ఆమె(కవిత )- గిరిప్రసాద్ చెలమల్లు

ఆమె ప్రాణం
గర్భంలో
ప్రశ్నయి మొలుస్తుంది

ఆమె గర్భంలో
ఆమె ప్రత్యుత్పత్తి
సమాజ ఛేదనలో
విలవిల లాడుతుంది

ఆమె అతడు
కలయిక
మనో వికాసం
మానవ వికాసం ల
హేతువు

ఆమెపై
అతడి దురాక్రమణ
అతడికి
ఆమె అవసరాన్ని
గుర్తించలేని గుడ్డితనం
పురుషాధిక్య ముసుగు తొడుక్కుని
చీకటిలో భ్రమణం

ఎక్స్ ఎక్స్ ఆమె
ఎక్స్ వై అతడు
ఎక్స్ ఆమెలో
ఎక్స్ వై అతడిలో
మరి ఆమె జననం
అతడి వై పై ఎక్స్ గెలుపుతోనే
ఎరుగని
రుచించని
జీర్ణించుకోలేని అతడి
బరితెగింపు
ఆమె పుట్టుక ప్రశ్నగా

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.