కౌమార బాలికల ఆరోగ్యం

3. రుతుచక్రం

ఒక నెల రుతుస్రావం ప్రారంభమైన దగ్గర్నుండి మరుసటి నెల రుతుస్రావం మొదలయే వరకు వున్న కాలవ్యవధిని

‘రుతుచక్రం’ అని అంటారు.10-11 సంవత్సరాల వయస్సులో రుతుచక్రం మొదలయి 45-52 సంవత్సరాల వరకు

కొనసాగుతుంది. సాధారణంగా బహిష్టు 28-30 రోజులకు ఒకసారి వస్తుంది. బహిష్టులు క్రమంగా వచ్చే స్త్రీలు తమ జీవిత

కాలంలో 450-500 సార్లు బహిష్టులు అవుతారు. బహిష్టులో ప్రతి నెల సుమారుగా 30-50 మి.లీ. రక్తం పోతుంది.

యవ్వన ప్రారంభదశలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మెదడులోని ‘హైపొధాలమస్‌’ అనే భాగం

‘పిట్యూటరీ’ అనే గ్రంధిని కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు పిట్యూటరీ గ్రంధి మిగతా కొన్ని

హార్మోన్లతో పాటు ముందు ‘ఫాలికిల్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌’ ని, à°† తరువాత ‘లూటినైజింగ్‌ హార్మోన్‌’ ని ఉత్పత్తి చేస్తుంది.

రుతుచక్రం వివిధ దశలు

à°…à°‚à°¡à°‚ విడుదలకు ముందు దశ లేక  ప్రాలిఫరేటివ్‌ ఫేజ్‌ (proliferative phase)’ఫాలికిల్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌’

అండాశయాలలోని ఫాలికిల్స్‌ని ప్రేరేపిస్తుంది. à°† ప్రేరణతో పెరిగే ఫాలికిల్స్‌ ‘ఈస్ట్రోజన్‌’ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి.

ఫాలికిల్స్‌ పెరుగుదలతో పాటు ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి ఎక్కువవుతున్న కొద్దీ హార్మోన్‌

ప్రభావంతో గర్భాశయం లోపలిపొర మందం కూడా పెరుగుతుంది. సూక్ష్మరక్తకేశనాళికలు, గ్రంథులు కూడా పెరుగుతాయి.

ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి à°’à°• స్థాయికి చేరాక అది హైపొథాలమస్‌ ద్వారా పిట్యూటరీ గ్రంధిని ‘లూటినైజింగ్‌ హార్మోన్‌’ని ఉత్పత్తి

చేసేందుకు ప్రేరేపిస్తుంది. అలా ఉత్పత్తి అయిన లూటినైజింగ్‌ హార్మోన్‌ ప్రభావంతో ఫాలికిల్‌ పగిలి అండం విడుదల

అవుతుంది.à°…à°‚à°¡à°‚ విడుదలను ‘ఓవ్యులేషన్‌’ అని అంటారు

అండం విడుదల తరువాత దశ లేక సెక్రీటరీ ఫేజ్‌ (secretory phase)

అలా పగిలిన ఫాలికిల్‌, లూటినైజింగ్‌ హార్మోన్‌ ప్రభావంతో కొన్ని మార్పులకు లోనవుతుంది. మార్పు చెందిన ఫాలికిల్‌ని

”కార్పస్‌లూటియమ్‌” అని అంటారు. కార్పస్‌ లూటియమ్‌ ”ఈస్ట్రోజన్‌”తో పాటు ‘ప్రొజెస్టరాన్‌’ అనే మరొక హార్మోన్‌ని

కూడా ఉత్పత్తి చేస్తుంది.అప్పటివరకు ఈస్ట్రోజన్‌ ప్రభావంతో క్రమేపీ మందంగా అవుతున్న గర్భాశయపు లోపలిపొర

‘ఎండోమెట్రియమ్‌’ మరింత మందంగా అవుతుంది. ఎండోమెట్రియమ్‌లో వుండే గ్రంథుల స్రావం పెరుగుతుంది. ఇది

సంయుక్తబీజకణానికి పోషకంగా ఉపయోగపడుతుంది. సూక్ష్మ రక్తకేశనాళికల వలయం దట్టంగా పెరుగుతుంది. ఈ

విధంగా ఎండోమెట్రియమ్‌ గర్భధారణకు అనువుగా సన్నద్ధమవుతుంది.

రుతుస్రావదశ  లేక మెన్ట్స్రువల్‌ ఫేజ్‌ (menstrual phase)

గర్భధారణ జరగనప్పుడు కార్పస్‌ లూటియమ్‌ కృశించడంతో దానిలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ పరిమాణం

తగ్గిపోతుంది. ఈ హార్మోన్ల ఆసరాతో పెరుగుతున్న ఎండోమెట్రియమ్‌ ఈ ఆసరా ఒకసారి పోగానే కృశించిపోతుంది.

కృశించి ముడుచుకున్న ఎండోమెట్రియమ్‌ కణజాలం అడుగున వున్న రక్త కేశనాళికల వల పగిలి చిన్న చిన్న రక్తపు

మడుగులు ఎండోమెట్రియమ్‌ క్రింద పేరుకుని, ఆ ఒత్తిడికి ఎండోమెట్రియమ్‌ విడిపోయి, తునకలయి ఆ తునకలతో పాటు

రక్తస్రావం, గ్రంథుల తునకలు, వాటి స్రావం గర్భాశయం నుండి రుతుస్రావంగా క్రిందికి జారుతూ సర్విక్స్‌ స్రావాన్ని కూడా

కలుపుకుని యోని ద్వారా బయటకు వస్తుంది. ఫలదీకరణ చెందని అండం కూడా విచ్ఛిన్నమై రుతుస్రావంలో

కలుస్తుంది.

ఇలా విడిపోయి తునకలైన ఎండోమెట్రియమ్‌ అడుగునవున్న కణజాలం, గ్రంధులు సూక్ష్మ రక్తకేశనాళికలతో సహా

అండాశయంలో  పెరుగుతున్న కొత్త ఫాలికిల్‌ ఉత్పత్తి చేసే ఈస్ట్రోజన్‌ ప్రభావంతో తిరిగి పెరగనారంభిస్తుంది.రుతుస్రావం

ఆగిపోయేసరికి ఎండోమెట్రియమ్‌ అంతా ఎక్కడా ఖాళీ లేకుండా తిరిగి నిర్మింపబడుతుంది.

ఇలా బహిష్టు అయిన మొదటి రోజునుండి కొత్త ఫాలికిల్‌ పెరుగుదల, ఎండోమెట్రియమ్‌లో కొత్త కణాల వరుస నిర్మాణంతో

కొత్త రుతుచక్రం ప్రారంభమవుతుంది.

వచ్చే సంచికలో….

బహిష్టు సమస్యలు

– à°¡à°¾. ఆలూరి విజయలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో