సంపాదకీయం

జీనవకాంక్ష

మనస్సుల్లో యెన్నిమార్లు మనం గత పదిరోజులుగా యెంతగా విలపించామో… యెన్నో సార్లు యెవరిని నిందించలేని అసహాయతకి మనలని మనం నిందించుకొన్నామో… జలప్రవాహాన్ని పసికట్టలేనందుకు యెంతగా నొచ్చుకున్నామో… అన్నం ముందు కూర్చున్న ప్రతిసారీ కడుపెలాతరుక్కుపోయాయో… ఆకాశగంగా క్షమించు… మా మానవుల అంతులేని ఆశల అహంకారాన్ని.
….
నింపాదిగా ప్రవహించే నదిపై తొలి సూర్యకిరణం ప్రసరించే మిలమిలని , కొండకోనల మీదగా వురికే జలపాతపు తుంపర్లపై మయూఖం చిందించే సప్తవర్ణాలని చూపుల్లో నింపుకోవటం ముద్దొచ్చే అహ్లాదం. వర్షాహర్షంతో పర్వతసావులల్లోంచి వడివడిగా పరుగులెత్తుతూ నిండైన నదీప్రవాహాల జేగురురంగుని వొడ్డున నిలబడి కళ్లల్లో ప్రతిబింబించుకోవటం విస్మయానందం. అదుపు తప్పని ప్రవాహమెప్పుడూ సంతోషాశ్చర్యాల జీవనసుసంభరమే.

అసలు ఆ ప్రాంతం యెటువంటిది. సుదూర సమున్నత శిఖరాలు… పచ్చికబయళ్ల లోయలు… మైళ్లకు మైళ్లు వొంకటికర దారులు, మట్టిబాటలు, యిరుకుదారుల్ని… వో వైపంతా బండరాళ్ల మట్టి కొండలు… కిందగా గలగలలే వినిపించనంత మెల్లగా సాగే మందాకిని… ఆ గాలిలోని వుద్వేగభరితమైన సౌందర్యం అంతరంగాన్ని శుచిగాశుభ్రపరుస్తోంది. ఆ జీవనసుగంధం యాత్రికులని భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందుతారు.

రాత్రికి రాత్రి అంతా జలోత్సాదన… భీకరమైన హారుతో అంతా ఛిద్రమైపోయింది. ఆ బీభత్సదృశ్యాన్ని చూస్తు నిశ్చేష్టులైపోయారు. జరుగుతున్నదేంటో అర్ధమయ్యేలోగా ఆ చీకటిలో ఆ జడివానలో యాత్రికులు, ఆ పల్లెవాసులు ప్రాణభయంతో తెల్లవారుతుందాని అల్లాడిపోయారు. వీపరీతమైన భయం కమ్ముకొన్న సమయంలో దారీతెన్ను తెలియని జలసునామీలో యెవరిప్రాణాలని వారు కాపాడుకోడాని యెన్నెన్నో ప్రయత్నాలు. నిస్తేజంగా నీటిప్రవాహంలో కొట్టుకుపోయినవాళ్లెందరో.

కేదార్‌నాధ్‌ ఆలయం వెనుక కొట్టుకొచ్చి ఆగిన బండరాళ్లు నీటిప్రవాహపు వాలుని దారిమళ్లించి గుడిని మిగిల్చాయి. ప్రాణభయంతో పరిగెత్తి చివరికి వో చెట్టు యెక్కేసిన వో నడివయస్సు స్త్రీ , ఆదివారం వుదయం నుంచి మంగళవారం సాయంకాలం వరకు చెట్టు మీదే వొంటరిగా వున్నానని, చాలా ఆకలి వేసిందని , వర్షపు నీరు తాగుతు రెస్‌క్యూ టీమ్స్‌ వచ్చే వరకు గడిపిన వైనం వింటుంటే ఆశ్చర్యమేసింది. వొంటరితనం. చిక్కని చీకటి. వో మాదిరి అడివి. జోరున వర్షం. మరో వైపు జలవిలయం. రెండు రాత్రులు, మూడు పగటి దినాలు ఆమె అక్కడ గడిపారు. జీవనకాంక్ష యెంతో విలువైనది. యెంతో బలమైనది.

ప్రకృతిని లక్షచేతులతో మింగేద్దామనే అభివృద్ధికాంక్ష యెంత దుర్మార్గమైంది. మానవ అహంకారానికి నిలువెత్తు సాక్ష్యం యీ విధ్వంసం. ఆ గాలితో, ఆ కొండలతో, ఆ నదులతో, ఆ అడివితో, పచ్చికబయళ్లతో, పువ్వులతో, పాటలతో , ఆ పెంపుడు జంతువులతో మమేకమై వేలవేలసంత్సరాలుగా సహజీవనం చేస్తున్న ప్రజలు యెందరో… వూళ్లకి వూళ్లే కొట్టుకుపోయాయి. వారి జీవనమే అస్తవ్యస్తమైయిపోయింది. దేశవ్యాప్తంగా యెందరో ఆప్తులని పోగొట్టుకొన్న విషాదం.

సౌందర్యమూ… ప్రశాంతత… నిగూఢత్వం కలబోసిన ఆ మేఘాల వూదా వర్ణపు మంచులోయల్లో అలక్‌నందా,మందాకిని నదుల్లా యెప్పట్లా ఆ వైభవోజ్వలమైన గతం ప్రవహించడానికి యెంత కాలం పడుతుందో… ధ్వంస రచన చేసినంత సులువు కాదు కదా పున:నిర్మించటం… వొక్కటి మాత్రం సత్యం… యెంతటి ప్రళయంలోనైనా నోవ నౌకలో జీనవకాంక్షకి యెప్పుడు చోటుంటుంది.

– కుప్పిలి పద్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

4 Responses to సంపాదకీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో