నా కళ్లతో అమెరికా-54(యాత్రా సాహిత్యం )- డా.కె.గీత

 డాడ్జి రిడ్జ్ (చివరి భాగం)

తుఫాను ఉదయం మంచులో మునిగిన కారుతో అడ్వెంచరస్ ప్రయాణం మొదలయ్యి, సాయంత్రానికి అనుభూతుల మంచుతో అనుక్షణం ఆకాశమే హద్దుగా, ఆనందంగా గడిచిన పగలంతా ఎప్పటికీ మరిచిపోలేని రోజు.

బయట తిరుగుతున్నంత సేపూ తెలియని అలసట హోటలుకి సాయంత్రానికి చేరుకోగానే ముంచెత్తింది. అందరం వేడి వేడి నీళ్ల స్నానాలు చేసి, బడలిక నించి కాస్త తేరుకున్నాం.
అదృష్టం కొద్దీ మెట్లు దిగగానే రెస్టారెంటు కావడంతో మంచులో మరి అడుగు పెట్టకుండా వేడిగా సూప్ తాగుతూ మరింత త్వరగా తేరుకున్నాం.
మర్నాడు హోటలు ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోవాల్సిన రోజు. అక్కడి నించి ఇల్లు మహా అయితే 3, 4 గంటల డ్రైవ్ లో ఉంటుంది. కాబట్టి ఉదయమంతా పిలల్లతో మంచులో ఆటలతో గడపాలని నిర్ణయించుకున్నాం. మంచులోఎత్తు నించి జారేందుకు పిల్లలు ఇంటి నించి స్కేట్ బోర్డులు తెచ్చుకున్నారు.

అయితే దగ్గర్లో చూడాల్సిన విశేషాల్లో “పైన్ లేక్” ఇంకా మిగిలే ఉందని సత్యకి జ్ఞాపకం చేసేను. “ఇంత మంచులో లేక్ ని చూసేదేముంటుంది?” అంటున్న వరుతో, “మమ్మీ సంగతి తెలుసు కదరా, ఇప్పుడు ఆ లేక్ చూడనిదే మనల్ని ఇంటికి వెళ్లనివ్వదు.” అని నవ్వేడు సత్య.
హోటలు నించి 2 మైళ్ల లోపులోనే ఉంది లేక్ బోర్డు. ముందు రోజు వెళ్లిన దారిలోనించే కొంత దూరం వెళ్ళి పక్కకి పైన్ రిసార్టు కి సంబంధించిన మార్గం గుండా వెళ్లాలి. “లేక్ తీరం” అని రాసి చోట ఉన్న కారు పార్కింగుని దాటి వెళ్లేము ఎక్కడా లేక్ కనిపించలేదు. ఇక ముందుకు వెళ్లే దారి మొత్తంమంచుతో మూసుకుపోయి ఉండడం వల్ల వెనక్కు తిరిగేం. ముందు రోజు అనుభవంతో ఎక్కడా కారుని రోడ్డు మీంచి మంచులో దిగనివ్వకుండా కష్టపడి జాగ్రత్తగా వెనక్కు తిప్పేం. తిరిగి కారు పార్కింగులోకి వచ్చేక కాస్త అలా దిగి చూద్దామనిపించి రెండడుగులు నడిచి చూసేక అర్థమైంది.

అక్కడ లేక్ అంతా గడ్డకట్టుకుపోయిందని. సరస్సుకి, ఒడ్డుకి తేడా లేదని. కనుచూపుమేర అంచులలో ముద్దలుగా, మధ్యలో నున్నని తెల్లని పళ్లెంలా ఒడ్డున చుట్టూ పైన్ వృక్షాలతో అప్పుడప్పుడే తళుక్కున ప్రసరిస్తున్న కిరణాలతో అత్యద్భుత సౌందర్యంతో మెరిసిపోతుంది పైన్ లేక్. పిల్లల్ని కారులో నించి దించి, మంచులో నడవడానికి వీలుగా పాంట్లు , బూట్లు, కోట్లు వేసే పని సత్యకి అప్పగించేసి ఒడ్డున ఉన్న చిన్న రాతి మీద కూర్చుండి పోయాను. ఆ రాతి మీంచి లేత మంచుని రాలుస్తూ కిందికి ఒంగుతున్న ఒక్కో కొమ్మ మీదుగా పైన్ వృక్షాల్నిఅధిగమించి అట్నించటే విహంగమై రెక్కలు సాచుకుని ఆకాశమే హద్దుగా సరస్సంతా గిరికీలు కొట్టాలని కుతూహలం మొదలయ్యింది.

IMG_8535 (1)

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

నా ప్రపంచంలో నేనుండగా, కారు దిగగానే పిల్లలు మంచు లోకి పరుగులు తీసేరు. వీళ్లు నన్ను దాటి వెళ్లి ఇరవై అడుగులు వెళ్లి నన్ను పిలిచే వరకూ అక్కడే ఉండిపోయాను.
నిజానికి ఒడ్డున అదొక చిన్న పార్కు. అక్కడ మెట్లు ఉన్నాయని, బల్లలున్నాయని తెలియడం లేదు. అడుగు మంచులోకి కూరుకుపోకుండా నిలబడగలిగినప్పుడు మెట్లనీ, చుట్టు ఉన్న మంచుని తుడిచి కూర్చున్నపుడు బల్ల అనీ అర్థమయ్యేది.

రెండు నిమిషాల్లో మెట్లు దిగి గడ్డకట్టిన సరస్సులో ముందుకు పరుగుతీసేడు సత్య. తన వెనకే పిల్లలు. నేను వద్దని వారించే లోగానే పిల్చే దూరాన్ని దాటి ముందుకెళ్లిపోయేరు. ఇక నేను వాళ్ల వెనకే వెళ్తూ పిలవడం తప్ప మరో మార్గం లేదు. అక్కడ సెల్ ఫోను సిగ్నల్ కూడా లేదు.

ఒక్కొక్క చోట మోకాలి లోతుకి మంచులో కాలు కూరుకుపోతూంది.

“ఇలా గడ్డ కట్టిన సరస్సుల్లో అక్కడక్కడా మంచు పెళుసై నీళ్లలోకి అమాంతం పడిపోతామని లక్ష డాక్యుమెంటరీలు చూసేం. బొత్తిగా తెలివుందా నీకు?” అని గట్టిగా అరిచేను. కానీ సత్యకి వినిపించినట్లు లేదు.

అప్పటికీ కొంచెం అర్థమయినట్లు ఆగేడు, అయినా “నవ్వుతూ ఇది సరస్సు కాదు, ఇంకా ఒడ్డే. అదిగో, అక్కడుంది సరస్సు” అంటూ మధ్యలో పలచగా నీళ్ల మీద కట్టి ఉన్న మంచు పొరని, మధ్యలో మెరుస్తున్నట్లున్న ప్రాంతాన్ని చూపించేడు.

అంతే కాకుండా సిరిని నా దగ్గిర వొదిలి, వరుని తీసుకుని అటు పరుగు తీసేడు మళ్లీ. నాకు చాలా భయం వేసింది. అక్కణ్నించి ఎటు కదలాలన్నా భయమే. అయినా మధ్యలోకి వచ్చేసాం.ఇక ఏం చేస్తాం? వీళ్ల అడ్వంచెర్ ని చూస్తూ ఉండడం తప్ప. చేసేదేమీ లేక నిలబడ్ద చోటే మంచులో కూచున్నాను.

ఇక ముందుకు వెళ్లిన వాళ్లు దారిలో ఎత్తుగా ఉన్న రాతి వరకూ ఎక్కుతూ కనిపించేరు. అక్కడ మలుపుకి తిరిగినట్లున్నారు, కాస్సేపు కనిపించలేదు. నాకిక బాగా భయం పట్టుకుంది.

ఒక పక్క సిరి నా ఒళ్లో కూచోకుండా రెండడుగులు వెయ్యడం, పడడం చేస్తూ గ్లోవ్స్, సాక్సులు తడిపేసుకుంది. నా గ్లోవ్స్ తీసి పిల్లకి తొడిగినా సాక్సులు మరో జత లేవు. “వచ్చి వచ్చి ఈ మంచు సరస్సులో ఇరుక్కున్నామేమిట్రా భగవంతుడా “అని తలపోటు రావడం మొదలెట్టింది. అనవసరంగా నేనే తీసుకొచ్చేను అనిపించింది.

మళ్లీ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాను. “నిజంగా సరస్సులో పడాలని రాసిపెట్టి ఉంటే తప్పదు. అనవసరపు భయం దేనికి?” అనుకుని మంచులో కూచున్న చోట ముద్దలు చేసి పిల్లతో ఆటలాడడం మొదలెట్టాను. ఆకాశం మీంచి ఏటవాలుగా పడ్తున్న కిరణాల తళత్తళల్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ.

పది నిమిషాల్లో సత్యకి పరిస్థితి అర్థమయ్యినట్లుంది. “ఇక్కడ అంత సేఫ్ కానట్లుంది, బయలుదేరుదాం” అన్నాడు.

వెనక్కి వచ్చేటప్పుడు ఈ అడుగు నేలకానుతుందో, లేదో అన్న భయాన్ని పక్కన బెట్టి పరుగెత్తేం.

ఒడ్డున ఉన్న పార్కు దగ్గిరికి చేరుకునే సరికి చెట్ల మీద ప్రసరిస్తున్న కిరణాల వాళ్ళ సన్నని కొమ్మలు,ఆకుల మీంచి ముద్దలుగా నేల రాలుతూ చెట్ల దగ్గిరికి వెళ్లే సరికి మంచు వాన కురవడం మొదలెట్టింది. ఇక పిల్లలు ఎక్కడ మంచు పడ్తుందో అక్కడికి పనిగట్టుకుని పరుగెత్తి తడవడం మొదలెట్టేరు. ఆ వెనకే మేమూ. తలల మీద కోట్లు కప్పుకుని తనివి తీరా తడిసేం.

అక్కణ్ణించి గట్టిగా అరగంట ప్రయాణం చెయ్యకుండానే దారిలో త్రోవ పక్క చిన్న మంచు కొండ దగ్గిర జనం ఆడుతూ కనిపించే సరికి మేమూ ఆగేం.

కారు రోడ్డు పక్కన ఆపుకుని కిందికి దిగేం. అక్కడ ఎదుటి కొండ దగ్గిరికి వెళ్ళడానికి రోడ్డు మీంచి దిగువకి దిగి, మధ్యలో పారుతున్న సన్నని నీళ్ళని ఒక్క టి, రెండు అంగల్లో దాటి, మళ్లీ పైకి ఎక్కాలి.

అప్పటిదాకా సరస్సులో ఆడినందువల్ల అందరం మంచు దుస్తుల్లోనే ఉన్నాం. చకచకా ఆలస్యం చెయ్యకుండా పరుగుతీసేం. నాకు ఎత్తు నించి జారడమంటే భయమని తెలుసు. అయినా నన్ను ఒప్పించి స్కేట్ బోర్డు లో కూచో బెట్టి కిందికి తోసేరు. బోర్డు కదిలిన మరు నిమిషంలో భయంతో పక్కకి దూకేసాను. అదృష్టం కొద్దీ మోచేతులు, మోకాళ్లు గీసుకు పోకుండా లేయర్లుగా వేసుకున్న బట్టలు ఆపేయి.

సిరి కూడా నాలాంటిదే. కాబట్టి అక్కడున్న గంట సేపు బుద్ధిగా మంచులో కూచుని ఆడుకున్నాం మేమిద్దరం. వరు మాత్రం చాలా ధైర్యవంతురాలు. ఏ సాహసమైనా చేసేస్తుంది.
సత్య, వరు కొండంతా ఎక్కి కిందికి మూణ్ణాలుగు సార్లు జారేరు. అయితే అక్కడ మంచు అప్పుడప్పుడే కరుగుతూన్నందువల్ల కనబడని రాళ్లు దెబ్బలు బాగా తగిలిస్తాయి. ఇద్దరూ రాళ్ల మీంచి దొర్లి దెబ్బలు తగిలించుకుని వచ్చాక గానీ ఆపలేదు.

ఇక ఇలాంటి ఆటలు మానేసి, మంచు క్రికెట్ ఆడడం మొదలు పెట్టాం. అయితే ఇందులో బాల్ మంచు, బ్యాట్ స్కేట్ బోర్డు. కొట్టిన వాళ్ల నెత్తినే మంచు పడితే అవుట్. చాలా సరదాగా ఆడిన ఆటలో నేను ఆడినప్పుడు మొత్తం మంచు నానెత్తినే పడడంతో మొదటే అవుటయ్యిపోయాను. అయినా బుకాయించి ఛాన్సు తీసుకున్నా మళ్లీ షరా మామూలే.

కారు ఎక్కేక వారు హఠాత్తుగా జేబు తడుముకుని “అమ్మో నా ఫోను” అంది. వరు, నేను మళ్లీ వెనక్కి పరుగెత్తేం. వరు ఐ-ఫోను కవరు నీలి రంగు నెమలి ఆకారపు బిళ్ళల్తో మెరుస్తూంటుంది. కానీ మంచు ముద్దల్లో కూరుకుపోతే అంతే సంగతులు. నేను ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాటజిక్ గా ఆలోచిస్తాను. ఎక్కడ పడితే అక్కడ గాభరాగా పరుగెడ్తున్న వరుని ఆపి, ఎక్కడెక్కడ జారిందో గుర్తు తెచ్చుకోమని , జాగ్రత్తగా ఆ జాడల్లో వెతుక్కుంటూ రమ్మని చెప్పేను. నేను మేం ముందు కూచున్న చోటి నించి మొదలు పెట్టి చివర్లో ఫోటోలు తీసుకున్న చోటి వరకు వెతికాను. ఇంకా రెండడుగులు వేసానో లేదో, నా కళ్లకి చిన్నగా మెరుస్తూ మంచులో సగం కూరుకున్న ఫోను కనిపించింది. కాస్సేపాగితే ఎవరైనా నడిచెళ్తే మొత్తం కూరుకుపోయేది. వరు నా చేతిలో ఫోను చూసి పరుగెత్తుకొచ్చి నన్ను కౌగలించుకుని ఏడుపు మొదలెట్టింది.

అలా ఆ ప్రయాణం చివరి రోజు సుఖాంతం అయ్యింది.

-డా.కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో