మట్టిలో మాణిక్యం

కళ్ళలో నుంచి మాటి మాటి కీ  ఊరుతున్న కన్నీటిని చీర  చెంగు తో తుడుచుకుంటోంది శాంభవి.జరిగినది తలుచుకున్న కొద్దీ దు:ఖం  ఆగటం లేదు . ఉక్రోషం వస్తోంది . తను పుట్టగానే  చనిపోయిన  అమ్మ మీద , వదిలేసి వెళ్ళిపోయిన   నాన్న మీద , చివరకు తనను ఈ విధంగా పుట్టించిన దేవుడి మీద అసలు ఈ ప్రపంచం మీదే iపట్టరాని కోపం వస్తోంది .అంతలోనే ఏడుపు ముంచుకు వస్తోంది .అసలు తన తప్పేమివుంది ? తను పుట్టినప్పుడు తన మొహం చూసేందుకే ఇష్టపడలేదట అమ్మ. నాన్నైతే ఓ చూపుచూసి బయటకు వెళ్ళిపోయాడట .  ఐనా తన ఈ రూపు తను కావాలని తెచ్చుకుందా ?

“ఏదో పాట పాడుతుంటే వింటున్నాను ” అని చిన్నగా గొణిగాడు . “దాని పాట అంత నచ్చిందా ఐతే పెళ్ళి చేసుకోరా , రోజూ వినవచ్చు ” అని వంగ్యంగా అంది దుర్గమ్మ. “ఏమమ్మో నా కొడుకుకు ఆ కాకిపిల్లను అంటగడుదామని చూస్తున్నావా ? కాకి గొంతేసుకొని కాకా అని అరుస్తుంటే అదే పాటైపోతుందా ?”అని పోట్లాటకు వచ్చింది ఆవిడ .

నల్లగా వుంటే వుంది ఇంత సన్నమేమిటి? బుగ్గ మీద ఇంత పెద్ద నల్లటి మచ్చ ఏమిటి ? తన దురదృష్టం కాకపోతే !  అమ్మా నాన్న మొహాలు తిప్పుకుంటే అమ్మమ్మ తనను ఎత్తుకుందిట. తొలిచూలు ఆడపిల్ల అమ్మవారు పుట్టింది అని ‘ శాంభవి ‘ అని అమ్మమ్మే  పేరు పెట్టిందిట.  తన దురదృష్ఠం తను పుట్టిన నెలకే అమ్మ చనిపోయింది . నాన్న నాకీ పిల్ల అవసరంలేదు ఏమైనా చేసుకోండి అని ఈసడించుకుంటే అమ్మమ్మ తనతో వూరు తీసుకెళ్ళింది.

                                images  వున్నంతలో బాగానే పెంచింది . తన రూపాన్ని ఎవరైనా వెక్కిరించినా , చిన్నచూపు చూసినా వారిని దులిపేసేది . ఎవరినీ వక్క మాట అననిచ్చేది కాదు , తను కూడా అనేది కాదు .    తన వెనకెనుకే తిరుగుతూ తనతో పాటు రామదాసు కీర్తన పాడుతున్న మనవరాలిని చూసి మురిసిపోయింది . భగవంతుడు దీని రూపం ఇలా ఇచ్చినా మంచి గొంతు ఇచ్చాడు అని మురిసిపోయి సంగీతం మాస్టారి ని బతిమిలాడి  తనకు సంగీతం నేర్పేందుకు ఒప్పించింది . అమ్మమ్మ ప్రేమతో , సంగీతం నేర్చుకుంటూ , స్కూల్ కు వెళుతూ ఆనందంగా వున్న తనను చూసి విధి కి కన్ను కుట్టింది. తను ఐదో తరగతి చదువుతుండగా అమ్మమ్మ ను తీసుకెళ్ళిపోయింది . అప్పటి వరకూ అత్తగారంటే భయం తో వూరుకున్న అత్తయ్య దుర్గమ్మ తనను చదువు , సంగీతం మానిపించేసింది . ఇంట్లో పనిపిల్లను చేసింది . మామయ్య రంగారావు చూడనట్లు , పట్టించుకోకుండా వుండిపోయాడు

                            తలుచుకున్నా కొద్దీ ఏడుపు ముంచుకు వస్తోంది .అసలు తన తప్పేమివుంది ?తన మానాన తను పని చేసుకుంటూ పాటలు పాడుకుంటోంది . అత్త వచ్చి నెత్తి మీద మొట్టేసరికి ఏమి జరిగిందో తెలీక భయపడిపోయింది . “ఏమే ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ బాగోతం ?” అని అరిచేసరికి అప్పుడే గమనించింది పక్కింటి అబ్బాయి గోడ మీద కూర్చొని తనను చూస్తున్నాడని . దుర్గమ్మను చూసి పారిపోబోయాడు . “ఆగరా నీకేమి పని ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ?”అని వాడిని దబాయించేసరికి వాడు తడబడిపోయాడు . ఈ గొడవకి పక్కింటావిడ బయటకు వచ్చింది . ఆవిడను చూసి ఇంకా రెచ్చిపోయింది దుర్గమ్మ .”ఏదో పాట పాడుతుంటే వింటున్నాను ” అని చిన్నగా గొణిగాడు . “దాని పాట అంత నచ్చిందా ఐతే పెళ్ళి చేసుకోరా , రోజూ వినవచ్చు ” అని వంగ్యంగా అంది దుర్గమ్మ. “ఏమమ్మో నా కొడుకుకు ఆ కాకిపిల్లను అంటగడుదామని చూస్తున్నావా ? కాకి గొంతేసుకొని కాకా అని అరుస్తుంటే అదే పాటైపోతుందా ?”అని పోట్లాటకు వచ్చింది ఆవిడ . ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు . ఆమెతో పోట్లాటలో అలిసిపోయిన దుర్గమ్మ కోపంతో శాంభవి జుట్టు పట్టుకొని ఇంట్లోకి గుంజుకు పోయింది. “నువ్వు పెద్ద గాయనీమణిని అనుకుంటున్నావా ? నీ పాటకు వాడు పడిపోతాడనుకున్నావా ? విన్నావుగా నీది కాకి రూపం, కాకి గొంతు అని ఎట్లా అన్నారో !భోగం వేషాలేస్తున్నావు “అని అరుస్తూ శాంభవి చెప్పేది వినకుండా చీపిరి తీసుకొని ఇష్టం వచ్చినట్లు బాదింది . ఇంకా కసి తీరలేదు “నీ ఈ వేషాలతో నా పిల్లలూ చెడిపోతారు . ఇంట్లో నుంచి వెళ్ళిపో “అని బయటకు గెంటి   తలుపేసేసింది.”అత్తా తలుపుతీయి , ఇంకోసారి పాడను” అని ఏడుస్తూ ఎంత తలుపు కొట్టినా తలుపు తీయలేదు .ఎక్కడి కి వెళ్ళాలో తెలీక గుడికి వచ్చి కూర్చుంది . తలుచుకున్నా కొద్ది దు:ఖం ముంచుకు వస్తోంది . తల మోకాళ్ళలో పెట్టుకొని ఏడుస్తున్న శాంభవి తల మీద ఓ చేయి పడింది .

                                  ఉలిక్కిపడి తల ఎత్తింది . ఎవరో ఒకావిడ ఎదురుగా కూర్చొని వుంది . ఆమె ఎవరూ అన్నట్లు ఆమెవైపు చూసింది . “శాంభవీ ఏమిజరిగింది . ఎందుకేడుస్తున్నావు ?” అని తన పేరుతో అడిగేసరికి శాంభవి ఆశ్చర్యపోయింది . “నువ్వు నాకెలా తెలుసు అనుకుంటున్నావా ? నేను మీ వీధి చివర ఇంట్లో వుంటాను .లాయర్ ను . నాపేరు విమల. నీ గురించి నాకు అంతా తెలుసు .ఎప్పుడూ కళ్ళెత్తకుండా  పనులు చేసుకుంటూ వుండే దానివి . బయటకే రావు . ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇలా ఏడుస్తున్నవేమిటి ?”అని ఆప్యాయంగా అడిగింది .అమ్మమ్మ చనిపోయిన తరువాత అంత ఆప్యాయత ఎరుగని శాంభవి కరిగిపోయి విమలకు జరిగిందంతా చెప్పింది .

                 “మరి ఇప్పుడు ఏమి చేస్తావు . కాసేపు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళుతావా ? లేకపోతే నాతో వస్తావా ? నేను సంఘసేవికను కూడా . నీకు ఏదో దారి చూస్తాను .”అంది .

                    శాంభవి విమల చేయి పట్టుకొని “నాకేమీ తెలియదు .మీరు నన్ను తీసుకెళెతే వస్తాను.కాని నేను ఏమి చేయాలి ?”అని దీనంగా అడిగింది .

        “ముందు మా అమ్మ దగ్గరకు తీసుకెళుతాను . ఆమె ఒక్కతే వుంటుంది .చాతకానిది . ఆమెకు సహాయంగా వుందువుకాని. “అంది..

.                ఇంతవరకూ ఏరోజూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు .ఎప్పుడైనా గుడికి వెళ్ళినా తన రూపం మీద వెక్కిరింతలు వేళాకోళాలు . వాటితో మనసు పాడై బయటకే వెళ్ళదు . అయినా సమయం ఎప్పుడు దొరుకుతుంది ఇంటి పని తోటే సరిపోతుంది . అలాంటిది ఈ రోజు ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బెరుకుగా వుంది . అయినా తప్పటం లేదు .పరిపరి విధాల ఆలోచిస్తూ విమల వెంట వాళ్ళ అమ్మగారి ఇంట్లో అడుగుపెట్టింది . పెద్దావిడ , ఎదురుగా పడక కుర్చీలో కూర్చొని వున్నారు . శాంభవి గురించి విమల చెప్పగానే చాలా ఆదరంగా మాట్లాడారు . దానితో కొంచం భయం తగ్గింది . “ప్రస్తుతము ఇక్కడ వుండు . కొంచము నువ్వు తేరుకున్నాక నిన్ను చదివించాలా ? ఏదైనా పని నేర్పించాలా ?”ఆలోచిస్తాను అంది విమల. చిన్నగా లక్ష్మమ్మగారి ఇంట్లో అలవాటు పడింది .

                        చిన్నగా అన్నమయ్య కీర్తన పాడుకుంటున్న శాంభవిని “ఏదమ్మా పెద్దగా పాడు నేనూ వింటాను” అని అడిగింది లక్ష్మమ్మ .సిగ్గుపడుతూ పాడింది శాంభవి . “ఎంత బాగా పాడావమ్మా “అని మెచ్చుకుంది లక్ష్మమ్మ.అప్పటి నుంచి రోజూ శాంభవితో పాడించుకొని  వింటోంది .ఓరోజు విమల రాగానే శాంభవి పాట గురించి చెప్పింది .

           “నాపాటేముంది ఆంటీ . నాది కాకి గొంతు .”అని దిగులుగా అంది శాంభవి .

                  “ఎవరన్నారు ఎంతబాగా పాడుతున్నావు . ఇన్ని రోజులూ  నిన్ను ఎందులో చేర్పించాలా అని ఆలోచిస్తున్నాను . నిన్ను పాటల పోటీకి పంపుతాను . నీది కాకి గొంతన్నవారే నిన్ను మెచ్చుకునట్లుగా చేస్తాను “అంది విమల .

                 దిగులుగా వున్న శాంభవి మొహంలో తళుక్కుమని మెరుపు వచ్చింది .శాంభవిని సంగీతం క్లాస్ లో చేర్పించింది .  ఎలాగైనా పెద్ద గాయని కావాలని పట్టుదలగా సాధన చేస్తోంది శాంభవి .

                     శాంభవితో నాలుగు పాటలు పాడించి రికార్డ్ చేసి , ఆ  కాసెట్ “పాడుతాతీయగా ” పాటల పోటీకి పంపించింది విమల . పోటీలో ఎన్నిక కోసం రామోజీ ఫిలిం స్టూడియో కు రమ్మని పిలుపు వచ్చింది . విమల తో కలిసి రామోజీ ఫిల్మ్ స్టూడియో కు వెళ్ళిన శాంభవి అక్కడవున్న అభ్యర్ధులను చూసి ఒక్క క్షణం భయపడి విమల చేతిని గట్టిగా పట్టుకుంది . అంతలోనే తన గొంతును కాకి గొంతు అని వెక్కిరించిన అత్తయ్య , పక్కింటి ఆవిడా గుర్తొచ్చారు . పట్టుదల వచ్చింది . ధైర్యం తెచ్చుకుంది .అసలు అంత పెద్ద గాయకుడు యస్. పి బాలసుబ్రమణ్యం ముందు పాడే అవకాశం రావటమే గొప్ప . ఎలాగైనా ఆయనను మెప్పించాలి అనుకుంది . ధైర్యంగా పాడింది. “పాడుతాతీయగా “లో పాల్గొనేందుకు ఎన్నికైంది . మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కిన శాంభవిని అభినందించారు విమల , లక్ష్మమ్మగారు .

                అప్పటి వరకూ అమ్మమ్మ ముందూ , లక్ష్మమ్మగారి ముందు తప్ప ఇంకెవరి ముందూ పాడలేదు .  రేపు స్టేజ్ ఎక్కి అందరి ముందూ పాడబోతోంది . స్టూడియోలో వాళ్ళే కాదు టి.వి ల ముందు కూడా ఎంతో మంది తన పాట వింటారు . తలుచుకున్నా కొద్దీ వుద్వేగంగా వుంది . ఎలా పాడుతానో అని టెన్షన్ గా వుంది . నిద్ర పట్టటం లేదు .అంతలోనే భయం , అంతలోనే పాడాలి గెలవాలి అనే పట్టుదల . చాలా టెన్షన్ గా గడిచిపోయింది రాత్రి .

                “శాంభవి “అని పేరు పిలవగానే తడబడే అడుగులతో వేదిక మీదకు వెళ్ళింది శాంభవి . వేదిక మీద శాంభవిని చూడగానే ప్రేక్షకులు అబ్బా అనుకున్నారు .    తనను పరిచయం చేసుకొని మైకు తీసుకొని ఓ క్షణం కళ్ళుమూసుకొని ,టెన్షన్ ను ఆపుకొని “జోరుమీదున్నావు తుమ్మెదా “అని పాడటం మొదలుపెట్టగానే తన భయము , ఎదురుగా వున్నప్రేక్షకులను మర్చిపోయి పాటలో మునిగిపోయింది . శాంభవి గొంతెత్తి పాడగానే అందరూ నిశబ్ధం మయిపోయారు సన్నగా తీగలా సాగుతూ , మధురం గా వున్న ఆ గాన మాధుర్యంలో మునిగిపోయారు .  హోరుమంటున్న  చప్పట్లతో ఈ లోకంలోకి వచ్చింది

                     అన్ని రౌండ్లనూ తృప్తికరంగా పూర్తిచేసింది .   ఒకొక్క ఎపిసోడ్ లో ,క్వాటర్ ఫైనల్స్ , సెమీ ఫైనల్స్ ను విజయవంతంగా పూర్తిచేసి , ఫైనల్స్ కు చేరుకుంది  ఫైనల్స్ కు చేరుకునేసరికి శాంభవికి ఎంతమందో అభిమానులు ఏర్పడ్డారు .  శాంభవి గెలవాలి అని కోరుకునేవారు . శాంభవి .ఎలాగైనా ఫైనల్స్ లో గెలుపొందాలని రాత్రి పగలు ఓ తపస్సులా పాటలను సాధనచేసింది . ఫైనల్స్ ను ఓ పెద్ద అడిటోరియం లో ఏర్పాటు చేసారు .వివిధ రంగాలలోని చాలా మంది ప్రముఖులు వచ్చారు . హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది .ఆ అశేషజనవాహిని ని చూసి ఓ క్షణం బెదిరింది .కాని తన లక్ష్యం  గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుంది . పోటీ మొదలైంది . అందరూ తమ శక్తి వంచన లేకుండా చాలా బాగా పాడుతున్నారు . ఎవరు పాడుతుంటే వారే గెలుస్తారు అనుకునేట్లుగా పాడుతున్నారు . అన్ని రౌండ్లూ పూర్తి అయ్యాయి . గెలుపెవరిదా అని అభ్యర్ధులంతా  టెన్షన్ గా  వేచి చూస్తున్నారు . మొదటి బహుమతి శాంభవి కి అని ప్రకటించగానే సరిగ్గా విన్నానా అని అనుకుంది శాంభవి . అందరూ అభినందిస్తుంటే నిజమే అనుకుంది . అన్ని రోజుల నుంచి ఆపుకున్న ఆరాటం , దు:ఖం ఒక్కసారే బయటకు వచ్చాయి . కళ్ళ నుంచి నీళ్ళు కారిపోయాయి . తనను తాను నిలవరించుకుంది . ఆ కార్యక్రమం చూసేందుకు వచ్చిన సంగీత దర్శకుడు కోటి తన వచ్చే సినిమాలో శాంభవికి  అవకాశం  ఇస్తున్నట్లుగా ప్రకటించారు.సంతోషం పట్టలేకపోయింది శాంభవి . అక్కడే వున్న యస్.పి. బాలసుబ్రమణ్యం పాదాలకు నమస్కరించింది . మెచ్చుకుంటునట్లుగా ఆయన శాంభవి భుజం తట్టారు .

                    తను ఈ స్తితికి చేర్చేందుకు ప్రోత్సహించి, తోడ్పడిన విమల పాదాలకు నమస్కరించింది . విమల ఆప్యాయంగా శాంభవిని దగ్గరకు తీసుకుంది .  “అభినందనలు శాంభవి .పట్టుదలగా కృషి చేసావు , గెలిచావు . నాకు తెలుసు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్ద గాయనివి అవుతావు . నీ రుపాన్ని వెక్కిరించినవారే నీ పాటను మెచ్చుకుంటారు . బాహ్యరూపం కన్నా నీలోని కళ గొప్పది అని నిరూపించావు . నువ్వు బాధపడతావని చెప్పలేదు కాని , నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కాసేపటి తరువాత మీ అత్తయ్య తలుపు తీసి నీకోసం వెతుక్కుంది . నువ్వు ఏడుస్తూ అక్కడే పడి వుంటావనుకుంది . నువ్వు లేకపోయే సరికి ఖంగుతింది . ఆడపిల్ల ఎక్కడికిపోయిందో ఏమవుతుందో అన్న దిగులేమీ లేదు , పని చేసేవాళ్ళు లేరే అన్న దిగులు  తప్ప.నువ్వు టి . విలో కనిపిస్తున్నప్పటి నుంచి , నిన్ను బంధువుల ఇంట్లో వుంచి , సంగీతం నేర్పిస్తున్నానని , ఈ పోటీకి తనే పంపిస్తున్నానని అందరికీ చెపుతోంది . ఏదో ఒక రోజు నీ ఆచూకి తెలుసుకొని నీ దగ్గరి కి వచ్చినా వచ్చేస్తారు .నిన్ను వెక్కిరించి , ఎగతాళి చేసి , బాధపెట్టి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళకొట్టినవారే నీ దగ్గరకు చేరుతున్నారు . అదీ నీ గొప్పతనం , నీ మంచి తనం “అంటూ ఆప్యాయంగా శాంభవి నుదుటిమీద ముద్దు పెట్టుకుంది విమల .

 – మాలాకుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~

కథలు, తొలి కథ, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

10 Responses to మట్టిలో మాణిక్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో