ముకు తాడు -3

ఆ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో “నా లుంగీ ఎక్కడా?” అంటూ చంద్రనుద్దేసించి గట్టిగా అరిచాడు.

“కారు లోంచి ఎవరన్నా నా సూట్ కేస్ తెచ్చారా?”

“ నా కళ్ళ జోడు ఎక్కడుంది? ఈ ఇంట్లో ఎదీ కనబడదు. ఎక్కడ పెట్టినవి అక్కడ ఉండవు.”

ఇంతకీ అతను కళ్ళ జోడు కళ్ళకు పెట్టుకునే వున్నాడు.

భోజనానికి కిందకు వచ్చాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. మనిషి తడబడుతూ నడుస్తున్నాడు.మాట కూడా ముద్దగా వస్తోంది. తాగి డ్రైవ్ చేస్తున్నందుకు పోలీసులు అతన్ని అరెస్టు చెయ్యక పోవడమే అదృష్టం.

“భోజనంలోకి ఏం చేసావు? చపాతి, కూటు నా? నాకవి ఇష్టం లేదు. ఉప్మా చెయ్యి. కొన్ని వుల్లిపాయలు సన్నగా తరిగి కలుపు.. తొందరగా చెయ్యి. రాత్రంతా

నువ్వు చేసే చెత్త వంట కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా?” విసుక్కున్నాడు.

భోజనాలు అవడం ఆలశ్యం, చంద్ర, మల్లిక, మంజు తమ కంచాలు కడిగేశారు. మనో భోజనానికి రాలేదు. మూర్తి ఆ విషయం గ్రహించే స్టితిలో లేడు. భోజనం అవడం ఆలశ్యం తన గదిలోకి వెళ్లి పోయాడు.

‘ అదీ ఒకందుకు మంచిదేలే’ అనుకుంది చంద్ర. మనో కి భోజనం అతని గదికి తీసుకు వెళ్ళింది.

పనంతా అయ్యాక కింద గదులన్నిటికి గడియలు పెట్టి, అలసటగా మేడ మీదకు వచ్చింది చంద్ర. పొద్దున్నించి జరిగిన విషయాలు ఆమెను కలవర పెడుతున్నాయి. జరిగినవన్ని మర్చి పోయి, కళ్ళు మూసుకుని పడుకుంటే గానీ ఆమెకు నిద్ర పట్టేలా లేదు.

గదిలో టి.వి.మోగుతోంది. మూర్తి మేలుకొనే వున్నాడు. ఆమె గదిలోకి అడుగు పెట్టడం ఆలశ్యం, అతను దగ్గరికి లాక్కున్నాడు. అతని స్పర్శ ఆమెకు కంపరం పుట్టిస్తోంది.

“ ప్లీజ్, అవతల  పిల్లలున్నారు. ఇంకా వాళ్ళు పడుకో లేదు. హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. వద్దు… ఆమె ఎంత బ్రతిమాలితే అతను అంత గట్టిగా పట్టుపడతాడు. ఆమె మాటలు గాలికి పోతాయి కాని, అతని చెవి లోకి దూరవు. కాసేపట్లో అతని నిద్ర పోయాడు. చంద్ర లేచి స్నానం చేసి, అప్పుడు వచ్చి పడుకుంది.

** ** ***

మర్నాడు మాములుగానే తెల్లారింది. నిన్న జరిగిన సంగతులన్నీ చంద్ర మనసు కలచి వేస్తునాయి. అయినా తమాయించుకుని కాఫీ తీసుకుని మనో గదిలోకి వెళ్ళింది.

“ ఎలా వుంది నాన్నా?”

మనో మాట్లాడ లేదు.

“కొద్దిగా నయమేనా?”

అప్పటికి మనో మాట్లాడ లేదు. ఆమె అతని పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ,అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి.

పొద్దున్న పూట కొడుకుతో ఇంకా సమయం గడిపే వీలు లేదు. ఆమె చెయ్యాల్సిన పన్లు చాలా వున్నాయి.

కిచెన్ లోకి వచ్చింది.కాని ఆమె మనసంతా మనో చుట్టూనే తిరుగుతోంది. ఏ విషయమూ చెప్పడయ్యే. ఏమీ చెప్పక పొతే ఎలా తెలుస్తుంది?

అలవాటైన పనులే కనుక గబగబా పని చేసేస్తోంది. ఇవాళ మూర్తి తన కాఫీకి ఏ వంకా పెట్టినట్లు లేదు. లేక పోతే, వంక పెట్టినా తనూ గమనించ లేదేమో.

ఆఫీసుకు వెళ్ళడానికి తయారై ఎనిమిదిన్నరకు మూర్తి కిందికి వచ్చాడు. మల్లిక స్కూల్ బస్సు లో అప్పటికే వెళ్లి పోయింది. కాలేజిలో తనను దింపడానికి తండ్రి కోసం మంజు ఎదురు చూస్తోంది.

మనో అక్కడ లేక పోవడం చూసి, మూర్తి “మనో ఏడి? పొద్దున్న నుంచి వాడ్ని చూడనేలేదు. అప్పుడే కాలేజికి వెళ్ళిపోయాడా?” అడిగాడు.

“లేదు. వాడి గదిలో వున్నాడు”.చెప్పింది చంద్ర .

మూర్తి మనో గదికి వెళ్లాడు. “ఓయ్! ఏంటి? కాలేజికి ఆలశ్యం అవడంలేదా?” అడిగాడు.

‘ఓయ్’ అతను అందర్నీ పిలిచే పద్ధతి. మాకు పేర్లు లేవా? అనబోయింది చంద్ర. ఇలాంటి వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు.

మనో తండ్రి వంక చూసి ఏమి మాట్లాడ లేదు.

“కాలేజి లేదా”

మనో జవాబు ఇవ్వ లేదు.

“ ఏదో ఒకటి మాట్లాడవేం? నోరు పడిపోయిందా, లేక పోతే చెవుడు గానీ వచ్చిందా?”

ఆదంతా గమస్తున్న చంద్ర వెంటనే మనోను ఆదుకుంది..

“పోనీండి. నిన్నటి నుంచి వాడికి ఒంట్లో బాగా లేదు. “

“ ఏమైంది? నాకు బాగానే ఉన్నట్లు కనబడుతున్నాడే! ఇదొక వంక కాలేజి ఎగ గొట్టి తిరగడానికి!”

అప్పటి దాకా మౌనంగా వున్న మనో చర్రున లేచాడు. అతనికి వంటి మీద కారం పూసినట్లుంది.

“ ఏదో ఒక వంక పెట్టడం నాకేం అవసరం లేదు. మీకు ఆ అవసరం ఉందేమో! అబద్ధాలు ఆడుతున్నది, మోసం చేస్తున్నదీ మీరు!” అనేశాడు.

చిన్న విషయాలకే నోరు పారేసుకునే మూర్తికి కొడుకు మాటలు కోపం తెప్పించాయి.కళ్ళు ఎర్రబాడ్డాయి.

“ఏ మాట్లాడుతున్నావురా? ఏం మోసాలూ, ఏం అబద్ధాలు ఆడాను? ఏమంటున్నావూ? చెప్పేదేదో సరిగా చెప్పి ఏడు” ఉరిమాడు.

చంద్ర తండ్రి కొడుకుల వాగ్వివాదం చూసి కంగారు పడింది.

వెంటనే మూర్తి మొహంలోకి చూస్తూ “ చికాకు పడకండి. వాడికి బాగా లేదని చెప్పాను కదా. వాడేమి మాట్లాడుతున్నాడో వాడికే తెలియడం లేదు. వాడ్ని వదిలెయ్యండి. కాసేపు ఆగితే వాడే సర్డుకుంటాడు.” అంటూ భర్తకు సర్ది చెప్పింది చంద్ర.

మంజు వెంటనే అందుకుంది “ డాడి! మీరు రండి డాడి! టైమైపోతోంది నాకు! వాడికి నిన్నట్నుంచి బాగా లేదు.” చేత్తో తండ్రిని లాగుతూ తొందర పెట్టింది.

కొడుకు మాటలతో మూర్తి చాలా కోపంగా వున్నాడు. కాని, ఆఫీసుకు టైమవుతోందని వెంటనే వెళ్లి పోయాడు. చంద్ర ఒక్క సారి వూపిరి పిల్చుకుంది. మనోను వంటరిగా వదిలేసి వంట గదిలోకి వెళ్లి పోయింది.

వంటింట్లో పని చేస్తూనే మనోతో ఎలా మాట్లాడితే వాడు అసలు విషయం చేబుతాడోనని ఆలోచిస్తోంది. పనిమనిషిని పచారీ సామాను తెమ్మని బజారు పంపించి, మనో గదిలోకి వచ్చింది.

మనో చేతులు తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా, మృదువుగా “ ఏమిటి రా నాన్నా! నాన్నా గారితో అలా మాట్లాడ వచ్చా? ఏమైంది నీకు? అసలు నీ బాధ ఏమిటో చెప్పు. ఎవరైనా ఏమైనా అన్నారా?” అడిగింది.

మనో మాట్లాడ లేదు.

“ నువ్వు చెప్పక పోతే నాకు ఎలా తెలుస్తుంది?”

మనో అమ్మ వంక చిరాకుగా చూశాడు. ఆవిడ అసలు ఈ విషయం వదిలేటట్టు లేదు.

“ అమ్మా, నీకు తెలుసు. నేను ఆ విషయం నీకు చెప్పను.”

“ ఏం ఎందుకని?”

“ అదంతే! చెప్పను అంతే్…”

చంద్ర కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. వీడికి సహాయ పడాలనేగా తనూ తాపత్రయ పడుతోంది! అందరి తల్లుల లాగానే తనూ తన పిల్లలకు ఎలాంటి కష్టము రాకూడదనే ఆలోచిస్తోంది.

ఏ విషయము చెప్పక పోతే తను ఏ చెయ్య గలదు?

మరొక సారి ప్రయత్నిద్దామని నిశ్చయించుకుంది. వేరే విధంగా అడిగితే చేబుతాడేమో.

“ చూడు నాన్నా! నువ్వు పెద్ద వాడివి అయ్యావు. నాకు చెబుతావా లేదాని పది సార్లు అడిగి,అరిచి నిన్ను విసిగించ లేను. కాని నేను నీకు అమ్మను రా! నువ్వు ఏదో తల్చుకుని బాధ పడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోను? నాకు అసలు సంగతి చెప్పక పోతే, నేను ఏం చెయ్యగలను?”

“అమ్మా ,ప్లీజ్, నన్నేమి అడక్కు! నా చేత చెప్పిద్దామని చూడకు.”

ఇక బలవంత పెడితే మనో చెబుతాడని చంద్ర గ్రహించింది. ఏమైనా సరే, వాడి బాధకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది.

“లేదు! నాకు విషయం ఏమిటో నువ్వు చెప్పితీరాలి!” దృడంగా చెప్పింది.

ఇక తప్పేటట్లు లేదు. కాని అమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలి మనో ఆలోచిస్తునాడు. మనో లేచి నిలబడ్డాడు. గదిలో అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు.

చంద్ర మౌనంగా వుంది. అతను ఇంత బాధ పడుతున్నది ఏదో తీవ్రమైన విషయం గురించే. ఎలా చెప్పాలో అతనే నిర్ణయించుకొని చెబుతాడు.

చాలా సేపటికి మనో నోరు విప్పాడు “ సరే, అమ్మా నువ్వు ఇంతగా బలవంత పెట్టావు గనుక చెబుతున్నా! నాన్నను నళినితో చూసాను.”

“నళినా?ఎవరావిడ?” ప్రశ్నించింది

“ నాన్న పర్సనల్ సెక్రటరి “

“ అదేనా? నాన్నను ఆయన పర్సనల్ సెక్రటరితో చూసావు! దానికే ఇంత కలవర పడుతున్నావా? వాళ్ళిద్దరూ ఏదో మీటింగుకు వెడుతూ వుండి వుంటారు. అంతే!”

మనో పిడికిలి బిగుసుకుంది. తండ్రి చేస్తున్న వెధవ పని గురించి తన తల్లికి ఎలా చెప్పగలడు ?

కాని తప్పదు. వున్న విషయం చెప్పక తప్పదు!

“ అమ్మా నువ్వుట్టి అమాయకురాలివి! వాళ్ళిద్దర్నీ నేనొక హోటల్లో చూసాను.”

“మనో, వాళ్ళిద్దరూ ఏకాఫీ తాగడానికో, టిఫిన్ చెయ్యడానికో వెళ్లి వుంటారు.”

“ అమ్మా, నీకు అట్లా అనుకోవడమే ఇష్టమా? నేను ఆ వేళ పొద్దున్న పదకొండు గంటలకు జరిగిన విషయం చెబుతున్నాను. పొద్దున్న పదకోండు గంటలకు జరిగిందిది. అర్ధమైందా! ఆ రోజు నేను నా స్నేహితుడు జరగబోయే పార్టీ గురించి చర్చిద్దామని ఆ హోటల్ కు వెళ్ళాము. ఆవేళ నాన్న రిసెప్షన్ లో తాళం చెవులు తీసుకోవడం నేను కళ్ళారా చూసాను. అంతే కాదు “ నళినీ, రావోయ్! పోదాం!” అనడం విన్నాను. వాళ్ళిద్దరూ ప్రపంచంతో సంబధం లేనట్లు చేతులు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లడం చూసాను.”

మనో కళ్ళు మూసుకున్నాడు. ఎంతో ప్రయత్నం మీద ఆ విషయాన్నీ చెబుతున్నట్లుంది. నేను వెంటనే రిసెప్షనిస్ట్ ను అడిగాను వాళ్ళు ఎవరని. అతను వెంటనే చెప్ప లేదు. చివరకు గొణుగుతూ చెప్పాడు. “వాళ్ళు మీకు తెలుసా?వాళ్ళను గురించి నన్ను అడకండి. ఆయనొక పెద్ద మనిషి. దయ చేసి ఎక్కడా అనకండి. మా బిజినెస్ దెబ్బ తింటుంది.”

మనో తన మనసులో బాధను బయట పెట్టాడు. అతని కోపం ఇప్పుడు బయట పడుతోంది. మొహం అంతా ఎర్రబడి పోయింది. కోపాన్ని అణుచుకోలేక మంచం పై వాలి పడుకున్నాడు. తల్లితో అంతా చెప్పాక కూడా అతని బాధ తగ్గినట్లు లేదు.

చంద్ర మనసు శూన్య మైపోయింది. ఆమెకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. ఎటో చూస్తూ అక్కడే కూర్చుండి పోయింది.

 

(ఇంకా వుంది)

తమిళ మూలం: శివశంకరి

తెలుగు : 

టి.వి.యస్. రామానుజరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Uncategorized, Permalink

One Response to ముకు తాడు -3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో