ఒడిసిపట్టిన చిత్రాన్ని నేను!(కవిత) – విజయ భాను కోటే

అక్షరాలు ఎన్ని భావాలను వ్యక్తీకరిస్తాయో నాకు తెలీదు. నేను మాత్రం నీ కళ్ళలో మైమరపును నింపడానికే పుడతాను. ఇంద్రధనుస్సును సవాలు చేస్తూ… వేల వర్ణాలను నాలో నిక్షిప్తం చేసి… నీ మనసులో తిష్ట వేసేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. నీ ఒక్క నవ్వును… నీ కంటి నుండి జారే ఒంటరి కన్నీటి చుక్కను… నీ పెదవి విరుపునూ… నువ్వు పెంచే మొక్కకు పూసిన మొదటి పువ్వునూ… ఆకాశంలో ఎగిరే చిన్ని పక్షి రెక్కనూ… ఒక్కలాగే స్వీకరిస్తాను… నీ ప్రపంచంలో ఉన్న ప్రతి అందాన్నీ… నీలో […]

Read more

అసంఘటిత రంగం! (కవిత )- విజయ భాను కోటే

‘మే’ డే ప్రత్యేక కవిత శక్తి అపారం అనుభవం ఆకాశం అసంఘటిత రంగం! పాదాలను నేలలోనే పాతి రెక్కల డప్పులను వాయించుకుంటూ అవలీలగా అసాధ్యాలను సుసాధ్యాలు చేసే జీవం అసంఘటిత రంగం! శ్రామిక జీవన సౌందర్యాన్ని భుజాల యాంత్రికతతో మమేకం చేసి పూలను, ముళ్ళను ఒకేలా ఆదరించే స్వరం అసంఘటిత రంగం! భూమిని నమ్మి చెమటను చిందించి నెత్తుటి అరుణోదయాలు సృష్టించే సైన్యం అసంఘటిత రంగం! కార్మికత్వంలో మార్మికత్వం మచ్చుకైనా కనిపించనివ్వక శ్రమలోనే దైవాన్ని కొలుస్తూ నిత్యం దేశ మనుగడకు ఆసరాగా నిలిచే వర్గం […]

Read more

సమకాలీనం- మనకు స్థిరత్వo ఉందా? – విజయ భాను కోటే

         ప్రపంచం మొత్తం భారతదేశపు మూర్ఖత్వానికి ముక్కున వేలేసుకున్నా, లెస్లీ ఉడ్విన్ అనుకున్నది సాధించింది. మరిగి మరిగి ఉన్న మహిళల రక్తం మళ్ళీ మరిగింది. ఇండియాస్ డాటర్ మళ్ళీ ఒకసారి నివురు గప్పిన నిప్పును మంటల్లోకి నెట్టింది. చర్చ మొదలైన చోటే ఆగిపోవడం మనకు అలవాటే! మనకు టీవీ చానెళ్ళు అన్ని ఎందుకు అని నేను ఎన్నో సార్లు విసుక్కుంటూ ఉంటాను. వీధికో ప్రైవేట్ స్కూలు ఉన్నట్లే, వాటిని పుట్టగొడుగులు అని మనం అన్నట్టే, ఈ చానెళ్ళను ఎందుకు అనమో […]

Read more

ఆతిథ్యం

ఆతిథ్యం —————— కొన్ని సత్యాలు ముందే తెలుస్తాయి చేదువైనా, తీపివైనా… కొన్ని కలలు నడిరాత్రికి ముందే విరుస్తాయి అందమైనవైనా, వర్ణాలులేనివైనా…. కొన్ని విశ్వాలు ముందే నిదురలేస్తాయి ఆద్యంతాలున్నవైనా, లేనివైనా… కొన్ని మేఘాలు ముందే వర్షిస్తాయి తుంపరగానైనా, కుండపోతగానైనా… ముందే రావడం వాటి లక్షణం అనుకోని అతిథులకు నీవేమి ఆతిథ్యమిచ్చావన్నదే ముఖ్యం! గీతాలు ——————– అర్థ మరణాన్ని నా నుదుటిన రాసిన గీతలు అలవోకగా, అర్థాంతరంగా…. నీకు, నాకు మధ్య నెట్టుకు వచ్చిన కందకాలంటి గీతలు అసమంజసమని తెలిసినా… పర్వతసానువులపైకి నన్ను లాక్కుపోయిన ఉక్కుతాళ్ళ గీతలు…. […]

Read more

సమకాలీనం

ఈ పరిపాలనలో క్రొత్త సాంకేతిక కెరటం ఐ క్లిక్ ఈ పరిపాలన అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరిపాలనను భద్రతా రంగంలో కూడా విస్తృతం చెయ్యడం ఒక మంచి పరిణామం. ముందుగా విశాఖపట్నంలో ఏర్పాటు చెయ్యబడ్డ కియోస్క్ల పనితనం సఫలీకృతం అయితే, ఇక అన్ని పట్టణాల్లోనూ ఈ కియోస్క్ లను (ఐ క్లిక్) ఏర్పాటు చెయ్యవచ్చు. అయితే, పట్టణాల్లోనే ఈ విధానం అమలు చెయ్యాలా? గ్రామాల్లో మహిళలు భద్రంగానే ఉన్నారా? లేరు కదా!! గ్రామాల్లోని మహిళలు పోలీసు స్టేషన్లకు వెళ్ళడానికి సరైన వెసులుబాటు […]

Read more

వేణువు

వెదురు తోటల దారుల్లోనే నా జీవితమంతా ఒక్కో వెదురు నాపై వంగి వేణువునౌతానని మారాం చేస్తే నేనేం చేసేది? పనిముట్ల అవతారం ఎత్తి విరిచిన వెదురును వేణువుగా మల్చడం తప్ప? నన్ను తయారుచేస్తే చాలా? వట్టి మూసపు పాత్రగా ఎలా ఉండను? నీ భుజంపై ఎన్నాళ్ళని వ్రేళాడను? నీ చుట్టూ ఉన్న గాలిని నాలోకి పంపు రాగాల సంగమాన్ని శ్రుతి చెయ్యి నన్ను కాస్త పని చెయ్యనియ్యి అంటూ విసిగిస్తుంటే ఏం చెయ్యను? లోనున్న ఊపిరినంతా ముక్కలు ముక్కలుగా తెలిసీ తెలియని రాగాలుగా ప్రవహింపజేయడం […]

Read more

నేతాజీ అదృశ్యం వెనుక కథ ఇప్పటికైనా వెలుగులోకి వస్తుందా?

నిజంగానే నేతాజీ బ్రతికే ఉన్నారా? ఈ సందేహం మీలో ఎవరికైనా వచ్చిందా? కొన్ని మిస్టరీలు ప్రపంచంలో చేదించకనే మిగిలిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాతో, కొన్ని దశాబ్దాల తర్వాతనో కొన్ని మిస్టరీలు వీడిపోతాయి. ఇన్నేళ్ళ తర్వాత ఆయన బ్రతికి ఉన్నారంటూ రమేష్ కుమార్ అనే న్యాయవాది ద్వారా భారతీయ సుభాష్ సేన కు చెందిన ఒక మహిళ, తమిళ కోర్టులో కేసు వెయ్యడం కొంచెం విచిత్రంగానే ఉన్నా… అప్పట్లో భారత ప్రభుత్వం నేతాజీని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగిస్తామని హామీ ఇచ్చింది నిజమేనా? ఒకవేళ ఆ […]

Read more

మానవ హక్కుల దినోత్సవం- డిసెంబర్ 10

జంతువుగా పుట్టినందుకు జంతువుకు కూడా జీవించే హక్కుంది. కానీ ఆ హక్కుల గురించి ఆ జీవికి తెలియదు. హక్కును సృష్టించిందీ మనమే! కాలరాసేదీ మనమే!మనిషిగా పుట్టినందుకు మనిషికీ కొన్ని హక్కులున్నాయి. ఈ హక్కులను కూడా సృష్టించింది మనమే….ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు కాలరాసేదీ మనమే! మనకి మానవ హక్కుల గురించి తెలుసా? ఈ నెల పదో తేదీన మానవ హక్కుల దినోత్సవం. బాల్యం నుండి వృద్ధాప్యం వరకూ మానవ హక్కుల అణచివేత ఎలా జరుగుతుందో మనకు తెలియదా? న్యాయాన్ని పొందడానికి అత్యాచారానికి గురైన మహిళలు కోర్టుల చుట్టూ […]

Read more

చరితవిరాట్ పర్వం

“విశృంఖలత్వం, కుత్సితాభిలాష నా ప్రవర్తనలోనే కాదు, నా నరనరానా జీర్ణించుకుపోయింది. నాకేం కావాలో నాకు తెలియదు. ఏదో కావాలనుకోవడం, దాని వెనుక పరుగులు పెట్టి సాధించుకోవడం….తీరా అది దొరికాక, నాకు కావల్సింది అది కాదని అర్థం కావడం! ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకూ…. అనుకున్నవన్నీ దొరికాయి. దొరికాక తెలియని అసంతృప్తి. వెర్రి వేయి విధాలన్నట్లుగా నా వెర్రి పరిపరి విధాలుగా పోయేది.” నేను చెప్తున్నది ఆమెకు అర్థం అవుతుందో, లేదో నాకు తెలియలేదు. ఆమె ముఖంలోకి తేరిపార చూసాను. ఆ చిన్ని కళ్ళల్లో […]

Read more

ఒక జీనీ కావాలి

“ఒక అల్లాఉద్దీన్ అద్భుతదీపం కావాలి అందులోని జీనీ అచంచలమైన ఆత్మవిశ్వాసం కలిగినదై ఉండాలి. నేను ఎంతటి పని చెప్పినా… ఒక్క ఊపుతో పూర్తి చేసేదై ఉండాలి” “ఇది మానవులందరికీ ఉండే కోరికేలే!” ఒక్క మాటతో నా కోరికను జెనరలైజ్ చేసేసాడు దేవుడు! వాడిన నా ముఖం చూసి జాలి పడ్డాడో ఏమో…. “సరేలే! ఇంతకీ ఏమంత గొప్ప పనులు చెయ్యిస్తావేం జీనీతో” అనడిగాడు పోయిన ఉత్సాహమంతా బూమరాంగ్ లా తిరిగొచ్చేసింది! “మా గొప్ప పనులు చేయిస్తాలే!” అంటూ కళ్ళను గుండ్రంగా తిప్పాను! “అబ్బో కాసిన్ని […]

Read more
1 2 3 6