భూ భమ్రణంలో మనిషి

శతాబ్దాల నిరీక్షణను కళ్లలో నింపుకొని
జీవన ప్రవాహంలో ఈదులాడుతూ
తన ఉనికి కోసం పోరాడుతున్న మనిషి
ఫలితం దక్కని అన్వేషణలో
కాలం విసిరేసిన బంతిలా కొట్టుకుంటున్నాడు.
కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నా
తమ దోసిళ్లతో నింపుకోవాలని చూసే శాడిజం
వీధి వీధిలో నిర్భయంగా సంచరిస్తోంది.
కడుపు ఆకలితో మండినప్పుడు
ఆశయాలు ఎండిపోయి
ఆదర్శాలు అమ్ముడుపోతున్నాయి.
వాల్‌ పోస్టర్ల వర్ణచిత్రాలను
కళ్లలో పిండుకుంటూ, గుటకలు మింగుకుంటూ
పాన్‌మెయిల్‌ పెంచే యువతరం ప్రతిభ
గిరిశిఖరం నుండి అగాధంలోకి
దబ్బున పడిపోతున్న చప్పుడు.
కాలానుగుణంగా రంగుల్ని మార్చే
ఊసరవెల్లుల్లాంటి మనస్తత్వాల మధ్యన
నిర్ధాక్షిణ్యంగా నలిగిపోతున్న మనిషి
తన దైనందిన కార్యక్రమాలకి దూరంగా పారిపోలేక
వ్యక్తిత్వాన్నే బలిపెట్టుకుంటున్నాడు.
సమస్యల మూటను భుజాన వేసుకొని
భారంగా నడుస్తున్న శవాన్ని చూసి
ముఖం నిండా నవ్వుల్ని పులుముకుంటున్న
ఈ మానవారణ్యంలో
సామాజిక రక్తనాళాలలో రక్తం చేస్తున్న రొద
అరణ్య రోదనలా గొంతులోనే గిలగిలా కొట్టుకుంటోంది.
నీతికీ, అవినీతికి మధ్య గీతను హత్యచేసి
చట్టం చప్పుడు విన్పించనంత దూరంగా
నీతిని పట్టుకెళ్లి, చీకటి ఇంట్లో బంధించి
ఆ ఇంటి చుట్టూ మారణ హోమపు డప్పుల్ని
విన్పించే వేలాది చేతుల కర్కశ విన్యాసం.
నగ్నసత్యం దాగివుందన్న గుప్పెట చుట్టూ
కర్ర చప్పుడు విన్పించే గూర్ఖావానిలా
కొన్ని వేల చూపులు శిలువ వెయ్యబడి
ఆఖరు నిమిషంలో ఆ గుప్పెటనే కాటువేసి
గుట్టు చప్పుడు కాకుండా పక్కకి తప్పుకుంటున్న దృశ్యాల నీడలు.
బతుకు బరువు మోయలేక
ధర భ్రమణ వేగాన్ని అందుకోలేక
కేంద్రబిందువు దగ్గరే ఆగిపోతున్న మనిషి
తన ఆశల శ్వాసను బతికించుకోవటం కోసం
అనాగరికత ఒంటి విరుపులపై
తన పరువును ఆరేసుకుంటున్నాడు.
పిడికెడు అనుభూతికోసం
హృదయాన్ని పోగొట్టుకుని
కట్టుబాట్ల పరదాల వెనుక దాగి
కాలం తీర్పుకోసం ఎదురుచూసే
బలహీనుల కళ్లలో…. ఏదో
అర్థం తెలియని అర్థింపు.
భూమి తిరుగుతూనే వుంది
వ్యక్తి శక్తిని తనచుట్టూ తిప్పుకుంటూనే వుంది.
మరి మనిషిలోని జ్ఞానశక్తిని మాత్రం
మరింత వేగంగా గిరికీలు కొట్టించి
జ్ఞాపకశక్తిని కొద్దికొద్దిగా నంజుకుంటోంది.
ఎంత కాలం ఇట్లాగ?

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to భూ భమ్రణంలో మనిషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో