హలో ..డాక్టర్ !

1 . లేబరేటరీ లో చేయించాల్సిన వైద్య పరీక్షలు ?|
అ. మూత్రం పరీక్ష : మూత్రంలో షుగర్‌, ఆల్బుమిన్‌, చీముకణాలు వున్నాయేమో పరీక్షించాలి.
ఆ. రక్తపరీక్షలు : 
1. హిమోగ్లోబిన్‌ పరీక్ష :
        రక్తహీనత వుందో, లేదో తెలుస్తుంది
2. రక్తం గ్రూపు, ఆర్‌.హెచ్‌. టైపు  : 
        ఎ,బి, ఎబి, ఒ  గ్రూపులలో ఏగ్రూపు వుందో నిర్ధారించాలి.  ఆర్‌.హెచ్‌ .టైప్‌ పాజిటివ్‌ లేక నెగెటివ్‌ అనేది
         నిర్ధారించాలి. తల్లి ఆర్‌.హెచ్‌. టైప్‌ నెగెటివ్‌ అయితే బిడ్డ ఆర్‌. హెచ్‌. టైప్‌ పాజిటివ్‌ అయినప్పుడు కొన్ని సమస్యలు  
        వచ్చే అవకాశం వుంది.
3. వి.డి.ఆర్‌.ఎల్‌. టెస్ట్‌ :  
ఈ పరీక్ష ద్వారా తల్లికి సిఫిలిస్‌ వ్యాధి వున్నదీ లేనిదీ తెలుస్తుంది.  సిఫిలిస్‌ వ్యాధి వల్ల తల్లి,  బిడ్డలిరువురుకీ కొన్ని  సమస్యలు రావచ్చు.
4. రక్తంలో షుగర్‌ టెస్ట్‌ :
మధుమేహ వ్యాధిని, గుర్తించడానికి ఈ పరీక్ష అవసరం.  మధుమేహవ్యాధి వలన తల్లీబిడ్డ లిరువురికీ అనేక  సమస్యలు వస్తాయి.  బ్లడ్‌షుగర్‌ ఎక్కువ వుంటే ఆహారాన్ని నియంత్రిస్తూ మందులు వాడడం ద్వారా సమస్యల్ని  నివారించవచ్చు. 
5. ‘హెచ్‌ ఐ వి’ స్క్రీనింగ్‌ టెస్ట్‌ :
ఈ పరీక్ష నెగిటివ్‌ అయితే ఇన్ఫెక్షన్‌ లేదని అనుకోవడానికి వీల్లేదు.  విండోపీరియడ్‌లో వున్నప్పుడు శరీరంలో  ఇన్ఫెక్షన్‌ వున్నప్పటికి పరీక్ష నెగెటివ్‌గా రావచ్చు.  ఒకవేళ టెస్ట్‌ పాజిటివ్‌గా వస్తే తగిన చికిత్స చెయ్యడానికి, ప్రసవం  సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, గర్భాన్ని కొనసాగించడమా లేదా అనేది నిర్ణయించుకోవడానికి   వీలవుతుంది.  టెస్ట్‌ నెగెటిప్‌గా వచ్చినప్పుడు  మళ్ళీ 1 లేక 2 సార్లు పరీక్ష చెయ్యవలసివుంటుంది.  ప్రమాదకరమైన  లైంగిక ప్రవర్తన, మత్తుపదార్ధాల వ్యసనం వున్నవారికి ఇది మరీ అవసరం.
6. ‘హెపటైటిస్‌ – బి’ స్క్రీనింగ్‌ టెస్ట్‌ :
తల్లికి ‘హెపటైటిస్‌ – బి’ ‘హెపటైటిస్‌ – సి’ ఇన్ఫెక్షన్లు వుంటే శిశువుకు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం  వుంటుంది.  గర్భవతికి ఈ ఇన్ఫెక్షన్లు వున్నట్లు నిర్ధారణ అయితే ఆమెను జాగ్రత్తగా పర్యవేక్షించడానికి, సంరక్షించడానికి,  బిడ్డ పుట్టగానే చికిత్స చెయ్యడం ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఈ పరీక్ష చెయ్యడం  ఉపయోగపడుతుంది.  ఒకవేళ పరీక్ష నెగెటివ్‌గా వస్తే దాని అర్ధం ఇన్ఫెక్షన్‌ లేదని లేక పాజిటివ్‌గా వచ్చేంతగా  రక్తంలో ఏంటీబాడీలు లేవని, కాని ప్రమాదకరమైన లైంగిక ప్రవర్తన వున్న స్త్రీలకు, మత్తుపదార్ధాలు, మాదకద్రవ్యాల  వ్యసనం వున్న స్త్రీలకు మరొకసారి కొన్ని నెలలు గడిచాక ఈ పరీక్షను చెయ్యాలి.
7. టార్చ్‌ టెస్ట్‌  :
టాక్సోప్లాస్మోసిస్‌, రుబెల్లా, సైటోమెగలొవైరస్‌, హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఈ పరీక్ష  ఉపయోగపడుతుంది.  బిడ్డకు వైకల్యాలు కలిగించగల ఈ ఇన్ఫెక్షన్స్‌ గర్భవతికి సోకితే తొలిథలోనే గుర్తించి చికిత్స  చేయాలి.
8. జన్యు పరీక్ష :
        కుటుంబంలో వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న వ్యాధుల గురించి తెలుసుకోవడానికి, తల్లిదండ్రుల          వంశ చరిత్రను తెలుసుకోవడానికి జెనిటిక్‌ కౌన్సిలింగ్‌,  వారసత్వంగా సంక్రమించే వ్యాధుల్ని గుర్తించడానికి జన్యు  పరీక్ష, బిడ్డకు వైకల్యం రాగల ప్రమాదం వుందని తెలిపే ఇతర పరీక్షల్ని గర్భం రాకముందే చేస్తే మంచిది.
9. ఆల్ఫాఫీటోప్రోటీన్‌ టెస్ట్‌ :
తల్లి రక్తాన్ని పరీక్ష చెయ్యడం ద్వారా ఆమె రక్తంలోని ఆల్ఫాఫీటోప్రోటీన్‌ స్థాయి తెలుస్తుంది.  ఈ స్థాయి అసహజంగా  వుంటే బిడ్డకు మెదడు లేక వెన్నుబాము సమస్యలు, కవలలు, ప్రసవమయే తేదీని తప్పుగా అంచనా వేయడం లేక  ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’ వుందేమోనని అనుమానించాలి.  ఈ టెస్ట్‌ అనేక కారణాల వలన పాజిటివ్‌గా వస్తుంది కనుక  ఒకవేళ టెస్ట్‌ పాజిటివ్‌ అని వస్తే వ్యాధి నిర్ధారణ చేసేముందు ఈ పరీక్షను మరొకసారి చెయ్యడమే కాక ఇతర  పరీక్షల్ని కూడా చెయ్యాలి. 
10. ట్రిపిల్‌ స్క్రీన్‌ టెస్ట్‌ ( లేక ట్రిపుల్‌ మార్కర్‌)
ఈ పరీక్ష శిశువుకు పుట్టుకతో వచ్చే వైకల్యాలు లేక క్రోమోజోమ్స్‌ తేడాలు ఉండే ప్రమాదం గురించి సూచిస్తుంది.
ఈ పరీక్ష రక్తంలోని ఆల్ఫాఫీటోప్రోటీన్‌, హ్యూమన్‌ ఖోరియానిక్‌ గొనాడొట్రాపిన్‌ మరియు ఈస్ట్రియాల్‌ స్థాయిని  నిర్ధారించడం మీద ఆధారపడుతుంది. సామాన్యంగా 16 – 18 వారాల మధ్య ఈ పరీక్షను చేస్తారు. ఈ పరీక్ష తేడాలు వున్నాయని సూచిస్తుందే తప్ప ఏరకమైన తేడాలు వున్నాయో సూచించదు. ఏరకం వైకల్యమో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్షను చెయ్యాలి.

 11. ఖోరియానిక్‌ విల్లై శాంప్లింగ్‌ :

10-12 వారాల మధ్య చేసే ఈ పరీక్ష కూడా శిశువు జన్యు అభివృద్ధి గురించి తెలియజేస్తుంది.  మాయలోని  ఖోరియానిక్‌ విల్లైలోని కణాలను పరీక్షచేసి శిశువు శరీరకణాల్లోని జన్యుస్థితిని గుర్తించవచ్చు.  పొడవాటి సూదిని  మాయలోకి గుచ్చి ముక్కను తీసి పరీక్షిస్తారు.
ఏమ్నియాసెంటిసిస్‌ కంటే ఇంకా ముందుగా ఈ పరీక్షను చెయ్యవచ్చు, ఇది మరింత ఖచ్ఛితంగా జన్యుస్థితి నిర్ధారించే  పరీక్ష.
కాని, గర్భస్రావమయే ప్రమాదం ఏమ్నియోసెంటిసిస్‌ చేసినప్పటికంటే ఎక్కువ.  అంతేకాక ఈ పరీక్ష వలన  శిశువు కాళ్ళు, చేతులకు వైకల్యాలు వచ్చే ప్రమాదం వుందని కొంతమంది నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
12. నూఖల్‌ ట్రాన్స్‌లూసెన్సీ స్కీనింగ్‌ టెస్ట్‌ :
        ఈ పరీక్షనే నూఖల్‌ ఫోల్డ్‌  స్కాన్‌ అనికూడా అంటారు.  11-14 వారాల మధ్య అల్ట్రా సౌండ్‌ పరీక్ష ద్వారా శిశువు       
        మెడ వెనుక భాగంలోని ఖాళీభాగాన్ని వారానికొకసారి కొలవడం ద్వారా శిశువుకు వైకల్యాల ప్రమాదం వున్నదీ   
        లేనిదీ గుర్తిస్తారు.
డౌన్స్‌ సిండ్రోమ్‌ లాంటి కొన్ని సమస్యలలో ఈ ఖాళీభాగంలో ఎక్కువ ద్రవం వున్నట్లు స్కానింగ్‌ నిపుణులు గుర్తించారు.   ఐతే, ట్రిపుల్‌ మార్కర్‌ టెస్ట్‌ లాగానే ఈ పరీక్ష కూడా వైకల్యాల ప్రమాదాన్ని సూచిస్తుందే తప్ప ఏ వైకల్యం రాగలదో  తెలియజెప్పును. అందుచేత ఈ పరీక్ష పాజిటివ్‌ అనిపిస్తే నిర్ధారణగా గుర్తించేందుకు ఖోరియానిక్‌ విల్లై శాంప్లింగ్‌  లేక ఏమ్నియోసెంటిసిస్‌ చెయ్యాలి.
13 ఏమ్నియో సెంటిసిస్‌ :
శిశువు చుట్టూ వుండే ఉమ్మనీరును (ఏమ్మియాటిక్‌ ఫ్లూయిడ్‌) తీసి పరీక్ష చేస్తే శిశువు జన్యు అభివృద్ధి సజావుగా  వున్నదా,  ఏమైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నాయా అని తెలుస్తాయి.  15 – 16 వారాల గర్భం పెరిగాక తల్లిపొట్టమీద పొడవాటి  సూదిని గుచ్చి గర్భాశయంలోని ఉమ్మనీటిని తీసి కణాల్ని పరీక్షించడం ద్వారా క్రోమోజోమ్స్‌ తేడాలు, డౌన్స్‌  సిండ్రోమ్‌, టే-సాక్స్‌ డిసీజ్‌, హంటర్స్‌ సిండ్రోమ్‌ మొదలైన వాటిని దాదాపుగా ఖచ్చితంగా కనిపెట్టవచ్చు.
ఈ పరీక్ష చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు. అతి అరుదుగా అయినప్పుటికి రక్తస్రావం,  ఉమ్మనీటి సంచి పగిలిపోయి గర్భస్రావమయే ప్రమాదాలు ఉన్నాయి.
ఈ పరీక్ష ఎప్పుడు అవసరం?
1 35 సంవత్సరాలు దాటాక గర్భం వచ్చినప్పుడు
2. ఇంతకు ముందు గర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు 
3. జన్యు సమస్యల వంశ చరిత్ర వున్నప్పుడు
4. శిశువు ఊపిరితిత్తుల పరిణతి గురించి చివరి 3 నెలల్లో తెలుసుకోవలసి వచ్చినప్పుడు
5. సెక్స్‌తో ముడిపడివున్న వ్యాధుల్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా గర్భస్థ శిశువు సెక్స్‌ నిర్ధారించేందుకు.
ఇతర అవసరాలు లేకుండా కేవలం గర్భస్థ శిశువు సెక్స్‌ నిర్ధారణ కోసం ఈ పరీక్షను చెయ్యడం భారతదేశంలో  నిషేధింపబడింది.
14 అల్ట్రాసౌండ్‌ పరీక్ష :
1. నెల తప్పిన వారంలోపే గర్భాన్ని నిర్ధారించడానికి
2. క్రమబద్ధంగా బహిష్టులు రాని వారికి గర్భాన్ని నిర్ధారించడానికి, శిశువు వయసును, ప్రసవమయే తేదిని అంచనా  వేయడానిక,ి 12 వారాలకు ఈ పరీక్షను చేస్తే ప్రసవతేదీని దాదాపుగా ఖచ్ఛితంగా అంచనా వేయవచ్చు.
3. గర్భాశయం వెలుపలి గర్భాన్ని (ఎక్టాపిక్‌ ప్రెగ్నెన్సీ) కనుగొనడానికి, పిండం సజీవంగా వుందో లేదో తెలుసుకోవడానికి
4. ముత్యాలగర్భం వుందా అనేది తెలుసుకొనడానికి 
5. కవలలు వున్నారేమో తెలుసుకొనడానికి
6. ఆఖరి బహిష్టు తేది గుర్తులేనప్పుడు శిశువు వయసును నిర్ణయించడానికి
7. శిశువుకు అంగవైకల్యాలు వున్నాయేమో తెలుసుకోవడానికి
8. బిడ్డ పొజిషన్‌ ఎలావుందో గమనించడానికి
9. మాయ గర్భాశయంలో పైభాగంలో వుందో, క్రిందిభాగంలో వుందో తెలుసుకొనడానికి, కవలలు వుంటే ఒక్క  మాయ వుందో, రెండు వేర్వేరు మాయలు వున్నాయా అనేది తెలుసుకొనడానికి 10. ఉమ్మనీరు సరిపడా వుందా, ఎక్కువగా లేక తక్కువగా వుందా అనేది తెలుసుకొనడానికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. 16-18 వారాలు గర్భం పెరిగాక ఈ పరీక్షను చేస్తే శిశువు అంగ వైకల్యాల్ని ఖచ్ఛితంగా గుర్తించవచ్చు. అంతేకాక చివరి నెలల్లో శిశువు వుండవలసిన దానికంటే చిన్నదిగా వున్నప్పుడు అది సరిగ్గా పెరగలేదా లేక లెక్క తప్పా అనేది తెలుసుకొనడానికి 16-18 వారాల మధ్య చేసిన పరీక్ష రికార్డు ఉపయోగపడుతుంది. 2 వ సారినుండి పరీక్షకు వచ్చినప్పుడు చెయ్యవలసినవి : 1. బరువు, రక్తపోటు చూడడం 2. మూత్రం పరీక్ష 3. ఐరన్‌, ఫోలిక్‌ ఏసిడ్‌ మాత్రలు, ఇతర అవసరమైన మందుల్ని ఇవ్వడం లేక కొనుక్కోవడానికి రాసి ఇవ్వడం. 4. ధనుర్వాతం ఇంజక్షన్‌ 5. పోషకాహారం, ఫామిలీప్లానింగ్‌, తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవం, తల్లిగా నిర్వహించబోయే విధుల గురించి సూచనలు 6. అవసరమైనప్పుడు అన్ని సౌకర్యాలు వున్న ఆరోగ్యకేంద్రానికి పంపడం.

 – డా. ఆలూరి విజయలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో