నర్తన కేళి – 10

*పూర్తి పేరు ? తల్లిదండ్రులు  ?

దీప్తి మద్దనాల . అమ్మగారి పేరు లక్ష్మి జ్యోతి , నాన్నగారి పేరు ప్రసాద్ .

*మీ స్వస్థలం  ?

మా నాన్నగారు    కానిస్టేబుల్   కావడం వలన నా చిన్నతనంలో కొంత కాలం రంపచోడవరం లో ఉన్నాము . తరవాత  కాకినాడ లోనే ఉంటున్నాము .

*మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది ?

మా అమ్మ శాస్త్రీయ నృత్య కళాకారిణి కావడంతో నాలో స్వతహాగానే నాట్యం ఆసక్తి కలిగింది .

*ఎప్పటి నుండి నాట్యం నేర్చుకుంటున్నారు ?

నాకు మూడు సంవత్సరాల వయసున్నప్పటి నుండి మా అమ్మ నాట్యం నేర్పించడం ప్రారంభించింది .

*మీ తొలి గురువు ? వారి గురించి ? ఎన్ని సంవత్సరాలు విద్య నేర్చుకున్నారు ?

మా అమ్మగారే నా తొలి గురువు . ఆమె దగ్గర భరత నాట్యం , కూచిపూడి , జానపదం  అభ్యసించాను .

*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ ఇచ్చారు?

తొలి ప్రదర్శన  రంపచోడవరం లో ఉన్నప్పుడు నాకు అయిదు సంవత్సరాల వయసులో చేసాను . వసంత థిల్లాన , ధీం తన ధీనినాం రెండు చేసానట. నాకు అంతగా గుర్తు లేదు . తరవాత నాకు బాగా తెలిసిన ప్రదర్శన నర్తన యజ్ఞం  రాజమండ్రిలో సప్పా దుర్గా ప్రసాద్ గారు నిర్వహించారు .

*నర్తన యజ్ఞం అనేది ఆలయ నాట్యానికి సంబంధించిన శాస్త్రీయ నృత్యం కదా ?

అవునండి . ఆలయ నృత్యాలలో ఒకటి . యజ్ఞాయాగాదుల  సమయంలో చేసే  నృత్య ప్రదర్శన

.*మరీ ఆలయ నాట్యం ఎవరి వద్ద అభ్యసించారు ?

ఆలయ నాట్యం రాజమండ్రిలోని నటరాజ్ నృత్యనికేత న్  డా.సప్పా దుర్గా ప్రసాద్ గారి వద్ద ఆలయ నాట్యం నేర్చుకున్నాను .

*ఆలయ నాట్యం సుమారుగా ఎన్ని సంవత్సరాలు అభ్యసించారు ?

సప్పా దుర్గా ప్రసాద్ గారి వద్ద ఆలయ నాట్యాన్ని ఏడు సంవత్సరాలు అభ్యసించాను .

*మీ చదువు  గురించి ?

v.s lakshmi  కళాశాలలో  Msc  మైక్రో బయాలజీ చేసాను . కూచిపూడిలో సర్టిఫికేట్ ,డిప్లోమో చేసాను .

*కూచిపూడి నాట్యం ఎవరి వద్ద అభ్యసించారు ?

కూచిపూడి నాట్యం అడుగులు మొదలైన ప్రాధమిక శిక్షణ మా అమ్మ గారి వద్ద నే అభ్యసించాను .తరవాత సర్టిఫికేట్ , డిప్లోమో కి మాత్రం పసుమర్తి శ్రీనివాస శర్మ గారి వద్ద అభ్యసించాను .

*ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? మీకు గుర్తున్న కొన్ని ప్రదర్శనలు గురించి  మా చదువరుల  కోసం చెప్పండి ?

ఇప్పటి వరకు చాలా ప్రదర్శనలు ఇచ్చాను. గుర్తున్నవి అంటే రంపచోడవరంలో ఉన్నప్పుడు చేసాను , అలాగే రాజమండ్రి లో సప్పా దుర్గాప్రసాద్ గారు నిర్వహించి నర్తనయ యజ్ఞం , దసరాకి , ధనుర్మాసం లోను , హైదరాబాద్ లో శిల్పారామంలో జరిగిన నర్తన యజ్ఞం లోను చేసాను .

* ఎన్ని సంవత్సరాలుగా నుంచి గురువుగా శిక్షణ ఇస్తున్నారు ?

2009 నుండి గురువుగా శిక్షణ ఇస్తున్నాను.

 

*మీ నృత్యనికేతన్  ద్వారా ఇచ్చిన ప్రదర్శనలు ?

మా నృత్యనికేతన్  ద్వారా  ధనుర్మాసంలో సత్కళా వాహినిలోను  , వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి , బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి లో చేసాము .సిలికాన్ ఆంధ్ర కూచిపూడి నాట్య సమ్మేళనం  మహా నాట్య బృందం లో కూడా మా శిష్యులు చేసారు .

* మీరు అందుకున్న పురస్కారాలు ?

నా చిన్న వయసులో యునెస్కో  ‘బాలనాట్య శిరోమణి ‘ పురస్కారం అందుకున్నాను . అలానే  కళా దర్బార్ వారి నుండి నాట్య మయూరి , నాట్య రాయంచ  అవార్డ్స్ వచ్చాయి . నృత్య పోటీలలో జిల్లా ప్రధమ బహుమతులు లభించాయి .

*ప్రతి సంవత్సరం మీ నృత్యనికేత న్ ద్వారా ఇచ్చే ప్రదర్శనలు ?

ప్రతి సంవత్సరం ధనుర్మాసం లోను , అలాగే వెంకటేశ్వర స్వామీ ఉత్సవాలకి , దసరాకి అమ్మవారి గుడిలోను ప్రదర్శనలు తప్పకుండా ఉంటాయి .

*పిల్లలకి మీరిచ్చే శిక్షణ పద్ధతి ఎలా ఉంటుంది ?

ముందుగా అడుగులతో మొదలు పెడతాను . జతులకి వచ్చేటప్పటికి చిన్న చిన్న కీర్తనలకు నృత్యం చెప్పడం ప్రారంభిస్తాను . అప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది . నాట్యం చేస్తున్నంత సేపు సీరియస్ గా నే చెబుతాను .తప్పుగా చేస్తే మేడం కోప్పడతారు అనే భావన వాళ్ళలో ఉంటుంది .

* ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించేవారికి మీరిచ్చే సలహా?

ఎవరో ప్రదర్శన ఇస్తుంటే చూసి మనం అలా చేయాలి అని నాట్యం నేర్చుకోవడం మొదలు పెడతారు . చివరకి ఒకటి రెండు ప్రదర్శనలు ఇవ్వగానే నేర్చుకోవడం మానేస్తారు . అలా చేయడం మంచి పద్ధతి కాదు . నేర్చుకుంటున్నప్పుడు త్రికరణ శుద్దిగా , పూర్తిగా నేర్చుకోవాలి . అప్పుడే నేర్చుకునే విద్యకి ఫలితం ఉంటుంది . ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకి చెప్పాలి . మన శాస్త్రీయ కళలవిలువని , విశిష్టతని చెప్పాలి .

 మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

పుస్తక సమీక్షలు, Permalink

One Response to నర్తన కేళి – 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో