కాశ్మీర్ని దర్శింప చేసి , నేస్తాన్ని చేరిన జానపద విదూషీమణి- అరసి

ISSN 2278-478                   

 20140825040627!నాయని_కృష్ణ_కుమారి చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు విన్న పాఠం . యాత్ర చరిత్ర అంటే పూర్తిగా తెలియని వయసులో మా తెలుగు మాష్టారు పాఠం చెబుతుంటే ఒక రకమైన ఆసక్తి కలిగింది . ఆ రోజు ఇంటికి వెళ్ళగానే మళ్లీ పాఠం చదువుతున్నప్పుడు ఒక పెద్దావిడ ప్రక్కనే కూర్చుని తాను చూసిన యాత్రను , వింతలను చెబుతున్న అనుభూతి .

                     తర్వాత ఏం .ఏ తెలుగు చదివేటప్పుడు గ్రంధాలయానికి వెళ్లి తీసుకున్న మొదటి పుస్తకం “కాశ్మీర దీపకళిక” నాకు ఇప్పటికి గుర్తే .

                   నాయని కృష్ణ కుమారిగారు లెక్చరరుగా పని చేస్తున్న రోజుల్లో విద్యార్ధులతో కాశ్మీర్ విహారయాత్రకి వెళ్లిన అనుభూతులను కాశ్మీర దీపకళిక గ్రంధంలో ఆవిష్కరించారు .

                   “ మధ్యాహ్నం ఎండ గంజి పెట్టిన నూలు గుడ్డలా ఫెళ ఫెళలాడుతుంది “ అన్న ఒక వాక్యంతో కథలా మొదలవుతుంది ఈ యాత్ర . కనిపించీ కనిపించనట్లున్న ఆ  పర్వత శిఖరాలు మనస్సును ఏదో అవ్యక్తభావంతో నింపుతున్నవి . చూట్టు నేల రాతిమయం , మోదుగ చెట్లు , అడవి తంగేడు , చీమచింత జాతికి చెందిన చెట్లు ఎక్కడ చూచినా కుప్పతిప్పలుగా దృష్టి పథంలో పడి  వెనక్కి జారిపోతున్నాయి అంటూ బస్సు ప్రయాణంలో కనిపించే ఆ దృశ్యాలను వివరిస్తూ బస్సు కొండపైకి వెళ్లేటప్పుడు దిగువన ఉన్న ఇల్లు ఎలా కనిపించాయో చెబుతూ “ కొండల ఎత్తు పల్లాలలో అక్కడక్కడా విసిరినట్లున్న పెంకుటిల్లు అందమైన బొమ్మరిళ్ళులా కనిపించసాగాయి “ .

                  కాశ్మీర్ లో వసతులు , రోడ్లు , గృహాల సముదాయం , మనుషుల వేష , భాషలు , ప్రకృతి సోయగాలు అన్నింటినీ కళ్లకు కట్టినట్లు ఆవిష్కృతం అవుతాయి ఈ కాశ్మీర్ దీపకళిక చదువుతుంటే .

                           “అది కేవలం యాత్ర కథనం కాదు , అది ఒక వచన కావ్యం “అంటారు చేకూరి రామారావు ఈ పుస్తకం ముందు మాటలో . నాకు మాత్రం ఆణిముత్యాల్లాంటి పాత సినిమాల్నీ ఎన్ని సార్లు చూసిన కొత్తగా అనిపించినట్లు , కాశ్మీర్ దీపకళిక ఎన్ని సార్లు చదివిన కాశ్మీర్ కళ్ళ ముందు కదులుతుంది . తరవాత నేను ఎప్పుడు ప్రయాణం చేసిన ఒక వ్యాసంగా కానీ , ఒక కథలా కానీ రాసుకోవడం మొదలుపెట్టాను . అంతాగా నా మీద ప్రభావం చూపింది “కాశ్మీర్ దీపకళిక “.

                      రచయిత్రిగా , కవయిత్రిగా , పరిశోధకురాలిగా ,అధ్యాపకురాలిగా పలురంగాల్లో సుప్రసిద్దురాలు ఆచార్య నాయని కృష్ణ కుమారి . భాషా సాహిత్యాలలో , జానపద సాహిత్యంలో విశేష కృషి చేశారామే .1930లో గుంటూరులో నాయని సుబ్బారావు , హనుమాయమ్మ దంపతులకు మార్చి 14 న జన్మించారు కృష్ణ కుమారి . గుంటూరు జిల్లా నరసరావుపేట లోను , శ్రీకాకుళంలోనూ ప్రాధమిక విద్యని పూర్తి చేసారు . ఆంద్ర విశ్వవిద్యాలయం నుంచి 1948 లో తెలుగు ఎం .ఏ పూర్తి చేసారు .

                        వీరి తొలి రచన “ఆంధ్రుల కథ” , “తెలుగు జానపద గేయ గాధలు” అనే అంశం పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు . తెలుగులో జానపద గేయ సాహిత్యం విస్తృతి అభివృద్ధి పై లోతుగా పరిశీలించారు ఈ గ్రంధంలో . పరిశోధన, పరిశీలన వ్యాస సంకలనాన్ని వెలువరించారు .1978 లో అగ్ని పుత్రి “ కవితా సంకలనాన్ని వెలువరించి తన తండ్రి నాయని సుబ్బారావు గారికి అంకితం ఇచ్చారు . “ఏం చెప్పను నేస్తం” కవితా సంపుటిని కాలాతీతవ్యక్తులు నవలా రచయిత్రి డా .పి శ్రీదేవికి అంకితం ఇచ్చారు . “మానస లీల” కవితా సంకలనాలను , “ఆయత” పేరుతో కథల సంపుటిని రచించారు . కాశ్మీర దీపకళిక వంటి యాత్రా గ్రంధాలను వీరి కలం నుంచి వెలువడినవే .
ఇవే కాకుండా పలువురు మేధావులు రాసిన వ్యాసాల సంకలనం తెలుగు జానపద విజ్ఞానం , సమాజం – సంస్కృతి –సాహిత్యంను ప్రచురించారు . కథలు –గాధలు పేరుతో సంకలనం , మెకంజీ కైఫీయత్తులు , విజ్ఞానం , నల్గొండ జిల్లా ఉయ్యాల పాటలు , తెలుగు జానపద గేయ గీతాలు , జానపద తోరుదత్ ఆంగ్లంలో రాసిన ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు . గణిత శాస్త్రంలోని సరళ రేఖ సమీకరణాన్ని జానపద సాహిత్యంలో కథ చెప్పే పద్ధతులకు అన్వయిచడం వంటివి వీరు చేసిన ప్రయోగాలలో ఒకటి .

                       1951 – 52 లో మద్రాసు మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు . తర్వాత కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం  రీడర్ ,ప్రొఫెసర్,  తెలుగు శాఖధిపతిగా  పనిచేసారు . తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన అధ్యాపకులుగా పని చేసి 1996 నుంచి 1999 వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కు వైస్ చాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించారు .

                        గృహ లక్ష్మి స్వర్ణ కంకణం అందుకున్నారు . అసోచాయ్ మహిళా విభాగం నుంచి దశాబ్ది మహిళా పురస్కారం అందుకున్నారు . సాహిత్య అకాడమీ , తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలును పొందారు . జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన వారిలో ఆమె ఒకరు . యూనివర్సిటీలో పండితుల ఆదరణకి నోచుకోని ఒక సాహిత్య ప్రక్రియని చేపట్టి , దానికి సాహిత్య స్థాయి కల్పించిన విదుషీమణి నాయని కృష్ణ కుమారి . అంతేకాదు జానపద సాహిత్యాన్ని విశ్లేషించే విధానంలో క్రొత్త పద్దతులు ప్రవేశపెట్టిన ఘనత ఆమెదే . తానే స్వయంగా అనేక పల్లెలకు తిరిగి లెక్కలేనన్ని స్త్రీల పాటలూ , కథలూ సేకరించారు.

                     నాయని కృష్ణకుమారి విశాఖలో ఉన్న  కాలంలో ‘కాలాతీత వ్యక్తులు ‘  నవల రచయిత్రి డా.పి.శ్రీదేవి గారితో పరిచయం అయ్యింది . తరవాత కాలంలో కృష్ణకుమారి తల్లిగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు శ్రీదేవిగారు వైద్యం చేసారట . శ్రీదేవిగారి అకాలమరణాన్ని  జీర్ణించుకోలేని ఆమె , తన మనోవేదనని “ఏం చెప్పను నేస్తం” అన్న కవితలో ఇలా వెలువరించారు .

“ఆపదల పడవలో ఎక్కి
ఆ లోకపుటంచుల్ని మెట్టబోయిన అమ్మను
ఆపి మళ్లీ మా మధ్య వదిలిన
మృత్యుం జవని చెప్పనా నిన్ను నేస్తం ?

అంటూ డా .పి.శ్రీదేవిగారు చేసిన వైద్యం గురించి చెబుతూ ఇంకా ఇలా అంటారామె …..

“ ఎప్పుడో ఒకనాడు
రెండు లోకాలు కలిసే సరిహద్దు గీత మీద
నువ్వు నవ్వుతూ నాకెదురుగా వచ్చినప్పుడు
అంతరంగంలో నువ్వంటే
నాకెంత యిష్టమే
అంత నిజంగానే చెప్తాను నేస్తం !”

తరవాత కాలంలో అదే పేరుతో “ఏం చెప్పను నేస్తం “ అంటూ కవితా పుస్తకాన్ని వెలువరించారు .

                                     ఆమె రాసిన “కాశ్మీర్ యాత్ర చరిత్ర” యాత్ర సాహిత్యంలో ఎంతో మందికి ఆదర్శం . జానపద సాహిత్యానికి ఆమె చేసిన సేవ ఎన్నటికి మరువరానిది . ఆ సాహిత్య భాండాగారాన్ని భావితరాలకి వదిలేసి తన “నేస్తాన్ని చేరిన” జానపద విదూషీమణి తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోయారు .

– అరసి   

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో