అరణ్యం 2 – చింతామణి – వీణావాణి దేవనపల్లి
పొద్దున గమనించినప్పుడు చిన్నపీటలాంటి మొట్టు ఒకటి బయట కనిపించింది.అడిగితే సర్వాయి సౌత్ బీటులో తెచ్చామని ,అలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అది ఉత్తమొట్టు కాదు, శిలగామారిన మొట్టు. శిలాజంగా మారిన మొట్టు. అది యేచెట్టుదో మనం గుర్తించలేము.వాటిని పరిశోధించడానికి ప్రత్యేక సంస్థలున్నాయి. అయితే నాకు తెలిసి వీటిమీద పరిశోధనైతే జరగలేదు.ఔత్సాహికులద్వారా తెలిసిన విషయాలే.ఈశిలాజాలు … Continue reading →
జ్ఞాపకం 93 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
ఉదయాన్నే రెడీ అయి “నేను మా ఆదిపురికి వెళ్తున్నా!” అని భర్తతో చెప్పింది సంలేఖ. “అమ్మతో చెప్పావా?” అన్నాడే కానీ ‘ఎందుకెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?’ అని అడగలేదు. ఆమె మనసంతా బరువుగా అయింది. “అత్తయ్యతో చెప్పాను. వెళ్లమంది” అంది. “అంతేనా! ఇంకేమైనా అన్నదా?” అడిగాడు. “మీ రాజారాం అన్నయ్య జాబ్ కి వెళ్తున్నాడుకదా! సామాన్ల డబ్బులు అడిగి … Continue reading →
కవయిత్రి ,హిందీ ఉపాధ్యాయురాలు ,బొంబాయిలో స్త్రీ సమాజ శిక్షణ పొందిన జాతీయోద్యమ నేత –శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్
పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా అత్తిలి గ్రామం లో శ్రీ వంగల వాసుదేవుడు ,శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు సత్యవతమ్మ 15-6-1893న అయిదుగురు సోదరుల తర్వాత జన్మించింది .గారాబంగా పెరిగింది.చిన్నతనంలోనే పెళ్ళి, వెంటనే వైధవ్యం జరిగిపోయాయి .రాజమండ్రిలో మాధ్యమిక విద్య మాత్రమె చదివి స్కూల్ మానేసింది .తల్లి అన్నీ తానె అయి ,ఉత్తమ సాహిత్యం నేర్పి కూతుర్ని తీర్చిదిద్దింది … Continue reading →
అరణ్యం 2 – మధుఖండం – వీణావాణి దేవనపల్లి
నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు కనీస నీటిసదుపాయంకల్పించే నిమిత్తం చిన్నచిన్న నీటికుంటలు ఏర్పాటుచేసి, దానికి అనుసంధానంగా సూర్యచ్చక్తితో నడిచే మోటర్లను ఏర్పాటు చేసింది.ఇది ముందే నిర్ణయించిన కాలానికి తగిన విధంగా సూర్యరశ్మి ఉన్నంతవరకు … Continue reading →
జ్ఞాపకం 92 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“మీరు నన్ను కావాలనే కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతయినా రైటర్ కదా!” అంది ఎగతాళిగా చూస్తూ. ఆ అమ్మాయికి కొద్దికొద్దిగా ఓడిపోతున్నానేమో నన్న అనుమానం వున్నా సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం చావటం లేదు. సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ “నీకు భేతాళుని కథ కావాలి. అంతేనా?” అంది. “అంతే! కానీ మీకు తెలియదని … Continue reading →
సంఘ సేవా ధురీణ –శ్రీమతి తలారి చంద్రమతీ దేవి – మహిళా మణులు – గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీమతి చంద్రమతీ దేవి 6-6-1903 న శ్రీ తాడి చంచయ్య నాయుడు ,శ్రీమతి వెంకమాంబ దంపతులకు చిన్న కూతురుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించింది .ఆరవ ఏటనే వివాహం జరిగి ,,ఆరునెలలకే వైధవ్యం పొందిన దురదృష్ట వంతురాలు .అలాంటి స్థితి తమ చిన్న కూతురికి జరగటం జీర్ణించు కోలేక పోయిన తలిదండ్రులు ,ఆమె వైపు కన్నెత్తి చూడటానికే భయపడ్డారు … Continue reading →
అరణ్యం 2 – అభంగలీల – వీణావాణి దేవనపల్లి
కొత్త చిగురుతొడిగే చైత్రమాసంలో నిట్టనిలువు జపంచేస్తున్న దారువుల మధ్యనుంచి పాపటి చీలికలాంటి దారి మీద వెళ్తుంటే వేడి గాలి చెవులను విసిరి కొట్టిన క్షణం ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఈ ప్రయాణంలో పక్కన ఉన్న ఇతర ప్రాంతాలతో అభయారణ్యపు గంభీరత్వాన్ని సులభంగా పోల్చుకోవచ్చు. గాలి పోకడ ములుగు ప్రాంతం దాటే వరకు ఒకలాగా తాడ్వాయినుంచి ఒకలాగా … Continue reading →