకటే “ అంటూ “పుణ్యభూమిలో ‘ఓపియం’ కూడా కుటీర పరిశ్రమ కావడం, కర్మ భూమికి వందనాలతో “బ్రౌన్ షుగర్” ఆహ్వానం, ఇంటర్నెట్ లో ఆర్డర్స్, స్విచ్ ఆన్ కొరియర్ నవ్వులతో కావలసినంత “వర్ణానిది” అంటారు.
అక్షరం నా అస్తిత్వం
తన సాహితీ ప్రస్థానంలో తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ కవిత్వమై సాగిపోతూ “అక్షరాలు నా ఆత్మీయ స్వరాలు, నా జీవనాకాశం నిండా అక్షరాల నక్షత్రాలే! అనుక్షణం నా సుఖ దుఃఖాలను, ఉద్వేగాలను, ఆవేశాలను, అనుబంధాలను, అల్లుకుందీ అక్షరాలే” నంటూ తన అనుభూతులు అక్షరాలయ్యే వైనాన్ని వ్యక్తీకరిస్తుంది కవయిత్రి, అభద్రతా భావాలూ లేని, తడి లేని హృదయంలేని వాడు “మరలా” కనిపిస్తాడు నాకు అంటుంది కవయిత్రి. “ఎందులో గాని, కంటతడి లేని మనిషి, నా కళ్ళకు యంత్రం లా కనిపిస్తాడు, ఎందుకంటే మనిషి తనానికి మిగిలిన ఒకే ఒక తోడూ కన్నీరు” అంటూ కన్నీటి విలువను చెప్తారు కవయిత్రి.
రగిలిన అక్షరాలు
కవిత్వంలో పరిణితి చెందబట్టే ప్రతి క్షణం రగిలింది కవితాక్షరాలు చినుకు చినుకుగా కలిసి ఒక కవితా వాక్య ప్రవాహాన్ని సృష్టించాయి.జీవితం పడవ మీద ప్రేమను ……………………

“తల్లి పేగు” కవితలో “అమ్మ భాషంటే నీ కన్ను కదా!, అది తెరిచి చూస్తేనే, ఏ కళ్ళ జోడుకైనా చూపు కనిపించేది” అంటారు.
“మానవ సంబంధాలు మృగతృష్ణ లవుతూ, మనిషి తనానికి ఊపిరాడనప్పుడంతా దుఃఖo” అంటూ రగిలిన క్షణాలను వ్యక్తీకరిస్తారు కవయిత్రి.
కెరటం నా కీరీటం
సామాజిక సమస్యల లోతుల్లో కెళ్ళి విస్తృత విహారం చేసి వేదన రోదనలను పసి గట్టి చైతన్యాన్ని సముపార్జించి సామాజిక స్పృహతో మానవీయతకు మకుటాయమానంగా నిలచిన డా. భవాని దేవి కవిత్వం వాస్తవిక జీవన చిత్రణలో కృతకృత్యులైయ్యారనే చెప్పచ్చు. సాహిత్య భావనా ప్రవాహంలో ఆలోచనా కెరటాలను తన కిరీటంగా ధరించి భావ తరంగాలను మానవీయతా స్పృహతో ఆవిష్కరించి సామాజిక చైతన్యానికి తన వంతు సాహిత్య కృషిని అందించిన భవానీ దేవి అభినందనీయురాలు.
ఈమెకి కవిత్వంలో గొప్ప నేర్పరితనముంది. కూర్పరి తనముంది, మానవీయత భావనా తపనుంది. కల్లోల పరచే సమస్యలపై ‘కవాతు’ ఉంది. అక్షరాల్లో తడి ఉంది. వేడి ఉంది. వెలుగు వుంది. చదివించే లక్షణముంది. మానవీయత అంతరిస్తే మనిషి మరుగుజ్జు అవుతాడనే హెచ్చరికలున్నాయి. సాహితీ క్షేత్రంలో సద్భావనలు సాగుచేసి సత్క్రుషితో అక్షర పంట పండించాలని ఆశిస్తున్నాను. మరెన్నో కవితా సంపుటాలు వీరి కలం నుండి జాలు వారాలని కోరుకోవడంలో అతిశయోక్తి లేదనుకుంటాను.

– కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to భవాని దేవి కవిత్వంలో మానవీయత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో