హలో ..డాక్టర్ ! – గర్భిణి – గుండె, శ్వాస సంబంధిత వ్యాధులు

గర్భిణి స్త్రీకి గుండె సంబంధమైన వ్యాధులున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? – చరిష్మ ,నంద్యాల

                గుండె, ఊపిరితిత్తులు, హార్మోన్‌ సంబంధమైన వ్యాధుల వల్ల గర్భిణికి అనేక సమస్యలు రావచ్చు.  తల్లిమీద, పుట్టబోయే బిడ్డమీద ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది.  గర్భం సమయంలో స్త్రీ శరీరంలో సహజంగా జరిగే మార్పులు వ్యాధి నిర్ధారణను కష్టతరం చేస్తాయి.  భిన్న వైద్య విభాగాల నిపుణులు, సమర్ధమైన చికిత్సనందించగల రిఫరల్‌ సెంటర్‌ ఉంటే వీరికి మెరుగైన సంరక్షణ లభించి ప్రమాదం నుండి తప్పించుకుంటారు.  వ్యాధి గర్భం రాకముందునుండి ఉండొచ్చు లేక గర్భం సమయంలో మొట్టమొదటిసారి రావచ్చు.  కాని తొలిదశ లోనే వ్యాధిని గుర్తించడం చికిత్సకు కీలకం.

              గర్భిణికి గుండె వ్యాధి మామూలుగా గర్భం సమయంలో గుండె, రక్తప్రసరణ వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతాయి.  రక్తం పరిమాణం, నాడివేగం, గుండె పంప్‌ చేసే రక్తం పరిమాణం,- వీటి పరంగా అనేక మార్పులు జరుగుతాయి.  గర్భం సమయంలో గుండెకు ఎక్కువ రక్తం చేరుకుంటుంది.  గుండె వ్యాధి ఉన్న స్త్రీ సహజంగా జరిగే ఈ మార్పుకు తట్టుకోలేదు.  గుండెకు శ్రమ పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది.  గర్భం సమయంలో వేరే ఏ తేడా వచ్చినా అది గుండె జబ్బును ఇంకా తీవ్రం చేస్తుంది.ప్రసూతి నిపుణులు, గుండె వ్యాధి నిపుణులు, మత్తు మందుల నిపుణుల సంప్రదింపుతో చికిత్స జరగాలి.  వారు ఎక్కువ ప్రమాదం ఉన్న అంశాల్ని గుర్తించాలి.  రాగల సమస్యల్ని అంచనా వెయ్యాలి, గర్భం, ప్రసవం, ప్రసవం తరువాత వచ్చే సమస్యలకు తగిన చికిత్స చెయ్యాలి.

                      హాస్పటల్లో ప్రసవించే స్త్రీలలో 1 శాతం కంటే తక్కువమందికి గుండె వ్యాధి ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకంటే రుమాటిక్‌ గుండె వ్యాధితో బాధపడే వారే ఎక్కువ ఉంటారు.  కాని మెరుగైన చికిత్స, సంరక్షణ వల్ల ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతూంది.

గర్భం మీద గుండె వ్యాధి ప్రభావం :

* నెలలు నిండక మునుపు ప్రసవం

* బిడ్డ ఎదుగుదల మందగించడం

* పుట్టిన బిడ్డకు అనారోగ్యాలు, మరణించడం

గుండె వ్యాధిపై గర్భం ప్రభావం

* గర్భం కారణంగా గుండె వ్యాధి వున్న స్త్రీకి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రావచ్చు, మరణించవచ్చు. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకంటే రుమాటిక్‌ గుండెవ్యాధి తక్కువ ప్రమాదకరం.

గుండె వ్యాధి రోగుల విభజన :

మొదటి తరగతి : రోగులు తమ పనుల్ని మామూలుగా చేసుకోగలుగుతారు.

రెండవ తరగతి : ఏ పనీ చెయ్యకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు సౌకర్యంగానే ఉంటుంది.  మామూలుగా చేసే       పనుల్ని చేసినప్పటికి అసౌకర్యంగా ఉంటుంది.

మూడవ తరగతి : మామూలుకంటే తక్కువ శ్రమతో కూడిన పనుల్ని చేస్తున్నప్పటికి రోగికి చాలా అసౌకర్యం కలుగుతుంది.

నాలుగవ తరగతి :అసౌకర్యం లేకుండా ఏ చిన్న పనినీ రోగి చెయ్యలేదు.

లక్షణాలు :

*మెడలోని రక్తనాళాలు పొంగి ప్రస్ఫుటంగా కనపడతాయి, రక్తనాళాలు కొట్టుకోవడం కూడా కనిపిస్తుంది.  గుండె  సక్రమంగా కొట్టుకోనప్పుడు ఈ రక్తనాళాల స్పందన కూడా సక్రమంగా ఉండదు.

* హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలు కనిపించవచ్చు.

* ఛాతీకి ఎక్స్‌రే, ఇ.సి.జి, ఎకోకార్డియోగ్రఫీతో వ్యాధిని నిర్ధారించవచ్చు.  గర్భం వల్ల రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌

        ఎక్కువవదు. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి గర్భం వలన ప్రమాదకరంగా మారుతుంది.

సంరక్షణ :

గుండె వ్యాధి ఉన్న గర్భిణికి ప్రసూతి నిపుణులు, గుండె వ్యాధి నిపుణులు సంయుక్తంగా చికిత్స చెయ్యాలి.

మామూలు కంటే తరచుగా పరీక్ష చెయ్యాలి.

గర్భంతో ఉన్నప్పుడు :

* ప్రతిసారి గర్భవతి ప్రసూతి వ్యాధి నిపుణురాలికి, గుండె వ్యాధి నిపుణునికి చూపించుకుంటే హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలేమైనా

వున్నాయోమో అంచనా వేసి చికిత్స చేస్తారు. ప్రతిసారి బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో అంచనా వేస్తారు.

* ఊపిరితిత్తులకు, పళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్‌ వల్ల కలగగల ప్రమాదం గురించి రోగికి హెచ్చరిక చెయ్యాలి.

* రక్తహీనత ఉంటే రక్తవృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఇనుమును, ఫోలిక్‌ ఏసిడ్‌ని ఇవ్యాలి.

* రోగి మధ్యాహ్నం కనీసం రెండు గంటలు, రాత్రి 9 గంటలు కాళ్ళక్రింద తలగడలు పెట్టుకుని ప్రక్కకు తిరిగి పడుకోవాలి.

* బరువు ఎక్కువ పెరగగూడదు.

* మాంసకృత్తులు ఎక్కువగా వున్న ఆహారాన్ని తీసుకుని పిండి పదార్ధాల్ని తగ్గించాలి.

*ఆయాసం ఉంటే, లేక గుండె సక్రమంగా కొట్టుకోకపోతే దాని కారణాన్ని జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోవాలి.

* రొంప, దగ్గు, జ్వరం వస్తే వెంటనే హాస్పటల్లో చేరాలి.
* కాళ్ళకు నీరు పడితే వెంటనే హాస్పటల్లో చేరితే మంచిది.
గర్భస్రావం చెయ్యడం :
సామాన్యంగా గర్భస్రావం చేయించుకోమని సలహానివ్వరు.  కాని ఆపరేషన్‌ సాధ్యపడని గుండె వ్యాధులు, ఇతర ప్రమాదకర గుండె వ్యాధులు ఉన్నప్పుడు గర్భస్రావం చెయ్యవలసిరావచ్చు.  8 వారాలలోపే సామాన్యంగా గర్భస్రావాన్ని చేస్తారు.
గుండెకు ఆపరేషన్‌ :
గర్భం సమయంలో గుండె వ్యాధికి ఆపరేషన్‌ చెయ్యడానికి నిషేధం లేదు, కాని ప్రసవమయే దాకా వాయిదా చెయ్యడం మంచిది.హాస్పటల్లో చేరడం :
గర్భం సమయంలో హాస్పటల్లో చేర్చి సంరక్షించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, కాని అందర్నీ చేర్చవలసిన అవసరం ఉండదు.  ఇన్ఫెక్షన్‌, రక్తహీనత, గుండె సక్రమంగా కొట్టుకోకపోవడం మొదలైన ప్రమాదకర అంశాలు ఉన్నప్పుడు త్వరగా హాస్పటల్లో చేర్చాలి.  ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌తో సహా అన్ని సదుపాయాలు ఉన్న హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో ప్రసూతి నిపుణులు, గుండె వ్యాధి నిపుణులు సంయుక్తంగా చికిత్స చెయ్యాలి.
ప్రసవ సమయంలో సంరక్షణ :
* గుండె వ్యాధి ఉన్న గర్భిణులు సాధారణంగా సహజంగా ప్రసవిస్తారు. ప్రసవం ప్రారంభమవడానికి సాధారణంగా        మందుల్ని ఇవ్వవలసిన అవసరం అంతగా కలగదు.
* ప్రసవం ప్రారంభమవడానికి ఉమ్మనీటి పొరను పగలగొట్టకూడదు.  దీనివలన ఇన్ఫెక్షన్‌ ప్రమాదం ఉంటుంది.
* ప్రసవం ప్రారంభమయాక ఏంటీబయాటిక్‌ని ఇవ్వాలి.
* ఒకవేళ ఇంట్రావీనస్‌ ఫ్లూయిడ్స్‌ని ఇస్తే గుండెమీద భారం పడకుండా చాలా పరిమితంగా, నెమ్మదిగా ఇవ్వాలి.   నొప్పి తెలియకుండానూ, రక్తపోటు తగ్గకుండానూ చర్యలు తీసుకోవాలి.
* ఎకోకార్డియోగ్రఫీ చేస్తూ రోగిని సన్నిహితంగా, నిశితంగా గమనించాలి.
* ప్రసవ నొప్పుల్ని నియంత్రించాలి.
*బిడ్డ బాగా క్రిందకు దిగాక ఎక్కువసేపు ముక్కకుండా బిడ్డ త్వరగా బయటపడేలా చెయ్యాలి.
* ఒకవేళ జననమార్గం ఇరుకుగా వుంది అనిపిస్తే సిజేరియన్‌ చెయ్యాలి.  హార్ట్‌ ఫెయిల్యూర్‌ ఉన్నప్పుడు సిజేరియన్‌  చెయ్యడం ప్రమాదకరంగా పరిణమించవచ్చు.
* బిడ్డ బయటకు వచ్చాక రక్తస్రావం ఎక్కువగా అవకుండా అరికట్టడానికి మామూలుగా ఇచ్చే ఎర్గోమెట్రిన్‌ని ఇవ్వకూడదు.
* ప్రసవమయాక 5 – 10 రోజులదాకా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. హార్ట్‌ ఫెయిల్యూర్‌ లేకపోతే బిడ్డకు పాలివ్వవచ్చు.
* ఇద్దరు పిల్లలు వున్న స్త్రీకి ‘ట్యుబెక్టమీ’ ఆపరేషన్‌ చెయ్యడం మంచిది. ఒక బిడ్డ తరువాత త్వరగా గర్భం  రాకుండా   ‘కాపర్‌ – టి’ లూప్‌ని పెట్టవచ్చు.

 – డా. ఆలూరి విజయలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో