గర్భిణి స్త్రీ సంరక్షణ

డాక్టర్ గారూ! గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి?

సునీత ,ద్రాక్షారామం.

ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రసవ మరణాల సంఖ్య, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.  సామాజిక, ఆర్ధిక, ప్రగతితోపాటు సమర్ధవంతమైన గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రమాదకరమైన కేసుల్ని గుర్తించి, సంరక్షించడంలో సాధించిన సాంకేతిక ప్రగతి యీ మరణాల సంఖ్య తగ్గడానికి దోహదపడతాయి.
గర్భిణీ స్త్రీ సంరక్షణ లక్ష్యాలు :
1.    గర్భవతి శారీరక, మానసిక, ఆరోగ్యాన్ని పెంపొందించడం, ప్రసవమయే దాకా ప్రమాదాలు జరగకుండా కాపాడడం.
2.    పరిపూర్ణమైన ఆరోగ్యంతో, జీవంతో, నెలలు నిండాక బిడ్డ పుట్టేలా చెయ్యడం.
3.    స్త్రీని ప్రసవానికి, పాపాయికి పాలివ్వడానికి, భౌతిక, మానసిక, విద్యాపరంగా బిడ్డను సంరక్షించడానికి సన్నద్ధురాలిని         చెయ్యడం.
4.    గర్భిణి స్త్రీకి, గర్భస్థ శిశువుకు రాగల ప్రమాదాల్ని తొలిథలో గుర్తించి చికిత్స చెయ్యడం, పరిశీలనలో వుంచడం,         ప్రమాదాల్ని నివారించడం.
5.    ఆరోగ్య సమాచారాన్ని గర్భిణికి తెలపడం, గర్భం సమయంలో వచ్చే స్వల్ప సమస్యలకు సలహానివ్వడం, గర్భిణికి,         ఆమె భర్తకు ధైర్యం చెప్పడం, ఆసరానివ్వడం, భయాల్ని, ఆందోళనలను తొలగించడం.
6.    గర్భస్థ శిశువుకు వైకల్యాలు ఉన్నట్లు గుర్తిస్తే తగిన చికిత్స చెయ్యడం.
7.    ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు, ఎలా ప్రసవం చెయ్యాలో నిర్ణయించడం.  ఎక్కువ ప్రమాదం వున్న         వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం.
గర్భిణికి అత్యున్నత ప్రమాణాలు గల సంరక్షణ లభించాలి.  నిర్ణీత వ్యవధిలో క్రమబద్ధంగా మంత్రసాని, జనరల్‌         ప్రాక్టీషనర్‌ లేక ప్రసూతి నిపుణులు పరీక్షించాలి.  సాధారణంగా కమ్యూనిటీలో వుండే మంత్రసాని గర్భిణి స్త్రీని         ఎక్కువసార్లు పరీక్షించడానికి అవకాశం వుంటుంది.
గర్భం రాకముందు కౌన్సిలింగ్‌ :
గర్భిణి స్త్రీ సంరక్షణ ఆమె గర్భవతి అవకముందే ప్రారంభమవాలి.   పిల్లల్ని కనాలనుకునే స్త్రీలు గర్భం రాకముందే ప్రసూతి నిపుణురాలిని సంప్రదించాలి.  ప్రసూతి సంబంధమైన ప్రమాదాలు వచ్చే అవకాశం వున్నవారు, ఆరోగ్యపరమైన ఇతర వ్యాధులు ఉన్న వారు అసలు తమకు గర్భం రావచ్చో లేదో తెలుసుకోవాలి.  కొన్ని వ్యాధులు ఉన్నవారు, ఉదాహరణకు జన్యు సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నవారు పిల్లల్ని కనగూడని పరిస్థితి వుండొచ్చు.
గర్భం రాకముందే కౌన్సిలింగ్‌ చెయ్యడం మంచిపద్ధతి.  పోషకాహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు గురించి తెలుసుకోవడం, వైకల్యాల్ని కలిగించగల వాటిని నివారించడం, ఫోలిక్‌ ఏసిడ్‌ని తీసుకోవడం మొదలైన వాటిగురించి తెలుసుకుని ఆచరిస్తూ గర్భాన్ని గురించి అవగాహనతో వ్యవహరించడం గర్భిణి సంరక్షణ లక్ష్యాల్ని సాధించడానికి ఉపకరిస్తుంది.
గర్భిణిస్త్రీ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి?
1.    గర్భం వచ్చిందని అనుమానం రాగానే సంప్రదించాలి.  అలా చెయ్యడం వల్ల ఆఖరి బహిష్టు తేది బాగా జ్ఞాపకం         ఉండి దానిని బట్టి ప్రసవమయే తేదిని లెక్క వెయ్యడానికి, నెలల కనుగుణంగా బిడ్డ పెరుగుతూందా, లేదా అనేది         నిర్ణయించడానికి అవకాశముంది. రక్తపోటు, బరువు, హిమోగ్లోబిన్‌ మొదట ఎంత వున్నాయో తెలిస్తే అవి తరువాత         సహజమైన మార్పులు చెందాయా  లేక అసహజంగా పరిణమించాయా అనేది తెలుస్తుంది.
2.    తల్లి, బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపించే అధిక రక్తపోటు, గుండెజబ్బు, మధుమేహం, సుఖవ్యాధులు, మూత్ర         సంబంధమైన ఇన్ఫెక్షన్స్‌ మొదలైన వాటిని త్వరగా కనిపెట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, మందులు         వాడడానికి అవకాశం వుంటుంది.
3.    ఆహారం, శుభ్రత, వ్యాయామం మొదలైనవాటి గురించి సలహా యివ్వడానికి అవకాశముంటుంది.
4.    ఒకవేళ ఆరోగ్య కారణాలవల్ల,  సాంఘిక, ఆర్ధిక, పరిస్ధితులవల్ల గర్భస్రావం చెయ్యవలసివస్తే అపాయం  తక్కువగా         వుంటుంది.
గర్భవతి ఎంత వ్యవధిలో పరీక్ష చేయించుకోవాలి?
28 వారాల వరకు – నెలకొకసారి
28 -36 వారాలు – 15 రోజులకొకసారి
36 వారాల నుండి ప్రసవమయేవరకు – వారానికొకసారి
భారతదేశంలో ఎక్కువమంది తల్లులు సామాజికంగా, ఆర్ధికంగా మెనుకబడిన వర్గానికి చెందినవారు.  ఒకరోజు హాస్పటల్‌కి వెళ్ళి పరీక్ష చేయించుకోవడమంటే దాని అర్ధం ఒకరోజు ఆదాయాన్ని కోల్పోవడమే.  ఈ కారణాలవల్ల తరచుగా పరీక్షకు వెళ్ళలేనివారు కనీసం 4 సార్లు పరీక్ష చేయించుకోవాలి.

జ    గర్భం అని అనుమానం రాగానే
జ    24 – 26 వారాల మధ్య
జ    32 – 34 వారాల మధ్య
జ    నెలలు నిండాక
గర్భ నిర్ధారణ :
అ.    గర్భం లక్షణాలు :
జ    బహిష్టు రాకపోవడం : లైంగిక జీవితాన్ని గడుపుతూ క్రమబద్ధంగా బహిష్టులు వస్తున్న స్త్రీకి రావలసిన             తేదీకి బహిష్టు రాకపోతే గర్భం వచ్చిందేమోనని అనుకోవచ్చు.
జ    వేవిళ్ళు : బహిష్టు ఆలస్యమయిన స్త్రీకి వికారం, వాంతులు వుంటే అది గర్భానికి సూచిక.
జ    రొమ్ములలో మార్పులు : పొంగినట్లు, బరువుగా వుండడం, సలుపుగా, గుచ్చుకున్నట్లుగా వుండడం.
జ    మూత్రం తరచుగా అవడం
జ    అసాధారణ అలసట, నిస్త్రాణకు లోనవడం
జ    ఆహార విషయంలో వెర్రికోరికలు : కొన్ని ఆహారాలంటే పిచ్చి ఇష్టం, కొన్ని ఆహారాలంటే అసలు గిట్టకపోవడం             వుంటాయి.  అరుదుగా మట్టి, సున్నంలాంటి కొన్ని అసాధారణ పదార్ధాల్ని తినాలనే వెర్రికోరిక వుంటుంది.
జ    యోనిస్రావం ఎక్కువవడం
జ    మలబద్ధకం
జ    మూడ్‌ మార్పులు, చిరాకు
జ    ఎక్కువగా ఉమ్ము ఊరడం
– ఈ లక్షణాలన్నీ, లేక కొన్ని గర్భం తొలిథలో కనపడి గర్భాన్ని సూచిస్తాయి.
ఆ.    మూత్రం పరీక్ష (ప్రెగ్నెన్సీ టెస్ట్‌) :
గర్భం వచ్చాక పిండం తాలూకు కణాలు హ్యూమన్‌ ఖోరియానిక్‌ గొనాడోట్రాపిన్‌ అను హార్మోన్‌ని తల్లి శరీరంలోకి         విడుదల చేస్తాయి.  తల్లి మూత్రంలో విసర్జింపబడే ఆ హార్మోన్‌ని గుర్తించడం ఆధారంగా గర్భాన్ని నిర్ధారించే ఈ         పరీక్షని ‘కిట్‌’ ద్వారా ఎవరికివారే చేసుకోవచ్చు. లేక లేబొరేటరీలో చేయించుకోవచ్చు.  నెలతప్పిన 4,5 రోజులకే         ఈ పరీక్ష ద్వారా గర్భాన్ని నిర్ధారించవచ్చు.
ఇ.    అల్ట్రాసౌండ్‌ పరీక్ష :
అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా కూడా నెలతప్పిన వారంలోపే గర్భాన్ని నిర్ధారించవచ్చు
ఈ.    యోనిద్వారా పరీక్ష : (పెల్విక్‌ పరీక్ష)
యోనిద్వారా పరీక్షను చెయ్యడంద్వారా 6 వారాలలోపే గర్భాన్ని నిర్ధారించడం కష్టం.  6 వారాలు దాటాక యోని,         సర్విక్స్‌, గర్భాశయంలో కలిగే మార్పులను బట్టి గర్భాన్ని నిర్ధారించవచ్చు.
ఉ.    పొట్ట పరీక్ష :
12 వారాలు గర్భం పెరిగాక పొట్టను పరీక్ష చేసి గర్భాన్ని నిర్ధారించవచ్చు

-డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో