మన ఆరోగ్యం మన చేతుల్లో- రాగులు,సబ్జాలు – అలౌకిక శ్రీ

రాగుల వల్ల ఉపయోగాలు :

రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి. రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.

imagesరాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.

తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి.

బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా రాగులు కంట్రోల్‌ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర.

రాగుల్లోని అమినోఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెసా్ట్రల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్‌ టెన్షన్‌, బ్లడ్‌ప్రెషర్‌ని రాగులు చక్కగా నియంత్రిస్తాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్‌, అమినో యాసిడ్స్‌ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్‌ తలనొప్పిలాంటివి దరికి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.

కాల్షియంతో పాటు ఐరన్‌, నియాసిన్‌, ఽథయామిన్‌, రైబోఫ్లేవిన్‌తో పాటు ముఖ్యమైన అమినోయాసిడ్స్‌ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.

రాగుల్లో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.

అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగులను మన మెనూలో చేర్చడం ద్వారా ఈ లాభాలు పొందవచ్చు.

సబ్జాల వల్ల ఉపయోగాలు :

downloadఈ గింజల్ని నూరి ఏదయినా నూనెతో కలిపి గాయాలు, పుండ్లకీ వాడితే ఫలితం ఉంటుంది. ఇతర్రతా చర్మవ్యాదులనీ తగ్గిస్తాయి.

ఈ గింజల నుంచి తీసిన నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌ కి క్యాన్సర్లని వైరస్‌ లని ఇతర సూక్ష్మజీవుల్ని నివారించే శక్తి ఉందని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాదు తులసి గింజలకి ధాంబోసిస్‌ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయట.

కలుషిత నీటిలో ఉన్న లోహాన్ని రేడియోధార్మిక పదార్ధాలని తొలగించేందుకు కూడా ఈ గింజలు ఉపయోగపడతాయని కొత్త పరిశోధనల్లో వెల్లడయింది. ఈ గింజలనుండి తీసిన నునే ని షాంపూలు, పెర్‌ఫ్యుమ్స్‌ తయారిలోను వాడతారు.

జిగురుతో కూడిన సబ్జాల్లో పీచు శాతం ఎక్కువ. అందుకే ఔషధపరంగాను ఇవి ఎంతో మంచివి.

శరీర ఉష్ణోగ్రతను తగ్గించాడంతోబాటు మల, ముత్ర సమస్యల్ని నివారిస్తాయి . మలబద్ధకాన్ని డయేరియాని తగ్గిస్తాయి.

వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

బరువు తగ్గలనుకునేవాళ్ళు కాసిని సబ్జాలని బోజనానికి ముందు చప్పరిస్తే ఆకలి తగ్గి తక్కువ తింటారట. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉదరకోశ గోడలకు అతుక్కుని ఉండి జీవక్రియని ప్రేరేపిస్తాయి. ఫలితంగా శరీరం లోని క్యాలరీలు ఖర్చేయ్యేల చేస్తాయి. అదేసమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేల చేస్తాయి. దాంతో తీసుకున్న ఆహరంలో కొవ్వులు, చక్కేర్లని ఎక్కువగా రక్తంలోకి ఇంకనివ్వవు.

అందుకే వీటిని టీ, పండ్లరసాల్లో కలిపి లేదా డెజార్ట్‌, సలాడ్లమిద చల్లుకుని తాగినా తిన్నా ఉపయోగం ఉంటుంది. అయితే చాలామంది సబ్జాల్నినానబెట్టుకోడానికి బద్దకిస్తుంటారు. అలాంటివాళ్ళు మరిగించిన నీళ్ళలో వీటిని ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. తరవాత ఉబ్బిన వీటిని నమిలి తినడం కన్నా మిన్గాడమే మంచిది. కాబట్టి సబ్జాల్ని చప్పరిస్తే వచ్చే మజానీ అందులోనీ ఔషద గుణాల్ని మిస్‌ కాకండి.

  మరి మన  ఆహారం లో రాగులకి , సబ్జాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి ….

                                                                                                                       -అలౌకికశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, మన ఆరోగ్యం మన చేతుల్లో, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో