డా.పెళ్ళకూరు జయప్రద ‘‘వీలునామా’’

               

తెలుగులో సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలు అనేకం విస్తరించాయి. అందులో కథకు ప్రాముఖ్యత, ప్రాచుర్యమూ ఉంది. 1910లో మొదలైన ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ఎన్నో విలక్షణమైన కథలు వెలుగుచూశాయి. కథలో సమాజాన్ని, మానవ జీవితాన్ని అనేక అనుభవాలను అనేక కోణాల నుంచి స్పృశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కథలంటే అందరికీ ఇష్టమే. కథలని ఇష్టపడని వారుండరు. కథలో మానవువుని జీవితాన్ని పరిపూర్ణ్ణంచేసే మనోభావాలు, రాగద్వేషాలు, ఆనందాలు, క్షోభలు ఇవన్నీ కథలో ప్రతిఫలిస్తాయి.   

                  చాలా మంది గొప్పగొప్ప రచయితలు, రచయిత్రులు కథకు మెరుగులు దిద్దారు. ఈ కోవకు చెందిన వారే డా॥ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి గారు. జయప్రద కథారచనలో సామాజికాభ్యుదయం ఎక్కువగా దర్శనమిస్తుంది. వృత్తిరీత్యా డాక్టరు కావటముతో తన వద్దకు వచ్చే ఎంతో మంది పేషెంట్స్‌ జీవితాలను, తన చుట్టూ ఉన్న సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కథలు వ్రాశారు. జయప్రద కథల్లో పాత్రలన్ని సహజాతాలై వుంటాయి. మనకు తెలిసిన మనుషుల్లా అన్పిస్తారు. మనల్ని ఆలోచింపజేస్తాయి. అలా ఆలోచింపజేసే కథ ‘‘వీలునామా’’
   

                    ‘వీలునామా’ కథలో అత్యంత ప్రాధాన్యత వహించింది సంభాషణ చిత్రణ. పాత్రలు సంభాషించిన తీరు పాఠకులని ఏకబిగిన చదవడానికి ఉపక్రమింపజేస్తుంది. మొత్తంగా ‘వీలునామా’ కథను వస్తుపరంగా చూస్తే కటుంబ వ్యవస్థకు చెందినది. రూపవైవిధ్యం, వస్తువైవిధ్యం గల కథ అని చెప్పవచ్చు. కుటుంబానికి మూలం భార్యభర్తలు. భార్యా భర్తల బంధం అనిర్వచనీయం. జీవితలో కోపాలు, అలకలు, ఆవేశాలు, సుఖసంతోషాలు, మధురానుభూతులు సమ్మిళతమై వుంటాయి. మధురంగా సాగితున్న సంసారంలో అపశ్రుతి దొర్లింది. మనిషికి చావంటే భయం…. భయం…… కానీ ఏదోరోజు తప్పక మరణించాల్సిందే. కానీ మరణమనే ఊహకు కూడా భయభ్రాంతులై పోతారు. అలాంటిది మరణిస్తామని ముందే మరణిస్తే ఎంత న్యూనతా భావానికి లోనౌతారో, ఎంత మానసిక క్షోభకు గురౌతారో ఊహకందని నిజం.
   

               భర్తకు భార్య ప్రాణం. భార్యకు భర్త ప్రాణం. అలాంటి ప్రాణం మరో ప్రాణాన్ని ముందే వదిలి వెళ్తుందని తెలిస్తే….. ఇలాంటి స్థితిలో ధైర్యాన్ని నింపుకోవడం అసాధ్యం. జ్యోత్స్నకు క్యాన్సర్‌ ముదిరిపోయిందని, లివర్‌కి పాకిపోయిందని తెలిసి హర్షవర్థన్‌ నిశ్చేష్టుడైపోతాడు. తన కళ్ళముందే భార్య మృతి చెందుతుందని తెలిసిన హర్ష తన జీవితం శూన్యంలోకి నెట్టివేయబోతున్నట్లుగా పరితపిస్తాడు.
   

                           జ్యోత్స్నకి క్యాన్సర్‌ ముదిరిపోయిందని తెలిసి తన భర్తతో నేడో రేపో, ఎప్పుడో మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతాను…………… రచయిత్రి  అని  పలికించిన మాటలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ పాఠకున్ని కంటతడిపెట్టిస్తుంది.
   

                ప్రపంచీకరణ నేపధ్యంలో మానవుని సంబంధ బాంధవ్యాలు కుంచించుకుపోయాయని చెప్పుటకు ఎలాంటి సందేహమూ లేదు. ఈ కంప్యూటర్‌ యుగంలో మనుష్యుల ప్రేమానురాగాలలో ’‘నిజాయితీ’’ కన్పించుటలేదు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఉద్యోగాలు వారివి. జీవితం అంతా ఇంటిల్లిపాది తీరికగా గడిపే రోజులు పోయాయి. తీరిక చిక్కినా ఫేస్‌బుక్‌లతోనో, ట్విట్టర్స్‌లతోనో తను జీవితాలను బిజీ చేసుకుంటున్నారు. భార్యభర్తల బంధం ‘నేతి బీర’ చందాన మారింది. ఇలాంటి ఈ కాలంలో భార్య భర్తల ఔన్నత్యం, భార్య యెడల భర్తకుండాల్సిన బాధ్యత, భర్తపై భార్యకుండాల్సిన ప్రేమ ఇలాంటి సున్నితమైన అంశాలని హృద్యంగా ఆవిష్కరించారు జయప్రద..
   

                      భార్యభర్తల బంధం ఎంతో ఉన్నతమైనది. ఆ బంధం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తను సుమంగళిగా వెళ్ళాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. తను వెళ్ళిన తరువాత తన భర్త ఎలాంటి కష్టాలకు గురి కాకూడదని వాంఛిస్తుంది. ఈ కథలో జ్యోత్స్న తన భర్తకు తాను మరణించిన తరువాత తన భర్త ఒంటరి వాడుకాకూడదని ఆశిస్తుంది. అంతేకాదు. తన ఆస్తియావత్తు భర్తపేరుపై వ్రాయాలని నిశ్చయించుకుంది. అంతేగాక ఏ భార్య కూడా తన స్థానంలో ఇంకో స్త్రీ ఉండాలని కోరుకోదు. జ్యోత్స్న మాత్రం అంత పెద్ద త్యాగానికి సిద్ధపడిరది. తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, ఇంకెంతో కాలం బ్రతకనని తెలిసి హర్షవర్ధన్‌కి మళ్ళీ పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంది. తాను మరణించాక తనలాగే ఆయన్ను ప్రేమించే భార్యను వెతికి పెట్టాలని ఎంతో ప్రయత్నించింది. ఎందుకంటే తన భర్త ఒంటరి వాడు కాకూడదని, తన భర్తకు తోడు కావాలని ఆరాటపడిరది.
   

                          జంటలో ఒకరు వెళ్ళిపోయాక ప్రేమించే పిల్లలు ఉండి కూడా మరొకరు ఒంటరిగా బాధపడతారు. ఆ తప్పు పిల్లలది కాదు…… జంటలో మిగిలిన వాళ్ళకు బిడ్డలే ఓదార్పు. కానీ ఎంత సేపు? ఎంతకాలం? ఓ పది నిమిషాలు, అర్థగంట, లేదా ఒక రోజు! ఇంతకంటే వయస్సులో వున్న పిల్లలు తల్లిదండ్రులతో గడుపలేరు. ఇది సృష్టి విరుద్ధం కాదు. ఎందుకంటే…… తల్లిదండ్రులు సమకూర్చి పెట్టిన ఆస్తుల పెంపు చాలక, ఇంకా సంపాదించాలనే తపనతో ఎవరి ప్రపంచాన్ని వారు సృష్టించుకుంటున్నారు.
   

                         జ్యోత్స్న రాయించిన వీలునామాను లాయర్‌ సుబ్రమణ్యం జ్యోత్స్న మరణించిన మూడు దినముల చిన్న కర్మ అయిపోగానే వీలునామాను చదివి వినిపిస్తాడు. వీలునామాతో పాటు ఒక ఉత్తరం కూడా వ్రాసింది. ఆ ఉత్తరంలో భార్యభర్తల బంధానికున్న జౌన్నత్యాన్ని జ్యోత్స్న చేత జయప్రద పలికించిన విధము అద్భుతము. వీలునామా అనగానే కొడుకు మధుకర్‌, కూతురు స్వాతి, ఆడ బిడ్డ సునీత పరిపరివిధాల చింతిస్తారు. జ్యోత్స్న మరణించినందుకు వారికి భాధలేదు. కానీ ఆస్తి ఎవరి పేరున వ్రాసిందో, ఏమోనన్న ఆతురత చూస్తే మనసున్న మనిషికన్నా మనస్సులేని డబ్బుకే మనిషి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.
   

                       జ్యోత్స్న వీలునామాలో తన భర్తకు పెళ్ళి జరగాలని, అందుకు ఆయన ఒప్పుకోవాలని, తల్లి మాటని గౌరవించాలి. ఆయనకు తగ్గ వయస్సులో ఉన్న ఓ ఒంటరి స్త్రీని వెతికి ఆయనకి పెళ్ళి చేయాలని కొడుకు మధుకర్‌ని కోరింది. అలా వాళ్ళు చేస్తే….. తన అనంతరం ఆస్తిని 5 భాగాలుగా చేసి` ఒక్కభాగం తన కూతురు స్వాతికి, మరొక భాగం తన కొడుకు మధుకర్‌కి, మూడవ భాగం తన భర్త పెళ్ళి చేసుకోబోయే ఆ అపరిచితురాలుకు, నాలుగవ భాగం భర్త హర్షవర్ధన్‌కి, చివరి భాగం ఏ అండా లేని తన ఆడ బిడ్డ సునీతకి చెందాలని వ్రాయించింది.
   

                         అలాకాకుండా తన కొడుకు, కోడలు, మిగతా కుటుంబ సభ్యులు తన భర్తకు పెళ్ళిచేయని పక్షంలో…… తన ఆస్తంతా హర్షవర్థన్‌కి, ఆయన తదనంతరము డబ్బులేక, ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సహాయము లేక నిస్సహాయంగా చనిపోతున్న గుండె జబ్బుతో బాధపతుడున్న వారికి, శస్త్రచికిత్స కోసం వినియోగించాలని జ్యోత్స్న ఆశపడింది.  ఉత్తారాన్నీ, వీలునామాని చదవటం పూర్తిచేసి, కాగితాలు మడుస్తూ…….. అందరి వైపూ మార్చి మార్చి చూశాడు లాయర్‌ బాల సుబ్రమణ్యం, అతనికి అందరూ ‘‘తీవ్రమైన దిగ్భ్రాంతి’’కి లోనయ్యారని అర్థమయింది. అందరూ గంటలు తరబడి ఆలోచించి, పెళ్ళికి ఒప్పుకుంటారు. వాళ్ళ నిర్ణయం వెనుక వున్న స్వార్థాలు, మర్మాలు లాయర్‌ బాలసుబ్రమణ్యం గారికి తెలియకపోలేదు. హర్షవర్ధన్‌ మాత్రం షాక్‌లోనే ఉండి పోతాడు. అతనికి కావాల్సింది క్రొత్త భార్య కాదు, ఆస్తికాదు, తన ప్రాణంగా ప్రేమించిన భార్య తాలూకు స్మృతులను స్మరించడానికి కాస్త ఏకాంతం, గుప్పెడు కాలం, హర్షవర్థన్‌లా ప్రేమించే ఇలాంటి భర్తను పొందే ప్రతీ స్త్రీ జన్మ సార్థకమవుతుంది.
   

                అహంకారాంతో, ఆధిపత్యంతో భార్యను అదుపులో పెట్టుకోవాలని అణిచివేయాలనే భావన కల్గిన ప్రతి పురుషుడికి ఆదర్శ ప్రాయంగా హర్షవర్ధన్‌ పాత్ర మలిచిన తీరు ప్రశంసనీయం. భార్యభర్తల బంధం విడదీయలేని బంధం. మమతానురాగాలలో అల్లుకున్న పొదరిల్లు, అలాంటి ఇంట్లో ప్రతి భార్యభర్తలు కలకాలం సంతోషాలలో గడుపుతారని, అలాంటి వారే నలుగురికి ఆదర్శవంతులౌతారని తెలిపే కథ ‘‘వీలునామా’’.

  –  పెరుమాళ్ళ రవికుమార్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to డా.పెళ్ళకూరు జయప్రద ‘‘వీలునామా’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో