నితాఖత్

ఎవరికి ఎవరమో మొన్న

ఒకరికి ఒకరం నిన్న

విభజించబడిన దారి

ఆ కొసననువ్వు – ఈ కొనకునేను

భూమిని మొగులును కలిపికుట్టి

చేతిలో పెడతానన్న బాస

‘చితి’కి చివికి అలగామారి కలగా నిలిచినగడియ 

బహు చక్కంగ వర్గీకరించావు జోహార్లు

సమయానికి ముందున్న వాడవు

కాలాన్ని కలగన్న వాడవు

నేర్పుగా కన్నెత్తక పన్నెత్తక ఒంటిగా విడిచి

నడిచి గమ్యాన్ని చేరావు

వెలుగు ఇస్తావన్న  నీ మాటకై ఎదురు చూస్తూ

సుషుప్తిలోనే ఉన్నాను

చిటికెన వేలి ఆసరాతో కూడా  తీసుకుపోతావని ..

కలను కల్లచేస్తావనుకోలేదు

నివద్దిగా బెక్కన బెంగటిల్లుతూ

కంటి నీరూరంగా  సగం వాకిలి తీసి సూరీడు రాకకై చూస్తున్నాను

(నితాఖత్ : గల్ఫ్ దేశాని కెళ్ళిన  ప్రవాసులకు వీసా లేదన్న కారణంగా నితాఖత్ పేర స్వదేశం పంపే ప్రక్రియ )

–  కొలిపాక శోభారాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కవితలు, , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.