నాజీలకు తల వంచని మదర్ మేరియా స్కోబ్సోవా

                      ఆమె రష్యా కు చెందిన మత ప్రవర్తకు రాలు .దైవ చింతనతో పాటు ,సామాజిక బాధ్యతను కూడా నేరవేర్చిన వనిత. అంతేకాదు జర్మనీ నాజీ దురంతాలకు బలి అవుతున్న యూదులకు ఆశ్రయం కల్పించిన కరుణా మయి , కవి ,సాంఘిక సేవా తత్పరురాలు .నాజీను ఎదిరించి నిలిచిన ధీర వనిత . ఆమెయే మదర్ మేరియా స్కోబ్సోవా .

          పూర్వపు రష్యా సామ్రాజ్య భాగమైన లాత్వివా లోని రిగా లో సంపన్న కుటుంబం లో మేరియా 1891 లో జన్మించింది  .పెట్టిన పేరు ”ఎలిజ బేతా పెలంకో” అందరు ‘’లిజా ‘’అని ముద్దుగా పిలిచేవారు . ఆధ్యాత్మిక చింతన చిన్నతనం లోనే అలవడింది . పది హేను ఏళ్ళ వయసులో తండ్రి మరణించాక సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరింది .యూనివర్సిటి లో చదివింది కవులతో ,సామాజిక కార్య కర్తలతో పరిచయం పెంచుకొంది .మొదటి కవితా సంకలనం”సితియన్ సార్డ్స్ ” వెలువ రించింది . రాడికల్ పార్టీ తో పరిచయమేర్పడింది . లెనిన్ కు  సంబంధించిన బోల్షివిక్ పార్టీ కి చెందిన”డిమిట్రి”అనే కాథలిక్ అతన్ని పెళ్లి చేసుకొని ఒక కూతురును కన్నది .కొద్ది కాలమే హాయిగా కుటుంబ జీవన సౌఖ్యం అనుభవించింది .వివాహం విచ్చిన్నమైన తర్వాత మళ్ళీ క్రిష్టియన్ మతంలో చేరింది.

       రష్యా లోని ప్రజల దుర్భర పరిస్థితులను చూసి చలించి పోయింది .సాంఘిక అభద్రత,రివల్యూషన్ లతో జనం అల్లాడి పోతున్నారు . రెండు సంపుటాల కవిత్వాన్ని ప్రచురించింది .మహాత్ముల జీవితాలను చదివి ప్రభావితు రాలైంది .వారి కధలను చక్క గా వివ రించి చెప్పేది . బోల్షివిక్ రివల్యూషన్ తర్వాత సోషలిస్ట్ రివల్యూషన్ పార్టీ సభ్యురాలైన ఆమె నల్ల సముద్రం దగ్గరున్న ‘’అనప ‘’లో స్వంత ఎస్టేట్ ను నిర్వహిస్తూ ,ఆ పట్టణ మేయర్ గా ఎన్నిక అయింది . బందిపోటు దొంగల నుండి ప్రజల్ని రక్షిస్తూ బోల్షెవిక్ లను కూడా ఎదిరించి నిలిచింది . బోల్షివిక్ భావాలు నచ్చక ఎదిరించింది . అందుకే అరెస్ట్ కూడా అయింది . విడుదల తర్వాత తనతో పాటు ఖైదీలుగా ఉన్న వారికి ,అత్యల్ప ఆదాయ వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసింది . ఆమె అరెస్ట్ కేసును వాదించిన లాయర్ స్కోబ్త్సోవ నే రెండో పెళ్లి చేసుకకొంది .భర్తతో ,పిల్లలతో 1923  లో పారిస్ చేరింది .

            పారిస్ లో ఉండగా ‘’రష్యన్ స్టూడెంట్స్ మూమెంట్ ఇన్ ఎక్సైల్ ‘’నడిపింది .రష్యా నుండి పారి పోయి వలస వచ్చిన వారికి అన్ని రకాల సేవలందించాలని నిశ్చయించు కొన్నది . కూతురు మరణం, కొడుకు వేరే వెళ్లి పోవటం తో విరక్తి చెంది ‘’సాయం అవసరమైన వారందరి తానే తల్లి గా ‘’ఉండాలని భావించింది .  1932లో ‘’నన్’’అయింది . నలభై రెండేళ్ళ వయసులో ‘’మేరియా’’అనే కొత్త పేరు పెట్టుకొంది .అనేక కాన్వెంటు లను సందర్శించి అక్కడి దారుణ పరిస్థితులను గమనించి ఏంతో బాధ పడి,’’ఆర్ధడాక్స్ క్రిస్టియన్ మొనాస్టిజం ‘’ను ఏర్పరచి దీన జనోద్దరణ చేయాలని నిర్ణ యించుకోంది. ఇదే ధ్యేయం గా జీవించింది .

            1932 లో ఆర్తుల కోసం మొదటి గృహాన్ని  ప్రారంభించింది . డబ్బులు చేతిలో లేక పోయినా ధైర్యంగా పని ప్రారంభించింది .క్రమం గా విరాళాలు వెల్లువ గా వచ్చాయి . భగవంతుని మీదనే భారం వేసి కార్య క్రమం చేసేది . రెండేళ్లలో దారిద్ర నారాయణులకు పెద్ద భవనం లో హాస్టల్ తో సహా నివాసం ఉండే వీలు కల్పించింది  .పశువుల శాలలను  చర్చి లు గా మార్చి వాటి గోడలను తానె పెయింటింగ్ తో తీర్చి దిద్దింది . .తరువాత వృద్ధులకు ఆశ్రమాన్ని ఏర్పరచింది . ఇది గుర్తించిన ఫ్రెంచ్ ప్రభుత్వం కుష్టు రోగుల ఆవాసాలను ఏర్పరచింది .        

         ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద వారికి ,ముసలి వారికి రక్షణ ,భోజనాది సదుపాయాలూ కల్పిస్తూ తాను మాత్రం బీదరాలిగా చిన్నపాడు బడిన ఇంటిలో ఒంటరిగా ,హీటింగ్ సదుపాయం కూడా లేకుండా సాధారణ జీవితాన్ని గడిపి ఆదర్శ వంతం గా జీవించింది . ఆమె చిన్న కొంప పుస్తకాలు ,రాత ప్రతులు ,ఉత్తరాలు ,రసీదులతో నిండి పోయి ఉండేది . తెల్లవారక ముందే లేచి సెంట్రల్ మార్కెట్ కు వెళ్లి తాజా కూర గాయలను సరుకులను అతి తక్కువ రేట్ కే అక్కడి వారి కోసం కొని తెచ్చేది .  ఆ తర్వాత మీటింగులు ,నిర్వహణ బాధ్యత లతో రోజంతా సరి పోయేది .ఏ సమయం లో ఎవరొచ్చినా ఆమె తలుపు ఎప్పుడూ తెరిచి ఉంచేది .

          మేరియా కు సహాయ బృందం లో ఆమె కుమార్తె గైనా,ఏంతోమంది ప్రీస్టులు ,మొదలైన  అత్యంత సమర్దులుండే వారు .వారికి తానే తల్లిగా ప్రవర్తించి మాతృప్రేమ ను చూపేది ..అప్పటి నుండి ‘’మదర్ మేరియా’’ గా పిలువ బడింది . వలస వచ్చిన వారిలో తాగు బోతులు ,పనికి మాలిన వారు అసహాయులను తీసుకొని వచ్చి వారిని సక్రమ మార్గం లో నడిపించేది . వారికి ఆహారం, గూడు ,సలహా ,ప్రేరణలనిచ్చి మాతృప్రేమ ను చూపించి ఆదరించేది .వారిలో పరివర్తన తేవటమే ఆమె ధ్యేయం . బీద వలస దారులకు ‘’ధర్స్ డే స్కూల్స్ ‘’ నిర్వహించింది .

                   ఆర్ధ డాక్స్ చర్చి వారు ఆమె ధరించే సామాన్యమైన దుస్తులను చూసి ,ఏవ గించు కొనే వారు .ఆమె సిగరెట్ తాగటాన్ని వారు .హర్షించ లేదు .అందుకని ఆమె ‘’మేము చర్చి వారికి వామ భావాలున్న వారం గా , వామ పక్షీయులకు మేము పూర్తి చర్చి విశ్వాసం ఉన్న వారం గా కనిపిస్తాం .అందుకని ఆర్ధడాక్స్ చర్చి నుండి వేరు పడి‘’ఆర్ధడాక్స్ యాక్షన్ ‘’అనే దాన్ని ఏర్పాటు చేసింది . ఇది ఏ చర్చికి అనుబంధ సంస్థ కాదు . సర్వ స్వతంత్ర సంస్థ . దీనికి ఆమె చైర్ పర్సన్ గా వ్యవహరించింది . రష్యా మానసిక వికలాంగులకు కేంద్రాలనేర్పరచి ఆదుకోంది.ఎన్నో శరణాలయాలను సందర్శించి మానసిక స్తైర్యాన్ని కల్పించింది .

              1940 లో జర్మన్ అది నేత హిట్లర్ కు రష్యా లొంగి పోయింది .కాని లోర్మేల్ లో మేరియా పనులు ఆటంకం లేకుండా సాగి పోతున్నాయి .అందరికి ఆహారం అందించింది .దిన కృత్యం లో క్షణం తీరు బడి లేక పోయినా జబ్బు పడ్డ వారికి సేవచేసి నయం చేసింది . అర్ధ రాత్రి మీటింగులు ,చర్చలు , జరుగుతూనే ఉండేవి .  . ఫాదర్ డిమిత్రిక్లేపినిన్ ఆమె కు ఏంతో తోడ్పడే వాడు .

          హిట్లర్ దురహంకారాన్ని ఎదిరిస్తూ మదర్ మేరియా బహిరంగం గా ఎన్నో వ్యాసాలు  రాసింది ఫ్రెంచ్ వారు జర్మన్ ఫాక్టరీ లలో పని చేయాలని అంటించిన వాల్  పోస్టర్లను చిన్చేసింది .రష్యా నుంచి వలస వచ్చి,నాజీల చెర సాల పాలైన కుటుంబాల వారికి వెయ్యి మంది కి ఆహారం పొట్లాలు అంద జేసింది ..రష్యా వలస దారులకు ‘’ఐడెంటిటి కార్డులు ‘’ఇచ్చింది. హిట్లర్ ప్రభుత్వం  మేరియాను , ఫాదర్ దిమిత్రి లను కూడా తీసుకోమంటే వీరిద్దరూ తిరస్కరించారు అది అవమానంగా భావించారు .దాని వల్ల  ఇద్దరిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది .

               నాజీల చివరి ప్రయత్నం గా యూదులను ఏరి పారెయ్యటం ,చంపేయటం మొదలైంది . మేరియా ,దిమిత్రి లు ఎనభై మంది జ్యూ లకు వారు క్రిస్తియన్లు అని సర్తిఫికేట్లిచ్చి కాపాడారు .  1942 జులై 15 న నాజీలు యూదులను మొత్తం అరెస్ట్ చేసింది .మదర్ మేరియా లోర్నేల్ నుండి కిలో మీటర్ దూరం లో ఉన్న ‘’వేలోడ్రోం ‘’ స్టేడియం కు  చేరుకొంది అక్కడికి  సుమారు ఏడు వేల మంది  చిన్నా ,పెద్ద యూదులను నాజీలు  గొర్రెల మందను తోలు కెళ్ళి నట్లు తోలుకు వెళ్ళారు .ఇంట మందికి ఒకే మంచి నీటి పంపు ,పది మాత్రమె లెట్రిన్ లు ఉన్నాయక్కడ.

          1943 ఫిబ్రవరి ఎనిమిది న’’ నాజి గేస్తోపో పోలీసులు’’ మేరియా కొడుకు లూరా ను పట్టుకొన్నారు .ఇదివరకు ఈ పోలీసులే ఆమె కు,ఆమె సంస్తలకు  ఎన్నో రకాల సాయం చేశారు .కొడుకు జేబులో ఒక యూదు స్త్రీ దిమిత్రి ని బాప్టిస్ట్ సర్టి ఫికేట్ ఇవ్వమని కోరుతూ రాసిన ఉత్తరం దొరికింది .ఇదే ఆధారం గా ఫాదర్ ను నాలుగు గంటలపాటు విచారించారు . ..ఆయన ఆత్మ సంరక్షణను చేసుకో లేదు .తన జేబు లోని శిలువ బొమ్మను చూపి ‘’ఈయన యూదు డా “’?అని అడిగాడు .ఎదురు ప్రశ్న వేసి నందుకు చెంపలు పగల కొట్టారు .ఈయనను ,లూరా ను మరి కొంత మందిని అరెస్ట్ చేసి కామ్పీన్ లో ఏడాది ఉంచారు .ఫాదర్ న్యుమోనియా తోనూ , తీవ్రమైన కష్టమైన పని లో  చని పోయాడు లూరా కూడా అంతే

           మదర్ మేరియా ఫిబ్రవరి తొమ్మిది న విడిచి పెట్టారు .కొన్ని రోజుల తర్వాత గేస్తోపో పోలీసులు మళ్ళీ విచారించారు. ఆమె తన కూతురు తోబాటు కొంతమందికి సహాయం చేస్తోందని ఆరోపించారు .ఆమె ‘’నా కూతురు క్రిస్టియన్ గ్రీకు కాని జ్యూ కాని కాదు.మీరు ఏదైనా ఆపదలో ఉంటె ఆమె మీకూ సాయం  చేస్తుంది కూడా . కూడా ‘’ ‘’అని వాదించింది ..’’నీ కూతురు మళ్ళీ నీకు కనిపించదు ‘’అని తెగేసి చెప్పారు వాళ్ళు . అలాగే కూతుర్ని చంపేశారు .

               వెంటనే ఆమె స్తాపించిన ‘’ఆర్ధ డాక్స్ యాక్షన్ ‘’సంస్థను నాజీ ప్రభుత్వం నిషేధించింది . మేరియాను కామ్పీన్ లోని స్త్రీ కాంప్ కు చేర్చారు . మూడు రోజులు తిండీ తిప్పలు లేకుండా ఆమెను ఆమెతో పాటున్న మూడు వందల మంది మహిళలను ‘’రేవెంస్ బరాక్ కాన్సేన్త్రేషన్  కాంప్ కు తరలించారు . అక్కడే  ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ఆమె రెండేళ్ళు ఖైదీ గా ఉంది . ఎందరో ఖైదీలకు మంచి మాటలు చెప్పి ఊరడించింది. .ఖైదీ ల హాజరు  కోసం పొడవైన క్యూ లలో గంటల తరబడి గడ్డ కట్టే మంచులో నిలబడాల్సి వచ్చేది .   .ఆమెలో సహనం నశించి పోయింది .ఆరోగ్యం క్షీణించింది .ఫిబ్రవరి చివరలో నాజీ ప్రభుత్వం జబ్బు పడ్డ వారిని ,నడవలేని వారిని వెంటనే చంపేయాలని ఆర్డర్ జారీ చేసింది .

         గుడ్ ఫ్రైడే నాడు ఎందరో అభాగ్య  స్త్రీలను చంపేయాలని వరుసలో నిల బెట్టారు .అందులో మదర్ మేరియా ఉండటం చూసి మిగిలిన బందీలు చలించి పోయారు . తనతో బాటు చని పోయే వారి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పి ఓదార్చింది. చాలా మందిని విషవాయువు తోచంపారు .  .ఆ మర్నాడే 1945 మార్చ్ 31 న మదర్ పుట్టిన రోజు . ఆ రోజు  ఈస్తర్ ముందు రోజు కూడా . పవిత్ర శని వారం నాడు మేరియా ఒక యూదు మహిళ స్థానం లో నిలబడి  గాస్ చేంబర్ లో వీర మరణం పొందింది  . ఆమె భగవంతుని ప్రేమను అందరికి పంచి రుషి జీవితాన్ని గడిపిన మహిళా మణి  మదర్ మేరియా తనను నమ్మిన వారికి  తానెక్కడికివారిని విడిచి పోవటం లేదని వారితోనే ఉంటానని  సజీవం గానేఉంటానని  చివరి మాటలుగా చెప్పి చిరు నవ్వు తో.,నాజీ లకు తల వంచకుండా ధీర వనితగా మరణించింది . .

               – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

           

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో