సంపాదకీయం జూన్ నెల – అరసిశ్రీ

హర్యానాకు చెందిన 26 ఏళ్ల యువతి భారత సైన్యంలోని మొదటి మహిళా పోరాట ఏవియేటర్‌గా అవతరించింది ఆమె కెప్టెన్ అభిలాషా బరాక్‌. 

అభిలాష బరాక్‌కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్‌ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్‌లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది.

కెప్టెన్ బరాక్ సనావర్‌లోని లారెన్స్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఆమె 2016లో ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి టెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎస్ లోని డెలాయిట్‌లో చేరారు.

ఈ సందర్భంగా అభిలాషా బరాక్ మాట్లాడుతూ…. “మిలటరీ కంటోన్మెంట్స్‌లో యూనిఫాంలో ఉన్న వ్యక్తులతో చుట్టుముట్టబడినప్పుడు, ఇది ఎల్లప్పుడూ సాధారణ వ్యవహారంలా అనిపించింది. 2011లో మా నాన్న పదవీ విరమణ తర్వాత, మా కుటుంబం మిలటరీ జీవితం నుండి వైదొలిగే వరకు నేనెప్పుడూ దానిని గ్రహించలేదు. 2013లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మా అన్నయ్య పాసింగ్ అవుట్ పరేడ్ చూసిన తర్వాత నాలో బలమైన కోరిక కలిగింది అంటారామె. దిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్శిటీలో బీటెక్‌ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కాప్స్‌’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్‌ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది.

ఆర్మీ ఏవియేషన్‌కి దరఖాస్తు చేేసుకునేప్పటికి యుద్ధ విభాగాల్లోకి అమ్మాయిలకు అనుమతి లేదు. అయినా కొన్ని ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన తర్వాత మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యారు అభిలాష . ఎప్పటికైనా అమ్మాయిలకీ యుద్ధంలో పాల్గొనే అవకాశమొస్తుందన్నదనే నమ్మకం ఆమెది. అనుకున్నట్టుగానే వచ్చింది. దాన్ని గట్టిగా ప్రయత్నించి నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నుంచి విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొని తొలి యుద్ధ పైలట్‌ అయ్యారు. జూన్‌ 2022లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ తన మొదటి బ్యాచ్‌ మహిళా క్యాడెట్‌లను చేర్చుకోబోతున్న తరుణంలో అభిలాష బరాక్‌ సైన్యంలో మొదటి మహిళా పోరాట ఏవియేటర్‌ అయ్యారు.

‘ఇండియన్‌ ఆర్మీ ఏవియేషన్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్‌ ఏవియేషన్‌ కోర్స్‌ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్‌ అభిలాష ఇండియన్‌ ఆర్మీ ఫస్ట్‌ ఉమన్‌ కంబాట్‌ ఏవియేటర్‌…’ అని ఆర్మీ తన అధికార ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ తెలియజేయడం గర్వించదగ్గ విషయం.

 

-అరసిశ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సంపాదకీయం, , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో