పాల పిట్టల తోట సంతకం

తేనె పలుకుల తేటగీతి ఆమె 

ఆప్యాయతల లతలు అల్లుకున్న 
పలుకుబడుల చెట్టు రీతి ఆమె 
నిప్పుకణికలా  నిజతేజం ఆమె నీతి 
ఆత్మగల్ల పూర్ణజీవని  యశోదమ్మ 
పాల పిట్ట పాట సంతకం ఆయమ్మ 
తేనె పువ్వుల తోట పద్యం ఆయమ్మ … 
 
 
తెలంగాణా జాతీయాల బొండుమల్లెల 
తురిమిన సిగతో 
జాతి పౌరుషాలు చిమ్మిన 
మేరు నగధీర 
చూడ చక్కని తల్లి ఆయమ్మ 
పాలమూరు  అక్షరోద్యానవనంలో 
బిజినేపల్లి  మట్టి పొత్తిళ్ళలో 
కాశిరెడ్డి సరస్వతమ్మల  సంతానమై 
కోతిలా కొమ్మచ్చిలాడుతూ కేరింతలు కొట్టిన 
కొంటె కోనంగి కొదమ సివంగి ఆయమ్మ … 
 
 
రంగుల జగత్ జట్టీ విశ్వవిఖ్యాత చిత్రకారుడు 
పి. టి. రెడ్డి  మనసు గెలిచిన సహచరి 
దక్కన్ రేడియోలో మహాలక్ష్మి ముచ్చట్లతో 
తెలుగు పల్లె తేనెలు పంచిన కొండమల్లి 
ఎచ్చమ్మ తెనుగు కథావీధుల్లోకి తెచ్చిన 
కలం కత్తిపట్టిన కదనాల సాహసి … 
 
పోతన కావ్యసుధలు హరివంశోత్తర తత్వాలు 
ఎఱ్ఱాప్రగడ ప్రతిభోత్పత్తులు 
ఉత్తహరివంశ విశదీకరణలు 
మా ఊరి  ముచ్చట్లు తప్పెటలు 
ధర్మశాలల కథా కమామిషులు 
హరిశ్చంద్రోపాఖ్యాన ద్విపదలు 
విరచించిన నిత్య పరిశోధకురాలు 
విశ్లేషించిన యశోవంతురాలు … 
 
 
నారదీయ పురాణాన్నీ  – నాచన సోమనూ 
భారతంలో స్త్రీనీ – కథా చరిత్రనూ 
వచన వాచక గరళాన్ని సరళం చేసిన 
మన మట్టిన మొలిచిన బొడ్డెమ్మ 
భావికలో దేశీయతనూ జాతీయతనూ 
ఉగాదికి ఉయ్యాలలో సహచర్య సరసితనూ 
భాష తల్లి తలపై తలంబ్రాలుగా 
పోసిన పామర పండితాచార్యిని 
అధికార తెలుగు భాషను జనం శ్వాసతో 
అభిషేకించిన విప్లవ పూజారిణి … 
 
 
 
ఏ భాషకు ఆయా స్థానిక 
యాసలే  జీవనాడియని 
జీవన పర్యంతం అనర్ఘళ  ధ్వని కావ్యమైన 
ఆ కలకంఠి గళ  గాంధర్విని 
నిరాడంబరత్వం నిర్భయ వ్యక్తిత్వం 
కలబోసుకున్న సాంఘీక తపస్విని… 
 
 
మహబూబ్ నగరపు రైతుబిడ్డ 
భాగ్యనగరంలో పొంగిన తియ్యని జున్నుగడ్డ 
కరీంనగరం అన్నారం గ్రామంలో 
పాకాల వారింట మెట్టిన  వానకోయిలమ్మ 
తెలంగాణింట  తీరొక్క  పువ్వులతో
తీర్చిన వన్నె చిన్నెల బతుకమ్మ 
‘సుధర్మ’ పతాకమై ఎగిరిన యశోదమ్మ 
తెలుగు సాహితీ సీమలో విరబూసిన 
అమృత పుష్పరాగం ! 
మన సాహిత్య వైతాళికంలో పొదిగిన 
జాతి రత్నం ! 
 
 

 – అడువాల సుజాత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో