జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

మొది రెండు రోజులు అంతా కొత్తగా ఏమీ అర్థం కాకుండా, అసలు ఎందుకు వచ్చానా… తిరిగి వెళ్ళిపోతే బాగుండ అనుకున్నా బెరుకు బెరుగ్గా ఉన్నా, తనలాంటి  వాళ్ళు చాలా మంది ఉండడంతో నెమ్మదిగా పోశవ్వ కూడా గ్రూప్‌ డిస్కషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది . తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పింది. చాలా విషయాలు నేర్చుకుంది. పోశవ్వ జోగిని అని తెల్సుకున్న ఓ ట్రైనర్‌ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమెను పూలన్‌దేవితో పోల్చారు. అప్పటి  వరకూ పూలన్‌దేవి ఎవరో, ఏం చేస్తుందో పోశవ్వకి అసలే తెలియదు. అందుకే పూలన్‌ ఎవరో తెల్సుకోవాలని ఆరాటపడింది. తెల్సుకుని ఆశ్చర్యపడింది. నిజమే… తనకీ, పూలన్‌దేవికీ కొన్ని పోలికలు ఉన్నాయి. ఆమె బతుకూ తన బతుకులాగే గొప్పోళ్ళ అహంకారానికి, అధికారానికి బలయింది. నాశనం అయింది. అయితే అందుకామె కృంగిపోలేదు. కృశించిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. అవును, తనూ అలాగే ధైర్యంగా జీవించాలి. ఎదుర్కోవడం నేర్చుకోవాలి అని నిశ్చయించుకుంది. పూలన్‌ను స్ఫూర్తిగా తీసుకుంది.

రాజాగౌడ్‌ పోశవ్వను నిలబెట్టడంలోని, గెల్పించడంలోని అంతరార్ధం ఏమిటో  అవగతం చేసుకుంది. సర్పంచుగా తను కూర్చోవలసిన సీట్లో  అతను ఎందుకు కూర్చుంటున్నాడో స్పష్టమైంది. తను ఎవరి చేతిలోనూ కీలుబొమ్మ కాకూడదు. ఆ పోశవ్వను పూడ్చెయ్యాలి. సర్పంచ్‌ పోశవ్వగా కొత్త జన్మ ఎత్తాలి. ఊరికి పెద్దగా వ్యవహరించాలి. ఎవరు ఏం చెప్పినా అన్నీ విని, తన నిర్ణయం తాను తాసుకోవాలి. తనకు చదువు రాదు కాబట్టి  ఎదుటి  వారు తనని మోసం చేసే అవకాశం చాలా ఉందని అర్థం చేసుకుంది. ఎలాగైనా రాయడం, చదవడం నేర్చుకోవాలనుకుంది. ఈ ఏడు రోజుల్లో తనలో తను ఘర్షణ పడ్తూనే భావి జీవితానికి పునాదులు వేసుకునే దిశలో కొన్ని నిర్ణయాలు చేసుకుంది.

ఆ ఏడు రోజులూ తనను తానే మర్చి పోయి పూర్తిగా నిమగ్నమవడం, రాత్రి భోజనానంతరం రూంకి వచ్చి పడుకున్న తర్వాత ఆలోచిస్తూ, రేపటికి  బాటలకు సన్నద్ధమవుతూ ఉండేది పోశవ్వ. రవి అంతగా పట్టు పట్టక పోతే తను అలాగే ఉండేదని అనుకుంది. కొత్తగా వచ్చిన వాడైన రవి తన గురించి అంతగా ఆలోచించాడంటే, ఖాసిం అంత ఆత్రపడ్తూ వచ్చి చెప్పాడంటే వాళ్ళంతా తనని మంచి సర్పంచ్‌గా చూడాలని అనుకుంటున్నారు. నా కోసం ఆలోచించే వాళ్ళు, నా నుంచి కోరే వాళ్ళు ఉన్నారనుకున్న పోశవ్వలో నూతనోత్సాహం, నూతనోత్తేజం.

మహిళా రిజర్వేషన్‌లో గెలిచి శిక్షణ పొంది వచ్చిన తర్వాత, కూడా చాలా మంది స్త్రీలు సర్పంచులుగా విధులు నిర్వహించడంలో భర్త చాటు భార్యలుగానో, తండ్రి చాటు బిడ్డలుగానో, కొడుకు చాటు తల్లిగానో, అల్లుడిచాటు అత్తగానో, మామచాటు కోడలిగానో ఉండి సంతకం వరకే పరిమితమైతే, భర్తలు, తండ్రులు, కొడుకులు, అల్లుళ్ళు, మామలు, సర్పంచ్‌గా చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తూ రిజర్వేషన్‌నే అపహాస్యం చేస్తుంటే పోశవ్వ మాత్రం స్వయంగా రోజూ పంచాయితీకి వెళ్తోంది. తన పరిధిలో వ్యవహరించడం అలవాటు చేసుకుంటుంది. పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి ప్రయత్నిస్తోంది. వార్డు మెంబరు దుదేకుల ఖాసి, బడిపంతులు రవి ఆమెకి మంచి సలహాదారులయ్యారు. ఒక్కోసారి వారి సలహాల్ని కూడా ఆమె ప్రశ్నించే స్థాయికి ఎదిగింది.

పోశవ్వ హైదరాబాద్‌ నుంచి వచ్చిన రెండోరోజున….
పంచాయితీ ఆఫీసుకు బయలుదేరింది.
మొన్ని అవమానం కళ్ళ ముందు మెదులుతూ ఉండగా…
ఆ నడకలో ఎలాంటి  భయం లేదు. బెదురు లేదు…
వెళ్ళి తన సీట్లో  కూర్చుంది. కానీ ఆమెలో ఒక సందేహం..
ఒక భయం, బెదురూ… ఏమౌతుందోనని.
మళ్ళీ అంతలోనే తనకు తాను ధైర్యం కూడదీసుకుంది. హైదరాబాద్‌లో చెప్పిన విషయాలు గుర్తుతెచ్చుకుంది. తను తీసుకున్న నిర్ణయాలు మననం చేసుకుంది.
వెంట వచ్చిన ఖాసింతో

”ఖాసిం. భయ్‌…” అని ఆమె న్లో మాట పూర్తిగా వెలువడకుండానే,
”ఏందే… మాదిగలం… ఒళ్ళమ్ముకునే జోగుదానా… ఒళ్ళు బల్సిందా..
లెయ్‌.. ముందు. నా కండ్ల ముంగికెల్లి ఫో….ఫో…లం…. ఏదో గెల్పిచ్చిన్నని, అది నీ సీటు అనుకుంటున్నావే… మాద్గి ముండా …” అంటూ ఉగ్రనరసింహావతారమెత్తాడు రాజగౌడ్‌. నోటితో  ఉచ్చరించడానికి వీల్లేని పదజాలంతో తిట్టడు ఉపసర్పంచ్‌ శివప్ప, అతని అనుచరులు. ఇంత జరిగినా పోశవ్వ ఆ సీట్లోంచి లెగవనే లేదు.
”నేనెందుకు లేవాలె?” అక్కడ చేరిన జనాన్ని కలియ జూస్తూ రాజాగౌడ్‌ని సూటిగా ప్రశ్నించింది.
ఏదో గొడవ అవుతోందని రోడ్డు మీద ఉన్న జనం ఒక్కొక్కరూ జమయ్యారు.
”ఇంట్ల… ఎవడస్తే.. ఆని తోని పండెదానికి … గింత కావురమా…? అని ఒకరంటే” మనం ఇచ్చే పైసకోసం ఎట్ల చెయ్యిమంటే అట్ల ఆడేి గిదీన్ని ఇంత బలుపా..?
అవ్‌ గిట్లనే అయితది. జోగుదాన్ని సర్పంచు చేపిస్తనని మస్తు నీల్గిండు. తనే
గెల్పిచ్చిన్నని పేపర్లల్ల ఏపిచ్చుకున్నాడు. మరింకేంది అది తనే సర్పంచ్‌ అంటది. అనదా..?

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

One Response to జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో