మళ్లీ మాట్లాడుకుందాం

           అవును.  ఆ రోజు ఆ కుర్రాడు అలాగే అన్నాడు.  నాకు ఇప్పటికీ గుర్తుంది.  ఆ సంఘటన కాదు కాదు దుర్ఘటన జరిగిన తరువాత మేం ఆ అంశం మీద ఒక వర్క్ షాప్ నడిపాం.  కళాశాల విద్యార్దులు వారి తల్లితండ్రులు, అధ్యాపకులు, విద్యావంతులు మొదలైన వారంతా అందులో పాల్గొనేలా చూశాం.

ఆడపిల్లల మీద ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గం.  ఖండించాలి.  ఇదీ నినాదం.  అందరూ ఆవేశంతో ఊగిపోతూ, కరుణతో తడిసి పోయారు.  ఏడెనిమిది గ్రూప్ డిస్కషన్లు సమాంతరంగా నడుస్తున్నాయి ఇదే అంశం మీద.  నేను ఒక్కొక్కటీ  చూసుకుంటూ వస్తుండగా ఒక గ్రూప్ లోని యువకుడు ఏ మాత్రమూ ఆవేశపడకుండా ఈ మాటలు అన్నాడు.

‘ఆడ పిల్లలు మమ్మల్ని ఎన్ని రకాలుగా రెచ్చగొడతారో మీకు తెలుసా ?  మాతో లవ్ చెప్పి మా ఎదురుగానే మరొకడి బండి ఎక్కి తిరుగుతారు.  మాతో గొడవపడి వెంటనే మరొకడితో తిరుగుతారు.

మమ్మల్ని ఎంతగా రెచ్చగొడతారో  à°† విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడరు ?’

నేను తెల్లబోయాను.  వెంటనే అడిగాను.  ‘ఐతే à°† తప్పుకి శిక్ష మొహమ్మీద యాసిడ్ పోయడమా. మీరూ అలాంటి తప్పులు చేసి ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడైనా మీకు అలాంటి దౌర్జన్యకరమైన శిక్ష వేశారా ?’ అని అడిగాను.

ఆ అబ్బాయి వెంటనే ఏమి మాట్లాడలేదు కానీ చాలా సేపు గొణుగుతూనే ఉన్నాడు.  అంతేగాని తన ఆలోచనలోని తేడాని గమనించుకునే ప్రయత్నం చెయ్యలేదు.

ఈ మధ్య కాలంలో మనం మాట్లాడడం తగ్గించాం.  ఆ అబ్బాయిలాగ డిమాండ్  చేసే వారు

ఎక్కువయ్యారు.  తప్పదు అందుకే మనం అందరం మళ్లీ మళ్లీ మాట్లాడాలి.

మగవాడు తాను అన్నింటా అధికుడుగా ఉండాలి, ఉంటాడు.  వాడిని ప్రేమించే అమ్మాయి వాడి అధిక్యతలన్నింటిని మెచ్చుకోవాలి.  అంతకంటే తను తెలివైనదయినా సరే తెలివిలేనట్టు నటించాలి.

అవసరమైతే అతడిని రక్షించడానికి ఆ తెలివి వాడాలి.  తిట్టినా ఇష్టపడాలి.  వీటన్నిటికి అంగీకరించి అంత ప్రేమగానూ ఉన్నా కూడా మళ్లీ తనను గ్రేట్ అనాలి.  అలా అనకపోతే నీకు నామీద ప్రేమ లేదు అనేస్తాడు. ఇది నూరు శాతం ప్రేమ.  యువ దర్శకులు ఇలాంటి కథలతో పురుషాధిక్యతను తెలివిగా పునరుద్దరిస్తూ  యువతను ఉర్రూతలుగించే సినిమాలు తీస్తుంటే మనం మళ్లీ మాట్లడుకోవాల్సిన అవసరం కలుగుతోంది.

ఒకసారి నేనూ , ఒక విద్యావంతురాలైన  వృద్దురాలూ  కలిసి ప్రయాణం చేస్తున్నాం.

ఆమె దేశ దేశాలు  తిరిగి విజ్ఞానాన్ని ఆర్జించిన వ్యక్తి.  దార్లో ఒక ఉళ్ళో కారు ఆపినప్పుడు రోడ్డు వారగా రెండు కోడి పుంజులు ఒక దాన్ని ఒకటి డీకొంటూ  ఉండడం చూసాం.  ఆవిడ అంది కదా! చూసారా !

కోడిపుంజుల పౌరుషం. పెట్టకి à°ˆ పౌరుషం ఉండదు అని.  నేను వెంటనే “లింగ వివక్షను అంగీకరిస్తారా” అన్నాను.

ఆమె à°’à°• సమాధానం చెప్పింది. “నిజమే. పురుషులలో అహం, ఆధిక్యభావం ఉంటాయి.  స్త్రీలలో ప్రేమ, సహనం ఉంటాయి.  విదేశాలలో పురుషులకు తమలోని అహాన్ని, ఆధిక్యభావాన్ని తగ్గించుకోవాలని, స్త్రీల పట్ల గౌరవంతో, మర్యాదగా మెలగాలని చిన్నప్పటి నుంచి నేర్పుతారు.  వారిని à°† విధంగా వంచుతారు.  కాని మన దేశంలో పెంచిపోషిస్తారు.  తప్పని చెప్పరు.  మగవాడు దాన్ని తన హక్కు అనుకుంటాడు.  దౌర్జన్యాలు చేస్తాడు.  అతని పౌరుషాన్ని సామజిక సంక్షేమానికి ఉపయోగించాలని తెలుసుకోడు.  ఇలా ఇంకా చాల చెప్పింది ఆమె.  రెండేళ్ళు గడిచాయి. మళ్ళి మగ అహంకారాలు లేస్తున్నాయి.  మా మాటలని వినక పోతే పీకలు కోసేస్తాం అంటున్నాయి.

మీకు ఇష్టాలు, అభిప్రాయాలు  ఉండకూడదు.  ప్రకటించారా ! మేం సహించం అంటున్నాయి.

ఊరుకుంటే ఎలా ? మనం అందరం కలిసిమళ్లీ మళ్లీ మాట్లాడుకుందాం.

మీరు మగవారయినా మీరూ మనుషులే అని గుర్తుచేద్దాం.

– వాడ్రేవు వీరలక్ష్మి దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , Permalink

3 Responses to మళ్లీ మాట్లాడుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో