నా రెక్కలో!!! – క్రిష్ణ వేణి

            2008-2012కీ మధ్య, మహిళలకి ప్రసూతి సెలవలు నిరాకరించబడ్డాయన్న ఫిర్యాదులు భారతదేశపు లేబర్ కోర్టులకి 900 కన్నా ఎక్కువగా వచ్చాయి. వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని, Maternity Benefit Act- 1961 ని మార్చి, అప్పుడున్న 12 వారాలకి బదులు 26 వారాలకి పెంచమంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ Union labor ministry మీద ఒత్తిడి తెచ్చారు. ఆగస్టు నెలలో, 26 వారాల ప్రసూతి సెలవుండే సౌకర్యాన్ని కలిపించే బిల్ పాస్ చేసింది రాజ్యసభ.

           తండ్రులు కూడా నవజాత శిశువుల బాధ్యత పంచుకునేటందుకూ, పిల్లల్ని పెంచే బాధ్యత స్తీలదేనన్న భావాన్ని తొలిగించేటందుకూ, ప్రసూతి సెలవు పొడిగింపుగా తండ్రులకి కూడా సెలవిస్తే (పెటర్నిటీ లీవ్) తప్ప, ప్రసూతి సెలవే అసంపూర్ణమైనది’ అంటూ స్త్రీ హక్కుల ఏక్టివిస్టులూ, పార్లిమెంటేరియన్లూ- పురుషులకి కూడా పెటర్నిటీ లీవుని మంజూరు చేయమని ప్రభుత్వాన్ని కోరారు.
మనేకా గాంధీ అడుగు మెచ్చుకోతగ్గదే కానీ, ఆ తరువాత ఆమె ‘పిల్లల బాధ్యత వహించని మగవారికి పెటర్నిటీ లీవు అంటే ఆటవిడుపే తప్ప, వారు తలకెత్తుకునే బాధ్యతేదీ ఉండదని’ చెప్పిన మాటలే మరీ స్టీరియో టైపులో ఉండాలి.

              నిజానికి, ఆవిడన్న మాటల్లో దేశపు పరిస్థితి గురించిన యదార్థం పాళ్ళు తక్కువేమీ కాదు. కానీ, అవి పిల్లల్ని పెంచడం ఆడవాళ్ళ పని మాత్రమే అనీ, మగవాళ్ళు తమ ఉద్యోగాల మీద దృష్టి పెట్టాలన్న భావాలని ప్రతిఫలిస్తున్నాయి తప్ప కొంత మార్పు ఇప్పటికే చోటు చేసుకుంటోందనీ, అందరు పురుషులూ గతపు ప్రతిరూపాలకి అనుగుణంగా ఉండటం లేదన్న సంగతులని లెక్కలోకి తీసుకోలేదు. అదేకాక, పురుషులకి కుంటుంబ బాధ్యతలు పట్టవన్న మాటలు- వారిని తమ తండ్రుల విధులనుంచి విముక్తులని చేస్తూ, పిల్లల బాధ్యతనీ, ఇంటిపనినీ… అన్నిటినీ స్త్రీలమీదకి నెట్టేస్తున్నాయి.

             26 వారాల మెటర్నిటీ సెలవు అయిపోయి, స్త్రీలు ఉద్యోగంలో చేరిన తరువాత మాత్రమే మగవారు తమ లీవుని ఉపయోగించుకుంటారనీ, ఎంతమంది అలా చేయరో తను చూసినప్పుడే తనకి దీని మీద నమ్మకం కలుగుతుందన్న మనేకా గాంధీ వాదనలో ఇంకో లోపం-ఆమెకి సాక్ష్యం కావాలి. ఇక్కడే చిక్కుంది. ఆమె కావాలనుకున్నట్టుగా, ఈ చట్టం వల్ల కావలిసిన ప్రభావం కనబడుతుందన్న సాక్ష్యాన్ని, చట్టం అయే ముందే ఎలా కనపరచగలరు ఎవరైనా?

      పుట్టిన పిల్లని చూసుకోవడం తమ పని కాదనుకుని భార్యకి సహాయం చేయడానికి ఇష్టపడక, సెలవు తీసుకోని మగవారి దృక్పధాన్ని మార్చడానికి పెటర్నిటీ సెలవు డిమాండ్ చేయబడుతోంది. సంక్షేమ శాఖ మంత్రిగా, మనెకా గాంధీ లింగబేధం లేని సమాజాన్ని ఏర్పరిచే ప్రయత్నాలు చేయాలి. ఆమె మాటలు పురుషుల పట్ల అన్యాయమైనవేకాక, లింగ సాధారణీకరణలని పటిష్టం కూడా చేస్తున్నాయి.
ఆ తరువాత, తన ‘ఆటవిడుపు’ స్టేట్మెంటుని ఆమె వెనక్కి తీసుకునప్పటికీ, ఆ మాటలు చాలా విషయాలని వెలుగులోకి తెచ్చాయి.

    ప్రభుత్వాలూ, కంపనీలూ పెటర్నిటీ లీవుని మంజూరు చేసినప్పటికీ, వాటిని పురుషులు పాటిస్తారనమీ లేదు, నిజమే. కానీ, అలా అని ఆ ఆలోచననే పూర్తిగా పక్కకి నెట్టేయడం ఎంత మంచిది? ఒక చట్టం అంటూ వస్తే, మొదట దాన్ని ఒప్పుకోడానికి తటపటాయింపున్నప్పటికీ, మెల్లిమెల్లిగా దృక్పధం మారి- అలవాట్లూ, చాలాకాలంగా పాతుకుపోయున్న ఆలోచనాధోరణీ కూడా మారే అవకాశాలుంటాయి. అసలు చట్టమే లేకపోతే, ఏ మార్పునీ చూడలేం.

    కొత్తగా వచ్చిన The Maternity Benefit(Amendment)Bill, 2016- కార్మికశక్తిలో స్త్రీలకి విజయాన్ని తెచ్చిపెట్టింది. కానీ, ముందే పాతుకుపోయున్న సామాజిక నమ్మకాలకీ, లింగపాత్రలకీ ఒక ప్రగతిశీల చట్టం వెనువెంటనే మార్పులు తెస్తుందన్న హామీ ఏదీ లేదు కానీ అవకాశం మాత్రం తప్పక ఉంది.

    పెటర్నిటీ లీవు చట్టాలని ప్రతిపాదించకుండా ఉండటానికి మనెకా గాంధీ పేర్కొన్న కారణాలు సబబైనవేనా? స్త్రీలందరూ అతి ప్రేమగల తల్లులూ, మగవారు ఆషామాషీగా తిరిగేవారూ అన్నది నిజమేనా!

     ఒక మగవానికి తన పిల్లలతో గడిపే సమయం దొరకకపోతే తన భార్య అనుభవాలని అతను ఎలా పంచుకోగలడు?

   ఇప్పుడింక, మహిళలే ప్రాధమిక సంరక్షకులు అనే సాంప్రదాయాన్ని ముగించే సమయం వచ్చిందేమో అనిపించడం లేదూ!

        ఇంటిపనుల బాధ్యతని సమానంగా పంచుకునే తండ్రులు నాయకత్వ స్థానాలని పొందే అవకాశం ఎక్కువనీ, వారి కొడుకులు కూడా లింగ సమానత్వాన్ని అంగీకరించి ప్రోత్సహిస్తారనీ, ప్రవసం తరువాత స్త్రీలు తొలి నెలల్లో ఇంట్లో ఉండే సహచరులవల్ల తక్కువ మానసిక, భౌతిక వత్తిడికి లోనయి, ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంటారనీ అధ్యయనాలు తెలుపుతాయి.

        ఎక్కువమంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్వాతంత్రులవుతున్నప్పుడు, పితృస్వామ్య సంకెళ్ళు వదులవుతున్నాయి. అలాంటప్పుడు, పెటర్నిటీ సెలవుల చట్టాన్ని అమలుపరుస్తేనే నయం కాదూ!

             ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల సంఖ్యని పరిగణించినప్పుడు, పెటర్నిటీ లీవ్ లేకపోవడం అన్నది సమాజంలో ఇప్పుడున్న స్త్రీల పాత్రలని బలపరుస్తుంది. అంటే, వారు ఎక్కువ బలహీనమైన పరిస్థితిలో ఉండటాన్ని కొనసాగిస్తారు.

           వ్యవస్థీకృత శ్రామికశక్తిలో, ఇప్పుడు స్త్రీలు కీలక భాగం. పిల్లల్ని పెంచి పెద్దచేసే ఉమ్మడికుటుంబాలు కరువయాయి. చాలా, చాలా మెల్లిగా మారుతున్న పురుషుల వైఖిరిని మెరుగుపరచడానికి మార్గాలని కనిపెట్టే అవసరం ఉంది. కనుక, ఆ ప్రక్రియ వేగం పెంచే విధానాలు చాలా ముఖ్యం. కొత్త నిబంధనలని అమలులోకి తెస్తే తప్ప, స్త్రీలు తము పోషించవలిసిన పాత్రల మధ్య సంఘర్షణ పడే-అంగీకారయోగ్యం కాని వ్యవస్థని మనం సృష్టించే ప్రమాదం ఉంది.

             పిల్లల పెంపకం ఆచరణీయంగా ఉండే విధానాలని సమాజం కనిపెట్టాలి. సమాజం తనంతట తానే అలా చేయలేకపోతే కనుక, దానికి సహాయం అవసరం.

          ఈ కేసులో మార్పు అవసరం అన్నది స్పష్టం. సంప్రదాయ సామాజిక సంస్థలు కానీ, పని చేసే చోట్ల యజమానులు కానీ దారి చూపించలేవు/రు. కలిపించుకోవలిసినది చట్టమే.

           కానీ, ఈ చట్టం ఏర్పాటు చేయడానికి కారణం అది లింగ సమానత గురించి సరైన మాటలు చెప్పడం మాత్రమే అయి ఉండకూడదు. ఇది ఎవరికోసం ఉద్దేశ్యించబడిందో, అది వారి జీవితాలని మెరుగు పరచాలి. అందువల్లే చర్చలూ, వాదాలూ ముఖ్యమైనవి. ఈ సంభాషణ ముందుకి కదిలినప్పుడు మాత్రమే స్థిరమైన మార్పుకి చోటుంటుంది.

              కొత్త ఆలోచనలని అమలులో పెట్టాలన్న నిజాన్ని ఒప్పుకోకుండా, ఏ ఎరికా లేకుండా ఒట్టి పేపర్ మీద మాత్రమే ఉండే మార్పు వల్ల ప్రయోజనం ఏముంది?
‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నట్టు, అందరినీ ఒకే గాట కట్టలేం. ఎందరో మగవారు- ప్రత్యేకంగా, తమ పిల్లలతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకుని, మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థుతులతో నిమిత్తం లేకుండా, తమ పిల్లల్ని ప్రేమతో అబిమానంగా పెంచే ఒంటరి తండ్రులనేకం మన దేశంలో. వారికీ అవకాశం ఇవ్వొచ్చు.

single-fatherపెటర్నిటీ లీవ్ అన్నది ఒక హక్కు/బాధ్యత మాత్రమే కాదు కానీ అంగీకారాన్ని చూపించే ఏ తండ్రికైనా ఒక అవసరం కూడా. లాభాన్నీ అందిస్తుంది. పిల్లల్ని పెంచడం కష్టంతో కూడుకున్న పని. ఆలంబనం అవసరం. ముఖ్యంగా చట్టానిది. వారిని పక్కకి పెట్టేయడం కూడా లింగ పక్షపాతమే.

             పెటర్నిటీ లీవ్ ఇప్పుడు తక్షణావసరం. ఇది స్త్రీమీద మాత్రమే పూర్తి సంతాన బాధ్యతని మోపదు కనుక, మంచి ప్రణాళిక. ప్రసవం తరువాత వెంటనే, ఉద్యోగాల్లో చురుకుగా పాల్గొనాలనుకునే స్త్రీలెందరో ఉన్నారిప్పుడు. వారిని ప్రోత్సహించే, వారికి సహాయపడే దిక్కుగా తీసుకునే ఏ అడుగైనా మెచ్చుకోతగ్గదే.

             మనం లింగ సమానతల గురించి మాట్లాడతాం కానీ పురుషులూ ప్రేమించగలరని మనం గుర్తించం. ‘వారు సమయాన్ని వృధా చేస్తారు, పేకాటలో తాగుడుతో సమయాన్ని గడుపుతారు’, అనుకుంటూ పిల్లల్ని పెంచడంలో మనం వారిని ప్రోత్సహించం. అది వారికి అవమానకరం కాదా!

          ఇది పక్షపాత ధోరణి. పురోభావనల ఆధారంగా చెప్పే మాటలు. పెటర్నిటీ లీవుని వారు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారని అనడం అన్యాయం.

***
ప్రస్తుతం, భారతదేశంలో తండ్రులు 15 రోజుల పెటర్నిటీ లీవుని ఉపయోగించుకునే వెసులుబాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్ప ప్రైవేటు ఉద్యోగాల్లో లేదు.

 

                                                            -క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , Permalink

8 Responses to నా రెక్కలో!!! – క్రిష్ణ వేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో