వీరనారి ఝాన్సీ ఝల్ కారీ బాయి

                                 చరిత్రలో అంతరించిపోయి న  సాహసగాథలు , సాహస వీరులు ఎంతో మంది ఉన్నారు . కొందరి చరిత్రలు గ్రంధస్థమైతే , మరికొందరి సాహసాలు చరిత్ర పొరల్లో భూస్థాపితం అయిపోయి ఉంటాయి .

                                      స్త్రీల విజయాలు . సాహసాలు , త్యాగాలని ఈ రోజుకి బాహాటంగా అంగీకరించని పరిస్థితులు  కన్పిస్తాయి.  స్త్రీలనే  వంకతోనో , చులకన భావనతోనో ఆమెకు దక్కాల్సిన కీర్తి ,గౌరవం అందటం లేదు . ఇప్పటి  పరిస్థితే ఇలా  ఉంటే  రెండు శతాబ్దాల క్రితం స్త్రీల పరిస్థితి  అందులోనూ దళిత కులాలకిసంబంధించిన స్త్రీల పరిస్థతి ఎలా  ఉంది ఉంటుందో అర్ధం చేసుకోవచ్చును .

                            బయట ప్రపంచానికి తెలిసిన ఝాన్సీ లక్ష్మిబాయి సాహసాలు , యుద్ద నైపుణ్యం , జీవిత గాధ  సాహసానికి ఒక కోణాన్ని చూపిస్తుంటే రెండవ పార్శ్వం చరిత్రలో అడుగున తొక్కేయబడింది . ఆ అణచబడ్డ శక్తి పేరే ఝల్ కారి బాయి 1830 నవంబర్ 22 న జన్మించింది .  పుట్టుకతోనే సాహసాన్ని వెంట తెచ్చుకుందేమో  అనిపించేలా అడవికి కట్టెలకు వెళ్ళినప్పుడు తన మీద లంఘించిన పెద్ద పులిని ఒంటరిగా పోరాడి చంపేసింది . రాణి లక్ష్మి బాయికి  దగ్గర పోలికలున్న ఝల్ కారి బాయి 1987లో జరిగిన ఝాన్సీ యుద్ధంలో తెల్ల వాడితో భీకర పోరాటం చేసి తానే లక్ష్మిబాయిని అని తెల్ల వాళ్ళ సైన్యాన్ని నమ్మిస్తూ వీర పోరాటం చేసింది .

                      రాణి లక్ష్మి బాయిని  కొడుకు దామోదర్ తో  సహా సురక్షిత ప్రాంతాలకు తరలించి యుద్దంలో వీర మరణం పొందింది . లక్ష్మిబాయి కి కుడి భుజంగా నమ్మిన బంటుగా ఉంటూ రాణి క్షేమాన్ని కోరుతూ  ప్రాణాలు అర్పించి తన రాజనీతిని చాటుకుంది . దళిత వీరనారిగా , సాహసవంతురాలిగా చరిత్ర పుటలకెక్కింది . కాని అప్పటి గెజిట్   బ్రిటీష్ వారి చేత కాల్చి వేయబడటం చేత ఎంతో కాలం ఈ చరిత్ర మరుగున పడింది . చరిత్రకారులు ఝల్ కారి బాయి కుటుంబ సభ్యులను , వంశస్థులను కలిసి ఎన్నో విషయాలను సేకరించి వీరనారి ఝల్ కారి సాహసాన్ని ప్రపంచానికి సాటి చెప్పారు .

                       jhalkari stampభారత ప్రభుత్వం ఝల్ కారి బాయి సాహసానికి జ్ఞాపికగా 2001 జూలైన 22న ఝల్ కారి బాయి చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది . మధ్య ప్రదేశ్ లోనిఝాన్సీ లో ఝల్  కారి బాయి పేరు మీదగా ఎన్నో  పాఠశాలలు , కళాశాలలు నిర్మించబడ్డాయి. పార్కులు , ఆమె కాస్య విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి .  ఆ వంశస్తులు ఇప్పటికి ఝల్ కారి బాయి జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటారు .

                        మోహన్ డా నైమిశ్ రాయ్ హిందీలో రచించిన ‘ వీర నారి ఝాన్సీ ఝల్ కారి బాయి ‘ పుస్తకాన్ని రచయిత, ఉర్దూ యునివర్సిటి ప్రొఫెసర్ డా. జి.వి.రత్నాకర్   తెలుగులోకి అనువదించారు .హైదరాబాద్ బుక్ ట్రస్ట్  ప్రచురించిన ఈ పుస్తకాన్ని విహంగ పాఠకుల కోసం ధారావాహికగా అందించడానికి ఎంతో సంతోషిస్తున్నాము . అడిగిన వెంటనే  అంగీకరించిన రచయితకి ,H.B.T సంస్థకి , గీతా రామస్వామిగారికి ధన్యవాదాలు. ..
  చరిత్ర కిటికీలను తెరిచి వాస్తవంలోకి పయనిద్దాం …..  

 – సంపాదకులు
విహంగ

Uncategorized, , , Permalink

One Response to వీరనారి ఝాన్సీ ఝల్ కారీ బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో