వీరనారి ఝాన్సీ ఝల్ కారీ బాయి

బయట ప్రపంచానికి తెలిసిన ఝాన్సీ లక్ష్మిబాయి సాహసాలు , యుద్ద నైపుణ్యం , జీవిత గాధ  సాహసానికి ఒక కోణాన్ని చూపిస్తుంటే రెండవ పార్శ్వం చరిత్రలో అడుగున తొక్కేయబడింది .పరిచయం …

                 శౌర్యం, పరాక్రమం ఏ కులానికో, వర్ణానికో స్వంతం కాదు. ఎప్పుడూ అవి పిత్రార్జితాలుగా ఉండలేవు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దళిత నాయకులు, ఎలాంటి శక్తివంతమైన పాత్రల్ని పోషించారో అలాంటి బాధ్యతల్ని బహుశా వేరే జాతివాళ్ళు కూడా నిర్వర్తించి ఉండకపోవచ్చు. చరిత్ర నిర్మాతలకి, దళిత సమాజపు నాయకుల గురించి వారి సాహసోపేతమైన చర్యల గురించి బహుశా తెలియకపోవచ్చు. అందుకే ఆవైపు తమ కలాన్ని నడిపించలేకపోయారేమో?

            001 (2) భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఝల్‌కారీబాయికి కూడా ఇదేవిధమైన శక్తివంతమైన, ప్రతిభావంతమైన చరిత్ర ఉంది. ఒకవేళ తెలివైన రచయితలు, సాహిత్యకారుల ద్వారా పరిశోధన ప్రారంభం కాకపోయిఉన్నట్లైతే దళిత సమాజానికి చెందిన ఆ వీరనారి చరిత్ర అంధకారంలోనే మగ్గిపోయేది. ”మగవానివలె పోరాడింది. ఆమె ఝాన్సికి రాణిగా ఉంది.” ఈ పంక్తులు ప్రతి పిల్లవానికి తెలుసు. కాని స్వయంగా ఆమెకోసం రణభూమికి వెళ్ళిన ఝల్‌కారీబాయి గురించి ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగానే దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఝల్‌కారీబాయి పేరు వింటే సమస్త దళిత సమాజానికి గర్వంగా వుంటుంది. తన సాహసోపేతమైన ప్రతిజ్ఞతో, వ్యక్తిత్వంతో, భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆమె వేగుచుక్కలా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అంతేకాకుండా దళితస్త్రీ దేశ గౌరవాన్ని మరియు స్వాతంత్య్రాన్ని రక్షించడంలో ఎవరికీ తీసిపోలేదు అని ఆమె నిరూపించింది. ఈమె వంశవృక్షం బౌద్ధ చక్రవర్తుల గౌరవప్రదమైన చరిత్రతో ముడిపడి ఉంది.
బుందేల్‌ఖండ్‌ చరిత్ర ప్రారంభం నుండే శౌర్యానికి, సాహసాలకు పెట్టింది పేరు. కనుకనే దేశాన్ని ఆంగ్లేయుల కబంధ హస్తాలనుండి విడిపించి దేశానికి  స్వాతంత్య్రం ఇప్పించడానికి అక్కడి ప్రజలు వెనుకడుగు వేయలేదు. బుందేల్‌ఖండ్‌ ప్రజలు ఎప్పుడూ విదేశీ అధికారం ముందు శాశ్వతంగా లొంగిపోలేదు. ప్రత్యేకంగా కొన్ని రాజ్యాలు మరియు సంస్థానాలతో కూడిన ప్రాంతాన్ని ‘బుందేల్‌ఖండ్‌’ అని పిలుస్తారు. ఇందులో అప్పటి పన్నా, బిజావర్‌, ఆజంగఢ్‌, కాలపి, గ్వాలియర్‌, గఢ్‌కోటా, సాగర్‌, విదిశా, జబల్‌పూర్‌, సమథర్‌, ఫర్రీ, దాదపుర్‌, చిరగాఁవ్‌, దుఖఈ, గుర్‌సరాయ్‌, రేవా, దతియా, ఛతర్‌పూర్‌, ఝాన్సీ, ఓర్ఛా, టీకమ్‌గఢ్‌, చందేరి, బాన్‌పూర్‌, టోడి, ఫతేపూర్‌, మొదలైన భాగాలు వుండేవి.
                  డా|| ఎస్‌. పాఠక్‌ అభిప్రాయం ప్రకారం సామ్రాట్‌ అశోక చక్రవర్తి కౌశంబీని తన రాజ్యానికి రాజధానిగా చేసికొని అక్కడ బౌద్ధ సంఘాన్ని సంఘటితం చేయడానికి ప్రయత్నించాడు. ఇదే ఉద్దేశ్యంతో మహామంత్రులను నియమించాడు. ఆ కాలంలో ఇక్కడి ప్రజలు బౌద్ధ ధర్మాన్ని అధిక సంఖ్యలో స్వీకరించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అశోకుని మహారాణి ‘చారువాకి’ కౌశంబీ బౌద్ధ సంఘానికి మామిడిచెటు, ఇళ్ళు మరియు ఇతర వస్తువులు కానుకగా ఇవ్వడం జరిగింది. ఇదేవిధంగా గుప్తులకాలంలో బౌద్ధ మత ప్రచారం విశేషంగా సాగింది. బాందా జిల్లాలోని పాయలాని తహసీల్‌లోని ధన్‌శేర్‌ఖేరాలోని శిధిలాలలో బుద్ధ భగవానుని విగ్రహాలు లభించాయి. అవి గుప్తుల కాలం నాటివి. ఈ విగ్రహాలన్నీ ఈ ప్రాంతపు నాటి బౌద్ధ మతపు విశేష ప్రచారంకి సంబంధించిన సంకేతాలను ఇస్తున్నాయి.
           ఈ భూమిపై భగవాన్‌ బుద్ధుని అమృతవాణి  నిరంతరం  ప్రతిధ్వనిస్తూ ఉంటుంది
ఝాన్సీ దతియాల మధ్య ఒక పర్వతంపై ‘గుజర్రా’ పేరున్న శిధిలాలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో అశోకుని ద్వారా చెక్కించబడిన ‘శాసనాన్ని’ చూడవచ్చు. బౌద్ధ కాలంలో ఈ ప్రాంతాన్ని ‘బుద్దఖండం’ అనేవారు. దానికి ఈ శిథిలాలే సాక్ష్యము. ఆవిధంగా ‘బుద్దఖండ్‌’ ప్రజల నోళ్ళలోపడి బుందేల్‌ఖండ్‌గా మారిపోయింది.
                     ఈ సమస్త భూమండలంలో ఒకప్పుడు బుద్ధ భగవానుని అమృతవాణి వినిపించేది. కొన్ని సంవత్సరాలక్రితం భోపాల్‌ మండల్‌లో కుషాణుల కాలపు  విశాలమైన గోడను కనుగొన్నారు. ఇక్కడి పురాతన కాలం నాటి మహత్తరమైన బౌద్ద గుహలు ురియు బౌద్ధ విహారాల్ని చూచినట్లైతే ఈ ప్రాంతం బౌద్ధులకాలంలో గౌరవప్రదమైన స్థలంగా కీర్తింపబడిందని ప్రామాణికంగా తీసుకోవచ్చు.
                  సత్యేంద్రసింగ్‌ అనే ప్రముఖమైన హిందీ అధికారి అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతాన్ని ‘బుందేల్‌ఖండ్‌’ అని అంటారు. అదేమంటే వింధ్యాచల్‌లో ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో రాజపుత్ర రాజు హరిసింగ్‌ ఒక జీవిని బలి ఇవ్వదలచుకున్నాడు. బలిఇచ్చే సమయంలో ఒక బూంద్‌ రక్తపు చుక్క కింద పడింది. దీన్నే ‘బుందేల’ అని అన్నారు. మరోవైపు డా|| సుభేష్‌ ప్రకారం పంచమ్‌సింగ్‌ బుందేలా 1048 సం||లో మహోనీలో తన రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత          బుందేల క్షత్రియుల పేరుతో దీనిని ‘బుందేల్‌ఖండ్‌’ అని పిలవసాగారు..
                    వీరనారి ఝల్‌కారీబాయి దళిత జాతికి చెందిన ‘కోరీ’ ఉపజాతికి చెందింది. ‘కోరీ’ని ‘కోలి’ అని కూడా అంటారు. గౌతమబుద్దుని భార్య కూడ ‘కోరీ’ జాతికి చెందింది. ఈ వాస్తవాల్ని చూస్తుంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఒకప్పటి పాలకవర్గం ఎలా పతనమయ్యింది? ఇలాంటి శూర, వీర జాతిని ఎవరు పతనం కావించారు?
                    19వ శతాబ్దపు 2 వ చరణంలో ఝాన్సీ వీరనారి ఝల్‌కారీబాయి 22 నవంబరు 1830 న ఝాన్సీ దగ్గరి బాలాజీ మార్గ్‌లోని భోజలా గ్రామంలో జన్మించింది. తండ్రికి ఒక్కతే సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరగడం వల్ల ఆమెకి ‘మొండి’ మనస్తత్వం అలవడింది. కానీ భవిష్యత్తులో ఆమె నిజంగానే గొప్ప వీరనారిగా, యోధురాలిగా తయారయింది. ఆమె భర్త పూరన్‌కోరి ఝాన్సీరాజు గంగాధర్‌రావు రాజ దర్బారులో సిపాయిగా వున్నాడు. ఆమె తండ్రిపేరు మాల్‌చంద్‌, తల్లిపేరు ధనియా. డా|| చోఖేలాల్‌ వర్మ ‘నిర్మల్‌’ ఈవిధంగా అంటారు. ఝల్‌కారీ తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె. ఛామనఛాయ అయినప్పటికీ తెల్లటి బుగ్గలు, కాటుక కండ్లు, ఎత్తైన నుదురు, కొనదేలిన ముక్కు అపూర్వ మైన లావణ్యంతో గ్రామంలో ఆమె అందరి ఆకర్షణకు కేంద్రమైంది. భవానీశంకర్‌ విశారద్‌ తన పుస్తకంలో ఈవిధంగా వ్రాసాడు. ‘ఆమె కోరీ వంశస్థురాలు. ఆమె గోత్రం ‘లడియా’. చిన్నప్పటి పేరు ‘ఝలరియా’.  తండ్రి ఆమె వివాహాన్ని 1843లో ఝాన్సీలోని నయాపురాకు చెందిన పూరన్‌తో జరిపించాడు. అప్పటినుండి ఝల్‌కారీ తన అత్తగారింట్లో ఉండసాగింది.
                   Photo459  ఆ కాలంలో ఝాన్సీకోటకి 12 తలుపులు ఉండేవి. ఉన్నావ్‌గేట్‌ అందులో ఒకటి. దాన్ని నారుశంకర్‌ మరాఠా గవర్నర్‌ కట్టించాడు. రాజా గంగాధర్‌రావు కాలం కంటే ముందు దళిత సమాజంలోని హస్తకారులు నగరం బయట ఉండేవారు. ఎవరైనా రాజుని కలవడానికి రావాలంటే మార్గమధ్యంలోనే వారి సమయం అంతా గడిచిపోయేది. గంగాధర్‌రావు వారి కొరకు నగరంలోనే ఒక బస్తీ కట్టించాడు. దానిపేరు ‘నయాపురా’. ఈ గేట్‌ నుండి బయలుదేరి దతియా మార్గంలోని ‘ఉన్నావ్‌ బాలాజీ’ తీర్థ స్థలాన్ని చేరుకోవచ్చు. కనుక దీనికి ‘ఉన్నావ్‌గేట్‌’ అనే పేరు వచ్చింది.
వీరనారి ఝల్‌కారీబాయి తన భర్తతోపాటు కులవృత్తి అయిన వస్త్రాలు నేసేది! ఆమె ఒక ఆదర్శవంతమైన మహిళ. ఆమె కుటుంబ జీవితం చాలా కష్టాలతో గడిచింది. కుటుంబసభ్యులు అంతా కూలి పనిచేసి వారి జీవితాన్ని గడిపేవారు. ఝల్‌కారీబాయి ఝాన్సీలక్ష్మీబాయిలా పుడుతూనే బంగారు చెంచాతో పుట్టలేదు, ఆమె ఒక పేద, దళిత కుటుంబంలో జన్మించింది. చూడడానికి ఝల్‌కారీబాయి చాలా అందంగా, ఉత్సాహంగా వుండేది.
                 చూడటానికి ఝాన్సీలక్ష్మీబాయికి, ఝల్‌కారీబాయికి మధ్య కొన్ని పోలికలు ఉండేవి. ఇద్దరి తల్లులు కూడా వీళ్ళ బాల్యదశ లోనే చనిపోతూ వీళ్ళను వాళ్ళ తండ్రులకు అప్పచెప్పారు. వాళ్ళిద్దరినీ వాళ్ళ తండ్రులే పెంచారు. ఇద్దరూ చిన్నప్పటినుండీ వీరత్వంతో పెరిగారు. వాళ్ళిద్దరూ భయంలేకుండా ఉండేవారు. ఇద్దరూ అందంగా ఉండేవారు. ఇద్దరూ ఒకరి పోలికలతో మరొకరు ఉండేవారు.
                    ఝల్‌కారీబాయి కూడా నిజంగానే పేదకుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుండి కూడా ఆమెలో వీరత్వపు లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడేవి. దేశంపట్ల సమాజం పట్ల ఆమెకు అంతులేని ప్రేమ ఉండేది.
ఝల్‌కారీ 12 సం||రాల వయస్సులో ఒకరోజు గొడ్డలి తీసుకొని కట్టెలు కొట్టటానికి బయలుదేరింది. కొన్ని కట్టెలు కొట్టిన తర్వాత ఆమెకి ఒక చిరుతపులి దగ్గరకు వస్తూ కనబడింది. ఝల్‌కారీ తనని తాను సంబాళించుకునేలోపే చిరుతపులి ఆమె మీదకు దూకింది. రెప్పపాటులో ఆమె ఆ చిరుతపులిని చూసింది. ఆ సమయంలో ఝల్‌కారీబాయి కొంచెంకూడా అధైర్యపడలేదు. ధైర్యం తెచ్చుకొని  ఆమె చిరుతపులి మీదకు గొడ్డలి విసిరింది. చిరుతపులి పెద్ద అరుపుతో దూకింది. ఝల్‌కారీ  చేతి నుండి గొడ్డలి పక్కకు జారిపడింది. అయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. చిరుతపులితో ఆమె యుద్ధానికి తయారైంది, చేస్తూవుంది. ఆఖరికి ఝల్‌కారీబాయి పులి దవడలు పట్టుకొని చీల్చింది. చిరుతపులి ఆ దెబ్బకు తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయింది.
ఝల్‌కారీ ఇంటికి తిరిగివెళ్ళేటప్పటికి, ఆమె తలమీద కట్టెలమోపులేదు. ఆమె బట్టలుకూడా అస్థవ్యస్తమైపోయి, చిరిగిపోయి వున్నాయి. బట్టలు రక్తంతో తడిచి ఉన్నాయి. ఒంటిపై గాయాలున్నాయి.ఇంట్లో వాళ్ళు ఇది చూసి భయపడ్డారు. ఝల్‌కారీ తన సాహసకృత్యం గురించి చెప్పిన తరువాత ఆ ఇంట్లోవాళ్ళే కాదు ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆశ్చర్యంలో మునిగితేలారు. చూస్తుండగానే ఝల్‌కారీ వీరత్వం, సాహసం గురించి ఝాన్సీ నగరంలో,  ఇతర గ్రామాలలో చెప్పుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు.
                      ఝల్‌కారీ ధైర్యం మరియు వీరత్వం ‘పూరన్‌’ చెవిలోపడింది. ఆతను కూడా కోరీజాతికే చెందినవ్యక్తి. ఆతనికి ఝల్‌కారీని చూడాలి, ఆమె గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అతనికి కుస్తీ, కత్తిసాము, తుపాకీ పేల్చటం, గుర్రపుస్వారీ, మొ||గు వాటి గురించి బాగా తెలుసు. అతడు ఝల్‌కారీ వీరత్వం గురించి వాళ్ళ అమ్మకు వివరించాడు. ఇంటిచుట్టు పక్కలవాళ్ళ ద్వారా ఆమెని వివాహం చేసుకోవాలనే కోరికను పూరన్‌ అమ్మకు తెలియజేసాడు. అమ్మ చాలా సంతోషంగా అతని మాటని ఒప్పుకుంది. ఈ విషయం ఝల్‌కారీ వాళ్ళ నాన్నకి తెలిసింది. ఆయన చాలా సంతోషపడ్డాడు. అతనుకూడా వీరనారి అయిన తన కూతురికి మంచి వీరుడే వరుడుగా దొరికాడు అనుకున్నాడు. రెండు కుటుంబాల మనస్సులు కలిసాయి. పెళ్ళి బాజాలు మోగాయి.
                    ఝల్‌కారీబాయి అప్పుడప్పుడు భర్తతో రాజమహల్‌కి వెళ్ళేది. లక్ష్మీబాయి, ఝల్‌కారీబాయి  స్వభావం, వ్యకిత్వం, అందాన్ని చూసి ముగ్ధురాలయ్యేది. లక్ష్మీబాయికి పెద్దా, చిన్నా, ఉన్నతవర్గం, పేదవర్గం అనే బేధభావాలు లేవు. ఆమె ఝల్‌కారీ వ్యక్తిత్వాన్ని, పొగుడుతూ ఉండేది, గౌరవిస్తుండేది. రాజమహల్‌లోకి స్వతంత్రంగా రావటానికి, పోవటానికి లక్ష్మీబాయి ఝల్‌కారీకి అవకాశం కల్పించింది. భర్త సేవలో ఉండడం వలన ఝల్‌కారీకి సైనిక శిక్షణ తీకోవాలనే ఆలోచన కలిగింది, నేను కూడా సైనిక శిక్షణ ఎందుకు తీసుకోకూడదు. నేను నా కర్తవ్యాన్ని పూర్తిచేయలేనా! అనుకుంది. అప్పుడు రాణి లక్ష్మీబాయి స్త్రీలతో సైనికదళాన్ని ఏర్పాటు చేయసాగారు.  త్వరలో ఝల్‌కారీ కన్నకల నిజం కాసాగింది. రాణిగారు ఆమెను సేనలో చేరాలని కోరడంతో ఆమెలో సాహసం మరియు ఉత్సాహం పొంగిపొర్లింది.
                      ఝల్‌కారీబాయి చిన్నప్పటినుండీ వీరత్వంతో పెరిగింది. ఆమెలో ఉత్సాహం, ఆనందం మొదలైన గుణాలు కలగలసి ఉన్నాయి. అదేవిధంగా ఆమె మనస్సులో సైనికురాలు కావాలనే ఆలోచన బలీయంగా ఉండేది. ఆమె నిజాయితీపరురాలు మరియు కష్టపడే మనస్తత్వం కలది. సైనికుల దుస్తులు చూసి, రణభేరి మ్రోగగానే యుద్ధానికి సిద్ధంకండి అనే మాటలు వినగానే ఆమె పులకరించిపోయేది. ఆమె చుట్టుప్రక్కల కత్తులు విరుచుకు పడుతుండేవి. శబ్దం నింగికి తాకుతుందా అన్నట్టుగా అనిపిస్తుండేది. ఆమె చెవిలో ఎవరో ఇలా అన్నారు. ఝల్‌కారీ నీవు కూడా సైనికురాలివి కావాలి. ”నీవు దేశ సేవ చేయాలి, నీవు బ్రిటీషువారిని మన దేశం నుండి  తరిమికొట్టాలి” ఆ సమయంలో ఆమె మనస్సులో దేశభక్తి అగ్నిలాగా ప్రజ్వరిల్లింది. అది ఆమెను ప్రశాంతంగా ఉంచడంలేదు.
                          సరిగ్గా గమనించిసూస్తే ఆ సమయంలో ఝల్‌కారీ మరియు వారి ఇంట్లోవాళ్ళ పరిస్థితి ఏమిటి. ఆమె ఒక దళితవర్గానికి చెందినట్టిది. ఆరోజుల్లో దళితులను వారి నీడను కూడా అగ్రవర్ణాలు ఆమడదూరంలో ఉంచేవారు. ఉత్తర భారతదేశంలో అంటరానితనం, చాలా ఎక్కువగా ఉండేది. ఇలాంటి కఠినమైన, విషమ పరిస్థితుల్లో, ఒక దళిత సమాజపు ఆడమనిషి సైనికురాలిగా అవుతానని చెప్పటం ఎంత సాహసం. అయితే ఆమె సాహసాన్ని సమాజం ఎంత వరకు ప్రశంసించింది?  ఎప్పుడయితే ఝల్‌కారీ వాళ్ళ అత్తతో నేను సైనికురాలిని కావాలని అనుకుంటున్నాను అని అన్నదో, అప్పుడు వాళ్ళ అత్తనుంచి వచ్చిన జవాబు ఏమంటే, ”నీకు నా ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. ఏ సమాజం అయితే నీ ఉన్నతిని చూడలేకుందో అదే సమాజం నేడు నిన్ను ఒక సైనికురాలుగా చూసి ఓర్చుకోగలదా? సవర్ణ సమాజం గురించి కాదు, స్వయంగా మన సమాజం మనకులం అయిన కోరి సమాజపు పెద్దలు నిన్ను సుఖంగా మనశ్శాంతిగా వుంచుతారా? రచ్చబండ మీద కూర్చున్న మనుషులు, ప్రజలు ఈ విషయం గురించే మాట్లాడుతారు కదా?
ఎవరో ఒకడు అంటాడు –
పూరన్‌ తన ఇంటి ఆడదాన్ని సైనికురాలిగా మార్చాలని అనుకుంటున్నాడట. ”యుద్ధంలో ఎలా పోరాడాలి అని నేర్పిస్తున్నాడట”
ఇది మన సమాజానికి విరుద్ధం కదా…
మూడవ వ్యక్తికూడా ఊరికే ఉండలేదు
వేదాలు తీసుకో అందులో ఏం చెప్పారు
పెళ్ళికూతురు పని ఇంటి నాలుగు గోడలనే మధ్య అని చెప్పలేదా
నాలుగోవ్యక్తి ఉప్పు, కారం తగ్గించి పెట్టమన్నారు కదా. ఇక్కడ మన ఇంటి కోడలు మన ముక్కు కత్తిరించటానికి పుట్టినట్లుంది. అరే కోడలిమాటలు ఏటిగట్టున పెట్టాలి. ఆమె పూరన్‌ కళ్ళల్లో కారం కొట్టే ఉంటుంది.  మరి పూరన్‌ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది.
ఝల్‌కారీబాయి ముసుగు లేకుండా బయటకు పోవటం రావటం ఆ ఊళ్లో వాళ్ళకు మింగుడుపడేది కాదు. తన వీరోచితమైన స్వప్నాలతో ఆమె ధన్యురాలయింది. చరిత్రలో ఝల్‌కారీబాయి పేరు స్వర్ణాక్షరాలతో లిఖింపబడింది. తమదేశం కోసం, రాణికోసం తన జీవితాన్నే అర్పించింది ఝల్‌కారీబాయి.
                       ఝల్‌కారీ భర్త మొదటినుంచి సైనికుడే. ప్రప్రధమంగా ఝల్‌కారీబాయి తన భర్తనే తన గురువుగా ఎంచుకుంది. ఇంటినే పాఠశాలగా చేసుకొంది. కొన్నిరోజులు గడిచిపోయాయి. వారం, పక్షం ఆ తరువాత నెలరోజులు గడిచాయి. ఝల్‌కారీ శిక్షణ కొనసాగుతూ వుంది. కొన్ని నెలలు గడిచాక ఆమె సైనిక విద్య నేర్చుకోసాగింది. ఆమె తను కోరుకున్నట్లుగా సైనికురాలు కాసాగింది.
                     ఝల్‌కారీ కోరిక పూర్తికావచ్చింది. ఆమె తన భర్త దగ్గర సైనిక విద్యలన్నీ నేర్చుకుంది. విలువిద్య, కత్తిసాము, తుపాకీ పేల్చటం, దానితోపాటు గుర్రపుస్వారీలో కూడా నిష్ణాతురాలు అయింది. పెద్ద పెద్ద గుర్రాలను కూడా వశ పరుచుకోవటం ఎలానో నేర్చుకుంది. కత్తిని దగ్గరనుండి విసరటం, దూరంలో ఉండి గాలిలో ఎగరేస్తూ కత్తిని విసరటంలో తనకు సాటిలేరు అన్నట్టుగా నేర్చుకుంది. ఇంతేకాదు శత్రువుల బాణాలనుండి తప్పించుకోవటం, వారిమీద వెంటనే తిరుగుబాటు చేయటం కూడా ఆమె బాగా నేర్చుకుంది.
ఫిబ్రవరి 1843 న గంగాధరరావు ఆధీనంలోకి రాజ్యం వచ్చింది. (గజెట్‌ – 51వ పేజీ) 1853లో అతను చనిపోయాడు.  (గజెట్‌-51వ పేజీ) ఫలితంగా బ్రిటిషు అధికారుల అణచివేత, దోపిడీ, రాజ్యంలో ఎక్కువయింది. ఆ సమయంలో రాణి నలువైపులా కష్టాలలో కూరుకుపోయింది. రాజ్యం బైటనుంచి తిరుగుబాట్లు ఎదురు కాసాగాయి. యుద్ధపు నీలినీడలు అలుముకోసాగాయి. పురుషులతోపాటు స్త్రీలు కూడా సైన్యంలో చేరవలసిన అవసరం ఏర్పడసాగింది. నగరంలోని అనేకమంది మహిళలు బరీషన్‌, మోతీబాయి, జూహీ, సుందర్‌, ముందర్‌, కాశీబాయిలాంటివారు సైన్యంలో చేరసాగారు. వారిలో ఝల్‌కారీ బాయి ముఖ్యంగా చెప్పుకోదగింది. కోటలోని విశాలమైన ప్రాంగణంలో, ఆమె కుస్తీ, కత్తిసాము, గుర్రపుస్వారీ, పళ్ళతో కళ్ళేలు పట్టుకొని గుర్రాన్ని నడుపుతూ, రెండు చేతులతో కత్తులు ఝళపించటం, తుపాకీతోటి కాల్చటం మొదలైనవి నేర్చుకుంది. తన శ్రమ, ఏకాగ్రతలవల్ల ఝల్‌కారీ బాయి స్త్రీల కమాండర్‌ అనగా సైనికాధికారి అయింది.

హిందీ:మోహన్ దాస్ నైమిశ్ రాయ్
తెలుగు:జి.వి.రత్నాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

 

 

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో