Tag Archives: ధారావాహికలు

బోయ్‌ ఫ్రెండ్‌ – 41 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”నన్ను స్టేషన్‌లో దిగబెట్టరు . నాకు ఇంకొక అరగంటలో ట్రైయిన్  వుంది.” అదేమి ఈ రోజే వెళ్ళిపోతావా?” అలా అనేసి అలా అడగడం ఎంత అసందర్భమో తలచుకుని … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , | Comments Off on బోయ్‌ ఫ్రెండ్‌ – 41 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

విహంగ మార్చి 2015 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780   సంపాదకీయం – హేమలత పుట్ల కథలు వ్యసనం – నల్లూరి రుక్మిణి ఆమె ప్రియుడు – మేక్సిమ్ గోర్కీ అనువాదం-శివలక్ష్మి కవితలు పసి తుమ్మెదల్లా …- కుప్పిలి … Continue reading

Posted in సంచికలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , | Comments Off on విహంగ మార్చి 2015 సంచికకి స్వాగతం !

విహంగ డిసెంబర్ 2014 సంచికకి స్వాగతం !

ISSN 2278-4780 సంపాదకీయం – హేమలత పుట్ల కథలు చరితవిరాట్ పర్వం  – విజయ భాను కోటే ఓడిపోలేదోయ్..– పోడూరి కృష్ణ కుమారి కవితలు తిమిరంతో సమరం– … Continue reading

Posted in సంచికలు | Tagged , , , , , , , , , , , , | Comments Off on విహంగ డిసెంబర్ 2014 సంచికకి స్వాగతం !

ఎనిమిదో అడుగు – 20

ఆలోచిస్తున్నాడు, బహుశా ఏ తండ్రి అయినా తనలాగే ఆలోచిస్తాడేమో! ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దానితో ఇంటా, బయటా ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

ముకుతాడు – 17

“ ఎందుకు?” మరో ప్రశ్న. “ఇవాళ నేను మీ నాన్న ఒక్కడినే చూడాలి. ఈ రోజు విషయం మొత్తం నీకు అర్ధం అవుతుంది. ఫ్లైట్  ఖచ్చితంగా ఎప్పుడు … Continue reading

Posted in Uncategorized | Tagged | Comments Off on ముకుతాడు – 17

బెంగుళూరు నాగరత్నమ్మ

 పుట్టిన నాడే నిజభక్తిని మెడఁ గట్టి         గుట్టు చెదరక చెయిపట్టి విడువరాదు ||         (త్యాగరాజ కృతి: ”పట్టి విడువరాదు”, మంజరి రాగం, ఆదితాళం)1         దేవదాసీ కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టుక ఒక పండగే. పాండవుల చరిత్రతో సంబంధం వున్న ప్రాచీన గ్రామం హగ్గడే దేవన్న కోట.2 ఆవూళ్ళోని పుట్ట లక్ష్మీఅమ్మాళ్ వైష్ణవి ఇంట్లోనూ అదే పండగ.3 1878 నవంబరు 3న ఆవిడకి కూతురు పుట్టింది. భారతీయ పంచాంగం ప్రకారం అది బహుధాన్య సంవత్సరం, కార్తీకమాసం (నవంబరు, డిసెంబరు), శుక్లపక్షం నవమి4  స్రవిష్ట నక్షత్రసమూహం ఉచ్ఛథలో వుండగా పుట్టిన ఆడపిల్ల అదృష్ట జాతకురాలు. గొప్ప కీర్తినీ సంపదనీ పొందుతుంది.         నంజనగూడ శ్రీ కంఠేశ్వరాలయంలో దేవదాసి పుట్ట లక్ష్మి. దేవదాసి కూతురే అయినా తల్లిపేరు తెలియక పోవడం ఆశ్చర్యం. ఆమె తండ్రి సుబ్బన్న మైసూరులో సంపన్న బ్రాహ్మణుడు.5 దేవాలయ ఆదాయం చాలక పోవడం వల్ల లక్ష్మి మైసూరులో వకీలు సుబ్బారావు ఔదార్యం మిద ఆధారపడ వలసి వచ్చింది.6         నాగరత్నానికి ఏడాదిన్నర వయసులో లక్ష్మి సుబ్బారావుతో విడిపోయింది.7 తల్లీ కూతుళ్ళని కొట్టి, వాళ్ళ సామగ్రి అంతా తీసుకుని వీధిలోకి ఈడ్చేశారు.8 అదిచాలా బాధాకర విషయం. మళ్ళా మరో పోషకుడిని వెతుక్కోవలసిన పరిస్థితి.         మైసూరు సంస్థానం కళలకి కాణాచి. పాలించిన వారందరూ కళాకారుల్ని ప్రోత్సహించడంతో వారుబాగా వర్ధిల్లారు. 1799లో టిప్పుసుల్తాన్‌ మరణానంతరం ఒడయార్లు పాలకులయ్యారు. వారు అసంఖ్యాకంగా దేవాలయాలు నిర్మించారు. శిధిలాలయాలని పునరుద్ధరించారు. తమ అధీనంలో వున్న ఆలయాల్లో సంగీతకారులందరూ నిర్ణీత సమయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రత్యేక సందర్భాల్లో సరేసరి. కోటలో అనేకమంది వివిధ కళాకారులు వుండేవారు. రాజోద్యోగుల కోసం నిర్మించిన చామరాజు నగర్‌లోనే వీరందరి బస.9  నాగరత్నం, తల్లి మైసూరు వచ్చేనాటికి పదవ చామరాజ ఒడయార్‌ పాలిస్తున్నాడు. ఈయన 1868లో గద్దె ఎక్కాడు. ఈయన కాలంలో చాలా గొప్ప  సంగీత కారులు ప్రదర్శనలిచ్చేవారు.10  ఈయన స్వయంగా వయొలిన్‌ వాయిద్యంలో నిపుణుడు. ఒక్కొక్కసారి ఆస్థానవైణికుడు శేషన్నతో కలిసీ, గాత్ర విద్యాంసులు చిక్కా సుబ్బారావు, సుబ్బన్నలతో కలిసి వయొలిన్‌ వాయించేవాడు. సంగీతకారులు తమ రచనలెన్నో ఆయనకి  అంకితమిచ్చారు.11  నాటకాలంటే కూడా ఆయనకి ఎక్కువ మక్కువ గనక ఎన్నో నాటక ప్రదర్శనలు జరిగేవి. వాటికోసం శకుంతల నాటక సభ అనే బృందాన్ని మహారాజు ఏర్పరిచాడు. గిరిభట్ట తిమ్మయ్య అనే సంస్కృత పండితుడు సంగీతజ్ఞుడు కూడా.12  ఆయన ఈ నాటకసభలో బోధకుడు. ఈయనకి ‘సంగీత సాహిత్య కవితా విశారద’అనే బిరుదు వుంది.13 రాజాస్థానంలో ఈయనకి మంచి పలుకుబడి వుంది. ఈయన పుట్ట లక్ష్మికి పోషకుడయ్యాడు.         1886 దాకా అంతా బాగానే జరిగింది. గిరిభట్ట తిమ్మయ్యది చాలా పెద్ద కుటుంబం.14  అయినా ఈ తల్లీ కూతుళ్ళ పూర్తి సంరక్షణ భారం తీసుకున్నాడు.పైగా నాగరత్నంకి శిక్షణ కూడా ఇచ్చాడు. ఆమె ఏకసంథాగ్రాహి. అయిదో ఏటి నుంచే సంగీతం, సంస్కృత కావ్యాలు నేర్చుకుంది. వాచకం, సంస్కృత వ్యాకరణాలలో మంచి పునాది వేశాడు తిమ్మయ్య. సంస్కృతానికి పదకోశం లాంటి అమర కోశంలో మూడు భాగాలు చాలా వేగంగా నేర్చేసుకుంది. మరి కొద్ది సంవత్సరాలలోనే  జైమిని భారతం, రాజశేఖర విలాసం, కుమార వ్యాస భారతం ఒప్పజెప్ప గలిగింది.15  మైసూరు యక్షగాన కళాకారుల నాయకుడు విశ్వనాథయ్య.16 అతని కొడుకు బిడారం కృష్ణప్ప, తిమ్మయ్య శిష్యుడే. అతన్ని నాగరత్నంకి సంగీతం నేర్పమన్నాడు.17 ఆమె కన్నడం, తెలుగు, కొంత ఇంగ్లీషు కూడా నేర్చుకుంది.18         నాగరత్నం వేగంగా అన్నీ నేర్చుకుంటున్న సంగతి చూస్తున్న వారికి ఇక తిమ్మయ్య ఆమెకి నేర్పవలసింది ఏమిలేదని అర్ధమయింది. ఆమెతో పాటు నేర్చు కుంటూన్న చంద్రలేఖ చాలా వెనకబడింది. కొందరు ఈర్ష్యతో నాగరత్నం చురుకుదనాన్ని గురించీ తెలివితేటలు గురించి తిమ్మయ్యని భయపెట్ట సాగారు. దాంతో ఆమె పట్ల అతని ఆసక్తి తగ్గిపోయింది. నాగరత్నంకి తొమ్మిదేళ్ళ వయసులోనే తిమ్మయ్య తల్లీ కూతుళ్ళని వదిలేశాడు. మైసూరు వీధుల్లో ఆవుపేడ ఎత్తుకుని బతకమని నాగరత్నాన్ని శాపనార్ధాలు పెట్టాడు.19         ఇది ఇలాగే జరుగుతుందని వూహించిన పుట్ట లక్ష్మి రాబోయేరోజుల గురించి ఆలోచించసాగింది. అంత పలుకుబడి వున్న ఆస్థానకవితో తెగతెంపులైపోయిన ఈమెకి సాయంచేసే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో పరిస్థితి  అగమ్యగోచరమై పోయింది. కాని, మహారాజే తన కూతురిని స్వయంగా ఆహ్వానించేవరకు  ఆ నగరంలో అడుగుపెట్ట గూడదని ప్రతిజ్ఞ చేసింది. తిమ్మయ్య శాపనార్థానికి బదులుగా పేడ ఎత్తుకోమన్న చేతులకే మహారాజు బంగారం గాజులు తొడిగేలా చేస్తానని లక్ష్మి శపథం పట్టింది. అలా జరగనినాడు తనూ, తన కూతురు ప్రాణాలతో మిగలమనుకుంది. ఉన్న కాస్త సొమ్ము తీసుకుని దూరాన వున్న కాంచీపురానికి వెళ్ళారు. ఆ వూళ్ళోవున్న ధనకోటి సోదరీమణులు పుట్టలక్ష్మికి మంచి నేస్తాలు. వాళ్ళలో పెద్దది ధనకోటి అమ్మాళ్‌్‌. ఆమె శిష్యరికంలో కూతురిని పెట్టాలని లక్ష్మి కోరిక.         ధనకోటి వాళ్ళ జాతికే గర్వకారణం. వారి గగన మండలంలో మెరిసే ధ్రువతార. శ్యామశాస్త్రి దగ్గర బంధువు కచిశాస్త్రి దగ్గర ధనకోటి తల్లి సంగీతం నేర్చుకుంది. మెట్టు మిదవున్న కచ్ఛపేశ్వరాలయం దగ్గర్లో పుట్టేరి వీధిలో ధనకోటి సోదరీమణుల అమ్మమ్మ వుండేది. అందుకని ఆమెని అందరూ మెట్టుకామాక్షి అని పిలిచేవారు. ఆమె కూడా పేరు పొందిన కళాకారిణి.         ఆ కుటుంబమంతటిలోకి ధనకోటి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది. చెల్లెలు కామాక్షితో కలిసి  ధనకోటి సోదరీమణులుగా చాలా కచేరీలు చేసింది. శ్యామశాస్త్రి కీర్తనలే కాక అరుణాచల కవి రామనాటకం నుంచి చాలాపాటలు, పులియూర్‌ దొరస్వామి అయ్యర్‌ రచనలు, ముత్తు తాండవనార్‌, సుబ్బరామయ్యర్‌ పదాలు, పళని అండవర్‌ కృతులు,తిరుప్పుగల్‌నుంచి కొన్ని పద్యాలు కూడా ధనకోటి చక్కగా పాడేది. స్త్రీలు రాగం, తానం , పల్లవి, పాడకూడదనే నిబంధనని తోసిపుచ్చి పల్లవి పాడడంలో మెళకువలు నేర్చుకుంది. పల్లవులు పాడిన మొదటి కళాకారిణి ఈమే. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి లాటి తెలుగు ప్రాంతాల్లో  కూడా ఆమెకి చాలామంది అభిమానులున్నారు. ఆమెకి సంతానం లేదు. తన శిష్యులని ప్రేమాభిమానాలతో చూసుకునేది.  చాలామందికి భోజనపానాదులు సమకూర్చేది. జబ్బుపడిన వాళ్ళని ఇంట్లో వుంచి చికిత్స చేయించేది. మరి కొంతకాలానికి ఆమె ఆరోగ్యం చెడిపోయి, జలోదరం వ్యాధి బయటపడింది.         విసిగి వేసారి కాంచీపురం చేరిన పుట్ట లక్ష్మి, నాగరత్నాలకు ధనకోటి ఇల్లు తెలుసుకోవడం పెద్ద ఇబ్బంది కాలేదు. ఎందుకంటే ఆశ్రితులకీ, సంగీతకారులకి అది పుట్టిల్లు లాంటిది. అక్కడ వీళ్ళకి మంచి ఆదరణ లభించింది కాని నిరాశ ఎదురయ్యింది. ఆరోగ్యం క్షీణించడంతో ధనకోటి సంగీత శిక్షణ ఇవ్వడం మానుకుంది. పుట్టలక్ష్మి ఎంత ప్రాధేయపడినా లాభంలేకపోయింది. శ్రీరంగంలో వున్న పెద్ద వయొలిన్‌ విద్వాంసుడి దగ్గరకి వెళ్ళమని ధనకోటి సలహా ఇచ్చింది. కాని అప్పటికి తనదగ్గర సొమ్మంతా అయిపోయింది. పైగా అక్కడికి పోయినా జరుగుబాటు  అవుతుందని నమ్మకంలేదు. అందువల్ల ధనకోటి దగ్గరే మరికొంత కాలముండి బెంగుళూరు వెళ్ళారు తల్లీ కూతుళ్ళు. అక్కడ పుట్ట లక్ష్మి సోదరుడు వెంకటసామప్ప వయొలిన్‌ కళాకారుడు.         భవిష్యత్తులో నాగరత్నమ్మ పేరుతో ముడిపడబోయే బెంగుళూరు పట్టణంలో ఆనాటికి మిలటరీ వాతావరణం వుండేది. అందువల్ల  మైసూరుకి భిన్నంగా ఇక్కడ పాశ్చాత్య వాసనలు ఎక్కువగా వుండేవి. సివిల్‌, మిలటరీ స్టేషన్ల మధ్య పెద్ద పచ్చికబయళ్ళు వుండేవి (తర్వాత అదే కబ్బన్‌ పార్క్‌ అయింది.). … Continue reading

Posted in Uncategorized | Tagged | Comments Off on బెంగుళూరు నాగరత్నమ్మ

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

వయోజన విద్యావ్యాపకురాలు, సంఘసేవిక ‘పద్మశ్రీ’  కుల్సుం సయాని (1900-1987) భారత జాతీయోద్యమం ఉద్యమకారులను బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు మాత్రమే కాకుండా, సమాజ ప్రగతికి ఆటంకం … Continue reading

Posted in Uncategorized | Tagged | Comments Off on భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

ముకుతాడు – 9

“ నేనే మా ఇంట్లో పెద్దను. నేనేది చెబితే అది ఫైనల్.” “ మీకు పిల్లలున్నారుగదా, వాళ్ళ  సంగతి ఏమిటి?” “ అవును. నాకు ముగ్గురు పిల్లలు. కొన్నాళ్ళు … Continue reading

Posted in Uncategorized | Tagged | Comments Off on ముకుతాడు – 9

గౌతమీగంగ

  జుట్టు నున్నగా దువ్వుకొని వెనుక భాగాన కొంచెం వదులుగా ముడివేసి ఆ ముడి చెవి వెనుక కుడివైపున జుట్టులో ముడవడాన్ని కొప్పు పెట్టడం అంటారు. మరికొందరు … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged | 1 Comment

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

 మహిళా కార్యకర్తలచే ఆయుధం ధరింపచేసిన సమరశీలి సుల్తానా హయాత్‌ అన్సారి                            సుదీర్ఘంగా  సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను పరికిస్తే, వలస పాలకులకు వ్యతిరేకంగా ముత్తాత, … Continue reading

Posted in Uncategorized | Tagged | Comments Off on భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు