డిసార్డర్

అందరి దృష్టిలో నువ్వొక గొప్ప నాయకుడివి కావచ్చు..
రాబోయే కాలంలో నువ్వు దేశ ప్రదానివే అవ్వొచ్చు..
మరో మహాత్మా గాంధిగా అవతరించొచ్చు..

కాని నా దృష్టిలో నువ్వొక నీచుడివి…నికృష్టుడివి..
ఇది ఎప్పటికీ మారదు..
నా అభిప్రాయం తో నీకు పని లేక పోవచ్చు..
దానికి నా దృష్టిలో విలువ లేదు…
ఈ ప్రపంచం నాతో ఏకీభవించకపోవచ్చు..
నా భాధ ఈ ప్రపంచానికేం తెలుసు..

ఈ రోజు నుంచి..
నా లోని ప్రతి రక్తపు బిందువు..
నా లోని ప్రతి శ్వాస..
చివరివరకు…
నీ నాశనానికి..
సర్వ నాశనానికై…
ఎదురుచూస్తుంది..

అబ్బబ్బా మళ్లీ మొదలైందా దీని గోల ! ఇంకా ఎన్నాళ్ళు ఇలా ? రూం లో బంధించి ఎన్నేళ్ళు ? చుట్టుపక్కల వాళ్ళకు సర్ది చెప్పలేక చచ్చిపోతున్నా..! మీ చెల్లెలిని భరించే ఓపిక నాకు ఇక లేదు. దయచేసి ఏ మెంటల్ హోస్పిటలోనో పడేయండి.
కాసేపు నిశ్శబ్దం…
ఏంటి ఎం మాట్లాడరా?

ఏం మాట్లాడమంటావ్ సత్యా ? రోజూ ఉండే భాగోతమేగా? కాసేపు అరిచి ఊరుకుంటుందిలే!

”ఏమిటి ? ఆవిడని రూం లో బంధించారా? అరిచి అరిచి ఊరుకుంటుందా? సొంత అన్నయ్య అయ్యుండి మీరే ఆమెకి ఇలాంటి భయంకరమైన శిక్ష వేయొచ్చా?”

గుమ్మం దగ్గర మాట వినపడితే ఇద్దరు అలాగే అవాక్కై చూస్తున్నారు !

”నా పేరు లాలస ! మీ పక్కింట్లో ఈ మధ్యే దిగాం. రోజు ఆ అమ్మాయి ఇలా అరుస్తుందని , ఇంకా ఏడుస్తుందని మా పని మనిషి చెప్పింది. ఏమి అనుకోకండి ! రోజూ రావాలని అనుకుంటున్నా, ఇవాళ అనుకోకుండానే నా అడుగులు ఇటు లాక్కొచ్చాయి!”

అహ.. పరవాలేదు లాలస గారు ! లోపలికి రండి ! కూర్చోండి ! కుర్చీ చూపిస్తూ చెప్పింది సత్య !
”చూడండి తప్పుగా అనుకోవద్దు. ఇలా చొరవ తీసుకుంటున్నానని. ఆ అమ్మాయిని మంచి సైకియాట్రిస్టుకి చూపించండి.”

చూపించాం లాలస గారు ! మందులు వాడితే ప్రభావం ఉంటుంది! కాని మందులు వేయనివ్వదు, బలవంతంగా వేస్తే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంది. ఇలా చాలా సార్లు జరిగింది. కనీసం మనిషి కళ్ల ముందు ఉంటే చాలు అని ఊరుకున్నాం. పైగా డాక్టరుని కొట్టి , గిచ్చి బాగా భయపెడుతుంది! అందుకే ఎవరూ ముందుకి కూడా రావట్లేదు. అలా రూం లో వదిలేస్తే అరుస్తూ ఏడుస్తూనే తనకు బాగుంది అని చెప్తుంది.

”అవునా? లాలస కాసేపు ఆలోచించి ..నేను ఆమెతో మాట్లాడొచ్చా? అని అడిగింది.
అమ్మో వద్దండి! అది చాలా ప్రమాదం ! తను ఏం చేస్తుందో తనకే తేలీదు !

భర్త మౌనంగా వింటూ కూర్చున్నాడు.
‘తను ఎవ్వరితో మాట్లాడదు కూడా !’ చెప్పింది సత్య!
”హ్మ్మ్ .. అయితే కచ్చితంగా ఇది మా ఆయన చూడాల్సిన కేసే ! నేను ఆయనకు చెప్తాను. మీరేం భయపడొద్దు , ఆయన చెప్పినట్టు చేయండి చాలు.” చెప్పింది లాలస.
‘సరే లాలస గారు! ఇంతకి మీ ఆయనేం చేస్తారు?’
‘చెప్పడం ఎందుకు? ఏం చేయాలో చేసి చూపిస్తారు.’ అంటూ ఎంత సడన్ గా వచ్చిందో అంతే సడన్ గా మాయం అయ్యింది లాలస.

ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్న మయ్యారు!
******** ********** **********
తనకు రోజూ వచ్చే అన్నం కంచంలో ఏదో తెల్లటి కాగితం ఉంటే తీసుకొని చూసింది ప్రీతి !
ఐ లవ్ యు ! ఆ మూడు అక్షరాలే ఉన్నాయి ఆ కాగితంలో !
ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రీతి ! తనకు ఐ లవ్ యు అని ఎవరు చెప్తారు??? అది కూడా ఇలా ఇంట్లో వాళ్ళు ఇచ్చే అన్నం కంచం లో పెట్టి? వాళ్లకు తెలుసా?తెలియదా? ఇలా తనకు తానే ప్రశ్నల వర్షం కురిపించుకుంది ప్రీతి !
కాసేపు అలాగే చూసి సమాధానాలు వెతికే ఓపిక లేక అలాగే ఆలోచిస్తూ కూర్చుంది.
మళ్లీ అవే అక్షరాలూ!!! ఇలా ఇది జరుగడం గత కొన్ని రోజులుగా తనకు అలవాటైపోయింది. కాని రోజూ ఉత్తి ఖాళీ కాగితమే వచ్చేది! ఈరోజు ఏకంగా ఆ మూడు అక్షరాలూ ??? ఎందుకు? ఎవరు చేస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? నా తో ఈ ఆటలెందుకు?

********                    ****                             *******               ****                     ******                        *****

చూసారా? ఈ మద్య ప్రీతీ అన్నం బాగా తింటుంది ! ఇంతకు ముందు లా వదిలేయట్లేదు! పైగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది!

వదిన అన్నయ్యతో అంటున్న మాటలు తనకు వినపడుతున్నాయి!
తనకు అన్నం తినాలని లేకున్నా తింటుంది! లేకపోతే ఆ కాగితం రావట్లేదు మరి!

ఐ మిస్ యు..ఈ సారి పదాలు మారాయి. తను మాత్రం ఆలోచనలతో సతమతమౌతూనే ఉంది.
ఏమిటి సత్యా ఈ మధ్య మీ ప్రీతీ అరుపులు , గోల బాగా తగ్గాయి ? ఎక్కడైనా ట్రీట్మెంట్ కోసం పంపించారా? పక్కింటావిడ అడిగింది.
వీళ్ళకు ఎం జరిగినా వింతే! ఎం చేసినా చేయకున్నా అడుగుతారు ! అని మనసులో అనుకుంటూనే… అలా ఏం లేదు పిన్ని గారు కాస్త మందులు అవి వేసుకుంటుంది బాగా నిద్ర వస్తుంది తనకు అంతే ! అని చెప్పి వచ్చేసింది.
*********                         ******                         ******                  *******                 ******                  *******
“నేను నిన్ను చూడలేదు గాని.. నువ్వు నవ్వితే బాగుంటావని విన్నా..నిజమేనా..??”
అప్రయత్నంగానే తన ప్రమేయం లేకుండానే తను అద్దం ముందుకు వెళ్లి నిలుచుంది! తనకు తానే కనిపించేసరికి ఉలిక్కి పడింది ! చేతిలోని కాగితం కింద పడిపోయింది ! ఎన్ని రోజులైంది ? నన్ను నేను చూసుకుని .. సరిగా తల దువ్వుకుని !!! నేనేనా ???

అలా ఆలోచిస్తూనే నవ్వుతున్న తన మోహం చూసుకుని మళ్ళీ మళ్ళీ నవ్వుకుంది ! రక రకాల నవ్వులతో అన్ని వైపులా నుంచి చూసుకుని మురిసిపోయింది.

ఎమిటి? నన్ను చూడలేదా..? చూడకుండానే ఐ లవ్ యు…. అని ఐ మిస్ యు….. అని..ఎలా? అలోచనలు మళ్ళీ ప్రీతిని ఆవహించాయి! ఒక్కసారిగా ప్రీతీ ఆనందం ఆవిరైపోయింది. మొహంలో నవ్వు మాయం అయింది.

ఎవరు? ఎవరు ఇది….ఎవరు ఇది……గట్టిగా అరుస్తూ చేతికి దొరికింది దొరికినట్టు విసిరేయటం మొదలు పెట్టింది !

సత్య బయపడినంతా జరిగింది ! రూమ్ తలుపులు బాదేస్తుంది ప్రీతి ! తీయక పోతే ఏం చేస్తుందో అని తలుపులు తీసేసింది సత్య.

వచ్చాడు…వచ్చాడు …మళ్ళీ వచ్చాడు ! అంటూ పరిగెత్తి పడిపోయింది ప్రీతి .
******* ** ****
కళ్లు తెరిచే సరికి ఎదురుగా ఉన్న లాలసను వింతగా చూసి ..చుట్టూ ఇంకెవరూ లేకపోవడం చూసి కాస్త ఇబ్బంది పడింది! కళ్లు తెరిచిందే కాని అసలు భరించలేని నొప్పి నీరసం. హాస్పటల్ వాతావరణం, తనకు ఏవేవో అన్నీ అమర్చారు !లేవాలనుకున్నా లేవలేని పరిస్థితి.

లాలస తనని తాను పరిచయం చేసుకుంది. నేను మీ పక్కింట్లోనే ఉంటా..మీ వదిన స్కూల్ కెళ్లింది పిల్లను తీసుకుని రావడానికి .. బయపడకు..నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్..రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పాడు ! కళ్ళు మూసుకుని పడుకో !

ఎవరో తెలియని మనిషి తనతో అంత చనువుగా మాట్లాడుతుంటే నచ్చక పోయినా..ఎమీ చేయలేక అలాగే మౌనంగా పడుకుంది !

అలా మూడు రోజులు గడిచే సరికి లాలస బాగా ప్రీతీ తో కలిసి పోయింది !
కాస్త మాట్లాడిస్తే పలుకుతుంది ప్రీతీ! మెల్లి మెల్లి గా మాట్లాడిస్తూనే మాటల్లో నీకేదో పువ్వుల బొకే వచ్చింది.. అంటూ … అందులో ఒక కాగితం కూడా ఉంది చూసుకో అని ఇచ్చింది ప్రీతికి.
“నువ్వు బాగా కోలుకున్నందుకు సంతోషం ..నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ .. నీ శ్రేయోభిలాషి !”

అది చదవగానే కళ్ళు వర్షించే మబ్బులే అయ్యాయి ప్రీతికి. లాలస అమాంతం ప్రీతిని దగ్గరికి తీసుకుంది. ఆమె కౌగిలిలోనే చాలాసేపు ఉండిపోయింది ..అప్పుడు లాలస తోడు నిజంగా చాలా అవసరం అనిపించింది ప్రీతికి. తను ఎందుకు ఎడ్చిందో తనకు తెలిదు కాని..బాదో సంతోషమో తెలీదు కాని ..ఎందుకు? ఏమిటి? అని ఒక్క మాట కూడా అడగ కుండా మౌనంగా తనని ఓదార్చిన లాలస దేవత లాగే కనిపించింది ప్రీతీకి.

కాస్త కుదుటపడ్డాక మెల్లిగా లాలస అసలు విషయానికి వచ్చింది. అసలేం జరిగింది? నువ్వెందుకు ఎవరి గురించో ఆలోచిస్తూ తిడుతూ ఆ గదిలో .. ఎమిటి ఇదంతా..? ఎవరో వచ్చారు అన్నావ్? ఎవరు అది? నీకిష్టమైతేనే చెప్పు..బలవంతం ఏమి లేదు..అని అడిగింది !
ఇంకెవరైనా అడిగితే అసలు తను ఇలా నిశ్చలంగా ఉండేదా? కోపంతో ఊగిపోయేది..సత్య వదిన కూడా చాలా సార్లు అడిగింది కాని ఇలా కాదు..ఇంత సౌమ్యంగా కాదు…

అందుకే చెప్పకుండా ఉండలేక పోయింది..

మూడు సంవత్చరాల క్రితం నాకు ఒక వ్యక్తితో పరిచయం అయ్యింది..సరదాగా మాట్లాడుతూ ఒకరి కొకరం బాగా దగ్గరైయ్యాం..ఫోన్లు చేసుకునే వాళ్ళం .. అంతా చాలా బాగుండేది..అతన్ని ప్రాణం కన్నా ఎక్కువగానే ఇష్టపడ్డా ! అసలు అతని లోకం తప్ప వేరే ధ్యాసే లేదు..వేరే ప్రపంచమే లేదు..చాలా చాలా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి..కాని ఈ క్రమంలో చాలా మంది స్నేహితులని దూరం చేసుకున్నా..పట్టించుకోలేదు. నేను వాళ్లతో మాట్లాడక పోవడం వల్ల వాళ్ళు దూరం అయ్యారని సర్దుకున్నా.. అలా.. ఒక సంవత్సరం గడిచింది. తరువాత ఉన్నట్టుంది అతను నన్ను తప్పించుకోవడం , మాట్లాడక పోవడం , కలవక పోవడం ..ఇలా గొడవలు..ఏడుపులు..భాద .దుఖం .. అన్ని మొదలైయ్యాయి…
సరే అని ఊరుకున్నా…వదిలేసా…
కాని తను మాత్రం నేను అలా వదిలేయడం చూసి తట్టుకోలేకపోయాడు. భరించలేకపోయాడు..నేను అతను లేకుండా సంతోషంగా ఉంటే ఎలా? ఇదే అతని సమస్య..

తను నాతో ఉండకూడదు అలాగే ఇంకెవ్వరు నాతో గాని..నేను ఇంకెవ్వరితో గాని ఉండకూడదు. ఇది అతను నాపై చూపే ప్రేమ అని అతని భావన. అసలు నా స్నేహితులందరూ నాకు దూరం అయ్యారని నేను అనుకున్నాను. కాదు..అతనే అందరిని నాకు దూరం చేసాడని తెలుసుకున్నా. ఇలా మొదలైన అతని కక్ష ముదిరి నా పై నిఘా పెట్టెంతవరకు వచ్చింది. అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ , చాలా తెలివిగల వాడు కూడా .

ఎక్కడంటే అక్కడ రక రకాలుగా నన్ను వెంబడిస్తాడు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజి తో..నా కంప్యుటర్ సిస్టం ని హాక్ చేసాడు, నేను ఏం చేసినా అతనికి తెలిసి పోతుంది..నా ఫోన్ ని కూడా స్పై సాఫ్టవేర్ తో మొత్తం చూస్తాడు. నా మేసేజులు , కాల్ హిస్టరీ , నా ఫోటోలు అన్నీ చూస్తాడు. నేను ఎవరితో మాట్లాడినా అతనికి తెలిసిపోతుంది , మొత్తం లైవ్ గా వింటాడు కూడా.. నేను ఏ లొకేషన్లో ఉన్నానో కూడా తెలిసిపోతుంది. అలా నా గురించి తెలుసుకుని నన్ను ఏడిపిస్తాడు. తనకు నా గురించి అంతా తెలుసు అని నాకు తెలిసేలా చేస్తాడు. నా ఫోన్ ఇంకా ఫేస్ బుక్ లలో మేసేజులు ….నన్ను భాదపెట్తేలా ఏడిపిస్తూ పంపిస్తాడు. ఏ ఫోటో పెట్టినా బాలేదు అంటాడు.. నువ్వు ఇలా ఎందుకు చేసావ్? అలా ఎందుకు చేసావ్? అని అడుగుతాడు. కాని అవన్నీ తన పేరుతో అడగడు. వేరే వాళ్ళ లాగా , వేరే పేరు పెట్టుకుని, వేరే నెంబరు తో ఏడిపిస్తాడు. నేను ఏడుస్తుంటే అతను నవ్వుతాడు. ఇదే అతని దిన చర్య. వాడి జీవితంలో మూడు వంతుల సమయం నాకోసమే ఖర్చు చేస్తాడు కాని నాతో డైరెక్ట్ గా మాట్లాడడు. బయటికి మాత్రం పెద్ద మనిషిలా గొప్ప వాడిలాగా చలామణి అవుతాడు. నేను వాడి మీద పోలిస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేను. ఎవరికీ చెప్పుకోలేను. అసలు చెప్పడానికి రుజువులెక్కడున్నాయి..??? రోజుకో నెంబరు తో పేరు తో సతాయిస్తుంటే…నాలో నేనే చచ్చి బ్రతుకుతున్నా..అందుకే అన్నీ వదిలేసి..ఒక గదిలో పడి ఉంటున్నా..నాలో నేనే సమాది అయిపోతున్నా… ఇంట్లో ఏం చెప్పగలను? చేసిన తప్పుకు తలవంచుకోవడం తప్ప ….సరి దిద్దుకునే మార్గమే కనిపించట్లేదు. వాళ్ళని బాదపెడుతూ నేను బాద పడుతున్నా.. అంతే!

మొత్తం విన్న లాలసకి..అప్పటికే అక్కడికొచ్చి అంతా విన్న ప్రీతీ అన్నా వదినెలకి నోట మాట రాలేదు. ఏడుపొక్కటే తక్కువ. ఇంత నరకం ఎవరికీ చెప్పకుండా అనుభవిస్తున్న ప్రీతిని ఎలా ..ఏం చెప్పి దైర్యం చెప్పగలం! ఇంకా నయం మనిషి కళ్ళముందే ఉంది .. ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంటే చేసేది ఏముంది?? జీవితం బలి చేసుకోకుండా .. ఎవరినీ బాద పెట్టకుండా ఉండాలనుకుంది! ఈ మాత్రం ఆలోచన ఈరోజుల్లో ఎవరికుంది. ప్రతి మనిషికీ కావలసింది ప్రేమా , ఆప్యాయతే కాని అవి శ్రుతి మించితే పిచ్చిగా మారి హద్దులు మరిచిపోయి..ఇలా జీవితాలతో ఆడుకునేలా చేస్తాయి.

ఇలా ఆలోచిస్తున్న లాలస “హే హవ్ ఆర్ యు ప్రీతీ.?” అంటూ వచ్చిన పృథ్వి రాకతో ఈ లోకంలోకి వచ్చింది. మా వారు..
సైకాలజిస్ట్ అని అందరికి పరిచయం చేసింది లాలస.
ప్రీతీ.. నీకు చిట్టిలు పంపింది నేనే . అది పృథ్వి ఐడియానే ! నిన్నూ నీ ఆలోచనలని కొంచం డైవర్ట్ చేస్తే నువ్వు ట్రీట్మెంట్ కి సహకరిస్తావ్ అని అలా కొంచం రిస్క్ తీసుకున్నాం మా అదృష్టం అది సక్సెస్స్ అయ్యింది.

మనతో ఆడుకునే వాళ్ళతో మనం ఆడుకోవాలి కాని ఇలా ఏడుస్తూ జీవితం నాశనం చేసుకుంటామా ప్రీతీ? నువ్వేదో తప్పు చేసావని తలొంచుకోవాలని అస్సలనుకోవద్దు! ఇవన్ని జీవితంలో పాఠాలే. కొంచం సమయస్పూర్తి తో సరిదిద్దుకొని ముందుకెళ్లి పోవాలి ! ఇక ఈ విషయం గురించి మర్చిపో! నువ్వు ఎప్పటిలా మాములుగా ఉండాలి..ఒక విషయం గుర్తుంచుకో…మనమేం చేసినా దేవుడు గమనిస్తున్నాడు..అని మనం అందరం నమ్ముతాం కదా..ఎక్కడైనా ఎప్పుడైనా…దేవుడికే భయపడనప్పుడు.. అతనికెందుకు భయపడడం? అతని పిచ్చి అతనిది! వదిలేయ్ .. నువ్వు పట్టించుకుంటేనే సమస్య లేకపోతే సమస్యే లేదు. కొంచం ప్రయత్నిస్తే అతన్ని పట్టించడం పెద్ద కష్టం కాదు..కాని దాని వల్ల నీ సమస్య తీరదు..అతని పగ పెరుగుతుంది..నీకు వ్యద తప్పదు. అందుకే అతనికి శిక్ష పడడం కన్నా నువ్వు ధైర్యం గా ఎదురుక్కొని ముందుకెళ్లడమే ముఖ్యం. నిన్నుఅలా తయారు చేసే భాద్యత లాలసది. అన్నీ లాలసకి వదిలేయండి అంటూ పృథ్వి ధైర్యం చెప్పడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

– రాణి సంధ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to డిసార్డర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో