‘సంగీత చూడామణి ‘ శ్రీరంగం గోపాలరత్నం (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

(జీవితం-సంగీతం)
రచయిత్రి;ఇంద్రగంటి జానకీబాల

2కర్ణాటక సంగీత విద్వాంసురాలైన శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి ఈ పుస్తకం వ్రాసారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాలగారు.శ్రీరంగం గోపాలరత్నం గారు రచయిత్రి కి వ్యక్తిగతంగా కూడా కొంత తెలుసు.రచయిత్రి ఆకాశవాణి లో లలితసంగీత పాడేసమయం లో శ్రీరంగం గోపాలరత్నం గారి తో పరిచయం ఉంది.ఆవిడతో కలిసి “మానవులం మకుటధారులం ” అనేపాట లో కోరస్ పాడారు.ఈ పుస్తకం వ్రాసేందుకు ,శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీ శ్రీకాంత శర్మ,శ్రీమతి తులశమ్మగారు కావలసిన సమాచారము అందించారు.

ప్రతిభానైపుణ్యాలతో కర్ణాటక సంగీతం లో అత్యున్నత శిఖరాలను చేరిన విదుషీమణి కుమారి శ్రీరంగం గోపాలరత్నం.శ్రీరంగం గోపాలరత్నం కర్ణాటక బాణీ లో కృతులు మొదలుగా గలవి అనేకమైనవి పాడి, దక్షిణదేశం అంతా కచేరీలు చేసారు.అదే కాకుండా ఆమె లలిత సంగీతం, మీరాభజన,అన్నమయ్య, క్షేత్రయ్య పదాలు అద్భుతం గా పాడి పండిత పామరుల మెప్పును పొందారు.కూచిపూడి యక్షగానాలలో దరువులు, పద్యాలు,శ్లోకాలు ఎంతో అర్ధవంతంగా గానం చేసేవారు. ఆధునిక భావకవుల పాటలు,రేడియో సంగీత రూపకాలలో పాత్ర(గాత్ర) ధారణ పాడి రేడియో శ్రోతల అభిమానం చూరగొన్నారు.బహుముఖమైన ప్రతిభామూర్తి శ్రీరంగం గోపాలరత్నం.

సంగీతచూడామణి శ్రీరంగం గోపాలరత్నం , విజయనగరం జిల్లా లో ఉన్న పుష్పగిరి అనే గ్రామం లో శ్రీరంగం వరదాచార్యులు.సుభద్రమ్మ దంపతులకు 1939 వ సంవత్సరం లో పుట్టారు.వరదాచార్యులవారికి మంచి సంగీతాభిరుచి ,ప్రవేశం ఉండటము వల్ల పిల్లల కు కూడా సంగీతము లో ప్రవేశము కలిగింది.చాలా చిన్న వయసు నుంచే ఆటల మీద కంటే పాటల మీద ఆసక్తి కనిపించేవారు గోపాలరత్నం.చిన్న వయసులోనే తన మేనమామ,తల్లీ కలిసి వినోదానికి వ్రాసిన రెండు హరికథలకు 1.శ్రీకృష్ణ లీలలు,2.భీమార్జున గర్వభంగం లకు తనే బాణీలు కూర్చి గానం చేసారు.ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో 1957 వ సంవత్సరం లో తన 18/19 వయసు లో నిలయవిద్వాంసురాలిగా రేడియోలో అడుగు పెట్టారు.1977 వరకూ రేడియోలోనే పని చేసారు.శ్రీరంగం గోపాలరత్నం అన్నమాచార్య కీర్తనలు గానము చేసిన ప్రధములలో ముఖ్యురాలు.అందువలననే 1969 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయనిగా నియమించారు. 1977 లో హైదరాబాద్ త్యాగారాజ సంగీత కళాశాలకి ప్రిన్సిపల్ గా, 1979 లో సికింద్రాబాద్ రామదాసు సంగీత న్రుత్య కళాశాల ప్రిన్సిపల్ గా, 1988 లో తెలుగు విశ్వవిద్యాలయం లో లలిత కళాపీఠానికి తొలి ప్రొఫెసర్ డీన్ గా పని చేసారు.1991 లో భారత ప్రభుత్వం సంగీతం లో ఆమె సేవ ను గుర్తించి ‘పద్మశ్రీ’బిరుదును ప్రధానం చేసింది.ఆమెకు ఎన్నో బిరుదులు వరించి వచ్చాయి.’స్వరభూషిణి ‘,స్వరసామ్రాజ్ఞి ‘సంగీత చూడామణి ‘,’గంధర్వ కళానిధీ, ‘మధుర సరస్వతీ,’గానసరస్వతి ‘, ‘సంగీతవాహిని ‘,’సంగీత కళాసాగర ‘ వంటి అనేక బిరుదులను పొందారు.

అతి చిన్న వయసు నుంచి దాదాపు నలభైఏళ్ళూనేక రీతులలో సంగీత సరస్వతిగా జీవించిన ఆమె అకస్మాత్తుగా తన 53 వ ఏట మరణించటము సంగీత ప్రియులకు లోటు.వివాహము తన సంగీతానికి అడ్డుగా భావించి వివాహము కూడా చేసుకోకుండా చివరి వరకు సంగీతము లోనే జీవించారు కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

ఈ పుస్తకములో గోపాలరత్నం గారి జీవిత చరిత్రే కాకుండా , ఆవిడ వివిధసంధర్భములలో తీసుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి.అంతేకాకుండా శ్రీరంగం గోపాలరత్నం పాడగా అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని లలిత గీతాల రచనలు (టెక్స్ట్) కూడా ఉన్నాయి.

దక్షణాది కర్నాటక విద్వాంసురాళ్ళలో గోపాలరత్నం విశిష్టత ఎరుగనివారు ఉండరు.ఐతే ఎరిగి వుండటమే కాకుండా ముందుతరాలవారికి ఇలాంటి గొప్ప గాయని, విధ్వాంసురాలు,విదుషీ గురించి తెలియపరచవలసిన అవసరం ఎంతైనా వుంది.అందులో రచయిత్రి ఇంద్రకంటి జానకీబాల గారు సపలీకృతులైనారు.చివరి వరకు ఆస్క్తి గా చదివించారు.ఆవిడ కృషి అభినందనీయము.

ప్రతులకు :
ఈ పుస్తకము ధర;100 రూపాయలు.
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ ,నల్లకుంట లోనూ , అన్ని ప్రముఖ పుస్తక దుకాణముల లోనూ ఈ పుస్తకం లభ్యమవుతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , , Permalink

4 Responses to ‘సంగీత చూడామణి ‘ శ్రీరంగం గోపాలరత్నం (పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో