సంతకాల కుర్చీలు

ఈ సారంతా ఒకటే సందడి. స్థానిక ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ఎందరు మహిళలో ఈ సారి ఎన్నికల బరిలో! సంతోషం! రాజకీయ సాధికారత వైపు కూడా దృష్టి పెడ్తున్నందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి! ఇది ఒక గుణాత్మకమైన మెట్టు. మహిళలు వార్డు మెంబర్లుగా, పంచాయతీ ప్రసిడెంట్లుగా ఇక ప్రతి నియోజకవర్గంలోనూ యాభై శాతం కనిపిస్తారు. సమతుల్యత వైపు ఇదొక బృహత్తర అడుగు!
    

            కానీ ఇలా బరిలో నిలబడిన వారిలో ఎందరికి నిజంగా స్థానిక ఎన్నికల గురించి తెలుసు? ఎందరికి వారి ప్రాంత సమస్యలు తెలుసు? ఇదంతా ప్రక్కన పెడితే, సంతకాల కుర్చీకి నిచ్చెన వేస్తున్నది ఎందరు? భర్తల/తండ్రుల/అన్నల హయాముకు దారులు ఏర్పరుస్తున్నది ఎందరు? ఎన్నికల కాంపెయినింగ్ ను కాస్త గమనించండి. మైకుల్లో హోరెత్తిపోతున్న ఎన్నికల కాన్వాసింగ్ ను వినండి. భర్త/ తండ్రి పేరును పదిమార్లు ఉచ్చరించాక, బరిలోనున్న మహిళ పేరును ఉచ్చరిస్తారు. అది కూడా అతని భార్యగానో లేక కూతురుగానో! ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అనుకుంటాం. కానీ ఈ సారి ఇది ఒక ప్రతిష్టాత్మక నిర్ణయపు అమలు! ఖచ్చితంగా యాభై శాతం మహిళలకు రిజర్వు చేయడం వలన స్త్రీ, పురుషులు సమానంగా ఉంటారు. చాలా విజయగాధలు వింటున్నాం…. ఈ స్ఫూర్తితో అసలైన సాధికారత వైపు మహిళలు అడుగు వేస్తే ఇంకేం కావాలి? ఇదే పద్ధతి చట్ట సభల్లో కూడా అమలైతే, మార్పుకు మార్గం వేసినట్లే! ప్రయాణపు ఒడిదుడుకులు తట్టుకుని సమసమాజపు వాస్తవం వైపు ప్రస్థానం సాగించడం ఎంత అద్భుతమైన విషయం!

                  కొన్నాళ్ళ క్రితం మీ జేబులో ఇరవై రెండు రూపాయలుంటే మీరు దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్లే అన్నారు. ఇపుడు ఏకంగా భారతదేశంలో పేదరికమే మాయమైపోయే దశకు చేరుకున్నామన్న తీపి కబురు! సంతోషంతో మాటలు రావడం లేదు! మన రాష్ట్రంలో అయితే పేదలు డెభ్భై ఎనిమిది లక్షలే మిగిలున్నారట! వారిని దారిద్ర్యరేఖ నుండి పైకి తీసుకురావడానికెంతో సమయం అవసరం లేదు లెండి! నేనైతే కలలు సాకారం కావడం చూసేస్తాననిపిస్తోంది. పేదరికమే లేకుంటే తెల్ల రేషన్ కార్డులుండవు, సబ్సిడీలుండవు, పేదరిక నిర్మూలనంటూ దశాబ్దాల తరబడి అమలు పరుస్తున్న పథకాలుండవు, ఆమ్ ఆద్మీ అనే పదమే ఉండదు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చే అవసరం లేదు! ఇవన్నీ ఎందుకు? పేద అనే మాటే వినపడదిక! మన ప్రతి ఒక్కరి తల మీద మనం మోస్తున్న దేశీయ అప్పులుండవు! వాహ్! వాహ్! అభివృద్ధి చెందుతూఊఊఊఊఊఊఊఊఊ ఉన్న దేశంగా ముద్ర పడిపోయిన దేశమిపుడు “అభివృద్ధి చెందిన దేశంగా” పేరు గడిస్తుంది. మనకున్న అతి పెద్ద సమస్యలు నాలుగే! అధిక జనాభా, పేదరికం, నిరుద్యోగం మరియు నిరక్షరాస్యత. పేదరిక నిర్మూలనంటే, నిరుద్యోగం కూడా నిర్మూలించబడినట్లే! జనాభాకి సరిపడా తిండి, గుడ్డ, గూడు ఉన్నపుడు అధిక జనాభా ఒక సమస్యే కాదు! ఇక నిరక్షరాస్యతా? మన అక్షరాస్యతా శాతం ఇపుడు డెబ్భై నాలుగు పైనే!
  టెండూల్కర్ పద్ధతంట!
 పేదరికం చాలా వరకూ తగ్గిందంట!
 సమసమాజపు కల త్వరలో నెరవేరబోతోంది!
కానీ మొన్న భర్త చనిపోయి, నలుగురు బిడ్డల్ని సాకలేక ఏ హాస్టల్లో సీటు దొరుకుతుందా, పిల్లల్ని చేర్చుదామా అని కన్నీరు మున్నీరౌతున్న మా కృప తల్లి ఈ లిస్టులోకి రాదా?
 

ఇంకో ఇంట్లో పని దొరికితే బావుండు, కొన్ని బాకీలు తీర్చాలనే మా గౌరమ్మ, చుట్టల పని సాగలేక చతికిలపడిన మా జానకి, రెండ్రోజులు పనికి ఆహారపథకం పనికెళ్ళి వారం ఇంట్లో పడుకున్న నూకరాజు, ఒక నెల పనికెళ్ళి, వచ్చిన డబ్బుతో ఒక కొత్త మొభైల్ కొనేసి, ఇంట్లోకి కలర్ టీవీ కొనేసి, ఆపై పని లేక, అప్పులు పడినా, ఇంట్లో వస్తువులున్నందుకు పేదరిక రేఖ నుండి జనాభా లెక్కల్లో గట్టెక్కించేసిన ప్రసాదు కానీ ఈ లిస్టులోకి రారేమో!

అభివృద్ధికి గీటురాళ్ళు మారిపోయాయి….
పేదరికాన్ని కొలవడానికి కొలమానాలు మారిపోయాయి….

దేన్ని దేనితో కొలుస్తున్నామో, పాలనా పద్ధతులను ఏ విధంగా రాజకీయ లాభాలుగా, కాకి లెక్కలుగా చూపిస్తున్నామో తెలియడం లేదు…
ఇంతకీ ఈ టెండూల్కర్ ఎవరబ్బా?

ఈ టెండూల్కర్ పద్ధతిలో భారతదేశం ఇంత అభివృద్ధిని చూపించే సూచికలేమిటో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకుచూడాల్సిందే!
http://planningcommission.nic.in/eg_poverty.htm

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink

One Response to సంతకాల కుర్చీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో