సుకన్య (ధారావాహిక)

రచయిత్రి పరిచయం:

డా.కనుపర్తి విజయ బక్ష్ అధ్యాపకురాలిగా 25 సం.ఉద్యోగం నిర్వహించి రీడర్ గా పదవీవిరమణ

పొందారు.

శ్రీ సిద్ధార్థ బక్ష్ ని  అభ్యుదయ  వివాహం  చేసుకున్నారు.

తండ్రినుంచి సాహిత్యాభిలాష ,అభ్యుదయ భావాలు  , కులాతీత మతాతీత -  స్త్రీ పురుష  సమానత్వ సమాజం

కోసం  కృషి… స్త్రీల సాంఘిక అసమానత్వంపై ఆవేదన….తపన…వివిధ పత్రికల్లో 200 వ్యాసాలు,30 కథలుగా

రూపుదిద్దుకున్నాయి.

ఇతర రచనలు:బ్రహ్మసమాజ సాహిత్య,(సిద్ధాంత గ్రంథం ),తెలుగు సాహిత్యంలో హేతువాద భావాలూ -ప్రభావాలు

కాబా కాశి కా  మిలన్ ,ఆమె చెప్పిన కథ  కథల సంపుటాలు ,ఆకాశంలో సగం మాది-అవకాశాల్లో చోటేది?,సాహిత్య

సౌరభం వ్యాస  సంపుటాలు.      

సుకన్య  నవల (మొదటి భాగం)

”అనుకొన్నామని జరగవు అన్నీ…అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని”…

ఘంటసాల గాత్రంలో నుండి సుమధురగానం. ఎందుకో à°† పాటలోని మాటలు అంతగ రుచించలేదు సుకన్యకు. à°† సాయం సమయంలో అందంగా అలంకరించుకొని చంద్రధర్‌ కోసం ఎదురుచూస్త్తూ క్షణమొక యుగంగా గడుపుతున్న à°† అమ్మాయికి అనుకొన్నామని జరగవు అన్ని… అయ్యో! నిజంగానే చందు à°ˆ రోజు తనని కలవడానికి రాడా! అప్పటి వరకు తన చుట్టు ప్రక్కల ఏమి పరిశీలించకుండ తన ఆలోచనల్లో తాను మునిగి పోయిన సుకన్య కళ్ళెత్తి చూచింది.

సాయంకాలం ఆరుగంటలవుతోంది. అంతవరకు నిర్విరామంగా ఆకాశ వీధిలో పరుగెత్తి పరుగెత్తి ఆలసిపోయిన సూర్యుడు పడమటింటి పానుపుపై విశ్రమించడానికి వెళ్తున్నాడు. ఆపార్కులో అందమైన చెట్ల గుబురులు, నీళ్ళను విరజిమ్మే ఫౌంటెన్లు భూమి మీద ఆకుపచ్చని చాప పరిచినట్లు లాన్లు… పిల్లలూ ఒక్కొక్కరే రావటం అధికమైన కొద్ది గోల కూడా ఎక్కువయింది. కేరింతలు కొడుతూ, ఆడుతూ, పాడుతూ ఉయ్యాల మీద, జారుడు బల్లల మీద అల్లరిగా మాట్లాడుతూ ప్రపంచాన్ని మరిచిపోయి ఆడుతున్నారు.

సుకన్య వాచీకేసి చూసుకొంది ఆరుగంటల అయిదు నిముషాలయింది. ‘చందు ఎప్పుడూ చెప్పిన టైమ్‌కే వస్తాడు. ఇవాళ ఎందుకో లేట్‌ అయింది. అసలిట్లా ఎప్పుడు ఆలస్యం చేయడే!’ అనుకుంటూ గేట్‌ వైపు చూచింది. వయసు మళ్ళిన  దంపతులిద్దరు చెట్టాపట్టాలేసుకొని à°’à°•à°°à°¿ కొకరు ఆసరాగా నడుచుకొంటూ వస్తున్నారు. à°† వయసులో భార్యాభర్తలే ఒకరికొకరు మంచి స్నేహితులు. జీవితమంత యాతనలతో బాధ్యతలతో గడిచిపోయాక హాయిగా విశ్రాంతిగా గడిపే సమయమిదే. వారి వెనుకనే చందు…

అతడ్ని అంత దూరంలో చూడగానే సుకన్య మనసు పురివిప్పిన నెమలిగా అయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనిషి అయితే కూర్చుని ఉంది కాని మనసు అపుడే అతను రాకుండానే అతనితో సంభాషించటం మొదలుపెట్టింది. గ్రేకలర్‌ పాంటు, స్రై ్టప్స్‌ ఉన్న పుల్‌హాండ్స్‌ షర్టు టక్‌ చేసుకొని ఠీవిగా వస్తున్న అతన్ని చూస్తుంటే సుకన్యకు పట్టరాని సంతోషం కలిగింది. అంత క్రితం వరకు అతను లేట్‌ చేసాడన్న కోపం కాస్తా ఒక్కసారి ఎగిరిపోయింది. వస్తునే చంద్రధరే సుకన్య కేసి చూచాడు. లైట్‌ నీలం రంగు చీర అంతకంటే కొంచెం ముదురురంగున్న బ్లౌజు, మెడనంటుకొన్న సన్నటి చైన్‌. శరీరపు రంగులో కలిసిపోయినట్లుంది. అందమైన కోలముఖం పెద్దకండ్లు ఎర్రటి పెదవులు లూజుగా వేసుకొన్న జడ. జడలో పింక్‌ కలర్‌ గులాబి. కళ్ళు తిప్పుకొలేని అందం.

”సారీ సుకన్య ! ఫ్రెండ్‌ వచ్చాడు అయిదు నిముషాలు లేటయింది. నీవు వచ్చి à°Žà°‚à°¤ సేపయింది” అన్నాడు పక్కనే కూర్చుంటు.

‘పది నిముషాలయింది. కానీ క్షణమొకయుగంగా గడిచింది అసలు రావేమోనని భయపడ్డాను.’

‘వస్తానని మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఎట్లా ఉంటాను’ అంటూ సుకన్య చేతిని తన చేతిలోకి తీసుకొని అరచేతిలోని రేఖలు చూడటం మొదలు పెట్టాడు.

‘ఏమిటి చూస్తున్నావ్‌? గోముగా అడిగింది సుకన్య.

‘మనకు పిల్లలెంతమందోనని…’

‘à°† వెనకటికో సామెతుంది ”ఆలులేదు, చూలులేదు, అల్లుడి పేరు సోమలింగమని” అసలు మన పెండ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకొంటారో లేదోనని భయపడి పోతుంటే…’

”ఏం! వాళ్ళు ఒప్పుకోకపోతే మనం పెండ్లి చేసుకోలేమా? మనకు మన పెండ్లి ఎలా చేసుకోవాలో తెలీదా? ”

”తెలీదని కాదు. వాళ్ళ అనుమతి కూడా అవసరం కదా!” సందేహిస్త్తూ అన్నది సుకన్య.

”అయినా ప్రశాంతంగా ఉన్న à°ˆ సాయంసమయంలో ఏవో మంచి మాటలు చెప్పుకోక ఇపుడెందుకు మనసు పాడు చేసుకోవటం, ఎటూ వాళ్ళని అడగవలసి వచ్చినపుడు à°† టెన్షన్‌ తప్పదు కదా !” బుజ్జగిస్తున్నట్లు అన్నాడు చందు.

”ఇంతకీ పరీక్షలకెట్లా ప్రిపేర్‌ అవుతున్నావ్‌?” మాట మారుస్త్తూ అడిగింది
సుకన్య కళ్ళలోకి చూస్తున్నాడు. చందు.

”అట్లా అయితే మన పెండ్లి నిరవధికంగా వాయిదా పడును. మనం అనుకొన్నది ఏమిటి? పి.జి.అయిన వెంటనే మనం ఉద్యోగాలు సంపాదించుకొని అపుడు పెండ్లి చేసుకొందామని కదా! à°ˆ నాలుగు నెలలు కష్టపడి మనం కొంచెం అదుపులో ఉంటే à°† తర్వాత జీవితమంతా కలిసి హాయిగా బ్రతకవచ్చు. అబ్బాయిగారు అన్ని కట్టిపెట్టి బాగా చదవండి”

”ప్రయత్నం చేస్తున్నాను. కాని మనసు చాలా చెడ్డది. మాట వినటం లేదు”.

”ఎందుకు వినదు. నేను చూడు ఎంచక్కా నీ ఆలోచనలన్నీ నెట్టి పారవేసి మరీ చదువుకోవటం లేదు” సుకన్య గడుసుదనం ప్రదర్శిస్తూ అంది.

ఇద్దరు అట్లా వారి భవిష్యత్తును గూర్చి ఎన్నో చర్చించుకున్నారు. జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాలని కలలు కన్నారు. మాటల బరువును మనసు మోయలేనంతగ అయినాక ఇద్దరు లేచారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా మోటర్‌ సైకిలు మీద వస్తున్న నీల, సురేష్‌ కనిపించారు.

”హాయ్‌! చందు ఎక్కడికి రూమ్‌కేనా? నేను నీలని డ్రాప్‌ చేసి వస్తాను నడుస్తుండు” అంటూ అంతే వేగంగా వెళ్ళిపోయాడు.

మాటల్లోనే సుకన్య ఉండే రూమ్‌ వచ్చింది. గేట్‌ తీసికొని సుకన్య ”బై” చందు అంటూ వెళ్ళింది. చందు నాలుగడుగులు వేసాడోలేదో సురేష్‌ వచ్చాడు. తన ప్రక్కన ఆగిన బైక్‌ మీద కూర్చున్నాడు చందు. సురేష్‌ బైక్‌ స్టార్ట్‌ చేసాడు.

సుకన్య యూనివర్సిటీలో ఎం.ఎ. ఇంగ్లీషు చదువుతోంది. చంద్రధర్‌ కూడ అదే యూనివర్సిటీలో ఎం.ఎస్సీ ఫిజిక్స్‌ చేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే ఊరు. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఇద్దరివి వేరే వేరే కులాలు కావటమే.

సుకన్య తండ్రి ఆ గ్రామంలోఉన్న మోతుబరి రైతులలో ఒకడు. చెప్పుకోతగ్గ ఆస్థిపాస్ధులున్నాయి. అతని తాతతండ్రులు కావలసినంత ఇచ్చి వెళ్ళారు. దాన్ని ఇంకా ఇంకా పెంచాడు వెంకయ్య. తమ ఇళ్ళల్లోని ఆడవాళ్ళు ఏనాడు బయటకు వెళ్ళటం అనే ఆచారం లేదు. కాని సుకన్య చిన్నతనం నుంచి చాలా బాగా చదువుకోవటంతో, టీచర్లంతా చదువు మాన్పించవద్దని చెప్పటంతో ఆయన కిష్టం లేకపోయినా టెన్త్‌ తర్వాత చదువు మాన్పించలేదు. దానికి తగ్గట్టు సుకన్య కూడా చాలా మంచి మార్కులతో ఏ క్లాసు బ్రేక్‌ లేకుండా చదువుకొంది. హాస్టల్స్‌లో పెట్టినట్లయితే కూతురు అందరిలో ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ఆయన పట్నంలో ఒక చిన్న పోర్షన్‌ చూసి సుకన్యకు వంటచేసి పెట్ట్టటానికి తోడుగా ఉండటానికి దూరపు బంధువునొకామెను నియమించాడు.

సుకన్యను చూచి ఆగ్రామంలో కొందరిలో చదువుకోవాలనే ఇన్సిపెరేషన్‌ వచ్చింది. అట్లా వచ్చిన వాళ్లలో వెంకయ్య తమ్ముడు గోవిందయ్య కూతురు వనజ ఒకతి. ఆ అమ్మాయి కూడ సుకన్యతో పాటు పట్నంలో వుండి కాలేజిలో డిగ్రీ చదువుతోంది.

చంద్రధర్‌ తండ్రి కనకయ్య బలహీనవర్గాలకు చెందిన వాడు. అతని తండ్రి ఆ ఊరిలో కామందుల దగ్గర పనిచేసి కిందమీద బడి ఒక ఎకరం సుక్షేత్రమైన భూమిని సంపాదించాడు. మొదటి నుండి కొడుకును చదివించాలని అతనికి పట్టుదల. ఎట్టి పరిస్ధితుల్లో ఎన్ని కష్టాలెదురైనా కొడుకు చదువు కొనసాగించాలనే అతని సంకల్పం. దాని ఫలితమే చంద్రధర్‌ యూనివర్సిటీ చదువు దాక రాగలగటానికి కారణం. అతనికి సెవెన్త్‌ క్లాసు పాసయినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్పు నేటి వరకు కొనసాగుతునే ఉంది.

పల్లెటూరులో ఉండేది సామాన్యంగా ఒకటే హైస్కూల్‌ జనాభా ప్రాతిపదికను బట్టి చదువుకొనే ఆడపిల్లల సంఖ్యను బట్టి గరల్స్‌ హైస్కూల్‌ ఉంటుంది. ఇది చిన్న పల్లెటూరు కావటం వల్ల ఉన్నది ఒకటే హైస్కూల్‌. కో ఎడ్యుకేషన్‌ స్కూలు. సుకన్య, చంద్రధర్‌ హైస్కూల్‌ నుండి సహాధ్యాయిలు. ఇద్దరు ఒకే క్లాసు. పోటాపోటీగా చదివేవారు. సుకన్యకు లాంగ్వేజిస్‌లో ఫస్టు మార్కువస్తే చంద్రధర్‌కి గ్రూపులో ఫస్టు వచ్చేది. అయినా ఇద్దరి మధ్య పోటీ ఉండేది. ఆ పోటి చాలా ఆరోగ్యకరమైనదిగా ఉండేది.

– à°¡à°¾.కనుపర్తి విజయ బక్ష్

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సుకన్య, , Permalink

5 Responses to సుకన్య (ధారావాహిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో