ముకుతాడు

     

Ramaanujam

Ramaanujam

కళ్ళు మూసుకుని పడుకున్నదే కాని వచ్చిందేవరో అన్న ఆలోచన ఆమెకు నిద్ర పట్టనివ్వ లేదు. అప్పుడే గోడ గడియారం గంట కొట్టింది. టైము చుస్తే 11.30 అయ్యింది. బహుశా స్కూల్ కు, కాలేజికి క్యారేజిలు తీసుకెళ్ళే ఆమె వచ్చిందేమో. లేక పొతే ఆఫీస్ ప్యూన్ అయి వుండాలి.

వాళ్ళు ఎవరైనా ఇంత తొందరగానా? “ స్కూల్ లేదా తమ్ముడూ?’ అన్న పని మనిషి మాట విని కళ్ళు తెరిచింది.

పనిమనిషి తలుపు తెరవడం, మనో లోపలికి విసురుగా రావడం ఒకే సారి జరిగాయి. తలుపు ఎవరు తీసినది అతను గమనించ లేదు. కళ్ళు ఎర్రగా, మొహం కందిపోయి కోపంగా వుంది. దవడలు బిగుసుకుని ఏదో ఉపద్రవాన్ని దాచి పెట్టిన వాడిలా వున్నాడు అతను.

మాట్లాడకుండా తనని దాటి వెళ్ళిపోతున్న మనో చెయ్యి పట్టుకుని ఆపింది “ ఏమైంది కన్నా? ఏమిటి ఇంత తొందరగా వచ్చేశావు? కాలేజి లేదా?” ప్రశ్నించింది చంద్ర.

మనో ఏమి మాట్లాడలేదు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ధడేల్ మని గది తలుపులు వేసాడు. చేతిలో పుస్తకాలు మంచంపై విసిరేశాడు. మళ్ళీ చేతిలోకి తీసుకుని తిరిగి టేబుల్ మీద పెద్దగా చప్పుడు చేస్తూ పడేసాడు. “చీ” అంటూ గట్టిగా వుమ్మేసాడు. అతని చిరాకులన్ని  చంద్రకు వినబడుతూనే వున్నాయి.

అతని గదిలోకి నడిచింది. మనో మంచం మీద అడ్డంగా పడుకుని వున్నాడు. మొహం దిండులో దాచుకున్నాడు. ‘ ఏమై వుంటుంది. ఎందుకంత చికాకుగా వున్నాడు? వొంట్లో బాగా లేదా? లేదు. మనిషి కోపంగా వున్నాడు, అనారోగ్యం కాదు గదా ‘. చంద్ర అతని దగ్గరకు వెళ్లి నుదిటిపై చెయ్యి పెట్టి చూసింది. చల్లగానే వుంది. జ్వరం కాదు. ఏమైంది మరి?

చంద్ర వులిక్కి పడింది. కొడుకు కళ్ళ లో నీళ్ళు ఆమె చూడ లేక పోయింది. “ఏమిటి మనో?’ లాలనగా అడిగింది. అతని మోహంలో కోపం,బాధ కలగలిసి కన్నీళ్ళు రూపంలో బయట పడుతున్నాయి. ఆమె అతని మొహంలోకి సూటిగా చూసింది.

“మనో ఏమిటలా వున్నావు?” లాలనగా అడిగింది.

మనో మాట్లాడ లేదు. మరింత ముడుచుకుని పడుకున్నాడు.

“మనో….” మళ్ళి పిలిచింది.

“ మనో అలాగే పడుకున్నాడు. ఒక సారి తలెత్తి గాలి పీల్చుకుని మళ్ళి తల దిండులో పెట్టుకున్నాడు.

చంద్ర అతన్ని కదిపింది.

“అమ్మా నన్ను ఒంటరిగా కాసేపు ఒదిలేయ్యి….” కోపంగా ఒకొక్క మాటా వత్తి పలికాడు.

చంద్ర వులిక్కిపడి చెయ్యి వెనక్కి తీసేసుకుంది.

ఏ విషయమూ ఎన్నడూ దాచని వాడు, తన కొంగు పట్టుకుని తిరిగే వాడు, 20 సంవత్సరాలు పెరిగిన తన కొడుకు ఇవాళ తనని ఒంటరిగా ఒదిలేయమని అంటున్నాడు.

కంప్యూటర్ సైన్సులో మాస్టర్ డిగ్రీ చేస్తున్న మనో ఎప్పుడూ శాంతంగా నిదానంగా వుంటాడు. తగువులు, పోట్లాటలకు దూరంగా వుంటాడు. కాలేజి లో తన కున్న కొద్ది మంది మిత్రులతోనో, లేకపోతే ఇంట్లోనో తప్ప వేరే వ్యవహారాల జోలికి పోడు. అలాంటి వాడు ఎందుకు అలా వున్నాడు? ఏదో జరిగింది.

ఇంతలో మనో తలెత్తి కళ్ళవెంట నీళ్ళు కారుస్తూ “అమ్మా” అంటూ చంద్ర చెయ్యి పట్టుకున్నాడు.

చంద్ర వులిక్కి పడింది. కొడుకు కళ్ళ లో నీళ్ళు ఆమె చూడ లేక పోయింది. “ఏమిటి మనో?’ లాలనగా అడిగింది. అతని మోహంలో కోపం,బాధ కలగలిసి కన్నీళ్ళు రూపంలో బయట పడుతున్నాయి. ఆమె అతని మొహంలోకి సూటిగా చూసింది.

“మనో ….ఎలాంటి బాధ అయినా నాతో చెప్పు నాన్నా?” మెల్లగా అడిగింది.

మనో తల తిప్పుకుని కిందికి  చూస్తూ నెమ్మదిగా అన్నాడు “ ఏం లే్దు “. అతని మోహంలో బాధ కనబడుతోంది.

చంద్ర ఈ సారి కొద్దిగా ధైర్యం తెచ్చుకుని, “కాలేజి నుంచి అంత తొందరగా వచ్చేసావేం?” ప్రశ్నించింది.

“ కాలేజికి బంకు కోడదామని అనిపించింది” ఎటో చూస్తూ అన్నాడు.

“ పరీక్ష అన్నావుగా? అయిపోయిందా? ఎలా రాశావు?” అడిగింది.

మనో మాట్లాడ లేదు.

“ మనో..”చంద్ర నెమ్మదిగా పిలిచింది.

“ ప్లీజ్, అమ్మా నీ ప్రశ్నలు ఆపుతావా ఇంక? దయచేసి కొద్ది సేపూ నన్ను వంటరిగా వదిలెయ్యి. ప్లీజ్!” అన్నాడు మనో.

చంద్ర ఇక మాట్లాడ లేదు. లేచి వెంటనే ఇవతలకు వచ్చేసింది.

చంద్రకు చాలా పని వుంది. మూర్తికి, మల్లిక, మంజు లకు మద్యాన్న భోజనం రెడీ చేసి క్యారేజిలలో పంపాలి. మూర్తి! అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది’ ఇదేమిటీ,తను మూర్తిని భర్తగా అనుకోవడం లేదు!’

క్యారేజిలు సర్దుతూ కుడా ఆమె మనో గురించే ఆలోచిస్తోంది. తను ఎంత బతిమాలినా ఏమి చెప్పలేదు. ఏమై వుంటుంది? ఏదన్నా దెబ్బలాట జరిగి వుంటుందా? లేక, ఏదైనా గొడవలో ఇరుక్కున్నాడా? లేక వాళ్ళ ప్రొఫెసర్  ఏదైనా అని వుంటాడా?

ఏదో చాలా పెద్ద విషయమే అయి వుండాలి. లేక పొతే అంత బాధ పడడు

మంజు స్టెల్లా మెరీస్ కాలేజిలో ఇంటరు మొదటి సంవత్సరం చదువుతోంది. మల్లిక చదువు స్కూల్ లో ఈ సంవత్సరం తో అయిపోతుంది. . మంజుకు పెరుగాన్నంతో ఆవకాయ నమ్జుకోవడం ఇష్టం. మల్లికకు నిమ్మకాయ పచ్చడి ఇష్టం. మూర్తికి పళ్ళకారం ఇష్టం.

యాత్రికంగా ముగ్గురికి క్యారేజిలు సర్ది, ఆఫీసు ప్యూన్ కు మూర్తి క్యారేజి, ఆడ పిల్లలిద్దరి క్యారేజిలు, క్యారేజిలు తీసుకెళ్లే అమ్మాయికి ఇచ్చి పంపించింది.

పని మనిషిని పంపించి తలుపు గొళ్ళెం పెట్టింది. మేడ మీద మనో గదికి వెళ్ళింది. సమయం పన్నెండున్నర. సుమారు గంట నుంచి మనో అలాగే పై కప్పు వంక చూస్తూ పడుకుని వున్నాడు. ఫాను గాని, ఏ.సి. గాని వేసుకోలేదు. గది అంతా వేడిగా వుంది.

“ మనో..” ప్రేమగా పిలిచింది.

మనో మాట్లాడ లేదు.

“ఏమైంది నాన్నా ?”

మనో దగ్గర్నుంచి జవాబు లేదు.

“మనో…..” అతని తల నిమురుతూ పిలిచింది.

మనో ఆమెకేసి ఒక సారి చూసి దిండులో తల దూర్చి పడుకున్నాడు.

మాట్లాడకుండా పడుకున్న కొడుకుని చూసి చంద్ర లేచి కిందకు వచ్చేసింది. ఒక అర గంట ఆగి మధ్యాన్నం భోజనానికి పిలిచి మాట్లాడవచ్చులే అనుకుంది. డైనింగ్ హాల్లో కూర్చుని వార పత్రిక తిరగేస్తూ గడియారం వంక చూసింది. గడియారం అక్కడే ఆగిపోయినట్లు అనిపించింది ఆమెకు, ఎలాగో అర గంట గడిచింది. చేతిలో పుస్తకం పక్కన పడేసి మనో గదిలోకి వెళ్ళింది.

“ కిందకు వచ్చి నాతొ అన్నం తింటావా?” అడిగింది

“వద్దు” అన్నాడు మనో.

“ఏమైంది రా? ఏదైనా వుంటే నాతొ చెప్పకూడదా? చిన్న చిన్న విషయాలకే అన్నం మానేస్తారా ఎవరైనా?” అతని గడ్డం పట్టుకుని బ్రతిమ లాడింది.

మనో కాసేపు మౌనంగా వున్నాడు. అయిదు నిముషాల తర్వాత లేచి అమ్మను అనుసరించాడు. ఆకలి ఏ మాత్రం లేక, కేవలం తల్లికి కంపెని ఇవ్వడానికే వచ్చినట్లు వుంది అతను అన్నం తినడం చూస్తే! కంచంలో సాంబారు కలుపుకుని అప్పుడొక ముద్దా, అప్పుడొక ముద్దా నోట్లో పెట్టుకుంటున్నాడు తప్ప, ఆకలయ్యి అన్నం తింటున్నట్లు లేదు. చంద్ర అది గమనించినా మాట్లాడకుండా ఊరుకుంది.

భోజనాలు కాగానే, గిన్నెలు సర్ది, చంద్ర తన గదిలోకి వెళ్ళింది. ఏ.సి. ఆన్ చేసి కాసేపు విశ్రాంతిగా టి.వి. చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత కాసేపు మంచంపై వాలి కునుకు తీసింది.

నాలుగు గంటలకు లేచి యాలకుల పొడి వేసి టీ తాయారు చేసింది. మనోకి యాలకుల టీ అంటే చాల ఇష్టం. టీ లో ఎక్కువ షుగర్ వేస్తె అతనికి నచ్చదు . అలాగే పాలు ఎక్కువ కలిపినా మనోకి ఇష్టం వుండదు. టీ కలుపుకుని మనో గదికి తిసుకు వెళ్ళింది.

తల్లిని సూటిగా చూడకుండా మనో ఆమె చేతిలో టీ అందుకున్నాడు. పుస్తకం చదువుతూ టీ తాగుతున్నాడు.

“ కాలి ఫ్లవర్ బజ్జీ తింటావా నాన్నా? నీకు ఇష్టం కదా. కాలిఫ్లవర్ ఫ్రష్ గా వుంది.”

“వద్దు” అన్నాడు మనో.

“ పోనీ, దోసె వేసి పెట్టనా?’ మళ్ళీ అడిగింది చంద్ర. అతను ఏదో ఒకటి తింటే, కొంచే సర్దుకుంటాడని ఆమె ఉద్దేశం.

“ నాకేం వద్దు.”

“పోనీ ఊతప్పం వెయ్యనా?” అడిగింది చంద్ర.

“అమ్మా, నాకేం వొద్దని చెబుతున్నానా?” చేతిలో వున్న పుస్తకం గట్టిగా టేబుల్ పై విసిరి కొట్టాడు.

చంద్ర హడిలిపోయి, మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసింది. తోట లోకి వచ్చికుర్చీ వాల్చుకుని కూర్చుంది. ఎదురుగుండా జామ చెట్టు పై చిలకలు వాలి దొర కాయలు పట్టుకుని తింటున్నాయి. సన్న జాజి పూల పై సీతా కొక చిలుకలు వాలి ఉండుండి ఎగిరి పోతున్నాయి. అవి ఎంత స్వేచగా బతుకుతున్నాయి. తోటలో కాసేపు అలా కూర్చున్నాక చంద్ర మనసు సంతోషంతో తేలికైంది.

ఆమె మనో గురించే ఆలోచిస్తోంది. ఏమైంది వీడికి? ఎందుకంత కోపంగా వున్నాడు?

ఆడ పిల్లలిద్దరూ స్కూల్ నుంచి, కాలేజి నుంచి వచ్చేశారు. మనో మాత్రం అలాగే తన గదిలో వుండి పోయాడు. మంజు అతన్ని కవ్వించి మాట్లడిద్దామని చూసింది. మనో ఆమె పై గట్టిగా అరిచాడు.

మంజు తనకు లెక్కలు చెప్పమని అడిగింది. మనో ” నాకే తెలియదు.ఫో! ఇక్కడినుంచి “అని అరవడం చంద్రకు వినపడింది.

చంద్రకు ఏం చెయ్యాలో తోచడం లేదు. తన కొడుకు ఎప్పుడూ అలా ప్రవర్తించచలేదు. అతను అసలు విషయం ఏమిటో చెప్పకుండా అలా కసిరినట్లు మాట్లాడడానికి కారణం ఏమిటో ఆమెకు అర్ధంకావడం లేదు.

రాత్రయ్యింది. మూర్తి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. గేటు తీయమన్నట్లు హారన్ కొట్టినా హాల్లో కూర్చున్న మనో లేవలేదు. మూర్తి తనే గేటు తీసుకుని కారు లోపల ఆపాడు.

మనో వంక చూసి “అప్పుడే లేవలేని ముసలితనం వచ్చేసిందా?” అంటూ, హేళనగా నవ్వి లోపలికి వెళ్లి పోయాడు.

మనో తండ్రి వంక తిరస్కారంగా చూశాడు. మూర్తి అదేమీ గమనించే స్టితిలో లేడు. ఈ మధ్య రొజూ క్లబ్బులో తీసుకుంటున్న డ్రింకు డోసు కాస్త ఎక్కువ అవుతున్నట్లుంది. అతను తడబడ కుండా నడవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్లి పోయాడు.

(ఇంకా వుంది)

తమిళ మూలం: శివశంకరి

తెలుగు : టి.వి.యస్. రామానుజరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

 

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో