నర్తన కేళి – 11

మనం ఎవరికి బోధిస్తున్నామో వాళ్ల స్థాయికి దిగి చెబితేగాని అది వారికి అర్ధం కాదు అనేది నా భావన . చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు వాళ్ల స్థాయిలోనే చెప్పాలి . ఏదో బెదిరించి , భయ పెట్టో చెప్పడం వలన వాళ్ళు అంతగా ఆసక్తి చూపించలేరు అంటూ,  గత 22 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్న’ శర్మ ఉషారాణి ‘  గారితో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి ….

*మీ పూర్తి పేరు ? తల్లి దండ్రులు ?

శర్మ ఉషా రాణి . మా అమ్మ పేరు రాజ్య లక్ష్మి , నాన్న పేరు శ్రీనివాసన్ .

*మీ స్వస్థలం ?

మా స్వస్థలం కడప . నేను పుట్టింది తంజావూరు లో , కాని పెరిగింది , చదివింది హైదరాబాద్ .

*మీ నాట్యం పై ఆసక్తి కలగడానికి కారణం ?

మా అమ్మ  రాజ్య లక్ష్మి భరత నాట్య కళాకారిణి . ఆమె అప్పట్లోనే సింగపూర్ , మలేషియా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు .

*మీ తొలి గురువు ఎవరు ?

మా అమ్మ నా తొలి గురువు . తరవాత పసుమర్తి  శేషుబాబు గారి వద్ద కూచిపూడి సుమారు 15 సంవత్సరాలు శిష్యరికం చేసాను .

*మీ తొలి ప్రదర్శన గురించి ?

నా చిన్నప్పుడే కడప లో చేసాను . కూచిపూడి లో అయితే హైదరాబాద్ రవీంద్ర భారతిలో చేసాను .

*మీరు మొత్తం ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ?

సుమారుగా 1000 ప్రదర్శనలు వరకూ ఇచ్చి ఉంటాను . శిల్పా రామం , త్యాగరాయ గాన సభ , రవీంద్ర భారతి , సికింద్రాబాద్ వినాయగుడి , అష్టలక్ష్మి గుడి , ఒంటి మిట్టలో ని కోదండ రాముని దేవస్థానం లోను , ఇవే కాకుండా మద్రాస్ , సిక్కిం , బీహార్ , ముంబాయి , తిరుపతి , బెంగుళూర్ , ఉత్తరప్రదేశ్ , కలకత్తా  ఇలా చాలా చోట్ల చేసానమ్మ .

*విదేశాలలో ఇచ్చిన ప్రదర్శనలో మీకు గుర్తున్న ప్రదర్శన ఏమిటి ?

విదేశాలలో అంటే 2006 లో అమెరికా లో మూడు నెలల పర్యటించి ఇచ్చిన ప్రదర్శనలకు మంచి పేరు వచ్చింది .

*మీరు నాట్యం లో పి . హెచ్ డి చేసారు కదా ? ఏ విశ్వవిద్యాలయం నుండి చేసారు ?

అవునమ్మా . తెలుగు విశ్వవిద్యాలయం నుండి చేసాను .

 *పి . హెచ్ డి(phd) లో మీరు ఎంచుకున్న అంశం ? ఎవరి పర్యవేక్షణలో చేసారు ?

ఉమా రామారావు గారి పర్యవేక్షణలో యక్షగానం , కూచిపూడి భాగవతాలు మీద పరిశీలన చేసాను .

*మీరు అందుకున్న పురస్కారాలు  ?

నాట్య మయూరి , అభినయ నేత్రి , అమెరికా పర్యటనలో నాట్య చూడామణి , న్యూయార్క్  లో   నాట్య వేద విశారద ,విశాఖ పట్నం వారి నుండి వనితా పురస్కార్ , హైదరాబాద్ వారిచే విశిష్ట మహిళా పురస్కారం ,ఈటా వారి నుంచి ఉత్తమ నృత్య కళాకారిణి ,తాళ్ళ పాక దేవస్థానం వారు నాట్య చూడామణి , తిరుపతి లో కళా ప్రపూర్ణ  పురస్కారాలు అందుకున్నాను .

*మీ రూపొందించిన నృత్య రూపకాలు గురించి చెప్పండి ?

గీత గోవిందం , శభాజ గోవిందం , శ్రీ మద్ భగవద్గీత , శ్రీ సిద్ది వినాయక విజయం , శ్రీ శరణ్ నవ దేవి మహాత్త్యం , గోదా లక్ష్మి , అన్నపూర్ణ దేవి మహాత్త్యం , సాయి చేసిన నృత్య రూపకాలుచేసాను . తిరుమల తిరుపతి భక్తి చానల్ కోసం నృత్య సంకీర్తనపేరుతో ఒక కార్యక్రమం చేసాను .

*మీరు గురువుగా ఎన్ని సంవత్సరాలు నుండి శిక్షణ ఇస్తున్నారు ?

22సంవత్సరాల నుండి శిక్షణ ఇస్తున్నాను . ముందు హైదరాబాద్ భారతీయ విద్యా  భవన్ లో చేసేదానిని , ప్రస్తుతం తిరుపతిలో ని నృత్య కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా గురువుగా శిక్షణ ఇస్తున్నాను .

*కాలేజి లోనే కాకుండా మీరు ఇంటి వద్ద కుడా పిల్లలకి శిక్షణ ఇస్తారా?

ప్రస్తుతం ఇస్తున్నాను . నాకు చిన్న పిల్లలకి చెప్పడం అంటే చాలా ఇష్టం . 3 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఇంటి వద్దనే శిక్షణ ఇస్తున్నాను . పెద్దవాళ్లు వస్తున్నారు .

* కాలేజి లో మీరుకూచిపూడి మాత్రమే బోధిస్తారా

అవునండి . నృత్య శిక్షణ అయితే కూచిపూడి మాత్రమే బోధిస్తాను . వాళ్లకి కావాల్సిన నోట్స్ కూడా నేనే తాయారు చేసి ఇస్తాను . అలాగే భరత నాట్యానికి థీయరీ (నోట్స్)చెబుతాను .

* పిల్లలకి మీరిచ్చే శిక్షణ ఏ విధంగా ఉంటుంది ?

ఒక విషయం చెప్పాలి మనం ఎవరికి బోధిస్తున్నామో వాళ్ల స్థాయికి దిగి చెబితేగాని అది వారికి అర్ధం కాదు అనేది నా భావన . చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు వాళ్ల స్థాయిలోనే చెప్పాలి . ఏదో బెదిరించి , భయ పెట్టో చెప్పడం వలన వాళ్ళు అంతగా ఆసక్తి చూపించలేరు  .

*ప్రస్తుత కాలంలో మిగతా వాటితో పోలిస్తే నాట్య ప్రదర్శన ల అంతగా ఆకట్టుకొక పోవడానికి కారణం ?

వేటికి  ఉండే ఆదరణ వాటికి ఉండి . నాట్యం మన సంప్రదాయ కళఎప్పుడు మనం కూడా పాత విషయాలనే కాకుండా సాంఘికమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తే మరింత ఆదరణ లభిస్తుంది .

 * నాట్యం నేర్చుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ?

నేర్చుకున్న దానిని తప్పకుండా సాధన చేయాలి . దానికి మరి కొన్ని మెరుగులు దిద్దితే కాని అభ్యసించిన  దానికి అర్ధం ఉండదు .

 – అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో