మాదిరెడ్డి సులోచన ‘ అగ్నిపరీక్ష ‘

                                  మాదిరెడ్డి సులోచన దాదాపు నలభై ఏళ్ళ క్రితం , అచ్చమైన తెలంగాణా వాతవరణం ,మానవ సంబంధాలూ కలిపి చక్కనైన కుటుంబకథా నవలలను వ్రాశారు.ఆమె నవలలలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలలలో వుండే సమస్యలు కనిపిస్తూవుంటాయి.మన చుట్టూ వుండే వాతావరణం ప్రతిబిబంబిస్తూవుంటుంది.ఆ నవల చదువుతూ వుంటే ఇది ఎక్కడో మనమధ్యే జరిగిందే అనిపిస్తుంది. పాఠకులు ఊహాలోకలో విహరించరు. సులభమైన శైలిలో చివరి వరకూ ఆగకుండా చదివిస్తాయి.

                      ఆవిడ వ్రాసిన నవలలో వకటి ఈ “అగ్నిపరీక్ష”.ఇది ఇద్దరు యువకులు వకేరకమైనటువంటి సమస్యలో ఇరుక్కునప్పుడు ఎలా స్పందించారు అన్నదాని గురించి వ్రాసారు.
                        కోదండరామయ్య , చలపతి,రఘుపతి ముగ్గురు అన్నదమ్ములు.కోటీశ్వరులుగా పేరు పొందారు.కోదండరామయ్య అలనాటి కోదండరాముడే.అతనికి తమ్ములంటే అభిమానం.వ్యసనాలకులోనై మరణించిన రఘుపతి ని తలుచుకొని ఏడుస్తూవుంటాడు.ఉమ్మడికుటుంబం.అతని భార్య కాంతమ్మ భర్త లాంటిదే.మరిది పిల్లలు, నా పిల్లలు అని ఏనాడు భేదం చూపి ఎరగదు.రామయ్యకు,మోటార్ రిపేరింగు కంపెనీ వుంది.అడితీ దుఖాణం వుంది.ఇంకా ఎన్నో వ్యాపారాలు చేస్తాడు.అతని ఆదాయవ్యయ సంగతులు ఎవరికీ తెలియదు.రోజు కు పది మంది ఆశ్రితజనం ఆయింట వుంటారు.పిల్లలంతా పిల్ల జమీందారులా పెరుగుతున్నారు.ఇంటిలోని ఆడవారు కి జమా ఖర్చులు తెలియదు.

                          కావలసిన వస్తువులు , బట్టలు అన్నీ పద్దు వ్రాయించి తెచ్చుకోవటమే.అలాంటి పరిస్తితులలో కోదండరామయ్య చనిపోతాడు.చనిపోయేముందు తమ ఆర్ధికపరిస్తితి గురించి కొడుకు విష్ణువర్ధన్ కు వివరించి, కుటుంబగౌరవం కాపాడమని మాట తీసుకుంటాడు. అస్తవ్యస్తంగా వున్న ఆర్ధికపరిస్తితిని చక్కదిద్దటానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు విష్ణు.ఇంటిలోని దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. పద్దువ్రాసి వస్తువులు తెప్పించే పద్దతి మానిపిస్తాడు.ఇంటివారంతా కర్కోటకుడని తిడుతున్నా పట్టించుకోడు.ఈ కస్టసమయములో తోడు కావాలని మధ్యతరగతి అమ్మాయి సుజాత ను వివాహమాడుతాడు.సుజాత అత్తవారి సూటిపోటిమాటలను పట్టించుకోక విష్ణుకు అండగా నిలుస్తుంది.ఎన్నోవొడిదడుకులను ఎదురుకొని అన్నీ సరిదిద్దుతాడు విష్ణు.

                               002 సుందరమ్మ భర్త ఒకప్పుడు తాసిల్దారుగా పనిచేసాడు.సికింద్రాబాద్ దగ్గర లాల్ బజార్ లో బంగళా కట్టించాడు.దగ్గరే పొలం కొన్నాడు.నలుగురు ఆడపిల్లలు ఒక్కడే కొడుకు.ముగ్గురు ఆడపిల్లల పెళ్ళి అయ్యింది. చివరి కూతురు సుజాత బి. యే చదివింది.అన్న ఇబ్బంది చూసి కట్నం ఇచ్చేవాడిని వివాహమాడటానికి ఇష్టపడదు.సుందరమ్మ కొడుకు రఘు ప్రాణాలు తీస్తూ , ఆడపిల్లలలకు అన్ని లాంచనాలను జరిపిస్తూవుంటుంది. ఖర్చుచేస్తూవుంటుంది. అడ్డుపడబోయిన కూతురు సుజాతను, కోడలు సరళను మాట్లాడనీయదు. తల్లికి ఎదురుచెప్పలేని బలహీనత తో రఘు అప్పులపాలవుతాడు.ఖర్చులు తట్టుకోలేక బంగళా ,పొలం అన్నీ అమ్మేస్తాడు. ఐనా సుందరమ్మ ఖర్చులు తట్టుకోలేకపోతాడు. సుజాత, సరళ ఎంత హెచ్చరించినా ఆమెను అదుపులో వుంచలేకపోతాడు.మధ్యతరగతి భేషజాలకు బలైపోతాడు. పిచ్చివాడైపోతాడు. ఒక్క రఘు కాదు, రఘు లాంటి యువకులెందరో ఇంటివారి దుబారా,బయటవారి దుష్ప్రచారాలకు బ్రతుకులు బలిచేస్తున్నారు.

                                     రఘు, విష్ణు ఇద్దరూ జీవిత బాటపై డక్కామొక్కీలు తిన్నవారే.ఒకరు బలహీనుడు.భయపడుతూపిరికితనం తో,చెడు అని తెలిసినా , భయపడి పిరికివానిలా తన జీవితమేకాక,ఇతరుల జీవితం నరకప్రాయం చేసినవాడు.రెండో అతను మంచిని ఎంచి యెవరెన్ని మాటలన్నా,కర్కోటకుడని బిరుదునిచ్చినా ధైర్యంగా నిలబడి,శాసించి, శ్క్షించి,బ్రతుకు బాటలోని గతుకులను పూడ్చాడు.

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు , ప్రవృతులూ ఎప్పటికీ మారవు.ప్రేమ , ద్వేషం, స్వార్ధం లాంటివి ఎన్ని తరాలు గడిచినా మారవు. మాదిరెడ్డి సులోచన నవలలో ఇవి స్పష్టంగా చూపిస్తారు.

– మాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

2 Responses to మాదిరెడ్డి సులోచన ‘ అగ్నిపరీక్ష ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో