స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో…

స్త్రీల సమస్యలు స్త్రీలవి మాత్రమే కాదు. సమాజంనుంచి నిందించబడుతూ ,హింసల్నీ ,పీడనల్నీ ఎదుర్కుంటూ మన సమస్యల్ని మనమే చర్చించుకుంటూ వుండటమేనా ? స్త్రీల సమస్యల గురించి ఇటీవలి పరిణామాల పట్ల బాధ్యత కలిగిన పురుషులు ,రచయితలు ఎలా ఆలోచిస్తున్నారు? …. స్త్రీల సమస్యల్ని తమ కోణంనుంచి చర్చిస్తూ , వివిధ అంశాలని స్పృశిస్తూ రచయిత ఆచళ్ళ శ్రీనివాసరావు రాస్తున్న కొత్త కాలం ‘స్వయం సిద్ధ ‘ విహంగ పాఠకుల కోసం …..ఈ మాసంనుంచీ ప్రారంభం!

 అనర్థాల అనలంలో…

      భయం అంటే నాకు చాలా భయం అందుకే ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు .కానీ …

….ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం  ,  ఎలమంచిలి లో ఓ ట్యుటోరియల్ సెంటర్ నిర్వాహకుడి అఘాయిత్యం  ( అవి ఏమిటో వివరించి నా కీ బోర్డ్ కి అశ్లీలపు రాతల అపవిత్రతని అంటగట్ట లేను నేను )

యింక కలల కొత్త లోకాలని ఆవిష్కరించే కళాశాలలు , విశ్వవిద్యాలయాలు , ఉద్యోగ ప్రదేశాల లో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అంటూ … ప్రేమ పేరిట ఎమోషనల్ బెదిరింపులూ , ఆత్మ హత్యలూ ,ఏసిడ్ దాడులూ ,…హత్యాయత్నాలూ, హత్యలూ …

సంసారాల సాగరాల అలల కల్లోలాలలో ఒక్క మునక వేసామనుకోండి ….పూటు గా తాగొచ్చి , వరం డాలో నిద్ర పోతున్న కట్టుకున్నావిడని లేపి లోనికి రమ్మని ఆఖరి అనుభవాన్ని అనుమానం తో జీవితపు ఆఖరి క్షణాలనీ అందించ గలిగిన , అడ్డొచ్చిన ఆవిడ తరపు బంధువులని సైతం అక్కడికి అక్కడే నరికి వేయగలిగిన ఉత్తమోత్తముడయిన భర్త , అన్నం లో కి కూర వండి పెట్ట లేదని తల్లిని కడ తేర్చిన పుత్ర రత్నం , తనకు భారంగా మారిందని.. కన్నతల్లిని కర్కశం గా బతికుండగానే సజీవదహనం చేసి శవాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసిన మాననీయ మహిళా మాణిక్యం , అయిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిని …..( జుగుప్స తో వేళ్ళు వణుకుతున్నాయి ఈ సంఘటన వ్రాయడానికి )…. న కామం తో కళ్ళు మూసుకు పోయిన ఒక దౌర్భాగ్యపు తండ్రి … ”   కథ కంచికి వెళ్ళి పోయిందనుకున్నాను కానీ పునరపి జననం …

గత  కొన్ని మాసాలుగా  ప్రముఖ పత్రికల ప్రదాన సంచికలోనూ జిల్లా సంచికలలోనూ కనిపించిన వార్తలలో మాన భంగానికి గురి అయిన ఆడవాళ్ళ వయసులు నాలుగు , అయిదు ,ఏడు , పన్నెండు , పద్నాలుగు , పదిహేడు , పందొమ్మిది , యిరవై ఒకటి , యిరవై మూడు , ముప్పయి రెండు , నలభై అయిదు , ఏభయి ఆరు , డబ్బై రెండు సంవత్సరాలు ..కడుపు మండి పోతోంది…గుండె తరుక్కు పొతోంది … యింక ఈ ఘోరాలకి పాల్పడిన లంఝడికొడుకుల ( భాషా శాస్త్ర వేత్తలు మన్నించండి ఒంటి మీద పూర్తి స్పృహలోనే ఈ పదం వాడేను ) వయసులు కనిష్టంగా పద్నాలుగు గరిష్టంగా డెబ్బై రెండుసంవత్సరాలు … చక్కగా చదువుకోవాల్సిన  వయసొకరిది, హాయిగా కృష్ణా రామా అనుకుంటూ మనవలని దగ్గర కూర్చోబెట్టుకుని విద్యాబుద్దులు  నేర్పాల్సిన   వయసొకరిది … ఈ మద్యలో నవ యువకుళ్ళూ , నడిమి వయసు వాళ్ళూ …వారి వారి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించవలసిన వాళ్ళు …కానీ జరుగుతున్నదేమిటి ? ఆడదయితే చాలు బాల ,బేల ,ముగ్ధ ,ప్రౌఢ , వృద్ద అనే బేధం లేకుండా ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కళ్ళలో శిశ్నాలు దాచుకుని ప్రలోభపెట్టి , భయపెట్టి, బెదిరించి , చావగొట్టి … రాక్షసరతిలో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఈ పాశవికులు ఏ జాతి నాగరికతకి ప్రతీకలు ? పాలు తాగుతూ కన్నతల్లి స్తనాలని కూడా కామంతో కొరికి వుంటారా వీళ్ళు  ?        సీతని ఎత్తుకు వెళ్ళిన రావణాసురుడు కూడా ఎప్పటికయినా సమ్మతించకపోతుందా అని ఎదురు చూసాడే తప్ప అత్యాచారానికి ప్రయత్నించలేదు … అంతకన్నా దుర్మార్గులు కాదా వీళ్ళు ? స్త్రీ శరీరంలో సొంపైన వంపులు సృష్టించిన భగవంతుడు కొందరి పురుషుల బుద్ధిలో చాలా నికృష్టమైన నీచమైన వంకరలని సృష్టించినట్లున్నాడు . లేకపోతే నాలుగేళ్ళ పసికందుని కూడా  బెదిరించి  కౄరంగా కుతి తీర్చుకున్నది కొందరయితే  యిరవైమూడేళ్ళ అమ్మయిని దేశ రాజధాని నడివీధులలో నడిచే బస్సులో నిస్సిగ్గుగా నిర్భీతిగా బట్టలనీ వంటినీ బ్లేడుతో కోసి …. చితక బాది చిత్రవధ చేసి సామూహికంగా అనుభవించిన త్రాష్టులు కొందరు ఈ ఎపిసోడ్ మొత్తానికి ప్రధాన పాత్రధారీ సూత్రధారీ ఖర్మ కాలి ఒక మైనర్ , రాక్షసంగా కుతి తీర్చుకోవడానికీ నికృష్టమైన నేరాలు చేయడానికీ వయసొచ్చింది కానీ ఈ త్రాష్టుడిని శిక్షించడానికి న్యాయస్థానాలకి వీడొక బాలుడయిపోయాడు … దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల వల్లనో …మరే కారణాల వల్లనో వీళ్ళందరినీ న్యాయస్థానాలు  కొత్త చట్టాలనీ సృష్టించింది  కొత్త శిక్షలని సృష్టించి మరీ శిక్షిస్తుందనే ఆశిద్దాం …కానీ భార్య కాని స్త్రీతో శృంగారించాలనే ఆలోచనే తప్పన్న భావన శ్రీరాముడు పుట్టిన ఈ దేశంలో ఏ జీవినీ హింసించకూడదన్న మహావీరుడూ బుద్దుడూ నడిచిన ఈ గడ్డమీద  ఎంతమంది మగాళ్ళకి వుంది ? మృగాలు కూడా కామాన్ని యింత కర్కశంగా తీర్చుకోవు , మరీ మగాళ్ళకేం పోయేకాలం ? మలకూప ద్వారంలోనో , మకరద్వజుని కొంపలోనో అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా అంగాన్ని పాక్షికంగానో , సంపూర్ణంగానో జొప్పించి ( దీనినే రేప్ గా అభివర్ణించిందనుకుంటా చట్టం ..) బలవంతంగా అనుభవించడం కేవలం కామాన్ని తీర్చుకోవడానికా అధిపత్యాన్ని చెలాయించడంలొ పొందే పైశాచిక ఆనందాన్ని అనుభవించడానికా ? దేనికైనా ప్రాణాలనీ అంతకన్నా ఎక్కువగా భావించే మానాలనీ కోల్పోతున్నది మాత్రం స్త్రీలే …ఈ  వికృత క్ర్రీడల వార్తా విశేషాల దన్ను చూసుకుని భయానికి నేనంటే బొత్తిగా భయం పోయింది , ఈ మద్య నిరంతరం నన్నంటిపెట్టుకునే వుంటోంది .

             శృంగార అంగం తొడల మధ్య కాక చెవుల మధ్య వుందంటాడు ఓ ప్రసిద్ధ ఆంగ్ల నాటక రచయిత  నిజమే పట్టుమని పది పన్నెండేళ్ళయినా లేని పిల్లలు తోటి విద్యార్థినిలవైపు , కొండొకచో లేడీ టీచర్లవైపు చాలా ఆబగా చూస్తూ పాఠాలు వినకుండా ఏవో లోకాలలో విహరిస్తున్నారు . వీళ్ళ ఆలోచనలు యింత పెడత్రోవ పట్టడానికి కారణమేమిటి ? బ్రెయిన్ హార్డ్వేర్ అయితే మైండ్ సాఫ్ట్ వేర్  అట దానికి అధర్మ  శృంగార  వైరస్ అంటకుండా కాపాడుకోవల్సిన సామాజిక బాధ్యత సమిష్టి గా అందరిదీ కాదా ? పిల్లలు అర్థరాత్రి దాటే వరకూ పుస్తకాలు పట్టుకుని ఆ పైన ఎవరూ చూడకుండా తలుపులేసుకుని ఏ చానల్స్ చూస్తున్నారో , ఏం బ్రౌస్ చేస్తున్నారో ఓ కంట కనిపెట్ట గలిగిన తల్లిదండ్రులు ఎంత మంది ? పిల్లల కెరీర్ మీద వున్న శ్రద్ద వాళ్ళ కేరక్టర్ పట్ల ఎందుకు కనబరచటం లేదు తల్లిదండ్రులూ విద్యాసంస్థలూను ? ఎందుకంటే కెరీర్ పెట్టుబడికి తగిన లాభాల్ని తెచ్చిపెడుతుంది .కేరెక్టర్ ఎలా వుంటే ఎవడిక్కావాలి శతకోటి లింగాల్లో బోడిలింగం…యిదీ చాలా మంది ఆలోచనా సరళి . ఎంత బిజీ జీవితమైనా పిల్లలతో గడపడానికి తల్లిదండ్రులూ భర్తతో గడపడానికి భార్యా (వైస్ వెర్సా ) కొంత సమయాన్ని కేటాయించకపోతే ఆ సమయం ఎవరో పరాయి వాళ్ళు కేటాయిస్తారు అది చాలా సందర్భాలలో ఆపోజిట్ సెక్స్ కి చెందిన వాళ్ళే అవుతారు …తర్వాత అనర్థాల అనలంలో సర్వం కాలాక ఆకులు వెదుక్కిని ప్రయోజనం లేదు . కొంచం ఆలోచిద్దాం ….మారదాం మార్చుదాం !!!

– ఆచళ్ళ శ్రీనివాసరావు ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రచయిత  గురించి :
 13 04 1965( చైత్ర శుద్ధ ద్వాదశి ) న తూర్పు గోదావరి జిల్లా తుని లో అమ్మ నాన్నల అయిదుగురి సంతానం లో మద్యముడి గా మగ పిల్లలలో మొదటి వాడిగా జననం .       భార్య శ్రీ ఆదిభట్ల  శ్రీ దేవి , కుమార్తె మోనాలిస .
ఉద్యోగం : పాఠాలు చెప్పడం
 సద్యోగం : బలహీనత : చాలా రాత్రి వరకు నిద్ర పట్టక పోవడం  , బలం : ఆ సమయం లో బోలెడు చదువుకోవడం , కొద్దిగా వ్రాసుకోవడం .
 మొదటి కథ భారతిలో మొదలయి బ్లాగ్ వరకు సాగుతున్న ప్రస్తానం లో ఎన్నో కథలు కవితలు పాటలు , నాటికలు స్కిట్లు …. రూపకాలు , బుర్ర కథలు …  : రూపుదిద్దుకున్నాయి .
గాంధీ,సోక్రటిస్ , శ్రీశ్రీ , చలం ,వడ్డెర చండీదాస్ , టాగూర్, సార్త్రే , విల్ డ్యూరెంట్ .. షేక్స్పియర్ ,కీట్స్ ,ఐనిస్టిన్, డావిన్సి , బాలు .. యింకా చాలా మంది .చాలా ఇష్టం .
 వ్యసనమైన యిష్టాలు  లేదా యిష్టమైన వ్యసనాలు  : బుక్స్ , పెన్స్ అండ్ కాఫీ .
  ఫిలాసఫీ :        మనిషే కదా సిరి భువనానికి మనిషయ్యె బ్రతకాలి ప్రతిశ్వాసకీ!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
కాలమ్స్, పురుషుల కోసం ప్రత్యేకం, , Permalink

One Response to స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో