*’’విహంగ” తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక*
ఇది మహిళా పత్రిక. దీని ఉద్దేశం ఏమిటి? అనే సందేహం పాఠకులకు రావటం లో ఆశ్చర్యం లేదు.
అంతర్జాలం లో తెలుగులో మహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం.
ఉన్న ఒకటి, అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా నుంచి వెబ్ కి తరలించబడ్డవే.
అయినా స్త్రీల సాహిత్య పరిమాణం కొరతగానే ఉన్నందు వల్ల ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం, పత్రికలు అంతర్జాలంలో కాలు మోపాలని మా ప్రగాఢ వాంఛ.
మా ప్రయత్నంగా … పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న…
‘మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ’ సంస్థ ఆధ్వర్యం లో తెలుగు మహిళల భావోద్వేగాలకు వేదిక గా-
‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా 11-11- 11(2011) న అంతర్జాలపు వినువీధుల్లో సగర్వంగా ఎగరేస్తున్నాం.
‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను, అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది.
విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుంది. వైజ్ఞానిక ,మనోవికాసానికి స్వాగతం పలుకుతుంది.
కళాత్మకమైన, భావనాత్మకమైన సంవేదనల్ని తమ సంఘర్షణల్ని అక్షర రూపంలో ప్రకటించే సృజనకారులని ఆహ్వానిస్తుంది. అరమరికలు లేని స్నేహ హస్తాన్ని అందిస్తుంది.
వ్యవస్థాపకులు :
డా.హేమలత పుట్ల
సంపాదకులు:
మానస ఎండ్లూరి
సహ సంపాదకులు :
డా.అరసి శ్రీ
సహ సంపాదక వర్గం:
ఆచార్య కాత్యాయనీ విద్మహే, విశ్రాంత ఆచార్యులు
ఆచార్య కొలకలూరి ఆశా జ్యోతి , బెంగళూరు విశ్వవిద్యాలయం
ఆచార్య చల్లపల్లి స్వరూప రాణి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
డా.సవరం జ్యోత్స్న రాణి , సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ .
సహాయ సహకారాలు :
కట్టూరి వెంకటేశ్వర రావు ఏం.ఎ , ఏం.ఫిల్
డా. తాటికాయల భోజన్న ఏం.ఎ, ఏం.ఫిల్ , పి హెచ్ .డి
******************************************************************************************************
46 Responses to మా గురించి