స్త్రీ యాత్రికులు(7 వ భాగం)

పర్వతాల్లో ప్రయాణాలు చేసిన చిత్రకారిణి నీనా మజుషెల్లీ -3

ఎగిరే సీతాకోకచిలుకల్ని పట్టుకుని వాటిని ముద్దులతో ముంచెత్తేది.తూనీగల్ని  తరుముకుంటూ తిరిగేది.ఆ కొండలకి పుట్టిన

బిడ్డ  మాదిరిగా తనని ఊహించుకోనేది.ఫ్రానిస్ మాత్రం ఇవన్నీపట్టించు కోకుండా తుపాకీ భుజాన పెట్టుకొని ,సేవలతో  పాటుగా

ముందుకి వెళుతూనే ఉండేవాడు.

డార్జిలింగ్ లోని చప్పటి పార్టిలకి, బలవంతపు డిన్నర్లకి దూరంగా వచ్చినందుకు ఎంతో పరవశించి పోయింది

నీనా.ఇలాగా ప్రకృతి గుడారం లోకి పారిపోయన నీనా కి రెండు వారలు,రెండు రోజుల్లాగా గడిచి పోయాయి

.ఇలాంటి గొప్ప అనుభుతులోంచి త్వరగా ఇంటికి వెళ్ళటం నీనా కి ఏమాత్రం నచ్చలేదు.అందుకని రెండు నెలలు విశ్రాంతి

తీసుకొని ‘మరో పెద్ద యాత్ర కి బయలుదేరాలి ‘ అని నిర్ణయించుకుంది.

డార్జిలింగ్ పరిసరాల్లో ఉన్న హిమాలయాల్లో ఆనాటికి స్త్రీలు ఎవ్వరూ సాహస యాత్రలు చెయ్యలేదు.

అయినా సరే నీనా వెనుకంజ వేయకుండా బయలు దేరటానికి సిద్ధమైంది. పర్వతాల వాతావరణాన్ని రెండు వారాల

పాటుగా రుచి చూసిన నీనా ,వాటిని వదిలి పెట్టి ఉండలేక  పోయింది.ఇపుడు కాకపోతే ఎప్పుడు తన కలల్ని నిజం

చేసుకొనేది?అందుకనే ఫ్రాన్సిస్ ని ఒప్పించి మరల కాంచేన్ జుంగా పర్వాతాల్లోకి ప్రయాణ సన్నాహాలు చేయించింది.

అంతా సక్రమంగా జరిగితే ఆ యాత్రలోనేఎవరెస్ట్ శిఖరాల వైపు కూడా వెళదామని అనుకొంది.  

మనవ శక్తిని సవాలు చేస్తూ ఆకాశం  అంత ఎత్తులో నిలబడ్డ ఆ పర్వతాల్ని

వూరికే చూస్తూ ఎంత కాలం గడపగలదు ? వాటిని   అధిరోహిస్తేనే కదా? ఆమెకి ఆనందం కలిగేది.

1872 వ సం.లో మొదలైన ఈ రెండవ యాత్రలో నీనా, ఫ్రాన్సిస్ తో పాటుగా ఇంకో మిలిటరీ ఆఫీసర్ కూడా పాల్గొన్నాడు.వారికి

సహాయకులుగా డెబ్బయి మంది పనివాళ్ళు కుదిరారు.ఆ పరవతాల్లోం వారు 10 వేలనుండి 12 వేల అడుగుల ఎత్తు వరకూ

మాత్రమే అధిరోహిస్తారు.కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగవు.అలాంటి చిన్న ఎత్తులు  ఎక్కటం చాలా సులభం.

  వారివెంట  వచ్చిన సేవకులలో మూటలు మోసేవారు,చెట్లు కొట్టే వారు,వంటవాళ్లు , గుడారాలు వేసే వారు ఇంకా అనేక చిల్లర

పనుల కోసం సిద్ధమైన మనుషులు వున్నారు.కానీ ఆమెకు సహాయంగా మరో స్త్రీ లేదు. నా ఆనందం కోసం నేను

వెళుతున్నప్పుడు మరో స్త్రీని బాధపెట్టడం ఎందుకు?’అంటుంది నీనా.

  వారి సేవకులందరికీ కొండ మార్గాలన్నీ కొట్టిన పిండి.వారికి తెలియని దారులుండవు.వారిలో

లేప్చాలు,భోటియాలు,నేపాలీలు,సిక్కిమీయులు వున్నారు.ఒకరి భాష  మరొకరికి పూర్తిగా అర్ధం గాదు.అందుకే ఒకరిద్దరు

దుబాసీలను కూడా తమతోపాటు తెచ్చుకున్నారు.”Tower of Babel “ని నిర్మించటానికి బయలుదేరిన సమూహం లాగా 

ఉంది మా బృందం. అని తన డైరీలో రాసుకొంది నీనా.వారి వంట సామానుతో పాటుగా వారితో గొర్రెలు,కోళ్ళు ఉన్నాయి.అవి

చాలవన్నట్టు ఒక ఆవుని కూడా వెంట తీసుకువెళ్ళారు.ప్రతి రోజు ఉదయాన్నే టీ తాగటానికి పాలు కావాలి కాబట్టి.

(ఇంకా ఉంది)

-ప్రొ.ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో