మూడు సర్పాలు

మూడతుకులూ ముప్పై గతుకుల
ఆవరణలో పూచిన
అనాకారపు అవర్ణ పుష్పాన్ని..
అనునిత్యం అస్తిత్వాన్ని
అరిచి గీపెట్టే కడగొట్టు చిలుకను
వర్ణ`వర్గ`కుల`సమాజికపు
వెలి మొలకను..
నుదురు కొట్టుకుంటే
తాకుతుంది ‘కులం’ తిలకం
పుడుతూనే అది నా నొసట
అలంకృతం..
నా ఒంటినిండా ‘వర్ణం’ తూట్లు
వేరు వేరు పరికరాలతో
పొడిచిన గాట్లు..
నేను పైకెక్కినా ముందుకెళ్ళినా
కిందికీ వెనకకీ తోసేస్తూ
‘వర్గం’ వీరంగాలు..
   

    *   *    *     *

నోళ్ళు నవ్వుతున్నట్లున్నా

విషప్పొగలు దూసుకొస్తుంటాయి

చేతిలో చేయికలపబోతున్నట్లున్నా

నటనలు కోరలు చాస్తుంటాయి..

సానుభూతి సగం సగం

ప్రేమా అదెంతెంతో దూరం

అవసరాలకు మారే బాణీలు

ఒడ్డు చేరగానే తగిలేసే తంతులు..

రంగులూ రాగాలూ మారినట్టే అనిపిస్తాయి

చీలిన నేల గాయాలు మానినట్టే కనిపిస్తాయి

కానీ నా కలలన్నీ పీడకలలై

పచ్చిగా కోస్తుంటాయి..

కత్తులెత్తిన కర్కశత్వం

నా కదలికల్ని నియంత్రిస్తుంటుంది

అలసిపోయిన దేహం సొమ్మసిల్లి

అవిసిపోయిన మనసు సలపరిస్తుంటుంది..

నా జీవన గీతాలన్నీ కల్లోలితాలే

నా కలవరింతలన్నీ నా భయాలే

నన్ను వెంటాడుతున్న ఆ

మూడు సర్పాలూ ` ఒకే కాటు గురించి

నన్ను మర్చిపోనివ్వని అనుభవాలే..

              – అనిశెట్టి రజిత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to మూడు సర్పాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో