మనసారా…

ఇంతకాలం మనం అన్ని పత్రికల్లో స్త్రీలకి  ప్రత్యేక పేజీలని కేటాయిచడం చూశాం. దాన్ని చూసినప్పుడు

ఎప్పుడూ కలగని ఒక కొత్త ఆలోచన కలిగింది. అసలు ఒక పత్రికలో స్త్రీల కోసం ప్రత్యేకంగా పేజీ ఇవ్వడానికి

అదేమయినా పురుషుల పత్రికా ? కాదు కదా ?

అలాంటప్పుడు వాళ్ళు అలా ప్రత్యేకంగా పేజీ ఇవ్వడం ఏమిటి? అలా ఇవ్వడానికి వారికున్న ప్రత్యేక

అర్హతలేమిటి ? అది అప్రకటిత పురుషాధిక్యత కాదా ? దాన్ని స్త్రీలు ఇంతకాలం ఎలా సహించారు ? ఎందుకు

సహించారు ? బహుశా దాన్ని సహించలేకే స్త్రీలు తమకంటూ ప్రత్యేకమయిన పత్రికలని ఏర్పాటు

చేసుకున్నారేమో !

అలా ఏర్పాటు చేసుకోవడం వారిలోని చైతన్యానికి నిదర్శనమేమో అని ఇప్పుడనిపిస్తోంది. ఇది వైయక్తికంగా

నా అవగాహనా పరిధి విస్తరించాక నాకిప్పుడు ఏర్పడిన  అభిప్రాయం కావచ్చుగానీ, వాస్తవానికి అదే నిజం.

నేను ఈనాటికైనా మేలుకోవడానికి కారణం ఏమిటి ?

విహంగ అనేది ఒక స్త్రీవాద పత్రిక. దాన్ని చూడగానే, నాకూ అందరు మగాళ్ళ లాగే ‘  ఆడవాళ్ళు తమ

ముచ్చట్లు చెప్పుకోవడానికి ఒక పత్రిక పెట్టుకున్నారు. అయితే ఏమిటి ‘ ? అనిపించింది. తరవాత

పరవాలేదు బాగానే వుంది అనే ఆసక్తిని కలిగించింది. ఇప్పుడు మీరు పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక

పేజీని కేటాయిస్తూ చేసిన  ప్రకటన చూడగానే ఆసక్తిని మించిన ఆలోచన కలిగింది. ఆలోచనలకి స్త్రీ పురుష

భేదాలు లేవు కదా ? ఆ ఆలోచనల ఫలితంగానే, నేను పైన చెప్పిన నిజం అవగాహనకి వచ్చింది.

అంతే కాదు,

మరో కొత్త విషయం కూడా బోధ పడింది.

అదేమిటంటే,

స్త్రీ వాదం దళితవాదం లాంటి వాటిని భుజాన మోసే వారికీ మిగిలిన వారికీ మధ్య చెరువులో పడినవారికీ

గట్టుమీద ఉన్నవారికీ ఉన్నంత తేడా వుంటుంది.

చెరువులో పడినవారికి గట్టుమీదున్నవారు చేయ్యందించడానికి బదులు చెయ్యివ్వడం వల్లే ఉద్యమాలు

పుడతాయి. నిజానికి స్త్రీల సమస్యల గురించి ఆలోచించే స్త్రీలలో తాము ఎదుర్కొన్నచేదు అనుభవాలు

కలిగించిన ఆవేశం కొంతమేరకయినా పనిచేస్తుంది. ఆ మేరకి వివేకం తగ్గుతుంది. అదే బయటివారికయితే

ఆ మేరకి ఆవేశం తగ్గి ఆలోచన పెరుగుతుంది. అయితే వచ్చిన చిక్కల్లా అనుభూతికీ సహానుభూతికీ మధ్య

అనుభవ లేమి ఉండటం. ఆ లేమి వలన ఆ రెండింటి మధ్యా అంతరం ఏర్పడుతుంది. ఆ అంతరాన్ని పూడ్చే

తొలి ప్రయత్నంగా మీరు ప్రకటించిన  ఈ పేజీని నేను మనసారా ఆహ్వానిస్తున్నాను.

-రమణ కుమార్

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలు, , , , , , , Permalink

10 Responses to మనసారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో