కాల నాగు

దానికేం….
నీతి లేదు …. జాతిలేదు
కులము లేదు …..గుణము లేదు
మతము లేదు …. మానవత్వం లేదు
పేద … గొప్ప తారతమ్యం లేదు
ఆక్టోపస్ లా వేటాడుతూనే వుంటుంది.
శత సహస్ర బాహువులతో
మిమ్మల్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తుంది .
గర్భస్థ శిశువు నుంచి వృద్దాప్యం సైతం వదలదు.
కోర్కెల బుసలు కొడుతూ
కవ్వించిన వారినల్లా కాటేస్తుంది.
అంతర్జాల వలలో చిక్కిన యువతకై
విషం కక్కే కాలనాగవుతుంది.
ఛాటింగ్ లతో మొదలై డేటింగ్ ల దాకా
మళ్ళీ యువతపై కోరలు చాస్తుంది.
బతుకు పుస్తకంలో అక్రమార్కులతో
గూగుల్ గాగూల్స్ తో చీకటి లోకంలో
విచ్చల విడిగా విహరిస్తూ
చేజేతులా మృత్యు కౌగిళ్ళు అందిస్తుంది
చివరి కన్నీటి బొట్టు ఇంకే దాకా తెలియదు
మీరు పడగ నీడలో అచేతనమవుతున్నారని
మీ చుట్టూ ఉన్న వారే శతృవులై
మాటల గాయాలు…. మనసు చిధ్రం చేస్తారు
మీకు మీరే స్వస్తి పలకాల్సి వస్తుంది
మీ జీవిత వైకుంఠపాళీలో ఎగరేసే నిచ్చెనలే కాక
పడ దోసే విష నాగులు ఉంటాయి
మీకై నిర్వహించిన అవగాహన సదస్సులు
మరో ఉషస్సుకై…. మీ ఆయుష్షు కై…..

– ములుగు లక్ష్మి మైధిలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to కాల నాగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో