కౌమార బాలికల ఆరోగ్యo

ఈ నెలనుంచి ప్రారంభమవుతున్న ‘ఆరోగ్య దీపిక’ శీర్షికలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి,M.S. (Ob./ Gy.)

కౌమార దశలో  ఆడపిల్లలు ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యలను శాస్త్రీయంగా చర్చిస్తూ  వాటిని అధిగమించే సూచనలను

,విజ్ఞానాన్ని  ‘విహంగ ‘ పాఠకులకు  అందించబోతున్నారు . పాఠకులు  ఈ వ్యాసాల సారాంశాన్ని

ఉపయోగించుకుని, అవసరమైన  బాలికలకి  కూడా ఈ విజ్ఞానాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం .

వీరు  వృత్తిరీత్యా వైద్యురాలే అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా  మంచి రచయిత్రి,సంఘసేవకురాలు కూడా. National Trainer,

Adolescent Health, FOGSI-IMA-IAP & WHO

Managing Trustee, “CEDOW”

Winner of World Bank’s India Development Marketplace  – 2004 competitions.

వీరి ఇతర రచనలు:

కధానికా సంపుటిలు, నవలలు

1.    మీరు ప్రేమించలేరు

2.    మాకీ భర్త వద్దు

3.    పేషెంట్‌ చెప్పే కథలు

4.     అగ్ని కిరణం

5.    జ్వలిత

6.    సజీవ స్వప్నాలు

7.    చైతన్య దీపాలు

8.     ప్రత్యూష పవనం

9.     వెలుతురు పువ్వులు

వైజ్ఞానిక పుస్తకాలు

10. మాతృత్వం (గర్భిణీ  స్త్రీలకు

వైద్యసలహాలు)

11.     మన దేహం కథ (వ్యాససంపుటి)

అనువాదాలు :

12.     వైద్యుడు లేనిచోట

13.     మనకు డాక్టర్‌ లేనిచోట

14.     రక్తం కథ

15.    యోగాతో నడుమునొప్పి నివారణ

– సంపాదకులు


కౌమార బాలికల ఆరోగ్యo

అంతర్జాతీయంగా ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో జరుగుతున్న పెనుమార్పులు, సంక్షోభాలు, సమస్యలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు గాని, ఇతరులు గాని అంతగా పట్టించుకోని కౌమార   బాలికల ఆరోగ్యాన్ని ప్రపంచం కళ్ళముందు ప్రముఖంగా నిలబెట్టాయి.  శరవేగంగా విస్తరిస్తున్న లైంగికవ్యాధులు, నానాటికీ పెరుగుతున్న అవివాహిత తల్లుల సమస్య, కౌమార గర్భాలు, ప్రసవాల కారణంగా  అధిక సంఖ్యలో జరుగుతున్న మాతా శిశు మరణాలు, అతి దారుణంగా జరుగుతున్న  లైంగిక అత్యాచారాలు, కౌమార బాలికల ఆరోగ్యాన్ని ఒక అత్యవసర ప్రాధాన్యతాంశంగా పరిగణించి, శ్రద్ధ చూపవలసిన  అవసరాన్ని నిరూపిస్తున్నాయి.

కౌమార బాలికలకు తమ శరీరాల గురించి, తమ పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం గురించి ప్రాధమిక పరిజ్ఞానం లేదు.  ఆడ పిల్లలు సెక్స్‌ గురించి మాట్లాడటమే తప్పుగా భావించే సమాజ సంస్కృతి,

తల్లిదండ్రులు, ఉపాధ్యాయినులు, ఇతర వ్యవస్థలు, వ్యక్తుల ద్వారా ప్రామాణిక సమాచారం అందని పరిస్థితిలో కౌమార బాలికలు స్నేహితుల మీద, అనేక అవాస్తవాలు, అభూత కల్పనలు, ‘సెక్స్‌ స్వేచ్ఛ’  తప్పు కాదనే సూచనలిస్తూ, లైంగికంగా ప్రేరేపించే దృశ్యాల్ని పదే పదే చూపిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా మీద ఆధారపడుతున్నారు. ఇది వారు జీవిత పర్యంతం అనుభవించే నష్టాలకు లోనయేందుకు  దారితీస్తుంది.  దీనిని నివారించడానికి ఒక ఉద్యమస్థాయిలో ప్రయత్నం జరగవలసిన అవసరం వుంది. క్షేత్రస్థాయిలో కౌమార బాలికలకు తమ పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం గురించి ప్రామాణిక సమాచారం  అందజేయవలసి వుంది.

కౌమారదశ – వివిధ మార్పులు

ఏ బరువూ, బాధ్యతలూ లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరిగే బాలబాలికలు పెద్దలుగా మారే మధ్యస్థితి కౌమారదశ. పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి

చెందుతూ, కొత్త సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ, కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ ఇది. ఈ మార్పులన్నీ క్రమేపీ జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10-19 సంవత్సరాల మధ్య వయసును  ‘కౌమారదశ’గా నిర్వచించింది. కౌమార బాలలు ప్రపంచ జనాభాలో 20శాతం వున్నారు. వీరిలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో వున్నారు.

యవ్వన ప్రారంభం :

యవ్వన ప్రారంభంలో మెదడులోని ”హైపొధాలమస్‌”  పిట్యూటరీ గ్రంధిలో ముందు భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఈ

ప్రేరణతో పిట్యూటరీ గ్రంధి బాలలు పొడవుగా ఎదగడానికి కారణమైన ”గ్రోత్‌ హోర్మోన్‌”తో పాటు

ఇతర హార్మోనుల్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అందులో ”ఫాలికిల్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌”, కొంచెం తరువాత

ఉత్పత్తి అయే ”లూటినైజింగ్‌ హార్మోన్‌” అండాశయాల మీద పనిచేస్తాయి. ఫాలికిల్‌ స్టిములేటింగ్‌

హార్మోన్‌ ప్రభావంతో అండాశయాలలోని ఫాలికిల్స్‌ ”ఈస్ట్రోజన్‌” అను స్త్రీ సెక్స్‌ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి.

తరువాత లూటినైజింగ్‌ హార్మోన్‌ ప్రభావంతో ”ప్రొజెస్టరాన్‌” అను మరో స్త్రీ సెక్స్‌ హార్మోన్‌ని

కూడాఉత్పత్తి చేస్తాయి.యవ్వనదశలో వేగంగా జరిగే అనేక శారీరక, మానసిక, భావోద్వేగ, మేధోపరమైన

మార్పులకు స్త్రీ హార్మోన్లే కారణం. ఈ మార్పులన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి.

కౌమారదశలో బాలికలో జరిగే వివిధ మార్పులు

శారీరక మార్పులు:

1.     వేగంగా పొడవు, బరువు పెరుగుదల- 10-19 సంవత్సరాల మధ్య సగటున

24 సెం.మీ. పొడవు, 21 కిలోల బరువు పెరుగుతారు.

2.     రొమ్ముల పెరుగుదల.

3.     బాలికల భుజాలతో పాటు నడుము క్రింది భాగం వెడల్పుగా అవుతుంది.  కండరాలు పెరుగుతాయి.

క్రొవ్వు పేరుకుంటుంది. పిరుదులలో క్రొవ్వు చేరి గుండ్రంగా అవుతాయి.

4.     మానంపై, చంకల్లో వెంట్రుకల పెరుగుదల.

6.    చంకల్లో స్వేదగ్రంధుల (అపొక్రైన్‌ గ్రంథులు) పెరుగుదల వుంటాయి.

7.     కొన్ని చోట్ల, ముఖ్యంగా మానం మీద, కళ్ళు, మూతి, రొమ్ముమొనల చుట్టూ, పొత్తికడుపు మధ్యలో

నిలువుగా చర్మం నల్లబడుతుంది.

8.     చర్మంలో నిగారింపు, మెరుపు ఏర్పడుతుంది. ముఖం జిడ్డుగా వుండడం, మొటిమలు రావడం         జరుగుతుంది.

9.     పునరుత్పత్తి అవయవాల పెరుగుదల వుంటాయి.

10.    బాలికలు రజస్వల అవుతారు.

11.    అండాశయం సైజు పెరుగుతుంది. ఫాలికిల్స్‌ పెరిగి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అండం

పెరిగి, పరిణతి చెంది, విడుదల అవుతుంది.

12.    అండవాహికలు కూడా యవ్వనదశలో పూర్తి స్థాయికి ఎదుగుతాయి. అండవాహిక గోడలు, లోపలి

తలంలోని శైలికలు, పొత్తి కడుపులో తెరుచుకునే వేళ్ళలాంటి ”ఫింబ్రియా” లోపలి

రసాయన వాతావరణం, హార్మోన్ల ప్రభావంతో అండం అండవాహికలోకి చేరడానికి, ఫలదీకరణ తరువాత

సంయుక్త బీజకణం గర్భాశయంలోకి చేరడానికి, వీర్యకణాలు అండాన్ని చేరడానికి అనువుగా

వుంటాయి.

మానసిక మార్పులు

సంక్షోభం :

కౌమార బాలికలు తమ శరీరంలో జరిగే మార్పుల్ని, భావోద్వేగపరమైన మార్పుల్ని, పెల్లుబుకుతున్న లైంగిక

స్పందనల్ని కూడా తట్టుకోవాలి. శారీరక మార్పులు భావోద్వేగపరమైన ఒత్తిడిని, అలసటను,

అకస్మాత్తుగా, వేగంగా జరిగే మూడ్‌ మార్పుల్ని కలగజేస్తాయి. చిరాకు, భయం, ఆందోళన, స్థిమితం లేకపోవడం

మొదలైన లక్షణాలు కనపడతాయి. చిన్న విషయాలకు, అప్రధానమైన అంశాలకు

భావోద్వేగపరంగా చలించి పోవడం ఈ వయసువారి లక్షణం.

అలంకరణపై శ్రద్ధ :

తన మీద శ్రద్ద పెరుగుతుంది. ఫ్యాషన్‌ దుస్తులు, మ్యాచింగ్‌ నగలు, బొట్లు, గాజులు, జోళ్ళు, పువ్వులు, సెంట్లు,

శిరోజాలంకరణ పట్ల మోజు పెరుగుతుంది.

స్వంతగుర్తింపు కోసం అన్వేషణ :

1.ఒంటరిగా ఉండడానికి, తన ఊహల్లో తాను గడపడానికి ఇష్టపడుతుంది.

2. ఇక తను చిన్నపిల్లనేమీ కాదని, పెద్దదాన్ని అయానని, ఇతరుల మాటలు వినాల్సిన

పనిలేదని, స్వంత నిర్ణయాలు తీసుకోగలనని అనుకుంటుంది.3.తల్లితో కంటే తన వయసే వున్న

స్నేహితురాలితోనో లేక తనకంటే పెద్ద వయసు స్త్రీ వేరెవరితోనో మనసు విప్పి తన భావాల్ని

పంచుకుంటుంది. 4.ఇంట్లోవారితో కంటే స్నేహితురాళ్లతో గడపడానికి ఇష్టపడుతుంది. 5.ప్రేమ కథలు,

సినిమాలు, టి.వి. పట్ల ఆకర్షణ పెరుగుతుంది.

6. తనను అందరూ గుర్తించాలనుకుంటుంది. సొంత గది, వస్తువులు, డబ్బు కావాలను కుంటుంది.

7.తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారి మాటను లెక్కచెయ్యక పోవడం

జరుగుతుంది. 8.చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గి, కొంతమంది దురలవాట్లకు లోనయ్యే ప్రమాదం వుంది.

గ్రహణశక్తి అభివృద్ధి :

11-12 సంవత్సరాల వయసులో పిల్లల గ్రహణ శక్తి అభివృద్ధి చివరి దశకు చేరుకుంటుంది. వారు లోతుగా

ఆలోచించగలుగుతారు. ఒక అంశాన్ని పద్ధతి ప్రకారం అంచనా వెయ్యగులుగుతారు.

నిబంధనలకూ, ప్రవర్తనలకూ మధ్య వున్న తేడాను ప్రశ్నించగలుగుతారు. ఇది ”జనరేషన్‌ గేప్‌”కి మూల

కారణాల్లో ఒకటి.

సాంఘిక మార్పులు:

సాంఘికంగా కౌమారబాలలు ఇతరులపై ఆధారపడడం మాని స్వతంత్రంగా వ్యవహరిస్తారు. లైంగికతను

సమన్వయపరచుకో గలుగుతారు. కొన్ని నైపుణ్యాలను నేర్చుకుంటారు. కొంత వయసు పెరిగాక

స్నేహితులతో సంబంధాలలో మార్పులు వస్తాయి. పెద్ద పెద్ద గ్రూపులతో తిరగడం మాని స్థిరంగా వుండే

తక్కువమంది స్నేహితురాళ్ళతో స్నేహాన్ని పెంచుకుంటారు.

లైంగిక స్పందనలు:

హార్మోన్స్‌లో మార్పులు లైంగిక ఆలోచనల్ని కలగజేస్తాయి. మొదట ఇవి ”హోమో సెక్సువల్‌”గా వుంటాయి.

బాలిక తనకంటే పెద్దది, తనకు నచ్చిన స్త్రీల పట్ల విపరీతమైన ఇష్టం, ఆరాధనాభావం పెంచుకుంటుంది. తనకంటే

పై క్లాసులో వున్న బాలిక పట్ల లేక టీచర్‌ పట్ల లేక ఎవరైనా తెలిసిన స్త్రీ పట్ల ఇలా ఆరాధనను పెంచుకుంటుంది.

తరువాత లైంగిక స్పందనలు ”హెటిరోసెక్సువల్‌”గా మారతాయి. అమ్మాయిలకు అబ్బాయిలపట్ల ఆకర్షణ,

వారితో కలిసి తిరగాలని, మాట్లాడాలనే కోరికకు దారితీస్తుంది. కాని సామాజిక నియమాలు  అందుకు

అడ్డుపడతాయి.

డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

వచ్చే సంచికలో – స్త్రీల ప్రత్యుత్పత్తి అవయవాలు-నిర్మాణం,విధులు

వ్యాసాలు, Permalink

One Response to కౌమార బాలికల ఆరోగ్యo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో